అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • నవంబర్ 30, 2016

    ఇటుకపొడి… లూయిజా బ్రూక్

    అదొక శైధిల్యపు నుసి మేట ఏకధాటిగా గోడలు కూలిపోడమే. ఒకప్పుడు “ఇల్లు” అనిపిలవబడేచోట నా చిన్నతనం గడిచింది. వీడ్ధుల్లో పియానోలపై ప్రశాంతంగా ఫ్రాన్సు జాతీయగీతం వాయిస్తుంటే, ఎండ మండిపోతున్నప్పుడు ఆ అటకెక్కి ఏదో రాసుకుంటూండేదాన్ని ఇంటి యజమాని సాలుపురుగు కూర్చున్నాడు రాత్రివంటకాల వాసనావలయంలో మనుషులు తమకుచ్చిటప్పాల నరకంలో క్రమక్రమంగా మురిగిపోతున్నారు. అక్కడ నే నేర్చుకున్నది తల్చుకుంటే జుగుప్స. నేను రాత్రి తగలేసిన చమురుకీ ఎండి పోయిన నా కలకీ విచారిస్తూ కాలం వెళ్ళబుస్తూ ఉండవచ్చు. . లూయిజా…

  • నవంబర్ 29, 2016

    సౌందర్యం… ఆర్మెల్ ఒ కానర్

    సూర్యుడు చాలాచోట్ల మెరిసిపోతున్నాడు సౌందర్యం నేలమాళిగల్లోకి దిగబడుతోంది ఒక దీపం ఎన్నో ముఖాల్ని తేజోమయం చేస్తుంది దోషాన్నెత్తిచూపడంద్వారా, దోషరాహిత్యం నిర్వచిస్తోంది. ప్రతి కొండా, ఆకాసమూ, సెలయేరూ నా ప్రశ్నలకి ఒక దివ్యమైన సమాధానాన్ని అందిస్తోంది: అనుగ్రహించినవాడి అనుగ్రహం ఎన్నడూ తరిగిపోయేది కాదని. అయినా, నేను సరిపోల్చుకుంటూ, సందేహిస్తూ అకళంకమైన నా ఆనందాన్ని నాశనం చేసుకుంటాను ఎవరూ పంచుకోలేని సంపద భగవంతుడే…. కాలాతీతమైన సౌందర్యం …ఇక నా పాలు. . ఆర్మెల్ ఒ కానర్ . Beauty .…

  • నవంబర్ 28, 2016

    వసంతంలో ఒంటరిగా…. కెరోలీన్ గిల్టినన్, అమెరికను కవయిత్రి

    ఇంతకుమునుపెన్నడూ వసంతాన్ని ఒంటరిగా ఎదుర్కో లేదు; ఆ పుష్పాలూ, ఆ పిట్టలూ, ఆ తరులతాదుల శోభా… ఎప్పుడూ నాకు జంటగా నా ప్రేమిక ఉండడమే కారణం— ఇటువంటి పారితోషికాలనుండి రక్షించగలిగేది, ప్రేమ ఒక్కటే! కానీ, ఇపుడు నేను ఒంటరిని, సుదీర్ఘమైన రేయింబవళ్ళిపుడు కేవలం జ్ఞాపకాలతో వెళ్ళబుచ్చడమే పని . మేము జంటగా గడిపిన ఏప్రిల్ నెలలలో ఎన్నడైనా వసంతం మనసునింత గాయపరిచేదిగా ఉందా? మునుపెన్నడూ వసంతాన్ని ఒంటరిగా ఎదుర్కో లేదు ఈ పసిడివెలుగుల వరద… నా దుఃఖాన్ని…

  • నవంబర్ 27, 2016

    సిద్ధసత్యాలు… కార్ల్ సాండ్బర్గ్, అమెరికను

    ప్రతి ఏడూ ఎమిలీ డికిన్సన్ ఒక మిత్రుడికి తనతోటలో పూసిన తొలి “ఆర్బ్యుటస్”  మొగ్గల్ని పంపేది. ఆండ్రూ జాక్సన్ తన మరణశాసనంలో ఒక మిత్రుణ్ణి గుర్తుచేసుకుని జార్జి వాషింగ్టన్ వాడిన దూర్భిణి” ని అతనికి బహూకరించేడు. నెపోలియన్ కూడా, తన వీలునామాలో, ఫ్రెడరిక్ ది గ్రేట్ పడకగదిలోంచి తను సంగ్రహించిన వెండి వాచీని ఫలానా మిత్రుడికి దాన్ని అందజెయ్యవలసిందిగా ఆదేశించాడు. ఓ హెన్రీ తనకోటుకి తగిలించుకున్న ఎర్రని పువ్వుని తీసి కూరగాయలదుకాణంలో పనిచేస్తున్న పల్లెయువతికి ఇచ్చి “ఎర్రనైన…

  • నవంబర్ 24, 2016

    అసలు లేని వడ్డీ… రూమీ, పెర్షియన్ కవి

    తినబొయేదానిమీద ఆశే, ప్రేమికుని నిలబెట్టేది; చేతిలో రొట్టె ఉండనక్కరలేదు; ప్రేమలో నిజాయితీ ఉన్నవాడు అస్తిత్వానికి బానిస కాడు. ప్రేమికులకి అస్తిత్వంతో పనిలేదు. ప్రేమికులు అసలు లేకుండా వడ్డీ గణిస్తారు. రెక్కలులేకుండానే ప్రపంచం చుట్టివస్తారు;  చేతులు లేకుండనే, పోలోబంతిని మైదానం బయటకి కొనిపోతారు. వాస్తవం ఆచూకీ పట్టుకోగలిగిన డార్విష్ అతని చేతులు ఖండించబడినా, బుట్టలల్లగలిగేవాడు ప్రేమికులు తమ డేరాలని శూన్యంలో నిలబెట్టేరు వాటి లక్షణం, గుణం రెండూ శూన్యాన్నిపోలినవే. . రూమీ పెర్షియను కవి The lover’s food…

  • నవంబర్ 23, 2016

    గోడలు…. కన్స్టాంటిన్ కవాఫిజ్, గ్రీకు కవి

    మరో ఆలోచనా, జాలి, బిడియమూ లేకుండా వాళ్ళు నా చుట్టూ గోడలు కట్టేరు, ఎత్తుగా… మందంగా. ఇప్పుడు నేనిక్కడ కూచుని నిస్సహాయంగా నిట్టూరుస్తున్నాను. నేను మరొకటి ఆలోచించలేకున్నాను; ఈ దుస్థితి నా మనసు నమిలేస్తోంది కారణం, ఆవల నేను చెయ్యవలసింది చాలా ఉంది. వాళ్ళీ గోడలు కడుతున్నపుడు, నేనెలా పోల్చుకోలేకపోయానబ్బా!!! నా కెన్నడూ మేస్త్రీలు కనిపించలేదు, పిసరంత చప్పుడైనా లేదు. నేను గ్రహించలేనంత నేర్పుగా నన్ను బాహ్యప్రపంచానికి దూరం చేసేసేరు. . కన్స్టాంటిన్ కవాఫిజ్ April 29…

  • నవంబర్ 22, 2016

    ప్రేమ ఒక దృష్టిలోపం … సిల్వియా ప్లాత్, అమెరికను

    చూసే దృష్టికోణం ద్వైదీభావనతో మోసగిస్తుంది: రైలుపట్టాలు ఎప్పుడూ కలుస్తూనే ఉంటాయి, మరెక్కడోకాదు, అసంభవమైన మనోనేత్రంలో. సముద్ర తరంగాలు నింగిని కడుగుతున్నట్టు భ్రమింపజేసే క్షితిజరేఖను దాటిపోదామని మేధోసాగరాలమీద దిగంతరాలకు వెళుతున్న కొద్దీ, అవి వెనుకంజవేస్తూనే ఉంటాయి” ఇది నిజమని మనం అంగీకరిస్తే,  ఒకరి దేముడు మరొకరికి దయ్యంగా కనిపించడం మనకి ఆశ్చర్యం కలిగించదు; లేదా, సప్తవర్ణాల సూర్య కాంతి, నీడలోని అనేకానేక వన్నెలుగా కనిపించవచ్చు; సందేహాల ఊబిలో చిక్కినపుడు, ఎటూ తేల్చుకోలేకపోడమే మనజీవితాలకి అధిగమించలేని పెద్ద  అవరోధం .…

  • నవంబర్ 21, 2016

    సాగరసుమాలు… ఇ.జె.ప్రాట్, కెనేడియన్ కవి.

    అవి విహరిస్తూ ఒక క్షణంలో చేసిన విన్యాసాన్ని వివరించడానికి భాషలో తగిన ఉపమానాలు లేవు… రజతము, స్ఫటికము, దంతము అన్నీ కళతప్పేయి. వినీలాకాశం మీద చెక్కినట్టున్న లిప్తపాటు కదలికలేని ఆ దృశ్యానికి సాటిలేదు, ఆ రెక్కల కదలిక, తేలి తేలి ఎగిరే తీరూ ముందు ఉష్ణమండలంలో నీలి నేపథ్యంలో తేలిపోయే చుక్కలూ పర్వతాగ్రాలమీద కురిసిన మంచూ దిగదుడుపే. సూర్యుడి ఏడురంగుల్ని పట్టుకున్న కొండకొమ్ముల్లోనో మధ్యలో ఎక్కడో లంకల్లో కనిపించిన పచ్చికమైదానాల్లోనో ఒకదాని వెనక ఒకటి ఇపుడు క్రిందకి…

  • నవంబర్ 20, 2016

    యుద్ధభూములమీదుగా తూరుపుగాలి … ఏలన్ డూగన్

    రాత్రల్లా కొన్ని వేల యోజనాలు ప్రయాణం చేసి వచ్చింది గాలి ఈ ఉదయం దగ్గరగా దువ్వుకున్న నీ జుత్తును చెదరగొడుతూ. అది దీర్ఘప్రయాణం చేసి, త్రోవమరచిన సముద్రపక్షుల్ని తనతో తీసుకొచ్చింది, పాడుతూ. ఎప్పటివో పురాతన గీతాలు పాత రణస్థలాలూ, శ్మశానాలనుండి, కొత్తచోట్లలో కొత్తగా వినిపిస్తూ. అవి కొత్తగా వినిపించడానికి వసంతం కారణం కావచ్చు, నీ కురులలో బద్ధకంతీర్చుకుంటున్న నిన్నటి తెమ్మెరలా. మనదికాని వాతావరణం ఏదైనా ఎంతో కొత్తగా కనిపిస్తుంది. దాన్ని నువ్వు ఆస్వాదిస్తావు, గుండెనిండా పీల్చుకుంటూ, ఆ…

  • నవంబర్ 19, 2016

    చెడుసావాసాలకి వ్యతిరేకంగా… ఐజాక్ వాట్స్, ఇంగ్లీషు కవి

    ఆడుతున్నవాళ్ళతో నేనెందుకు కలవాలి వాళ్ళతో జతకలవడం నాకిష్టం లేదు. వాళ్ళు తిట్లూశాపనార్థాలు పెడతారు, ఎన్నడూ ప్రార్థించరు అన్ని రకాలపేర్లూ పెట్టి పిలుస్తారు, పోట్లాడుతారు. నాకు ఆ పోకిరీ పాట వినడమంటే అసహ్యం వాళ్ళ మాటలు నా చెవులకు కఠోరంగా వినిపిస్తాయి వాళ్ళు మాటాడే భాష ఉపయోగించి నేను నా నాలికని అపవిత్రం చేయ సాహసించను ఆ మూర్ఖులనుండి నా దృష్టి తప్పిస్తాను ఆ ఎగతాళి చేసే వాళ్ళతో కూడమన్నా కూడను. నేను తెలివైన వాళ్ళతో అడుగులు కలుపుతాను…

←మునుపటి పుట
1 … 74 75 76 77 78 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు