-
ముగ్గురు రాజులు… ఎడిలేడ్ ఏన్ ప్రాక్టర్, ఇంగ్లీషు కవయిత్రి
ఒక గొప్ప రాజ్యాన్ని అధీనంచేసుకుని తన ఆజ్ఞ పాలించమంటున్న ఒక రాజుని నేను చూశాను; అతని చేతి సంజ్ఞకి ప్రజలు చేతులు కట్టుకు నిలబడ్డారు వాళ్ళ గొంతుకలమీద అతని ఉక్కు పాదం మోపబడి ఉంది, రక్తపుటేరులలోనూ, అంత బాధలోనూ అతని పేరు మారుమోగింది అతని కత్తి వాదర తళతళలు మరిన్ని ప్రశంసలు తెచ్చిపెట్టింది నేను రెండవ రాజు తలెత్తడం చూసేను అతని మాటలు ఎంతో మంచిగా, ఉదాత్తంగా, వివేకవంతంగా ఉన్నాయి; ప్రశాంతమైన తన అధికారముద్ర అండతో అతను…
-
Silence … Chandra Kanneganti, Telugu, Indian
Choose whatever word you like; Whether you break it horizontally or sliver it vertically, you find no trace of moisture. Yet, if you want to light a fire they do not catch fire however long you may try. What to do now? Whatever picture you want to draw out of them these soiled words do…
-
చిలిపిచేష్టల గాలి… విలియమ్ హోవిట్, ఇంగ్లీషు కవి
ఓ ఉదయం గాలి నిద్రనుంచి లేచి తనలో ఇలా అనుకుంది, ‘ఇవాళ మనం వేడుక చేసుకోవాలి! ఒకసారి ఇలా గెంతాలి మరో సారి పిచ్చిగా గుర్రపుదాట్లు వేసుకుంటూ వెంటతరమాలి! వెళ్ళిన ప్రతిచోటా ఇవాళ కలకలం సృష్టించాలి! ‘ అనుకుంటూ. అనుకోడమే తడవు, ఊరు ఊరంతా కోలాహలంగా ఊడుస్తూ పోయింది దారిగురుతుల్ని చెరిపి, షట్టర్లని చెల్లాచెదరు చేసింది, నిర్దాక్షిణ్యంగా గాలిదుమారం లేపి మనుషుల్ని తోసుకుంటూ పోయి మిఠాయిల షాపు, వృద్ధస్త్రీల టోపీ అన్న తేడాలేకుండా ఎగరేసుకుపోయింది ఇంతకు ముందెన్నడూ…
-
ఊరట… మాత్యూ ఆర్నాల్డ్, ఇంగ్లీషు కవి
సూర్యరశ్మిని పొగమంచు కప్పేసింది నాలుగుప్రక్కలనుండీ పొగలు ఎగస్తున్న పొట్టి గుడిశెలు నన్ను చుట్టుముట్టి ఉన్నాయి; ఏదో చెప్పలేని నిరాశ నా మనసుని కృంగదీస్తోంది. కానీ, నే నొకవంక దిగులుతో అలమటిస్తుంటే ప్రతి దిక్కునా లెక్కలేనన్ని అవకాశాలు ఒకదానివెంట ఒకటి పరచుకుంటున్నాయి గణించలేనంత మంది మనుషులు చెప్పలేనన్ని మానసిక అవస్థలలో గడుపుతున్నారు. ఇక్కడనుండి దూరంగా, ఆసియాలో చదునుగా ఉన్న బిక్షువుల ఆశ్రమగోపురాలపైనా బంగారు రంగులో మెరిసే లాసా (టిబెట్) లోని మిద్దెలపైనా సూర్యుడు మిలమిల మెరుస్తున్నాడు. పసుపుపచ్చని టైబరు…
-
Lighting Fire under Her Feet… Sripada Subrahmanya Sastry, Indian
[This is one of the most touching stories by Sri Sripada Subrahmanya Sastry. In spite of my best efforts to the contrary, I could not contain my tears while reading and translating this story. It presents how pathetic the relations were between the kith and kin in Brahmin families not so long ago (I am…
-
హెన్రీ వాన్ సమాధి దగ్గర… సీ ఫ్రై ససూన్, ఇంగ్లీషు కవి
గలగలలాడుతూ పారుతున్న నదికి ఎగువన అదిగో సాదాసీదాగా కనిపిస్తున్న ఆకుపచ్చ సమాధిఫలకం ఎవరికీ కనిపించకుండా, యూ చెట్టు చాటున కనుమరుగై ఉంది. ఇక్కడే హెన్రీ వాన్ నిద్రిస్తున్నాడు, అతని పేరు శాశ్వతంగా మంచుకడిగిన వనదేవతలా, మన ఊహకికూడా అందనంత కాలం నక్షత్రాల వెలుగులా నిలిచిపోతుంది. అందరూ ఇష్టపడ్డ డాక్టరు, వేల్స్ కి చెందిన సిలూరిస్ట్ ఇక్కడే నిద్రిస్తున్నాడు, అతనెలా ఉంటాడో తెలిపే చిత్తరువులూ లేవు. అతని మనసులో దేవదూతలు వసించేవారు, అతను మనోనేత్రాలతోనే ప్రభాతవెలుగులు దర్శించేవాడు. ఇక్కడ…
-
ప్రియ మృత్యువు… లాంగ్స్టన్ హ్యూజ్, అమెరికను
. ప్రియ మృత్యువా! అన్నీ నీ రెక్కల క్రిందకి తీసుకుంటావు. హతమార్చడానికికాదు, కేవలం ఆకారం మార్చడానికి. బాధలతో తపిస్తున్న ఈ శరీరానికి మరో రూపం ఇవ్వడానికి. నువ్వు మళ్ళీ సుమారుగా ఇలాంటి వస్తువునే సృష్టించవేమోగాని కానీ, ఎన్నడూ అక్షరాలా ఇదే వస్తువుని తయారుచెయ్యవు. ఓ ప్రియ మృత్యువూ! నీ మారు పేరు మార్పు కదూ? . లాంగ్స్టన్ హ్యూజ్ (February 1, 1902 – May 22, 1967) అమెరికను కవి . Dear Lovely Death…
-
ఎవరు ఎక్కువ ప్రేమించారు? … జోయ్ ఏలిసన్, అమెరికను కవయిత్రి
“అమ్మా! నువ్వంటే నాకిష్టం,” అన్నాడు జాన్ అని, తన పని మరిచి, తన కుళ్ళాయి మరిచి తోటలో ఉన్న ఉయ్యాల ఊగడానికి పరిగెత్తాడు, నీళ్ళూ, కట్టేలూ తెచ్చే బాధ్యత ఆమెకి వదిలేసి. “అమ్మా! నువ్వంటే నాకిష్టం,” అంది ఎర్రబుగ్గల నీల్, “నువ్వంటే నా కెంత ఇష్టమో మాటల్లో చెప్పలేను,”; అంటూ రోజులో సగభాగం బుంగమూతి పెట్టుకుని సతాయించేది చివరికి తను ఆటకి పరిగెత్తగానే సంతోషంగా ఊపిరిపీల్చుకుంది. “అమ్మా! నువ్వంటే నాకిష్టం, ” అంది చిన్నారి ఫాన్, “ఈ రోజు నీకు ఎంత…
-
వానంటే ఎవరికి ఇష్టం?… క్లారా డోటీ బేట్స్, అమెరికను
“నాకు,” అంది బాతు, “అది గొప్ప సరదాగా ఉంటుంది. ఎందుకంటే, అప్పుడు నేను కాళ్ళతో ఈదొచ్చు మెత్తని బురదలో నడిచేప్పుడు, మూడు కాలివ్రేళ్ళ ముద్రలు పడతాయి… క్వాక్! క్వాక్!!” “నాకు,” అని అరిచింది డేండిలియన్ పువ్వు. “నా మొగ్గలు ఎండిపోయాయి, వేళ్ళు నీటికై తపిస్తున్నాయి,” అంది, పచ్చగా ఒత్తుగా ఉన్న తన గడ్డి పరుపు మీంచి తన చిందరవందరగా ఉన్న తల పైకెత్తుతూ. సెలయేరు పాట అందుకుంది,”ప్రతి చినుకుకీ స్వాగతం, వాన చినుకులారా! చిత్తుగా కురవండి! నన్ను…