-
మరో ట్రాయ్ ఎక్కడుంది? … విలియం బట్లర్ యేట్స్, ఐరిష్ కవి
Maud Gonne Picture Courtesy: Wikipedia ఇది యేట్స్ తన ప్రియురాలు, ఐరిష్ నటి, విప్లవకారిణి Maud Gonne మీద వ్రాసిన కవిత. ఇక్కడ ఒక చారిత్రక సత్యాన్ని తీసుకుని (హెలెన్ కోసం ట్రాయ్ పట్టణం దహించబడడం), ఒక విలక్షణమైన ప్రతిపాదన చేస్తున్నాడు: అందం నిప్పులాంటిది. అది ఇతరులనైనా దహిస్తుంది. తనని తానైనా దహించుకుంటుంది. “యేట్స్ ప్రేయసి Maud Gonne కోసం ఇప్పుడెవరూ యుద్ధం చెయ్యడం లేదు గనుక (ఇది అతని ఊహ మాత్రమే), ఆమె తన…
-
ప్రేమంటే ఇదే… రూమీ, పారశీక కవి
ప్రేమంటే ఇదే: ఎరుగని విహాయస పథాల్లోకి ఎగిరిపోవడం. ప్రతి క్షణం కొన్ని వందల తెరలు తొలగేలా చేసుకోవడం . మునుముందుగా, జీవితంపై మమకారాన్ని విడిచిపెట్టడం, చివరకి, అడుగువెయ్యకుండానే, ముందడుగు వెయ్యడం; ఈ ప్రపంచం అగోచరమని నిశ్చయించుకోవడం, చివరకి, ‘నేను’ గా కనిపిస్తున్నదాన్ని ఉపేక్షించడం. హృదయమా! ఇటువంటి ప్రేమికుల సమూహంలో ప్రవేశించగలగడం ఎంతో అదృష్టమని నే చెప్పలేదూ? చూపుల పరిధిదాటి చూడగలగడం వంటిది; హృదయాంతరం చేరుకుని అనుభూతి చెందడం వంటిది. . రూమీ (30 September 1207 –…
-
What the Thunder Had said… Vadrevu Chinaveerabhadrudu, Indian Poet
One early afternoon of Chaitra, As I was lazying with ambulant nap Under the shades of Mango grove in the village, The thunder started its conversation. Like mushrooms that shoot up At the first showers of summer rain, For that roll of thunder There was such a commotion within, as though Some eons-old deep…
-
సహజమైన ఆశ… జాన్ క్లేర్, ఇంగ్లీషు కవి
నశ్వరమైన ఈ మట్టికి ఎక్కడైనా మరో ప్రపంచం ఉందా, ప్రాణంపోసుకుని వెచ్చగా వెనకటిలా ఉండడానికి? నా చుట్టూ ఉన్న దేదో అటువంటి అవకాశం ఉన్నాదని చెబుతోంది. లేకుంటే నిష్కారణంగా ఎందుకు మన స్వభావం అటువంటి ఆశలు కల్పించుకుంటుంది? అటువంటి అవకాశం ఉంటుందన్నది ఈ ప్రకృతి భవిష్యవాణి కూడా. అందుకే అంతభద్రంగా దాచిన మహోన్నతమైన రహస్యాన్ని విప్పిచెప్పడానికి ప్రతీదీ ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోంది. శాశ్వతత్వం మీద ఎంతోఆశ ఉండబట్టే, కాలంకూడా అంత ధీమాగా ముందుకి నడుస్తోంది ఆ ప్రశాంతస్థితినందుకుని విశ్రాంతి…
-
గీతిక 314… రూమీ పెర్షియన్ కవి
ప్రేమ తమని నదిలా తనలోకి ఈడ్చుకుపోతున్నట్టు ఎవరు అనుభూతిచెందలేరో, ఎవరు ప్రాభాతాన్ని చెలమనీటిని దోసిలితో తాగినట్టు గ్రోలలేరో, లేక, సూర్యాస్తమయాన్ని రాత్రిభోజనంలా ఆరగించలేరో, ఎవరు మారడానికి అయిష్టంగా ఉంటారో, వాళ్ళని అలా నిద్రపోనీయండి. ఈ ప్రేమ వేదాంత చర్చ పరిధికీ, ఒకప్పటి మాయమాటలకీ, ఆత్మవంచనలకీ అతీతమైనది. మీరు మీ మనసుని ఆ విధంగా మెరుగుపరచుకోదలిస్తే అలాగే కానీండి. నిద్రపోండి. నేను నా బుద్ధిని పక్కనబెట్టాను. నా తొడుగులను విడిచి పీలికలు పీలికలుగా చేసి పారవేశాను. మీరు ఏ…
-
మంచులో వేటగాళ్ళు… విలియం కార్లోస్ విలియమ్స్, అమెరికను కవి
This Poem is about this picture by Piter Brugel the elder (1525- 9th Sept 1569), the famous and most significant artist of Dutch and Flemish Renaissance Painting. The Painting is “Hunter In the Snow” … is an Oil on canvas, 46 inches x 63.75 inches displayed in Kunsthistorisches Museum, Vienna. *** ఆ చిత్రం శీతకాలంలో మంచుకొండలు.…
-
The Painter… Bolloju Baba, Telugu Poet, Indian
Once His signature on walls, Banners, signboards and cut-outs Used to gleam like The solar disc hanging on to the horizon. Between the straight lines He drew with the twine dipped in indigo His letters used to nestle like doves in a nest. The paints amid the squirrel hairs of the brush…
-
కాలిపోతున్న ఓడ… జాన్ డన్ ఇంగ్లీషు కవి.
. ఇది చాలా సందేశాత్మకమైన కవిత. మనం జీవితాలు కాలి మునిగిపోతున్న ఓడలాంటివి. మరణాన్నించి ఎవ్వరమూ తప్పించుకోలేం. అలా తప్పించుకుందికి ప్రయత్నంచేసిన వారికి మరణకారణం మారుతుందేమో గాని మరణాన్నుంచి మినహాయింపు మాత్రం దొరకదు. జాన్ డన్ 17 వ శతాబ్దపు ప్రముఖ ఆధిభౌతిక (Metaphysical) కవుల పరంపరకి చెందినవాడు. . సముద్రంలో మునిగిపోవడంవల్ల తప్ప మంటలనుండి తప్పించుకోలేని కాలిపోతున్న ఓడ లోంచి కొందరు మనుషులు ఒక్కసారి బయటకు గెంతారు , వాళ్ళు శత్రుఓడలదరికి జేరగానే వాళ్ళతూటాలకు బలైపోయారు;…
-
సమస్య… ఆల్ఫ్రెడో గోమేజ్ జైమ్, కొలంబియన్ కవి

నేను మృత్యువంటే భయపడే పిరికివాడిని. నేను జీవితమన్నా భయపడే పిరికివాడిని: మృత్యువూ- జీవితమూ: రెండూ బృహద్రహస్యాలు . జీవితం- మృత్యువూ: రెండూ గొప్ప మోసగత్తెలు. . గులాబిమాలలతో అలంకరింపబడి – జీవితం సాగిపోతుంది; బరువైన ముసుగుకప్పుకుని- దరిజేరుతుంది మృత్యువు; దాని ప్రయాణంవేగంలో జీవితాన్ని ఎవరూ నిరోధించలేరు. అది రాకుండా మృత్యువుని ఎవ్వరూ అడ్డగించనూ లేరు. . నేనొక పిసినారిని, చెంగటనున్న సంపద కాపుకాస్తుంటాను నేను ఆరాధించే- మనసుకి నచ్చిన అపురూప సంపదను. ఎంతో ఇష్టమైనవని పువ్వుల్ని అతిజాగ్రత్తగా…
-
స్నేహితులు మూడు రకాలు…. రూమీ, పెర్షియన్ కవి
నే చెపుతున్నా, వినుకో: స్నేహితులు మూడు రకాలు మనని వాడుకునే వాళ్ళు, స్నేహం నటించేవాళ్ళు, నిజమైన స్నేహితులూ. . ఎదో కొంత విదిల్చి, నిన్ను వాడుకునే వాడిని వదిలించుకో తియ్యగా మాటాడుతూనే, నటించేవాడు నిన్ను మోసగించకుండా చూసుకో. . కానీ, నిజమైన స్నేహితుడిని మనసులో పదిలపరుచుకో కష్టపడవలసి వచ్చినా, భరించు. కానీ, అతన్ని చెయ్యిజారనియ్యకు. . రూమీ (30 సెప్టెంబరు 1207 – 17 డిసెంబరు 1273) పెర్షియన్ సూఫీ కవి . Friends are…