అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • సెప్టెంబర్ 13, 2017

    In the Moil of Hands… Bala Sudhakar Mauli, Telugu, Indian

    No Drop of empathy is shed No Helping hand stretches out But the moil of hands Presents life In thousand and one Scenarios.   And, In Each such Scene Every Drop of Sweat Remains a metaphor For the monumental humanity In the annals of history. Yet neither the hunger is half-served nor the trails of…

  • సెప్టెంబర్ 12, 2017

    ఉరుములూ మెరుపులూ….సుజేన్ డోయిల్, అమెరికను కవయిత్రి

    (మాత్యూ డోయిల్ జాకోబస్ కి) నువ్వు నా బిడ్డవి కావు; నా సోదరి బిడ్దవి. పాలచారికలుకట్టిన నీ మెత్తని పెదాలు అమ్మ కమ్మని తలపులతో తియ్యగా నవ్వుతున్నప్పుడు, నువ్వు ఊపిరి తీసినపుడల్లా పువ్వులా కదులుతూ విచ్చుకుంటున్నాయి. నాకూ ప్రేమంటే తెలుసు, కానీ ఇలా కాదు; ఈ విషాదమయ ప్రపంచంలోకి ఇంత అందాన్ని నా సోదరి ఎలా తీసుకురాగలిగింది? రాత్రి తుఫాను హోరుకి అలల్లా ఎగుస్తున్న కిటికీ పరదాలు ఎక్కడో దూరానున్న ఒంటరి కుక్క భీకరమైన అరుపు మోసుకొస్తున్నాయి.…

  • సెప్టెంబర్ 11, 2017

    బాసిస్, ఫిలీమన్ దంపతులు … డిక్ డేవిస్, ఇంగ్లీషు కవి

    జీవితం పలుగూ, పాఱ, సాపుచేసుకునే కత్తీ తడకలగదులూ, కర్ర సామాన్లతో వెళ్ళిపోతుంది. “మా ఆయన” అనీ, “మా ఆవిడ” అనీ చెప్పనవసరంలేని ముదిమి ఆవహించిన ఆ రెండు దేహాలూ యవ్వనానుభవాలు నెమరువేసుకుంటూనే ఉంటాయి. నిస్సారంగా గడపడంగానీ, దేనిగురించీ తెలుసుకోవలసిన అవసరంగాని లేని వాతావరణంలో వాళ్ళు జీవిస్తున్నారు; అది ఇప్పటికీ వాళ్ళ ప్రేమకి కొనసాగింపే. వాళ్ళ భయమల్లా ఇద్దరిలో ఒకరు ముందు పోయి రెండోవారి జీవితానికి అర్థం లేకుండా చేస్తామేమోననే వాళ్ళిద్దరి కోరికా ఒక్కసారే ప్రాణం విడిచిపెట్టి ఒక్క…

  • సెప్టెంబర్ 10, 2017

    Death Sentence… Viswanatha Satyanarayana , Telugu Indian Poet

    (10 September 1895 – 18 October 1976) ***  “You have sentenced me to death; and now ask me to say whatever I want to say. There would be some meaning if you had asked me before passing the sentence. Now, it makes no difference whether or not I say what I wanted to say. But…

  • సెప్టెంబర్ 8, 2017

    ఒడంబడిక … రాబర్ట్ క్రాఫర్డ్, స్కాటిష్ కవి

    దా, నా దగ్గర కూర్చో! నీ అభిప్రాయంలో ప్రేమంటే ఏమిటో, ఏది ప్రేమకాదో వివరించు. మనం అదనుకోసం నిరీక్షిస్తున్నంతసేపూ మాటాడు మనం కాలహరణం చేస్తున్నంతసేపూ మాటాడుతూనే ఉండు. తార్కికశక్తిపై నాకు తిరుగులేని,దృఢమైన నమ్మకమున్నా పణంగా ఉంచిన ప్రాణాల లెక్కలు వచ్చినపుడు ప్రతిసంకోచం, అనిశ్చితి వెనకా తారాడే నర్మగర్భమైన మాటలు వినడానికి ఇష్టమే; అది బెరుకుగా చూసే చూపు కావచ్చు, దీర్ఘంగా బిగబట్టి విడిచిన నిట్టూర్పు కావచ్చు; లేదా అసంకల్పితంగా, సమయాన్ని మించి చేతిలో ఉంచిన మరో చేతి…

  • సెప్టెంబర్ 7, 2017

    Velu Pillai… C. Ramachandra Rao, Telugu, Indian

    I started my blog on 28th Aug 2010  and this is the 2000th Post in my blog.  I have come a long way and never expected that I would last this long with my modest to less than modest work. ​​I thank all my blog viewers and visitors  for their continuous support, encouragement and comments which…

  • సెప్టెంబర్ 6, 2017

    వేదాంతికి చరమశ్లోకం … బిల్ కోయిల్

    యుద్ధాలు పాలకుల వినోదానికీ, వారి అధికార దర్పాన్నీ, బలాన్నీ ప్రదర్శించడానికీ తప్ప, పాలితులకు లవలేశమైనా మేలు కలిగించదన్న సత్యం అనాదిగా అందరూ చెబుతున్నదే. దీనినే కవి మరింత చమత్కారంగా చెప్పాడు. *** అతను మరణించి, కొన్ని వేల రణభూముల  అంతిమ ప్రతిఫలమైన ధూళికణంగా మారాడు. . బిల్ కోయిల్ సమకాలీన అమెరికను కవి Bill Coyle  Epitaph for a Philosopher . He has become, in death, the dust that yields the…

  • సెప్టెంబర్ 5, 2017

    అనుకోని సంఘటన… గెరీ కేంబ్రిడ్జ్, స్కాటిష్ కవి

    మనోహరమైన రాత్రి. నేను ఆరుబయటకి నడిచి శిశిర నిశీధిని తలెత్తి ఆకాశాన్ని పరికిస్తాను అక్కడ మేఘాలమధ్య తారకలు దివ్యంగా మెరుస్తుంటాయి అప్పుడు మనసుకి ఏ ఆలోచనతడితే అది ఆలోచించవచ్చు. నెత్తిన మెరుస్తున్న కృత్తిక దిగువ గొప్ప ఆలోచనలు గిలకొడుతోంది. నలుప్రక్కలా దట్టంగా పరుచుకున్న ఈ రాతిరి కిటికీ వెలుతురులోంచి వెతికే కనులకు అందని, శుష్కమైన పశ్చాత్తాపాలనీ, వీడ్కోళ్ళనీ సులభంగా గుర్తుచేస్తోంది. కానీ, ఇదేమిటి అకస్మాత్తుగా నా కాళ్ళదగ్గర పాదాలను నాకుతూ? ఓహ్! ఎప్పుడూ మచ్చికగా ఉండే బలిష్ఠమైన…

  • సెప్టెంబర్ 4, 2017

    పగిలిన అద్దం… డేవిడ్ బెర్మన్, అమెరికను కవి

    నా జీవితం చివరకు వచ్చేసింది; గణాంకశాస్త్ర రీత్యా అది రాబట్టిన సత్యమైనా, అది నిజమే; నేను అద్దంలో చూసుకోబోతే, అది పగిలి ఉంటుంది. అందుకని అది ఒకటి, రెండు, మరెన్నో పొంతనలేని ప్రతిబింబాలు చూపిస్తుంది; వాటిలో దేని లక్ష్యాన్నని నేను అందుకో ప్రయత్నించను? నా జీవితమా చరమాంకానికి వచ్చేసింది. అది సత్యం. ఇక మిగిలిన సమయంలోనంటావా? సామాను చాలవరకు సర్దేశాను. కట్టలుగట్టి పెట్టెల్లో పెట్టేశాను; చెయ్యడానికింకేమీ లేదు; నేను అద్దంలోకి చూసుకుంటే, అది పగిలి కనిపిస్తుంది. దాన్ని…

  • సెప్టెంబర్ 3, 2017

    భద్రవలయాన్ని దాటిపోవడం … టెన్నీసన్, ఇంగ్లీషు కవి

    సూర్యాస్తమయమూ, సాంధ్య తారకా…  రమ్మని నాకోసం ఒక స్పష్టమైన పిలుపు! నేనా ఇసుకతిన్నెను దాటి  సాగరంలోకి అడుగిడినపుడు ఎవరూ శోకించకుందురు గాక! నిద్రాకెరటమెంత తీవ్రంగా చుట్టుముడుతుందంటే గురకపెట్టడమూ, చొంగకార్చడమూ ఉండవు.  మేరలేని అగాథాల లోతులలోంచి బయటకు తెచ్చినదే చివరకు స్వస్థానానికి తిరిగి జాగ్రత్తగా చేరుస్తుంది. అసురసంధ్యాకాలమూ, సాంధ్యఘంటారవాలూ … ఆ తర్వాత అంతా చిక్కని చీకటే! నేను పడవలోకి ఎక్కినపుడు ఏ విషాదపు వీడ్కోలులూ ఉండకుండు గాక! దేశకాల సరిహద్దులనుండి తిన్నగా ఈ ఉప్పెన నన్ను చాలా…

←మునుపటి పుట
1 … 54 55 56 57 58 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు