-
మీరు లక్షలమంది మృతుల్ని చూడ్డం జరిగితే … ఛార్ల్స్ సోర్లీ, స్కాటిష్ కవి

మొదటి ప్రపంచయుద్ధంలో మరణించిన ప్రముఖ యువకవులలో ఛార్ల్స్ సోర్లీ ఒకడు. Wilfred Owen (1893-1918), Isaac Rosenberg (1890 – 1918) కూడా పిన్న వయసులోనే పోయారు. యుద్ధోన్మాదం పట్ల విముఖతే కాక, చనిపోయిన వారిగురించి అరిగిపోయినమాటలలో చెప్పే ఊకదంపుడు మాటలపట్లకూడా అతనికున్న విముఖత, మృత్యువుపట్ల వయసుకి మించిన పరిణతితో కనిపించే నిర్లిప్తతా ఈ కవితలో కనిపిస్తాయి. *** కొన్ని లక్షలమంది నోరులేనిమనుషులు మీ కలల్లో కుప్పలుతెప్పలుగా నిర్జీవంగా కనిపిస్తే మీ జ్ఞాపకంలో ఉన్నవి, నలుగురూ చెప్పినట్టే…
-
బహుమానాలు… జేమ్స్ థామ్సన్, స్కాటిష్ కవి

తను స్వారీ చెయ్యగల గుఱ్ఱాన్ని గాని, నడపగలిగిన పడవనిగాని ఒక మనిషికి ఇచ్చిచూడు; అతని హోదా, సంపద, బలం ఆరోగ్యం నేలమీదైనా, నీటిమీదైనా చెక్కుచెదరవు. ఒకమనిషికి వాడు తాగగలిగిన పొగాకుగొట్టాన్నిగాని, వాడు చదవగలిగిన పుస్తకాన్నిగాని ఇచ్చి చూడు; అతని గదిలో పేదరికం తాండవించవచ్చునేమోగాని, అతని ఇల్లు ప్రశాంతతతో ఆనందంతో కళకళలాడుతుంది. నేను ఇప్పుడు నిన్ను ప్రేమిస్తున్నట్టు, ప్రేయసీ, ఒక పురుషుడికి అతనికి మనసైన స్త్రీని ఇచ్చి చూడు అతని హృదయం అదృష్టస్పర్శతో ఉదాత్తమౌతుంది ఇంట్లోనూ, నేలమీదా, నీటిమీదా!…
-
దృక్పథంలో మార్పు … ఆర్థర్ సైమన్స్, వెల్ష్ కవి
నేను పువ్వులకంటే వాటి రంగుల్నీ, రెక్కలకంటే, పిచ్చుకల గమకాలనీ ప్రేమించాను. జీవితంలో సగానికి పైగా ఏ సహచరుని తోడూ లేకుండా వృధాచేసుకున్నాను. మరిప్పుడు నేను చెట్టూ పుట్టా ప్రక్కన ఆడుకునే పిల్లల్నీ, రాత్రీ పగలూ కనిపించే సూర్యచంద్రుల్నీ ప్రేమతో ఆశ్చర్యంతో, ఆనందంతో ఎలా చూడగలుగుతున్నాను? ఇప్పుడు రహదారుల్ని మునపటిలా కోపంగా కాకుండా, తొలివేకువలో చిరుకప్పల సమావేశస్థలిగా, మధ్యాహ్నవేళ సీతాకోకచిలుకల సంతగా ఎలా చూస్తున్నాను? ప్రతి కీటకపు అవ్యక్త ఝంకారం వెనుకా అనాదిగా చిక్కుబడ్ద ప్రాణరేణువు దర్శిస్తున్నాను. ఒక్కసారిగా,…
-
అందం… ఎడ్వర్ద్ థామస్, వెల్ష్ కవి

పైకి కొంచెం అన్వయ క్లిష్టత కనిపించినా, ఇది ఒక ఏకాకి ఆత్మరోదన. అందులోనూ ఎన్నడూ ప్రేమ రుచి చూడని వాడు. సౌందర్యం అందర్నీ ఆకట్టుకుంటుంది. కానీ సౌందర్య దృష్టి ఉన్నప్పుడే. కవి ఉద్దేశ్యంలో అందం పరమర్థం వేరే. అది చివరన చెబుతాడు. ప్రేమ ఎరుగని మనసుకి మృత్యువులోనే సాంత్వన దొరుకుతుంది. లేదా, కేవలం ప్రకృతిలో మమేకమైనపుడు. (అందుకే ఇందులో చక్కని ప్రకృతిదృశ్యాల వర్ణన. గుండెకోతను, నీటిని సన్నని కెరటాల తెరలుగా పిల్లగాలికోయడం ఒక అపురూపమైన ఉపమానం.} పాపం…
-
లాంతరుకంటే వెలుగే ముఖ్యం… నిజార్ కబ్బానీ, సిరియన్ కవి
లాంతరు కంటే వెలుగే చాలా ముఖ్యం, రాసిన పుస్తకం కంటే, కవితే ఎంతో ముఖ్యం, పెదాలకంటే, ముద్దు ఎక్కువ ముఖ్యం నేను నీకు రాసిన ప్రేమలేఖలు మనిద్దరికన్నా గొప్పవీ, ఎంతో ముఖ్యమైనవీ ఎందుకంటే, ప్రజలు నీ అందాన్నీ, నా పిచ్చినీ తెలుసుకోగలిగిన ఆధారపత్రాలు అవి. . నిజార్ కబ్బానీ (21 March 1923 – 30 April 1998) సిరియను కవి. . . Light Is More Important Than The Lantern . Light…
-
నిష్క్రమణ… హెన్రిక్ ఇబ్సెన్, నార్వేజియన్ కవి,నాటకకర్త
చివరగా… ఆఖరునవచ్చిన అతిథి వీధివరకు గుమ్మం వరకు సాగనంపేం; శలవు… తక్కిన మాటల్ని రాత్రి రొజ్జగాలి మింగేసింది. ఇంతదాకా వినిపించిన తియ్యని మాటలు చెవులకు సంగీతంలా వినిపించేయి… ఇక ఈ ఇల్లూ, తోటా, వీధీ పదిరెట్లు బావురుమంటూ ఉన్నాయి. ఇది కేవలం చీకటిపడుతూనే ఏర్పాటుచేసిన ఒక విందు. ఆమె కేవలం ఒక అతిథి, ఇప్పుడు, ఆమెకూడా వెళ్ళిపోయింది . హెన్రిక్ ఇబ్సెన్ నార్వేజియన్ కవి, నాటకకర్త, దర్శకుడు. . Henrik Ibsen Photo Courtesy: Wikipedia .…
-
కవికి మరణమే జీవితం -4… ఖలీల్ జిబ్రాన్, పాలస్తీనా కవి

చీకటి తన రెక్క్లమధ్య పొదువుకున్న ఆ నగరం మీద ప్రకృతి స్వచ్ఛమైన తెల్లని మంచువస్త్రాన్ని కప్పింది; ఉత్తరపుగాలి తోటలని నష్టపెట్టే మార్గంకోసం అన్వేషిస్తుంటే, వెచ్చదనం కోసం ప్రజలందరూ విధుల్ని ఖాళీ చేసి ఇంటిముఖం పట్టేరు. ఆ నగర శివారులో ఎప్పుడు పడిపోతుందో అన్నట్టుగా దట్టంగా మంచుపేరుకున్న ఒక పూరిగుడిసె ఉంది. చీకటిముసిరిన ఆ పూరిపాకలో, ఒక కుక్కిమంచం మీద పడుకున్న మృత్యుముఖంలో ఉన్న యువకుడొకడు గాలికి అల్లల్లాడుతూ కొడిగట్టడానికి సిద్ధంగా ఉన్న నూనెదీపాన్ని చూస్తున్నాడు. యవ్వన ప్రాయంలో…
-
శేషజీవి … ప్రీమో లెవి, ఇటాలియను కవి

అప్పుడే విచ్చుకుంటున్న మసక వెలుగులో అతను తన సహచరుల ముఖాలు చూస్తున్నాడు, సిమెంటు దుమ్ముకొట్టుకుని ఆ పొగమంచులో కనీకనిపించకుండా, కలత నిదురలలొనే మృత్యువువాత పడి. రాత్రివేళ, వాళ్ళ కలల బరువుకి నిద్రలోనే వాళ్ళదవడలు కదులుతున్నాయి అక్కడలేని టర్నిప్ ని ఊహించుకు నములుతూ “నీటమునిగిన మిత్రులారా! దూరంగా పొండి! పొండి! నా మానాన్న నన్ను విడిచిపెట్టండి. నేను మిమ్మల్నెవర్నీ వంచించలేదు. మీ నోటిముందరి రొట్టె లాక్కోలేదు. నాకు బదులుగా మరొకరిని ఎవరినీ బలిచెయ్యలేదు. ఏ ఒక్కరినీ. మీరు తిరిగి…
-
చప్పుళ్ళు… ఫేనీ స్టెరెన్ బోర్గ్, డచ్చి కవయిత్రి

నగరంలోని చప్పుళ్ళు నా కలల్లో కలగాపులగం అవుతుంటే ఈ రోజు ఉదయాన్నే నిద్రలేచాను. రెండు సింహాలు గర్జిస్తూ పరువుకోసం పోట్లాడుకుంటున్నాయి. బహుశా అవి రోడ్డుమీద వాహనాలై ఉండొచ్చు. వేటగాడు ఏదో అరుస్తున్నాడు బహుశా అవి వీధిలో అమ్ముకునేవాడి కేకలై ఉండొచ్చు; కాసేపు అంతా నిశ్శబ్దం అకస్మాత్తుగా ఆరుబయట ఒక తుపాకిగుండు ప్రతిధ్వని అది ఏ కారు సైలెన్సరు పగిలిందో లేదా అది పిల్లవాడి బొమ్మతుపాకీనో. క్రమంగా నిద్రలోంచి మెలకువ వస్తుంటే, అసలు చప్పుళ్ళు ఏమిటో తెలుస్తూ ఉంటాయి…
-
నా హృదయం నిద్రపోయిందా?… ఆంటోనియో మచాడో, స్పానిష్ కవి

నా హృదయం నిద్రపోయిందా? నా కలల తేనెటీగలు పనిచెయ్యడం మానేసాయా? నా కోరికల ఏతాము అడుగంటిందా? కంచాలు ఖాళీయై అందులో నీడలుమాత్రమే మిగిలాయా? ఏం కాదు. నా హృదయం నిద్రపోలేదు. మేలుకునే ఉంది, పూర్తి మెలకువలో ఉంది. నిద్రపోనూ లేదు, కలలుగనడమూ లేదు… కళ్ళు గచ్చకాయల్లా తెరిచి దూరాననున్న సంకేతాలు పరిశీలిస్తున్నాయి. అనంతనిశ్శబ్దపు నేమిపై చెవి ఒగ్గి వింటోంది. . ఆంటోనియో మచాడో 26 July 1875 – 22 February 1939 స్పానిష్ కవి .…