-
గాలివాన … లెనోరా స్పేయర్, అమెరికను .
ఈ కవితలో సౌందర్యం గాలివానని గెద్దలావాలడం అన్న ఊహలో ఉంది. సహజంగా సంగీతజ్ఞురాలైన ఈ కవయిత్రి అంత సంగీతభరితంగానూ ఈ కవితను వ్రాసింది. ప్రతి పదచిత్రం వెనుకా ఆ భావాన్ని ప్రతిబింబించే శబ్దం వెనుక శబ్దాన్ని గమనించండి. *** నల్లని రెక్కలతో కనుమరుగైన కోండలమీదకి వాలుతుంది భయపడిన పిల్లయేరు, దానికి ముందు దౌడుతీస్తుంది; అడవిలోంచి ఎక్కడనుండో ఆకుల గలగల వినిపిస్తుంటుంది రెమ్మల్ని హత్తుకుంటూ కొమ్మలమీంచి జారుతూ ఒక్కసారిగా పిట్టలన్నీ గప్ చుప్ అయిపోతాయి. ఒక ఉరుము ఆకాశాన్ని…
-
జ్ఞాపిక… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను
ఉత్తమోత్తమమైన పింగాణీ, ఎంచెంచి వేసినట్టున్న రంగుతో రాబిన్ పక్షి గూట్లో దొరికిన ఈ చిన్న గుడ్డును చూసి నెత్తిమీద బోర్లించినట్టు నీలం మూకుడుందిగదా, ఆకాశం అంటాం, దాని ముక్క ఒకటి తెగి భూమి గుండెలమీద పడిందేమో ననుకున్నాను. . ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్ అమెరికను అమెరికను కవయిత్రి, అనువాదకురాలు, చిత్రకారిణి The Souvenir . Of finest porcelain and of choicest dye, This bit of egg shell from a…
-
ప్రేమలో మునిగిన పడవ… రూమీ, పెర్షియన్ సూఫీ కవి
నేను దహించుకుపోతేనే తప్ప ప్రేమకి సంతృప్తి కలగదా? ఎందుకంటే, నా మనస్సే ప్రేమ ఆవాసమందిరం. ఓ ప్రేమా! నీ ఇల్లు నువ్వు తగలబెట్టుకుంటానంటే, తగలబెట్టుకో! “అది నిషిద్ధం,” అని ఎవడనగలడు? ఈ ఇంటిని పూర్తిగా దహించు. ప్రేమికుడి స్థావరం దహించబడ్డాక ఇంకా మెరుగౌతుంది. ఈ రోజునుండీ దహించుకుపోవడమే నా పరమార్థం నేను కొవ్వొత్తిలాటివాడిని, మంట నన్ను మరింతప్రకాశవంతం చేస్తుంది. ఈ రాత్రికి నిద్రకి దేవిడీ మన్నా; నిద్ర లేమితో అటూ ఇటూ తిరుగుతుంటాను అదిగో, ఆ ప్రేమికులని…
-
పికమేమన్నది?… జాన్ కీట్స్, ఇంగ్లీషు కవి
ఇదిగో నిన్నే! శీతగాలికి ముఖమెదురొడ్డుతున్నవాడా! హిమపరాగపు తెరలలో వేలాడుతున్న మబ్బులనీ, గడ్డకట్టిన తారలలో నల్లని చెట్లకొమ్మలనీవీక్షిస్తున్నవాడా, నీకు వసంతాగమనమంటే, పండగ వేళే లే! ఇదిగో నిన్నే! సూర్యుడు అస్తమించిన పిదప ఒక రాత్రి తర్వాత మరో రాత్రి, నిన్నావరించిన చిమ్మచీకట్లలోనే వెలుగులకై వెదుకుతున్నవాడా నీకు వసంతపు రాక మూడింతల ప్రభాతమే లే! జ్ఞానం కోసం పరితపించకు … నా కెక్కడిదీ జ్ఞానం? అయినా నా పాట సహజంగా ఆర్ద్రతతో వస్తుంది. జ్ఞానంకోసం వెంపర్లాడకు… నా కెక్కడిదీ జ్ఞానం?…
-
మతసామరస్యం … జాతిపిత మహాత్మా గాంధీ
మహాత్మా గాంధీ 69 వ వర్థంతి సందర్భంగా మతసామరస్యం అవసరమన్న విషయంలో అందరికీ ఏకాభిప్రాయం ఉంది. కానీ అందరికీ, మతసామరస్యం అంటే బలవంతంగా విధించగలిగిన రాజకీయ ఐక్యత కాదన్న విషయంమాత్రం తెలియదు. మతసామరస్యం అన్నది ఎవ్వరూ వేరుపరచలేని మనసుల కలయిక. అది సాధించడానికి ముందుగా ప్రతి కాంగ్రెసు వాదీ అనుసరించవలసింది, అతను ఏ మతానికి చెందినవాడైనప్పటికీ, తను హిందూ, ముస్లిం, క్రిస్టియం జొరాష్ట్రియన్, యూదు మొదలైన మతాలన్నిటికీ ప్రతినిథిగా ప్రవర్తించాలి. క్లుప్తంగా చెప్పాలంటే అతను హిందూ, హిందూ…
-
A Letter To Mother… Manasa Yendluri, Telugu, Indian
Manasa Yendluri “Dearest Mother, I am doing fine here. Wish you, father, brother and sissy are doing fine there. I am sending only eight thousand this month. I will try to send ten to fifteen thousand next month. Vasantha Akka helps me a lot here. It is from her that I occasionally take hand…
-
చివరికి అంతా ఇంతేనా?… కార్ల్ సాండ్ బర్గ్, అమెరికను
చివరికి అంతా ఇంతేనా? ఇక ఈ ద్వారాలు ఎన్నటికీ తెరుచుకోవా? తుప్పుపట్టిన తలుపుకమ్ములచుట్టూ ధూళీ- గాలీ దొంగాటాడుతూ, శరద్గీతికలు నిట్టూర్పులు విడువవలసినదేనా? నువ్వు పర్వతాలను వీక్షిస్తుంటావు పర్వతాలు నిన్ను చూస్తుంటాయి నువ్వు “నేను మహాపర్వతాన్నైతే బాగుండును” అనుకుంటావు మహా పర్వతం ఏమీ ఊహించుకోదు చివరకి ఇంతేనా? ఈ ద్వారాలు ఎన్నటికీ- ఎప్పటికీ తెరుచుకోవా? అంతా దుమ్మూ, గాలీ తుప్పుపట్టిన తలుపు కమ్ములూ ఓహ్, ఓహ్ అంటూ ఎండుటాకుల్లో నిట్టూర్పులు విడిచే శరద్గీతికలూ, అంతేనా? గాలిలో శోకగీతికలు…
-
బహిష్కరణ… వినిఫ్రెడ్ వెల్స్, అమెరికను కవయిత్రి
నా దుఃఖాన్ని అమూల్యంగా భావించి సంబరం చేసుకుంటూ నా వ్యథని నేను గర్వంగా ప్రదర్శించుకుంటున్నాను. నా అశ్రుకణాలు సిగలో నక్షత్రాల్లా మెరుస్తున్నాయి నా మౌనం ఇంద్రనీలమణిపొదిగిన ఉంగరంలా దిగ్భ్రాంతి గొలుపుతోంది. ఏ వెలుగులకన్నా చీకటే తన నీలివస్త్రం కప్పి ఇంద్రజాలంతో నన్నొక అపురూపమైన వస్తువుగా చెయ్య్యగలదు, నేను ధరించే ఏ ఇతర రంగులుకన్నా ఎక్కువగా నాపై ప్రసరించే నీడల ముత్యాలకాంతులు శోభనిస్తాయి. నాలాంటి వ్యక్తికి ఆనందాన్నివ్వడానికి ఏమి మిగిలింది? సూర్యాస్తమయమే దివ్యంగా మహత్తరంగా కనిపించినవాడికి కొత్తగా ఏ…
-
పిల్లులకి పిండంబెట్ట!… పీటర్ పోర్టర్, ఆస్ట్రేలియా
(ఇది చాలా అపురూపమైన కవిత. మనకి కొందరు వ్యక్తులపట్ల, కొన్ని జాతులూ, మతాలపట్లా నిష్కారణమైన ద్వేషం ఉంటుంది. ముందు మనం వాటిని ద్వేషించడం ప్రారంభిస్తాం గనుక ద్వేషించడానికి తగిన కారణాలు ఎంత అల్పమైనవైనా, అర్థంలేనివైనా వెతుక్కోజూస్తాం. ప్రభుత్వాలైనా అంతే. ప్రతిపక్షం అంటే ప్రభుత్వం చేసేది ప్రతీదీ తప్పు అనడం తప్ప ప్రభుత్వనిర్ణయాలను దేశప్రయోజనాల దృష్టిలో వివేచించే ప్రసక్తి ఉండదు. ఎదుటవ్యక్తిమీద మనతీర్పులన్నీ అతనిచర్యలవల్ల మనకి కలిగే లాభనష్టాలమీద ఆధారపడి ఉంటాయి తప్ప, ఎదుటివ్యక్తికి మనం కోరుకున్నట్టుగానే, అతనికి…
-
శరత్ సంగీతం…. జార్జి జె. డాన్స్, కెనడా
Photo by Reggaeman. Courtesy Wikimedia Commons. Licensed under a Creative Commons Attribution-Share Alike 3.0 Unported license. *** వేసవి వన్నెలతో రోజులు విసిగెత్తినపుడు కపిలవర్ణాన్నీ, బురద రంగునీ హత్తుకుని రాలి పోగులుపడ్ద ఎండుటాకులలో ప్రేమకోసమై వెదుకు. తరచు ప్రేమ అలానే రాలిపడుతుంటుంది. . జార్జి జె. డాన్స్. Born October 28, 1953 కెనడా George J Dance Autumn Music . When days grow bored with summer hues, embracing brown…