-
పాఠకుడికి… డెనిస్ లెవర్టోవ్, బ్రిటిషు కవయిత్రి .
మీరు ఇది చదువుతుంటే, ధృవాలలో ఒక తెల్లని ఎలుగు తెల్లని మంచుని కాషాయరంగులో ముంచుతూ మూత్రాన్ని విసర్జిస్తుంది. మీరిది చదువుతుంటే చాలామంది దేవతలు వృక్షాలనల్లుకున్న లతలలో దాక్కుంటారు; గాజులామెరిసేకళ్లు తరాల పచ్చని ఆకులని వీక్షిస్తుంటాయి. మీరిది చదువుతుంటే ఆ సముద్రం అలలు ఎగదోస్తుంటుంది భీకరమైన తన అలల్ని ఎగదోస్తుంటుంది. . డెనిస్ లెవర్టోవ్ (24 October 1923 – 20 December 1997) బ్రిటిషు కవయిత్రి Denise Levertov British Poet Photo Courtesy: http://lithub.com/denise-levertov/…
-
ప్రతి ఊరూ నా ఇల్లు… కణియన్ పూన్‌గున్రనార్, తమిళకవి
ప్రతి ఊరూ నా ఇల్లు ప్రతి మనిషీ నా చుట్టము. మన జీవితాలు, అవెంతప్రియమైనవైనా వాటి మార్గాన్ని అవి అనుసరిస్తాయి, ఆకాశాన్ని చీలుస్తూ మెరిసే మెరుపుల తర్వాత కురిసినకుండపోతకి ఉధృతంగా పారే నదీ ప్రవాహానికి రాళ్ళమీద ఒక్కదెబ్బకు ముక్కలయో లేదా దారితప్పో పోతున్నాయి తెప్పలు. ఇదంతా దూరదృష్టిగలవారి దార్శనికతవల్ల మనం తెలుసుకోగలం అందుకే మనల్ని గొప్పవాళ్ళు ఆశ్చర్యపరచరు సామాన్యుల్ని మనం కించపరచము. . కణియన్ పూన్‌గున్రనార్ తమిళకవి సంగం యుగం. Every Town a Home Town…
-
ఇక్కడ ఈ ఉదయం… ఏలన్ డూగన్,అమెరికను
ఇది ఈ రోజు సరికొత్త ఉదయం: గతరాత్రికి చెందిన కీర్తి అపకీర్తులు గతించాయి, వాటి ప్రభావాలు మినహా ; ఒకటవ, రెండవ ప్రపంచ మహాసంగ్రామాలూ, ఎడ్వర్డు ఏడుతోనో, ఎనిమిదితోనో, వాలిస్ వార్ ఫీల్డ్ సింప్సన్ వివాహమూ, “పోప్” లకున్న క్రమసంఖ్యల్లా… వరుస సంఖ్యలిచ్చిన రాకెట్లు …ఆకాశంలోనో చంద్రమండలం మీదనో పేలిపోతాయి. ఇక ఇప్పుడు ఒక కొత్త రోజు మొదలైంది. ఈ రోజునీ, దాని చక్కని చుక్కల్నీ తక్షణం హస్తగతం చేసుకోవాలి, మతాధికారులు ఆరుబయట పాదచారుల కాలిబాటల్ని శుభ్రపరుస్తున్నారు,…
-
స్వాప్నికుడు… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి
కలల కనుమల్లో ఒక స్వాప్నికుడు అతన్ని పిచ్చివాడిగా పరిగణిస్తారు; అతనికి అదొకవెర్రి; బక్కచిక్కి, వంగిన శరీరాన్ని కప్పి ఉంచిన అతని ఉడుపుల మాసికలనుబట్టి అతన్ని విలువకడతారు. ప్రతిరోజూ సూర్యుడు పడమటికొండ దిగగానే, తీరికలేని నగర పొలిమేరలుదాటి, నింగీ నేలా కలిసే చోట వంపులుతిరిగి, తీరికగా, సడిచేయక పారే సెలయేటి తీరాన ఆ వింత మనిషి ప్రశాంతంగా అటూఇటూ తిరుగుతుంటాడు. అతని చెవులబడే సంగీతం గురించి, ఆహ్! ఏమని చెప్పను?! ఆ కన్నులాలోకించే అద్భుతదృశ్యాలను ఏమని వర్ణించను?! అతనా పేదవాడు? ఎన్నటికీ…
-
బానిస … ఫ్రాంక్ పొలైట్, అమెరికను
రక్తం చెప్పలేనంత ఎరుపు, ఆవేశం, కొన్ని ప్రమాదకరమైన భయాల, కొన్ని సూర్యాస్తమయాల రంగు… ఆలోచనలలో అంతర్లీనంగా విశాలమైన, ఇరుకైన దారులగుండా గుండెచప్పుళ్ళు వినిపించే మృత్యువునీ, మృత్యుభయాన్నీ వేరుచేసుకుంటూ, సమీకరించుకుంటూ… దూరంగా జీవితాన్ని ప్రేమించిన రక్తం… ముగింపుకివస్తున్న సుదీర్ఘమైన విషాదంలో మునిగి ఒక నిర్ణయానికి వస్తుంది. బహుశా అక్కడ ఏ వెలుతురూ, గాలీ చొరరాని గదిలో ఒక గాయం, ఒక కిటికీ తళుక్కుమంటుంది, చెమటలుకక్కుకునే దృఢమైన బానిస ఒకరు క్షణకాలం ఆలోచనలోనిమగ్నమై దిగ్గున లేస్తాడు. . ఫ్రాంక్ పొలైట్…
-
Sanjeevarayudu… Dr. Mythili Abbaraju, Telugu, Indian
I had just returned from attending job counselling interview. I knew that there was a vacancy in that village before. When I mentioned my choice without a second thought, there was a shade of surprise on the face of the officials for my choice of that remote village. “Is it where you hail from, Doctor?”…
-
పారసీ వ్రాతప్రతికి … ఇడా ఓనీల్, అమెరికను కవయిత్రి
ఎత్తైన ఆ తెల్లని గోడ వెనుక ఎప్పుడూ ఒక ఉద్యానవనం ఉంటుంది… అక్కడ దగ్గరగా కోయబడిన పాలిపోయిన పచ్చిక, దానిమీద అలంకరించబడిన పువ్వులు ఉన్నాయి. అతిథిని సంతోషపెట్టడానికి ఒక కుర్చీ వేసి ఉంచారు. ఎత్తైన రొమ్ములుగల సన్నటి నడుముగల స్త్రీలు నెమలికంఠం రంగు నీలపు పాత్రల్లో అతనికి పళ్ళూ, ఆహారమూ అందిస్తున్నారు. ఆ గోపురాలున్న భవన ద్వారానికి దూరంగా ఏనుగులసవారీపై సార్థవాహులు పోతున్నారు, బంగారం రంగు పువ్వులు నగిషీ చెక్కినట్టున్న అడవి మార్గంగుండా నీలాకాశం నేపథ్యంలో తెల్లగా,…
-
ముప్ఫయ్యవయేటినాటి చిత్తరువు… ఫ్రాంక్ పొలైట్, అమెరికను
ఆ చెట్టు కాండములో 30 వృత్తాలు. అకస్మాత్తుగా, నన్ను నేనక్కడ చూసుకున్నాను, చిన్నగా అయి, ఆ కలపలో భాగమైపోయాను, గాలిని విసరుతూ . . ఫ్రాంక్ పొలైట్ 1936-2005 అమెరికను కవి . Image at Thirty 30 circles In the heart of one tree. Suddenly, I see me there, grown tiny, Rooted in the wood of the stadium, Fanning the air. . Frank Polite…
-
స్వేచ్ఛా పురుషుడు … గ్వెండొలీన్ బ్రూక్స్, అమెరికను కవయిత్రి
ఒక గదో, రెండు గదులో, మూడు గదులో ఉన్న చిరు జీవితంలోకి నిన్ను తీసుకుపోయి నిన్నొక సీసాలోని సారాయిలా పరిగణిస్తూ చాకచక్యంగా ఎవరు నిన్ను బంధించగలరు? ఏ స్త్రీ, ఏ భార్యా చెయ్యలేదు. పొంగిపొరలే రత్నంలాంటి ఆమెకు ఆనందాన్నివ్వడానికి నిన్ను గిరగిరా తిప్పనిచ్చి మిత్రుడికి పరిచయంచేస్తావు. ఆ గిరగిరా తిప్పడం ఒక బలహీనత. ఒకసారి స్వాతంత్య్రాన్ని చవిచూసేక అప్పటినుండి నువ్వు ఏ బిరడాలూ అనుమతించలేవు. ప్రతి స్త్రీ జాగ్రత్తగా ముందే ఆలోచించుకోవాలి. వారానికి ఒకసారి తనే ప్రమాదఘంటికలు…
-
All The Things She Said… Nanda Kishore, Telugu, Indian
Leave the flowers to the winds They won’t be redolent on paper for long Let butterflies take to wings Don’t seat them uncomfortably in the ellipses Their wings are too delicate. It looks good when the ripples Retreat, kissing your fingers Sunrise and sunset look Have their charm only over the hill. Unless you have…