అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • నవంబర్ 18, 2016

    మనిషి మాట… శామ్యూల్ రాత్, అమెరికను

    నాకు తెలుసు సందేహంగా కదలాడే దాని అలలగురించి అవి పురాతన ఆలోచలా తీరాలవెంట ఎప్పటిలా తిరుగుతుంటాయి; దాని రాగద్వేషాలూ; తుఫానులు నేర్పినవీ, సహజమైనవీ అవస్థలు. ఎండనీ, తుఫాన్లనీ భయం భయంగా ఎదిరించే ఇనుప మెరుగులక్రింద మహాసాగరాలలాగే కొన్ని లక్షల సమాధుల్ని దాచుకుంటుంది; సముద్రంలాగే పైకెగసిపడుతుంది జీవంతో ఉట్టిపడుతూ, వెనువెంటనే జ్ఞాపకాల్లోకి జారుకుంటుంది ఒకవంక కేశకుహరాల్లోకి పరుగులు తీస్తూనే. జీవితపు హృదయఫలకం మీద సృష్టికర్త మూడు మహా నిశ్శబ్దాలు రాసిపెట్టాడు: పుట్టకముందు మరొకసారి చైతన్యంలోకి వస్తూ మృతులుచేసే కదలికల…

  • నవంబర్ 17, 2016

    పరుగు… వాస్కో పోపా, సెర్బియన్ కవి

    కొందరు పక్కవాళ్ళది కొరికెస్తారు   మోచెయ్యో, కాలో, ఏది దొరికితే అది. దానిని పళ్ళ మధ్య బిగబట్టి వీలయినంత వేగంగా పరిగెడతారు. దాన్ని మట్టిలో కప్పెస్తారు.   అందరూ అన్ని దిక్కులా పరిగెడతారు వాసన చూడ్డం, వెతకడం, వాసనచూడ్డం, వెతకడం భూమినంతటినీ తవ్వెస్తారు. అదృష్టం బాగుంటే వాళ్లకో చెయ్యో లేదా కాలో, మరొకటో దొరుకుతుంది ఇప్పుడిక కొరకడం వాళ్ళ వంతు. ఈ ఆట మహా జోరుగా సాగుతుంది చేతులు దొరికినంత కాలం కాళ్ళు దొరికినంతకాలం అసలేదో ఒకటి…

  • నవంబర్ 16, 2016

    జీవనామృతం ప్రేమే… రూమీ, పెర్షియన్ కవి

    భగవంతునిపై ప్రేమను మించి మిగిలిన సర్వస్వమూ అది అమృతాశనమైనప్పటికీ ఆత్మకి ఎంత వేదనాత్మకము? జీవనామృతాన్ని చేజిక్కించుకోకుండానే మృత్యువును సమీపించడం లాంటిది. . రూమీ Everything other than love for the most beautiful God though it be sugar- eating. What is agony of the spirit? To advance toward death without seizing hold of the Water of Life. . Rumi Persian Poet, Sufi 13th…

  • నవంబర్ 15, 2016

    Wait For Me… Sivasagar, Telugu, Indian

    Through the song that was snapped by noose the incarcerated cataract the wounded footpath the breath of life, and the sonority of violin I return I resurrect Look for me Wait for me Through the sensitive grain of sand, Summer’s first drop of rain the open veins of the flute the ultimate star on the…

  • నవంబర్ 13, 2016

    ప్రయాణం-2 … షున్ తారో తనికావా, జపనీస్ కవి.

    నేనీ క్షణాన్ని శాశ్వతం చెయ్యదలుచుకోలేదు ఈ క్షణాన్ని ఉన్నదున్నట్టు స్వంతం చేసుకోవడమూ బాగుంటుంది జారిపోతున్న క్షణాన్ని పట్టుకోగలిగే మార్గం ఉన్నా సూర్యుడప్పుడే ముందుకి సాగిపోతున్నాడు. ఈ మాటలన్నీ కేవలం ఇసుకమీద రాయబడినవి నా వేళ్ళతో కాదు మరుక్షణంలో విషాదంలోకి జారిపోగల ఆహ్లాదమైన హృదయంతో. నా పిల్లలకి నా పోలికలు ఉన్నా నా పిల్లలకి నా పోలిక లేకపోయినా రెండూ నాకు ఆనందదాయకమే. గవ్వలూ, గులకరాళ్ళూ, గాజుపెంకులతో పాటు ఈ గ్రహం అంచున నీటి ఒడ్డున నా హృదయాన్ని…

  • నవంబర్ 12, 2016

    జాతి గుర్తు… ఎఫ్. ఆర్. స్కాట్, కెనేడియన్ కవి

    కొన్ని కవితలు సునిశితమైన వ్యంగ్యంతో చెంప చెళ్ళుమనేలా కొట్టి నిజాన్ని తెలియజేస్తాయి. ఒక దేశపు శతాబ్ది ఉత్సవాల కార్యనిర్వాహక సంఘం ముఖపత్రం మీద ఆ దేశానికి చెందిన ఏ చిహ్నమూ కాకుండా మరొక దేశపు వ్యాపారసంస్థ పేరు ఉండడం హాస్యాస్పదమైన విషయం అనుకుంటే, పేరు మార్పులు తప్ప, మనదేశంలో చిత్రం ఇంతకంటే భిన్నంగా ఉందా అనిపిస్తుంది. దౌర్భాగ్యం కొద్దీ ఎప్పుడూ సమకాలీన అవసరాలదృష్టితోనే చారిత్రకపురుషుల విశ్లేషణ జరుగుతోంది తప్ప వాళ్ళు జాతికి చేసిన సేవనీ, అందించిన ఉత్కృష్టమైన…

  • నవంబర్ 11, 2016

    నిన్ను నేను ప్రేమిస్తున్నాను… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి

    వసంతం నా మీదకి తొంగి చూసి గాఢనిద్రలో ఉండడం గమనించినపుడు ఒక గుండె దాచలేక దాచిన రహస్యాన్ని మట్టి ఇక దాచనక్కరలేదు. వసంతం కోయిలలకి చెప్పినపుడు మైదానాల్లోని పిట్టలకు తెలుస్తుంది వీచే ప్రతి గాలికీ సున్నితంగా ఆ మూడు మాటలనీ చెబుతాయి. అతని ఇంటి చూరుమీద పిచ్చుకలు దూరంగా చెదరగొట్టబడ్డ వర్షం పోలిన ధ్వనులతో అతని కిటికీ పక్కనున్న పిచ్చుకకి చెబుతాయి ఓ పిచ్చుకా, నా చిన్ని పిచ్చుకా, నేను దీర్ఘనిద్రలో ఉన్నపుడు నే దాచలేక దాచిన…

  • నవంబర్ 10, 2016

    పొగరుబోతు పొరపాటు… వాస్కో పోపా, సెర్బియను కవి

    అనగనగా ఒకప్పుడు ఓ పొరపాటు ఉండేది అది చాలా తెలివితక్కుదీ, చాలా చిన్నదీను. దాన్ని ఎవరూ కనీసం గుర్తించేవారుకూడా కాదు. అది తను తప్ప ఎవ్వరూ తనవంక చూడ్డంగాని వినడంగాని చెయ్యకపోడాన్ని సహించలేకపోయింది. అందుకని దానికి తోచిన అన్ని విషయాలూ కనిపెట్టింది దాని ఉనికి నిజంగా లేదని ఋజువుచెయ్యడానికి. అది దాని ఋజువులు భద్రపరచడానికి రోదసిని సృష్టించింది. అవి నిలవడానికి కాలాన్నీ, ఆ ఋజువులు చూడ్డానికి ప్రపంచాన్నీ సృష్టించింది. అది కల్పించినదంతా తెలివితక్కువ విషయమూ కాదు. అల్పవిషయమంతకన్నా…

  • నవంబర్ 6, 2016

    నాలుగేళ్ళు నిండబోతున్న పిల్ల దినచర్య నుండి… హనన్ అష్రవి, పాలసీనా కవయిత్రి

    కొన్ని కవితలూ, దానికి జతచేసిన బొమ్మలూ, ఒక్కోసారి ఎన్నాళ్ళయినా వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి కవితల్లో ఇది ఒకటి. ఈ కవితలో ఉన్నదల్లా కేవలం 4 ఏళ్ళవయసుండే పిల్లలలో కనిపించే అమాయకత్వం. ఈ కవితకి పెట్టిన బొమ్మ చూస్తేనే మనసు చలించిపోతే, ఈ కవిత చదివిన తర్వాత మనసు ఒకసారి నిస్తేజానికి గురైంది. ఇంత చిన్న మాటల్లోనే, కవయిత్రి యుద్ధం ఎంతటి వినాశకరమో, దానివల్ల ఎంతో అందమైన భవిష్యత్తుని అనుభవించవలసిన  అమాయకులైన పిల్లలు, జార్జి బుష్ జూనియర్ మాటల్లో…

  • నవంబర్ 5, 2016

    పొరలు… స్టాన్లీ కునిజ్, అమెరికను కవి

    నేను చాలా జన్మలు ఎత్తాను అందులో కొన్ని నావే కాని, ఇప్పటి నేను, అప్పటి నేను కాదు, జీవిగా కొన్ని లక్షణాలు మిగిలి ఉన్నప్పటికీ; నేను వాటినుండి దూరంగా జరిగిపోకుండా ఉండడానికి నానా తంటాలూ పడుతున్నాను. నేను ముందుకి వెళ్ళడానికి కావలసిన శక్తి సమకూర్చుకోవాలంటే అలా చూసుకోడం తప్పనిసరి కాబట్టి, నేను ఒకసారి వెనుతిరిగి చూసుకుంటే, మైలు రాళ్ళన్నీ తిర్యగ్రేఖవైపు జారిపోవడం గమనించేను; విడిచిపెట్టిన మజిలీలలో వేసిన చలిమంటలు క్రమంగా సన్నగా క్షీణించిపోతుంటే, వాటిమీంచి బరువైనరెక్కలతో దేవదూతలు…

←మునుపటి పుట
1 … 75 76 77 78 79 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు