-
శరత్ సమ్మేళనం … పాలీన్ జాన్సన్
ఇంత సున్నితమైన స్వరమూర్ఛనల వడితో సంగీతాంబరము నేను సమర్పించగలగడానికి ఆలపించిన ఈ గీతాలను నను వెన్నాడేలా వాయులీనం మీద నువు పలికించడమే సుమీ! . పాలీన్ జాన్సన్ (March 10, 1861 – March 7, 1913) కెనడా కవయిత్రి . . AUTUMN’S ORCHESTRA (Inscribed to One Beyond Seas) Know by the thread of music woven through This fragile web of cadences I spin,…
-
నీటికాకి… ల్యూ సారెట్, అమెరికను
ఒంటరి సరోవరం, ఒంటరి ఒడ్డు, చందమామకి చేరబడుతూ ఒంటరి దేవదారు వృక్షం రాత్రల్లా రెక్కలతో సరసులో అలలు రేపుతూ ఒంటరి నీటికాకి చీకటిపడింది మొదలు సూర్యోదయం దాకా శోకిస్తూ చుక్కల్ని చూస్తూ అతను ఏదో వాగుతూనే ఉన్నాడు కల్లుపాకబల్లమీద కూచుని ఆ బైరాగి మత్తెక్కీదాకా పొయ్యమని చట్టి తడుతూనే ఉన్నాడు. . ల్యూ సారెట్ (May 16, 1888 – August 17, 1954) అమెరికను Photo Courtesy: http://pennyspoetry.wikia.com/wiki/Lew_Sarett . The Loon . A lonely…
-
నేను నేనే… షున్ తారో తనికావా, జపనీస్ కవి
నే నెవరో నాకు తెలుసు ఇప్పుడిక్కడున్నాను నేను మరుక్షణంలో మాయమవొచ్చు నేనిక్కడ మరి ఉండకపోయినా నేను నేనే నిజం చెప్పొద్దూ, నేను నేనుగా ఉండక్కర్లేదు. నేనో మొక్కని, కొంతవరకు నేను చేపనుకూడా … చాలవరకు నేనో కాంతిహీనమైన ఖనిజాన్ని… దానిపేరైతే నాకు తెలియదుగాని. ఆమాటకొస్తే, నేను అచ్చం మీలా ఉంటాను. నన్ను మరిచిపోయినంతమాత్రంచేత పోలేను గనుక నేను నాలుకమీద ఆదే పల్లవిలోని లయని నేను సూక్ష్మమైన కెరటాన్నీ, కణాన్నీ కూడా ఎలాగూ వచ్చేను గనుక, గర్వంగా చెప్పాలంటే,…
-
కవి వీరుడు… కోర్సన్ మిల్లర్
అటు చూడండి! అతను నిష్క్రమించాడు; తారాకిరీటంతో, ఏ కన్నీరూ లేకుండా, తలలో వసివాడని కీర్తి కుసుమాలతో. మృత్యువు ముద్దాడింది; ఈ రాత్రి ప్రకృతిఎంతో అందంగా ఉంది కవులునిద్రించే, ప్రశాంతత రాజ్యమేలే పడమటి ద్వీపానికి అతను సరికొత్త అతిథి. నవయవ్వనుడైన కీట్స్ అతనిచెంతనే ఉన్నాడు. వెండి వెన్నెలబోలిన నీటిబుగ్గలు ఎగసిపడుతున్నాయి; భూమిమీది కవులకు ఒక శోకగీతం పాపం! వాళ్ళ నేత్రాలిపుడు చీకటితో మూయబడ్డాయి, వాళ్ళ పుట్టువు ఎటుచూసినా, బాధలనూ, క్లేశాన్నీ అగాధమైన నిస్పృహనీ భవిష్యవాణిగా సూచిస్తోంది. ఓ గులాబులారా!…
-
మిడుత… లెనోరా స్పేయ ర్అమెరికను కవయిత్రి
మిడుత దాపున ఉన్న ఏ చెట్టు మీంచో నీ వాడి గొంతు చురకేస్తుంది నీ వేగానికి గాలిలో నీ జాడలు సెగరేగుతూ ఉంటాయి సూర్యుడి నులివెచ్చనికిరణాలమీద సానపెట్టిన చిన్న శబ్ద తరంగం మండుతూ ప్రసరించినట్టు. . లెనోరా స్పేయర్ (7 November 1872 – 10 February 1956) అమెరికను కవయిత్రి The Locust Your hot voice sizzles from some cool tree nearby: You seem to burn your way through…
-
లాయర్లకి మరీ ఎక్కువ తెలుసు… కార్ల్ సాండ్ బర్గ్, అమెరికను
బాబ్! లాయర్లకి చాలా ఎక్కువ తెలుసు. వాళ్ళు జాన్ మార్షల్ పుస్తకాలు ఆపోసన పట్టిన వారు. వాళ్లకంతా తెలుసు, చచ్చినవాడు ఏమిటి రాసాడో, అందులోనూ, మృతుడి బిరుసెక్కిన చేతులు, కణుపులు పట్టుతప్పుతుంటే, చేతి వేళ్ళ ఎముకలు సున్నంలా రాలిపోతుంటే ఏం రాసారో. లాయర్లకి బాగా తెలుసు, చనిపోయినవాడి ఆలోచనలేమిటో. బేరసారాలు చేసే లాయర్ల అడుగు జాడల్లో, బాబ్! తప్పించుకుందికి అనువుగా మరీ ఎక్కువ “అనుమానా”లు, “ఐనప్పటికీ”లు, “ఇంతకుముందెన్నడూ”లు, “అలా అయితేనే”లు, “అలా కాకుండా”లు, చాలా ద్వారాలుంటాయి రావడానికైనా…
-
సాయంత్రవేళలో ఆ ఇల్లు… విలియం రోజ్ బెనెట్
ఈ కవిత చదవగానే నాకు James Hilton రాసిన Good Bye Mr. Chipps నవల గుర్తుకొచ్చింది. *** స్కూలు ఆటస్థలానికి అడ్డంగా మొదలవుతుందా ఇల్లు ఆ పసుపు పచ్చని దీపం… నా కంటి వెలుగు రగులుతున్న హృదయానికి కవాటము కలతపడ్డ కలలకి మార్గాంతరం స్వర్గానికి తిన్నగా తీసుకుపోయే నిచ్చెన ఎంతో మురిపెంతో ఊరటనిచ్చే ఆ గొంతు ఆ ప్రేమాస్పదమైన వెచ్చని చేతులు ఒకప్పుడు నా నిర్లక్ష్యానికి గురయ్యేయి. ఆ ఇల్లు అంతటి పవిత్రమైన…
-
ద్వారం… ఎలిజబెత్ జె కోట్స్ వర్త్, అమెరికను
మనిషి ఆశాజీవి. వర్తమానం ఎంత కష్టంగా గడుస్తున్నా, భవిష్యత్తు బాగుంటుందనే ఆశలేకపోతే, మనిషి బ్రతకలేడు. తన బలహీనతలు అర్థం చేసుకుని, వర్తమానంలో భవిష్యత్తుకోసం తగిన ప్రణాళికలు వేసుకోకుండా కూడా బ్రతకలేడు. ఈ చిన్న కవిత కష్టాల్లో ఒక రైతు ఇంటిపోరునీ, వర్షాభావాన్నీ, కవివాక్కులు తలుచుకుని తన జీవితానికీ రాజీ పడడాన్నీ కవయిత్రి ఎంతో అందంగా ఏ వ్యాఖ్యలూ లేకుండా చిత్రించింది. *** రోడ్డుమీద మందంగా దుమ్ము పేరుకుపోయింది పొలాలు ఎండకి మాడిపోతున్నాయి రోజుపని పూర్తిచేసుకుని ఇంటికి వచ్చేక…
-
సివిల్ ఇంజనీర్లు… ఫీబీ హాఫ్ మన్, జర్మను-అమెరికను కవయిత్రి
వాళ్ళు ప్రకృతి కోటగోడలపై దాడి చేశారు మందుగుండు, రంధ్రాలువేసే యంత్రాలతో కదిలారు ఆమె కొండ బురుజులపైకి, చిత్తడి నేలల్లోకి ఆమె శక్తికి దీటుగా వాళ్ళ నైపుణ్యంతో. కొండగొర్రె కొమ్ములు మెలితిరిగినట్టు వాళ్ళ వంతెనలను ఎగసిపడే కెరటాలతో మెలితిప్పినా వాళ్ళ జలాశయాల దన్ను గోడలమీద ఆకలిగొన్న పులిలా ఆమె లంఘించినా వాళ్ళు బీవర్ (Beaver) కళను అనుకరిస్తూ అడ్డుగోడల్ని సాలెపురుగుల్లా అల్లేరు గుండెతడిలేని ఏడారిలో పూలు విరబూయించి ఎడారి నిద్రమత్తుని వదలగొట్టేరు ప్రకృతి హైమహస్తాల్లోంచి సొరంగాలు తవ్వో లేక…