What the Thunder Had said… Vadrevu Chinaveerabhadrudu, Indian Poet

One early afternoon of Chaitra,

As I was lazying with ambulant nap

Under the shades of Mango grove in the village,

The thunder started its conversation.

 

Like mushrooms that shoot up

At the first showers of summer rain,

For that roll of thunder

There was such a commotion within, as though

Some eons-old deep dormant memories had come to life.

It was like… a goods-train, stopped for ages at a station,

Wriggled out of its slumber on the rails;

Like the thumping of doors released

From the frail hold of rusted and worn out bolts. 

 

Throwing a thick veil of clouds on singing sun

When a familiar darkness seizes the day,

The amnesic signals

Suddenly start functioning.

 

*

 

But, the messages were in a language

Older than you had ever learnt to speak first.

And all through the Thunder’s communication, 

You heard it with the cache of your memories, than ears.

 

Until now, you were vexed with listening to people,

Trying to make sense out of their phrasal words.

Before you even pricked your ears to hear their purport

The conversation slipped away.   

 

The conversation of the Thunder, that afternoon

Was like the humming of bees over an arbor in full bloom.

What you were expecting, in fact, was not a rambling of words

But a sweet drop of honey.

 

As a mark of you having had

A meaningful conversation with someone,

A whiff of fragrant air envelopes you.

 

When the world asks you what the Thunder had said,

Don’t be too anxious to explain.

I would rather you speak nothing at all.

 

Upto now,

you had been treading gently on the heavenly pastures.

Taking the memories of that Mango shades along

Try to recap leisurely what you had heard.

.

Vadrevu Chinaveerabhadrudu

 

Vadrevu Chinaveerabhadrudu

 

ఉరుము చెప్పింది 

 

చైత్రమాసపు తొలిమధ్యాహ్నం

పల్లెలో మామిడిచెట్లనీడన

సోమరికునుకు మధ్య

ఉరుము సంభాషణ మొదలయ్యింది.

 

తొలకరి మేఘగర్జనకి 

భూమిలోంచి పుట్టగొడుగులు పైకి లేచినట్టు

వసంత మేఘగర్జనకి 

నాలో పురాతనజ్ఞాపకాలు మేల్కొన్న అలజడి.

ఎన్నాళ్ళుగానో స్టేషన్లో ఆగిపోయిన గూడ్సురైలు

పట్టాలు విదిలించుకున్న చప్పుడు.

ఎన్నేళ్ళుగానో తుప్పుపట్టిన గడియలు ఊడిపడి

తలుపులు తెరుచుకుంటున్న సవ్వడి.

 

 

పెళపెళా కాస్తున్న ఎండమీద మబ్బు పరదా కప్పి

పట్టపగలే ఒక పాతచీకటి కమ్మినప్పుడు

అప్పటిదాకా మర్చిపోయిన సిగ్నల్సు పనిచేయడం మొదలుపెడతాయి.

 

సందేశాలు నువ్వు మాటలు నేర్వడానికి ముందటిభాషవి,

ఉరుము మాట్లాడుతున్నంతసేపూ

నువ్వు చెవుల్తో కాదు, స్మృతుల్తో వినడం మొదలుపెడతావు.

 

ఇన్నాళ్ళూ ఎందరెందరి మాటలో విని విసిగిపోయావు

ప్రతి ఒక్క మాటా ఒక అసంపూర్తివాక్యం.

వాళ్ళేమి మాట్లాడుతున్నారో విందామని చెవులు రిక్కించేలోపలే

మాటలు ముగిసిపోయేవి.

 

మధ్యాహ్నం ఉరుము మాట్లాడుతున్నంతసేపూ

పూలగుత్తి చుట్టూ రొదపెడుతున్న తుమ్మెదల చప్పుడు

నీకు నిజంగా కావలసింది వెయ్యి మాటలు కాదు

ఒక్క తేనెబొట్టని తెలుసుకున్నావు.

 

ఇంతదాకా నీతో ఎవరో 

నిజమైన సంభాషణ సాగించారనడానికి గుర్తుగా

నీ చుట్టూ ఒక తీపితెమ్మెర.

 

ఉరుము ఏమి చెప్పిందని లోకం నిన్నడిగినప్పుడు

దత్త‘, ‘దమ్యత‘, ‘ దయాధ్వంఅని చెప్పకు.

 

అసలేమీ మాట్లాడకు.

 

నువ్వింతసేపూ ఒక దేవలోకపు పచ్చికమీద తిరుగాడావు,

నీతో పాటు మామిడిచెట్టు నీడ కూడా 

వెంటతెచ్చుకుని

నువ్వు విన్నదేదో తీరిగ్గా నెమరెయ్యి.

.

వాడ్రేవు చినవీరభద్రుడు

తెలుగు కవి

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: