Untimely Rain… Bandla Madhava Rao, Telugu, Indian
What does it matter to me now
where the clouds come from?
When I am severed from this soil
And bade goodbye to farming,
What if it rains on time or, untimely?
Once the chord between me and water snapped
what matters if it my barren fields are overcast with nimbus.
let it rain
wherever it pleases… in brambles, bushes, rills and ponds.
it can no longer help a seed sprout in my field.
let it thunder in hailstorms or hurricanes
it can neither quenches my thirst any more
nor, shall wash off my sweat from my back.
it is just the same if it rains in concrete jungles
or over the land I was alienated from.
The rain that drowns now
could no longer solve the hardened sod of my life.
And it failed to refill verdure in the dried up crop
waiting relentlessly during that summer season.
And the idling agricultural tools became food for white ants.
let it rain
it no longer concerns me
when the pal had long parted his ways.
when it is destined to meet the sewage drains
it matters little wherever it rains.
When the whole farm had become barren,
and the land is traded throwing currency across
even a seasonal rain becomes a belated rain.
When rain can’t sink into the soil
to regenerate as life once more,
wherever it rains or whenever it rains
it is just a downpour of water but not rain.
When once my connection with the soil was snapped
my relation with water had also snapped.
Now, the only link that’s left between me and water is
to quench my thirst. That’s all!.
.
Bandla Madhava Rao
First published 18.10. 2015, Andhra Jyothi
From Kavitvam 2015
Edited with permission from the poet.
.

అకాల వర్షం
ఇక్కడకురుస్తున్న మేఘం ఎక్కడిదైతే నాకేంటి
అకాలంలో కురుస్తుందో సకాలంలో కురుస్తుందో
మట్టినాది కాకుండా పోయాక
రైతుపదానికి నేను రాజీనామాచేశాక
నా ముచ్చబోడుమీద మొగులు కమ్మితే ఏంటి
నీటికీనాకూ ఉన్న జీవం తెగిపోయాక
కురిసిన మేఘం డొంకల్లో వాగుల్లో చెరువుల్లో
ఎక్కడ ప్రవహించినా ఎక్కడ నిలిచినా
నా చేలో విత్తనానికి మొలకనివ్వదని తెలిసాక
కురవనీ
వడ్సగళ్ళుగానో, తుఫాన్లుగానో,
ఎలా కురిస్తేనేం
నా చెమటలో కలవనప్పుడు
నా దాహం తీర్చనప్పుడు
ఏ సిమెంటు కాంక్రీటు వనాల్లో కురిసినా ఒక్కటే
ఇక్కడ కురిసిన వాన
నా జీవన మట్టిబెడ్డను కరిగించలేదు
ఒకానొక గ్రీష్మకాలాన ఎండిన
నా పచ్చదనాన్ని చిగురింపజెయ్యలేదు
వానకోసం పరితపించిన పనిముట్లు
చెదలుపట్టి మట్టిలో కలిసిపోయాయి.
కురవనీ
ఎలా కురిసినావానకూ నాకూ
బంధం తెగిపోయాక
డ్రైనేజీ కాలవల్లో కలవబోయేవాన
ఎక్కడ కురిస్తే నాకేంటి
పొలం మొత్తం శాశ్వతంగా ఈడుపడిపోయాక
మట్టిలోంచి పుట్టిన కాగితపునోట్లు
భూమి మొత్తం పరుచుకున్నాక
అకాలంలో కురిసినా సకాలంలో కురిసినా
అది అకాల వర్షమే
కురిసిన నీరు
మట్టిగర్భంలో కలిసి మొలకెత్తలేనపుడు
ఎక్కడకురిసినా ఎప్పుడు కురిసినా
అది వాన కాదు
నేలతో బంధం తెగినప్పుడే
నీటితోనూ బంధం తెగిపోయింది
ఇప్పుడు నీటికీ నాకూ ఉన్న ఒకే ఒక అనుబంధం
శరీరదాహం తీర్చుకోవడమే.
.
బండ్ల మాధవ రావు
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
స్పందించండి