-
అతనికి తెలీదు… హారీ కెంప్, అమెరికను కవి
అతనికి తను చనిపోయాడని తెలియదు; రద్దీగా ఉన్న వీధిలో నడుచుకుంటూ వెళ్ళాడు, దారిలో ఎదురైన స్నేహితులందరినీ టోపీ తీసి, తలూపి పలకరిస్తూ నవ్వేడు. అందరూ ఏమీ పట్టనట్టు పక్కనించి వెళ్ళిపోయారు ఏమీ తెలియనట్టు కళ్ళలో కళ్ళుపెట్టి తెల్లబోయిచూసారు; అతనే ఏదో గాలి రివట అన్నట్టు పట్టించుకోకుండా ఏటోదిక్కులుచూస్తూ తమత్రోవన నడిచిపోయారు. “ఏదో జరగరాని విషయమేదో జరిగి ఉండాలి,” అని మృతుడు మనసులో అనుకుని త్వరగా ఇంటిముఖం పట్టాడు. అతని భార్య అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ దువ్వెనతో…
-
హావము … వినిఫ్రెడ్ వెల్స్, అమెరికను కవయిత్రి
నే నెప్పుడూ చేతులు కదలకుండా దగ్గరా పెట్టుకుని ఉండే వాడిని. పొరల్లో దాక్కున్న విత్తనంలా, మడతబెట్టిన జెండాలా ఉండేవాడిని నే ననుకునే వాడిని, ప్రేమ నను తాకినపుడు రెండు చేతులూ మొలకెత్తడం ప్రారంభిస్తాయని. పువ్వురేకులా విచ్చుకుంటుంటాయనీ రెక్కలా తెరుచుకుంటాయనీ. ఓహ్, ఏమా ప్రేమ! నా చేతులు పైకి లేచాయి కానీ అటూ ఇటూ విసురుగా, ఊగడానికి కాదు. అవి చాలా కష్టపడి పనిచేసి, గీరుకుపోయాయి శిలువమీద బారజాపిన చేతుల్లా. . వినిఫ్రెడ్ వెల్స్ 1893 -1939 అమెరికను…
-
కథ మొదటికి … మేక్స్ వెల్ ఏండర్సన్, ఆమెరికన్ కవి
ఇక ఇపుడు దేవుళ్ళు లేరు కాబట్టి, దేవుడి ప్రతిరూపాలయిన రాజులుకూడా లేరు కాబట్టి భూమి మీద మనిషి ఒంటరివాడు సూర్యుణ్ణి పోలిన బోలెడు నక్షత్రాలతో ఏకాకి. రాత్రిపూట సమాధానం చెప్పలేని తన నక్షత్రసమూహాలమధ్య తిరుగుతుంటాడు. అతని చేతులు ఎంత అశక్యమైనవో తెలుసు కళ్ళు వెలుస్తురులో మోసం చేస్తాయనీ తెలుసు. ఇక్కడ గెలవడానికి ఏ బహుమానాలూ లేవని తెలుసు నల్లగా తను పట్టిపోయిన బూజుతప్ప, తన కల ముందుగా ముగిసిపోడం చూస్తాడు యవ్వనం ముసలితనంగా మారడం చూస్తాడు. అయినా,…
-
చెట్టు… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
ఓహ్! నా గురించి ఏ జ్ఞాపకాలూ మిగలకుండా నన్ను నేను అన్ని సంకెళ్ళనుండీ విముక్తం చేసుకోవడం డిశంబరునెలలోని చెట్టులా నా హృదయాన్ని మోడులా చేసుకోవడం ఆకులన్నీ రాల్చిన తర్వాత చెట్టులా ప్రశాంతంగా నిశ్చింతగా నిలబడగలగడం రాత్రి కురవబోయే వర్షానికి గాని వేకువ సంధ్యారాగానికిగాని నిరీక్షించే పనిలేకపోవడం అయినా ఇంకా, ఓహ్ అంత నిశ్చలంగా ఉండడం… విసరుగాలులు వచ్చిపోతుంటే కురవబోయే మంచు వర్షానికి భీతిగాని లేదా బరువుగా పేరుకునే మంచు గురించి భయం గాని లేకుండా నిశ్చలంగా ఏమీ…
-
ముగింపు… మేక్స్ వెల్ బోడెన్ హీమ్ , అమెరికను కవి
వంపులు తిరుగుతున్న నీ పెదాలపై ఒకదాని వెనుక ఒకటిగా యోగ్యమైన ఆశీర్వచనాలు నర్తిస్తున్నాయి కలలు … నిలకడలేని సత్యాలు అవి దారిపక్క విరిసినపూలను ఏరుకుందికి వంగి కోటు బొత్తాలలో అందంగా అలంకరిస్తాయి చప్పుడుచెయ్యకుండా అనుకరిస్తాయి. పూవులు క్షణంలో వాడిపోతాయి గనుక కలలెప్పుడూ కళ్ళుమూసుకునే నడవాల్సి వస్తుంది. నీ మాట వింటుంటే, నే పట్టుకున్నకల కళ్ళువిప్పి ఒకసారి చూసి, కన్నుమూసింది. . మేక్స్ వెల్ బోడెన్ హీమ్ (May 26, 1892 – February 6, 1954) అమెరికను…
-
మృత్తిక … డోరతీ ఏండర్సన్, అమెరికను కవయిత్రి
ఈ కవితలో చమత్కారం… రెండు అసమాన దృశ్యాలను ప్రదర్శిస్తూనే, వాటిలోని సాదృశ్యతని వాచ్యం చెయ్యకుండా చెప్పడం. అన్నీ మట్టిలో కలిసిపోయేవే. కానీ, జీవం ఉట్టిపడుతున్నప్పుడు ఆ మట్టే ఇన్నిరూపాలుగా ప్రతిఫలిస్తుంటుంది. . మృత్తిక అంటే ఏమిటి? బూడిదైపోయిన ప్రేమ, కాలిపోయిన ఉత్తరాలు, వాడిపోయిన సూర్యముఖి, మృతుడిచేతిలోంచి జారిపడిన గులాబి రేకులు; సాలీళ్ళు, గబ్బిలాలు, పాడుబడిన ఇళ్ళు, కూలుతున్న కోటలు, గతిపంచిపోయిన సైనికుల రథచక్రాల జాడలు. అంతేనా? మృత్తిక అంటే, వెలుగు, నవ్వులు, సర్కసులు, విలాసవంతమైన గొడుగులు, ముక్కుతో…
-
ప్రత్యూషవేళలో కీచురాళ్ళు… లెనోరా స్పేయర్, అమెరికను
రాత్రల్లా కీచురాళ్ళు అరుస్తూనే ఉంటాయి చిమ్మచీకటిలాంటి నిశ్శబ్దంలో చిన్న చిన్న చుక్కలు మిణుకుమిణుకుమన్నట్టు. వేసవిరాత్రుల నిరామయతలో క్రమం తప్పని అద్భుతమైన లయతో అవి అరుస్తూనే ఉంటాయి: నీడల్ని వాటి చిన్నిగొంతులతో మోస్తున్నాయేమోన్నట్టుగా. కానీ, ప్రత్యూషకిరణాలకి మేల్కొన్న పక్షుల రవాలు చెట్టునుండి చెట్టుకు ప్రాకుతూ అడివల్లా సందడి నిండినపుడు ఓ ప్రత్యూష స్వర్ణవర్ణసమ్మేళనమా! ఒక దాని వెనక ఒకటిగా కీచురాళ్ళు నిశ్శబ్దాన్ని సంతరించుకుంటాయిసుమా. . లెనోరా స్పేయర్, 7 November 1872 – 10 February 1956 అమెరికను…
-
శ్మశాన వైరాగ్యం… W H ఆడెన్, ఇంగ్లీషు కవి
గడియారాలన్నీ ఆపండి, టెలిఫోన్లు కత్తిరించండి, రసాలూరు బొమికని కొరుకుతూ అరుస్తున్న కుక్కని అరవనీకండి, చాలు! పియానోవాయించడాన్ని ఆపమనండి, మద్దెలపై గుడ్డకప్పండి శవపేటికని బయటకి తీసుకు రండి, శోకించేవాళ్ళని దారి ఇవ్వండి. అతని మరణవార్తని ఆకాశంలో రాసుకుంటూ, విమానాలను నెత్తిమీద విచారసూచకంగా చక్కర్లు కొట్టనీండి తెల్లని పావురాల మెడల్లో మెత్తని పట్టు దండలు వెయ్యండి రాకపోకలు నియంత్రించే పోలీసుల్ని నల్లని చేతిమేజోళ్ళు ధరించమనండి అతనే నాకు తూరుపూ, పడమరా, ఉత్తరం, దక్షిణం నా పనిరోజులూ, ఆదివారాల విశ్రాంతీ అతనే…
-
Untimely Rain… Bandla Madhava Rao, Telugu, Indian
What does it matter to me now where the clouds come from? When I am severed from this soil And bade goodbye to farming, What if it rains on time or, untimely? Once the chord between me and water snapped what matters if it my barren fields are overcast with nimbus. let it…
-
దుఃఖానికి దగ్గరచుట్టం.. ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను
నేనేమైనా దుఃఖానికి దగ్గరచుట్టాన్నా, తలుపుతట్టేగడియ అస్తమాటికీ జారి పడిపోతుందెందుకు? అలాగని, దబ్భుమనీ పడిపోదు చప్పుడుచెయ్యకుండానూ రాలిపడదు, ఎప్పటినుండో దుఃఖం తట్టుకి అలవాటుపడినట్టు! గుమ్మం చుట్టూ బంతిపూలూ దవనమూ వేలాడుతుంటాయి. అయినా, అక్కడ బంతిపూలుంటే నేమిటి దవనం ఉంటే నేమిటి దుఃఖానికి? నేనేమైనా దాని చుట్టాన్నా? అస్తమాటికీ నాతలుపు తట్టడానికి మనం దాని చుట్టాలమా? ఓహ్! మీరా! రండి రండి లోపలికి. . ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే February 22, 1892 – October 19, 1950…