అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • డిసెంబర్ 17, 2023

    కట్టుకథ… రాల్ఫ్ వాల్డో ఎమర్సన్, అమెరికను కవి

    ఒకసారి ఒక మహాపర్వతమూ, ఉడుతా తగవులాడుకున్నాయి. తగవులో, పర్వతం ఉడతని “నువ్వో తుచ్చమైన దొంగవి,” అంది; దానికి ఉడుత ఇలా సమాధానం చెప్పింది: “ణువ్వు చాలా పెద్దదానివని ఒప్పుకుంటాను; ఏడాదికైనా, గోళానికైనా రోజులన్నీ లెక్కించకుండా ఖండాలన్నీ లెక్కించకుండా స్వరూపాన్ని నిర్ణయించలేము. నేను నా అంత ఉండడంలో సిగ్గుపడడానికి కారణమేదీ లేదనుకుంటున్నాను. నేను నీ అంత పెద్దదాన్ని కాదనుకుంటే నువ్వు నా అంత చిన్నదానివీ కావు, నా చురుకుదనంలో సగపాలు కూడా నీకు లేదు. నువ్వి మా ఉడతలకి…

  • డిసెంబర్ 15, 2023

    పసరం… వాల్ట్ వ్హిట్మన్, అమెరికను కవి.

    నేను కూడా పసరాన్నై, పసరాలతో కలిసి జీవిస్తే బాగుణ్ణు వాటంత నెమ్మదైనవీ, స్వయంపోషకాలు మరొకటి లేవు, అలా నిలబడి గంటలకొద్దీ వాటినే చూడాలనిపిస్తుంది. వాటి స్థితి గురించి చెమటలు కక్కుకుంటూ అరిచి, ఇతరులని నిందించవు; రాత్రల్లా నిద్రమేలుకుని తాము చేసిన పాపాలకై వగవవు; దేముడి పట్ల మన బాధ్యత గురించి ఉపన్యాసాలు దంచి విసిగించవు; ఏ ఒక్కటీ అసంతృప్తికి లోనుకాదు, లేదా ఫలానా వస్తువు ఎలాగైనా సంపాదించాలన్న వ్యామోహంతో పిచ్చెత్తి పోవు; ఒకటి రెండవదానికి గాని, వేల…

  • డిసెంబర్ 14, 2023

    ఆశ … ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి

    ఆశ … రెక్కలొచ్చిన పక్షి అది మనసు కొమ్మ మీద వాలి ఉంటుంది మాటలు లేని సంగీతాన్ని ఆలపిస్తుంది ఎన్నడూ విశ్రాంతి అన్నది ఎరుగదు. పెను తుఫానుల్లో మరింత మధురంగా వినిపిస్తుంది; ఎందరి గుండెలనో వెచ్చగా ఉంచే ఆ చిన్ని పిట్టని ఆందోళనకి గురిచేసే ఆ తుఫాను ఎంత బాధాకరమైనది!’ మిక్కిలి చలి ప్రదేశంలో దానిని విన్నాను జాడ తెలియని సముద్రం మీదా విన్నాను అయినా, ఎన్నడూ, ఎంత విపత్తులోనూ, నాకు ఇది కావాలని నన్ను యాచించలేదు.…

  • డిసెంబర్ 12, 2023

    ఒక్కడినే… ఏడ్గార్ ఆలన్ పో, అమెరికను కవి

    చిన్ననాటి నుండీ అందరూ ఉన్నట్టు నేను లేను అందరూ చూసింది నే చూడలేదు అందరి అనుభూతి ఊటలనుండీ నా ఆవేశాలు బయల్పడలేదు అందరి దుఃఖాలకీ కారణం నా దుఃఖ కారణం కాదు. వాళ్ళంత తీవ్రతతోనే నా గుండె ఆనందంతో గెంతు లేయ లేదు. నేను ఏది ఇష్టపడినా- ఒక్కడినే ఇష్టపడ్డాను. అత్యంత సంక్షుభిత జీవితం పొద్దు పొడిచిన వయసులో- మంచీ- చెడులు అన్ని లోతుల నుండీ ఉధృత ప్రవాహాలనుండి- చిన్ని నీటి బుగ్గలనుండి శరత్కాలపు బంగరు వన్నె…

  • డిసెంబర్ 11, 2023

    సగం బ్రతుకు బ్రతక్కు— ఖలీల్ జీబ్రాన్, లెబనీస్- అమెరికను కవి

    సగం బ్రతుకు బ్రతక్కు సగం చావు చావకు. మౌనంగా ఉండదలుచుకుంటే, నోరు మెదపొద్దు. మాటాడదలుచుకున్నపుడు, చెప్పడం పూర్తయ్యేదాకా ఆగకు. అంగీకరించేటపుడు, కచ్చితంగా చెప్పు ముసుగులో గుద్దులాట వద్దు అంగీకరించని పక్షంలో,స్పష్టంగా ఉండు అస్పష్టపు అనంగీకారం, ఊగిసలాడే అంగీకారం సగం పరిష్కారాలు ఒప్పుకోకు అర్థసత్యాలను నమ్మకు సగం కల కనకు సగం ఆశలు ఆశించకు. సగం దూరం నిన్నెక్కడికీ తీసుకుపోదు. నువ్వు పూర్ణమైన వ్యక్తివి పూర్తి జీవితాన్ని జీవించడానికి ఉన్నావు సగం జీవించడానికి కాదు. . ఖలీల్ జీబ్రాన్…

  • డిసెంబర్ 10, 2023

    వీడ్కోలు… ఖలీల్ జీబ్రాన్, లెబనీస్- అమెరికను కవి

    నీకూ, నీతో గడిపిన నా యవ్వనానికీ కడసారి వీడ్కోలు ఇంకా నిన్ననే, మనిద్దరం ఏదో కలలో కలిసినట్టుంది. నా ఒంటరితనంలో నువ్వు పాటలు పాడి వినిపించావు. నేను నీ ఆశలతో ఆకాశ సౌధాలని నిర్మించాను. ఇప్పుడు మన నిద్ర ఎగిరిపోయింది, కల కరిగిపోయింది. అప్పుడే నాలుగు బారల పొద్దెక్కింది. మధ్యాహ్నం కావస్తోంది. మన కలత నిద్రతో రోజు పూర్తి కావచ్చింది. వీడ్కోలు తీసుకునే సమయం వచ్చింది.   జ్ఞాపకాల మసక వెలుగుల్లో మళ్ళీ మనం మరోసారి కలుసుకుంటే…

  • డిసెంబర్ 8, 2023

    కెరటం పెరుగుతుంది, కెరటం విరుగుతుంది … H. W. లాంగ్ ఫెలో. అమెరికను కవి.

    కెరటం పెరుగుతుంది, కెరటం విరుగుతుంది సంధ్యచీకట్లు చిక్కనౌతాయి, క్రౌంచము కూస్తుంది; తడితడిగా ఉండే కావిరంగు సముద్రపుటిసుకమీద ఒక పాదచారి వడిగా నగరంలోకి పరిగెడతాడు కెరటం పెరుగుతూ ఉంటుంది, కెరటం విరుగుతూ ఉంటుంది. చీకటి, ఇంటి కప్పులమీదా, గోడలమీదా పేరుకుంటుంది కానీ ఆ సముద్రం చీకటిలో రారమ్మని పిలుస్తుంది; బుల్లి కెరటాలు తమ తెల్లని, మెత్తని చేతులతో ఇసుక మీది అడుగుల జాడలని తుడిచేస్తాయి కెరటం పెరుగుతూ ఉంటుంది, కెరటం విరుగుతూ ఉంటుంది. పొద్దు పొడుస్తుంది; గుర్రాలు తమ…

  • డిసెంబర్ 6, 2023

    No More Searching… Mohan Rushi, Telugu Poet

    Suppleness is lost. Value has elided. Relevance… reduced to a farce.   Gravity is missing. Intensity and solidity are snows of yesteryears. Compassion is an orphan.   Trust is a limping lame. Fidelity is a street show. It’s avarice to expect love in return. Complacence is veritable childishness.    Hope is a cadaver.  Tactility is…

  • డిసెంబర్ 5, 2023

    మరణమృదంగం జాన్ డన్ …. ఇంగ్లీషు కవి

    ఒక ద్వీపంలా ఏ మనిషీ స్వయం పూర్ణుడు కాడు. ఒక్కొక్కడూ ఒక మహాఖండపు తునక, భూ ఖండంలో ఒక భాగం. ఒక చారెడు నేలను సముద్రం కోసేసినా యూరోపు ఆ మేరకు కొరవడుతుంది, ఒక మిట్ట పోగొట్టుకోడానికి తీసిపోదు ఒక మొఖాసా పోగొట్టుకున్నంత అది నీదైనా, నీ మిత్రుడి దైనా. ప్రతి మరణంలోనూ, నాలో కొంత పోతుంది, ఎందుకంటే నేను మానవాళితో ముడిపడి ఉన్నాను. కనుక, మిత్రమా, ఎవరు పోయారు? అని కనుక్కోకు. మరణమృదంగం మోగేది నీ…

  • నవంబర్ 30, 2023

    How Does the Country look after the elections were over? KNY Patanjali పతంజలి

    How Does the Country look after the elections were over? It resembles an innocent girl who was summarily looted! It looks like a crazy country girl who boards the train Naively trusting the mischievous smiles of an intermediary. How Does the Country look after the elections were over? Much like the mountains of useless political…

←మునుపటి పుట
1 … 4 5 6 7 8 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు