-
1994- ల్యూసిల్ క్లిఫ్టన్ … అమెరికను కవయిత్రి
నాకు 58 వ ఏడు నిండబోతోంది. అప్పుడు బొటకనవేలంత మంచుగడ్డ నా గుండెమీద దాని ముద్ర వేసింది. నీ అభిప్రాయం నీకుంటుంది. నీ భయాలూ, నీ కన్నీళ్ళూ నీ నమ్మలేని నిజాలగురించి నీకు తెలుసు. చిత్రం ఏమిటంటే, మనం చెప్పే అబద్ధాలలో అతి బాధాకరమైనవి మనకు మనం చెప్పుకునేవి. నీకు అదెంత ప్రమాదమో తెలుసు రొమ్ములతో పుట్టడం; నీ కదెంత ప్రమాదకారో తెలుసు నల్లని చర్మం కలిగి ఉండడం. నాకు 58 వ ఏడు నిండబోతుంటే కొంత…
-
కొండమీద ఒక మధ్యాహ్నం… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
ఈ ఆకాశం క్రింద నా అంత ఆనందంగా ఎవరూ ఉండరు. నే ఒక వంద పుష్పాలు తాకుతాను కానీ, ఒక్కటీ తురుమను. నేను మేఘాల్నీ, కొండ కొనకొమ్ముల్నీ ప్రశాంత వదనంతో తిలకిస్తాను. గాలి ఎలా పచ్చికని అవనతం చేస్తూ పోతుందో పచ్చిక తిరిగి ఎలా తలెత్తుకుంటుందో చూస్తాను. దూరాన ఉన్న మా ఊరిలో దీపాలు వెలిగే వేళకి మా ఇల్లు ఎక్కడ ఉందా అని చూసి, గుర్తించి కొండ దిగడం ప్రారంభిస్తాను. . ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే…
-
చిత్తరువులు … మారిన్ సొరెస్క్యూ, రుమేనియా కవి
మ్యూజియాలన్నిటికీ నేనంటే భయం: ఎక్కడైనా నేను రోజల్లా ఒక చిత్రాన్ని నిశితంగా పరిశీలిస్తానా, మరుచటిరోజే, అది మాయమైపోయిందని ప్రకటిస్తారు. ప్రతిరోజూ, ప్రపంచంలో ఏదో ఒకచోట నేను ఏదో ఒకటి దొంగిలిస్తుండగా పట్టుకుంటారు. నా చెవుల్ని ఒరుసుకుంటూ తుపాకిగుళ్ళు పోతుంటాయి; ప్రేమికులకి తమ ప్రేమికల శరీరగంధం తెలిసినదానికంటే ఎక్కువగా పోలీసు కుక్కలకి ఇప్పుడు నా అడుగుల వాసన బాగా తెలుసు; అయినా నేనేమీ చలించను. నేను నా ప్రాణానికి ముప్పుతెచ్చిపెట్టే తైలవర్ణచిత్రాలమీద గట్టిగా అరుస్తాను. వాటిని మేఘాలమీదా, చెట్టుకొనలకీ…
-
స్వర్గానికి నిచ్చెన… మారిన్ సొరెస్క్యూ, రుమేనియన్ కవి
సాలీడు అల్లిన పట్టు దారపుపోగు కప్పునుండి వేలాడుతోంది సరిగ్గా నా పక్కకి నెత్తిమీద. రోజు రోజుకీ అది క్రిందకు దిగడం గమనిస్తున్నాను. నే ననుకుంటుంటాను: “ఇప్పుడు నాకు దేముడు స్వర్గాన్ని అధిరోహించడానికి నిచ్చెన వేస్తున్నాడని.” నేను నీరసించిపోతే నీరసించిపోదునుగాక పూర్వపు నా రూపుకి నేను ఒక చాయనవుతే అవుదునుగాక కానీ, నన్నీ నిచ్చెన భరించలేదు. ఓ హృదయమా, విను! నువ్వు మాత్రం ముందుకి సాగు… మెత్తగా… సుతిమెత్తగా . మారిన్ సొరెస్క్యూ రుమేనియన్ కవి, నాటక కర్త…
-
చితిమీద ఒక కవి … మునిపల్లె రాజు

మునిపల్లె రాజుగారు తెలుగు కథకి చేసిన సేవ అపారమైనది. అభ్యుదయ కుటుంబనేపథ్యంనుంచి వచ్చిన రాజుగారు, రక్షణశాఖ ఉద్యోగిగా తమ రెండవ ప్రపంచసంగ్రామపు అనుభవాలనీ, బొంబాయి నూలుమిల్లుల్లో తను చూసినవీ, విన్నవీ, నవయువకుడిగా స్వాతంత్య్ర పోరాటాన్ని దగ్గరగా చూస్తూ పొందిన అనుభవమూ, ఎనభై ఏళ్ళు దాటేవరకూ చెక్కు చెదరని తన జ్ఞాపకశక్తినీ బాగా రంగరించి అపురూపమైన కథలు వ్రాసేరు. (వారు తన చిన్నప్పుడు తనతో చదువుకున్న మిత్రులూ, పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుల పేర్లే కాదు, మిలిటరీ శిక్షణతీసుకుంటున్నప్పుడు తనకి…
-
శోకస్తుతి… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి
శోకమా, ఓ శోకమా, నా హృదయానికి నువ్వు ఎంతచిరపరిచితురాలవంటే, నీ విషాదస్వరానికి అలవాటుపడిన ఆ చెవి, నీ పాటకై ఎదురుచూస్తుంది. కొత్తగా ఈ మధ్యనే నాకు ఊల్లాసమని పిలిచే భావనతో పరిచయమేర్పడినా, అల్లంత దూరంలో చిరుచీకటిలో అస్పష్టంగానైనా పోల్చుకోగలిగేట్టుగా నీ రూపు తెలుస్తోంది అదెంత సాహసంతో గులాబిపూలహారాలతో మనసుదోచి నీ విషాదచ్ఛాయలను చెరిపివేయడానికి ప్రయత్నించినా. కానీ, ఓ శోకమా! నీ మార్గంలో చిరకాలం నడిచిన నాకు ఇపుడు వేరొక కొత్తదారిని నడవడం నాకు సాధ్యపడదు- చీకటిరోజులకు నీ…
-
Retrospection-3… Nanda Kishore, Indian
Some friendships are also such: Before you are aware of your fledging They take you to the high skies; Before you could remember it’s time to nest They bid adieu … leaving an indecipherable mark behind. Warning not to raise any questions They take you around forests and woods, and Through rills and rivulets.…
-
మానవ జీవితంలో ఋతువులు… జాన్ కీట్స్, ఇంగ్లీషు కవి
ఒక ఏడాది ప్రమాణాన్ని నాల్గు ఋతువులతో కొలవొచ్చు; మనిషి జీవితంలో కూడా నాలుగు ఋతువులున్నాయి; జీవంతో ఉట్టిపడే వసంతంలో, పరీవ్యాప్తమైన సౌందర్యాన్నంతటినీ వెర్రిగా అంచనా వేస్తుంటాడు. అతనూ గొప్పరోజులు రుచి చూస్తాడు, వసంత మధురిమల చవితో మత్తెక్కి, యవ్వనపుటాలోచనల పరమార్థమైన వాటి తియ్యదనాన్ని తీరికగా నెమరువేసుకుంటూ, ఆ ఆలోచనల గాఢతలో స్వర్గానికి పొలిమేరలలో తారాడుతుంటాడు; తనలోకంలో తానుంటూ అతనికీ శరత్కాలం అనుభవంలోకి వస్తుంది, అపుడు తన రెక్కలు దగ్గరా ముడుచుకుని, గడపముందునుంచి పోయే సెలయేరువంటి సౌందర్యాన్ని కూడా…
-
గీటురాయి… శామ్యూల్ బిషప్, ఇంగ్లీషు కవి
ఒక మోసగాడూ, ఒక మూర్ఖుడూ తమతమ ఆశలకి అనుగుణంగా జూలియాని పెళ్ళిచేసుకుంటామని ప్రతిపాదించారు; మోసగాడు తన ఆర్థిక ఇబ్బందులు గట్టెక్కడానికీ మూర్ఖుడు తనకన్నులపండుగ చేసుకోడానికీ. అయితే జూలియా ఎవరిని పెళ్ళిచేసుకుంటుందనే గదా నీ సందేహం; దానికిదే గీటురాయి: ఆమె మోసగత్తె అయితే మూర్ఖుణ్ణీ మూర్ఖురాలైతే మోసగాణ్ణీ పెళ్ళిచేసుకుంటుంది. . శామ్యూల్ బిషప్ (21 September 1731 – 17 November 1795) ఇంగ్లీషు కవి The Touch-stone . A fool and a knave with…
-
భవిష్యవాణి …ఆర్థర్ డేవిసన్ ఫికే, అమెరికను కవి
ఒక వేసవి సాయంవేళ పచ్చికమీద మేను వాల్చేను. పసిడిచాయల జుత్తుగల అందమైన పాప అటుగా వచ్చి, నన్నొకసారి పరికించి, దాటిపోడానికి ఇష్టంలేక వదలని సందేహాలు కళ్ళలో తొంగిచూస్తుండగా నిలబడి, సంకోచిస్తూనే నా ముందుకు వచ్చి (ఓహ్! ఆమె తలచుట్టూ ఎంత లేత బంగరు పరివేషమో!) నా భుజం మీదనుండి తొంగిచూస్తూ అడిగింది: “మీరు చదువుతున్నదేమిటి?” అని. “నే నొక ప్రాచీన కవి కవిత్వం చదువుతున్నాను, తన జీవితకాలమంతా అతను తన కవిత్వంకంటే అందమైన ఈ పుడమి సౌందర్యాన్నీ…