All The Things She Said… Nanda Kishore, Telugu, Indian
Leave the flowers to the winds
They won’t be redolent on paper for long
Let butterflies take to wings
Don’t seat them uncomfortably in the ellipses
Their wings are too delicate.
It looks good when the ripples
Retreat, kissing your fingers
Sunrise and sunset look
Have their charm only over the hill.
Unless you have time to notice the changes
Don’t blab about Spring and Autumn.
Before you carry the streams within
Feel the cool tactility of water first.
If you can sleep at night
You never need to write about it.
Finally, I don’t ordain you not to love,
But mind you, you are in your grave.
.
Nandakishore
Image courtesy: Nanda Kishore
All The Things She Said
పూలనట్లా గాలికి వదిలెయ్
కాగితం మీద అవి ఎంతోసేపు పరిమళించవు.
సీతాకోకచిలుకల్ని ఎగరనీయ్
పదాల విరుపుల్లో ఇరుగ్గా కూర్చోబెట్టకు
వాటిరెక్కలు సుతారం
అలలు నీ వేళ్లని తగిలి
వెనక్కిపొతే బాగుంటది
ఉదయం అస్తమయం
కొందమీదనే అందం.
ఋతువుమారడం గమనించే తీరిక ఉంటేతప్ప
వసంతం, శిశిరం అని కబుర్లు చెప్పకు
సెలయేర్లు మోసే ముందు చల్లగా
కొన్ని నీళ్ళు ముట్టుకో
రాత్రి నిద్రపొతే అసలు దాని గురించి
రాసే అవసరం ఉండదు
ఇకపొతే, ప్రేమించొద్దని చెప్పనుగానీ
నువ్వు సమాధిలో ఉన్న సంగతి మరిచిపోవద్దు
.
నందకిషోర్
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
స్పందించండి