-
అందరూ పాడిన పాట… సీ ఫ్రై ససూన్, ఇంగ్లీషు కవి
అందరూ ఒక్కసారి పాట అందుకున్నారు; నాలో ఎంత ఉత్సాహం పొంగిపొరలిందంటే పంజరంలో బంధించబడిన పక్షులు విముక్తులై తెల్లని పూదోటలమీద రెక్కలల్లార్చుకుంటూ పచ్చనిపొలాలమీదుగా విహరిస్తూ విహరిస్తూ కంటికి కనిపించనంతదూరంవెళ్లినంతగా. అందరిగొంతుకలూ ఒక్కసారి తారస్థాయికి చేరుకున్నాయి; సూర్యాస్తమయవేళ సౌందర్యం అందర్నీ ఆవహించింది, నా మనసు కన్నీటితో పులకించిపోయింది; భయం పటాపంచలయింది… ఓహ్! కానీ అందరూ పక్షుల్లాగే… పాటలో పదాలు లేవు; పాట ఇక ఎవరూ పాడలేరు. . సీ ఫ్రై ససూన్ (8 September 1886 – 1 September…
-
ముఖంలో గొప్ప ఆకర్షణ ఉంటుంది… ఎమిలీ డికిన్సన్ అమెరికను కవయిత్రి
సరిగ్గా కనీ కనిపించని ముఖంలో ఎదో తెలియని గొప్ప ఆకర్షణ ఉంటుంది. పాపం, అది కోల్పోతుందేమోనని ఆ పిల్ల ముసుగు తొలగించసాహసించదు కానీ ముసుగుకావల ఏముందో చూస్తుంటుంది కాసేపు కోరుకుంటూ కాసేపు వద్దనుకుంటుంది. ఆకారం అందంగా ఉన్న వ్యక్తితో సంభాషణ కోరికని అణచివేస్తుందేమోనన్న భయంతో . ఎమిలీ డికిన్సన్ (December 10, 1830 – May 15, 1886) అమెరికను కవయిత్రి Emily Dickinson Photo Courtesy: Poetry Foundation . A Charm Invests…
-
వాడిన పువ్వులనూ ప్రేమించాను… రాబర్ట్ బ్రిడ్జెస్, ఇంగ్లీషు కవి
నేను వాడిన పువ్వులనూ ప్రేమించాను వాటి మార్మిక హృదయమందిరాల్లో అశాశ్వతమైన తీయని సుగంధాలతో వైవిధ్యభరితమైన రంగులు జతగూడుతాయి అవి ప్రేమయాత్రలకు ఉద్దీపనాలు కంటికెదురుగా కనిపించే ఆర్ద్రప్రేమ సంకేతాలు. క్షణంలో వయసుమీరుతాయి. వాటిని ఆహ్వానించడానికి భయంతో నీరుగారిపోతున్న ఆకాశ వేదికని తమ సమ్మోహకరమైన సుగంధాలు నింపకముందే, అంతరించే గాలుల్ని ప్రేమించాను. హృదయ కాంక్షను వ్యక్తపరిచిన విస్ఫులింగాలబోలిన రాగరంజిత స్వరాలు పలుచనై, శాశ్వతంగా కనుమరుగవుతాయి. నా గీతికకూడా అటువంటి వాయుతరంగమైపోవాలి. ఓ నా గేయమా! నువ్వుకూడా గాలిలా పతనమవు! కుసుమంలా…
-
స్వర్గారోహణ … కేథ్లీన్ నోరిస్, అమెరికను కవయిత్రి
అది కేవలం ఉరుముతున్న అకాశం మీద గన్ మెటలు మేఘాలను వెంట తరిమే గాలిపరగడాయే కాదు; కొమ్ము ఊదినపుడు వెలువడ్డ శబ్దతరంగం పైకి ఎగసినట్టు అంతటి వడిగాలిలో మనంకూడా తేలిపోతున్న అనుభూతే కాదు; అది మా చెల్లెలు నీటిలోకి దూకడం, ఆమె అరుపులూ, ఒక్కసారి రక్తం, ఎముకలూ క్రిందకి ప్రవహిస్తున్న అనుభవమే కాదు; అందులో అన్నీ కలిసి ఉన్నాయి. బురదా, కరుగుతున్న మంచులోంచి కొత్తగా మొలకెత్తుతున్న గరికా, క్రిందటివారం కురిసిన మంచుతుఫానుకి మా ఇంటి ద్వారం ముందు…
-
ఇసుకమీద… ఎలా వీలర్ విల్ కాక్స్, అమెరికను కవయిత్రి
స్నేహం పునాదిగా లేని ప్రతి ప్రేమా ఇసకమీద కట్టిన భవంతిలాంటిది. దాని గోడలు దేశంలో దేనికీ తీసిపోనంత గట్టివైనా వాటి శిఖరాలు ఆకాశంలోకి నిటారుగా హుందాగా తలెత్తినా; అనుభవజ్ఞులూ, నిపుణులైన పనివారు అన్నిచోట్లా అందమైన అలంకరణలతో తీర్చిదిద్దినా చీకటి మూలల్లో తళతళలాడే విగ్రహాలు నిలబడినా, పూలుదాగున్న చోటుల్లో జలయంత్రాలు నీరు చిమ్ముతున్నా, తూర్పునుండి ఆగ్రహోదగ్రమైన ఒక్క పెనుగాలి వీచితే చాలు, విధి వక్రించి, పగలనక రాత్రనక ఒక తుఫాను ముంచుకొస్తే చాలు, దాని గోడలు దాసోహం అంటాయి.…
-
మనిషికి బ్రతికుండగా సమయం దొరకదు… యెహుదా అమిఖాయ్, ఇజ్రేలీ కవి
మనిషికి బ్రతికుండగా సమయం దొరకదు ఏ పనిచెయ్యడానికైనా సమయం కేటాయించడానికి. అతనికి చాలినన్ని ఋతువులు లేవు తన ప్రతి అవసరానికీ ఒక ఋతువు కేటాయించడానికి. ఆ విషయంలో మతగ్రంథం చెబుతున్నది తప్పు. అతనికి ఒకే సమయంలో ప్రేమా కావాలి, ద్వేషమూ కావాలి ఆ కళ్ళతోనే ఒక ప్రక్క నవ్వాలి, మరొక వంక ఏడ్వాలి, ఆ చేతులతోనే రాళ్ళు రువ్వాలి, రాళ్లు ఏరుకోవాలి, యుద్ధంలో ప్రేమించాలి, ప్రేమలో యుద్ధం చెయ్యాలి. ద్వేషించాలి, క్షమించాలి, గుర్తుంచుకోవాలి, మరిచిపోవాలి, ఒక క్రమ…
-
తరుణి… లిండా గ్రెగ్, అమెరికను కవయిత్రి
నేను ఒకప్పుడు హాయిగా బ్రతికిన నా స్వదేశానికి తిరిగివచ్చేను, ఎన్నో మార్పులకు లోనై. ఇప్పుడు అవేశం నన్ను ఒత్తిడికి గురిచెయ్యదు. ఇప్పుడు వాంఛల జాగాలో ఏవి వచ్చి చేరుతాయోనని కుతూహలంగా ఉంది. నేను ఎంతో మెరుగ్గా ఎక్కడ జీవించేనో అక్కడ తిరుగాడుతున్న నా గత ప్రకృతికి వికృతిలా ఉన్నానేమో! అటూ ఇటూ తచ్చాడుతూ విలువైన వస్తువు నాకు కనిపించినపుడు తల పంకిస్తూ. ఇప్పుడు నా ఇంట్లో గుడ్లగూబల అరుపులు వింటూ నివసిస్తున్నాను. అవి నేను నెమ్మదిగా మళ్ళీ…
-
ప్రేమే సర్వస్వం కాదు… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
గమ్మత్తైన శిల్పంతో ప్రేమ సర్వస్వం కాదంటూనే, దాన్ని సర్వస్వంగా వాచ్యం చెయ్యకుండా నిరూపిస్తుంది ఎడ్నా ఈ కవితలో. *** ప్రేమే సర్వస్వం కాదు; అది తిండిపెట్టదు, దాహం తీర్చదు నిద్రపుచ్చదు, కనీసం వర్షాన్నుండి రక్షించదు; అది ప్రవాహంలో కొట్టుకుపోతున్న కొయ్యకూడా కాదు దాన్ని ఆసరాగా చేసుకుని మునుగుతూ, తేలుతూ, ఒడ్డుచేరుకోడానికి; గట్టిపడిన ఊపిరితిత్తుల్ని అది గాలితో నింపలేదు, రక్తాన్ని శుభ్రపరచలేదు, విరిగిన ఎముకని అతకనూలేదు; అయినప్పటికీ, మనిషి మృత్యువుని కాగలించుకుంటూనే ఉన్నాడు నేను మాటాడుతున్న ఈ క్షణంలో…
-
నాకేమిటి లక్ష్యం… సారా టీజ్డేల్
కలలలోనూ, వసంతపు మత్తులోనూ నా పాటలు వినిపించకపోతే నాకేమిటి లక్ష్యం? అవి సుగంధాలవంటివి, నేనొక చెకుముకి రాయిని, నిప్పురవ్వని, ఆర్తిగా పిలిచేవి అవి; వాటికి బదులుపలుకుతాను అంతే! నా ప్రేమ కొద్దిలో ముగిసిపొతుందంటే, నాకేమిటి లక్ష్యం? నా హృదయాన్ని చెప్పదలుచుకున్నది చెప్పనీండి, బుద్ధి మారుమాటాడదు. నా బుద్ధికి మౌనంగా ఉండగల అహం, సమర్థతా ఉన్నై, పాటలు కట్టేది నా హృదయమే, నేను కాదు. . సారా టీజ్డేల్ అమెరికను కవయిత్రి . . . . What…
-
శాస్త్రవిజ్ఞానానికో నమస్కారం… ఎడ్గార్ ఏలన్ పో, అమెరికను కవి
శాస్త్రవిజ్ఞానమా! ప్రాచీనకాలానికి అచ్చమైన బిడ్డవు నువ్వు. నీ నిశితమైన దృష్టితో అన్నిటినీ పరివర్తన చెయ్యగలవు. ఎందుకునువ్వు ఈ కవిహృదయాన్ని కబళించడానికి సిద్ధపడతావు? నువ్వు హృదయంలేని కరుకు సత్యాలరెక్కలతో విహరించే రాబందువి కావూ? కవికి నీమీద ప్రేమ ఎక్కడినుండి కలుగుతుంది? నీ జ్ఞానాన్ని మెచ్చేదెలా? అలుపులేని ఆలోచనల రెక్కలతో అతను మింటికెగసి అక్కడ నిక్షిప్తమైన సౌందర్య నిధులకై తిరుగాడుతుంటే నువ్వు అతన్నికూడా విడిచిపెట్టవు గదా! డయానాని తన సింహాసనం నుండి బహిష్కరించింది వనదేవతలని చెట్లనుండి వేరుచేసి మరో చోటు…