అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • జూలై 22, 2019

    జైలులో ఒక సాయంత్రం… ఫైజ్ అహ్మద్ ఫైజ్, పాకిస్థానీ కవి

    సర్పిలాకారపు సాయంత్రమనే నిచ్చెన మీంచి ఒక్కొక్క నక్షత్రపు మెట్టూనీ దిగుతూ రాత్రి భూమిమీదకు దిగుతుంది. పిల్లగాలి చెవులకి ఎంతదగ్గరనుండి పోతుందంటే చెవిలో ఎవరో రహస్యప్రేమభాషణ చేసినట్టనిపిస్తుంది. జైలు ముందరి ఆవరణలోని చెట్లు ఆకాశపు పటం మీద ఇంటికి తప్పించుకు పారిపోయే దారిని అల్లుకుంటున్న కాందిశీకులు. డాబామీద చంద్రుడు ప్రేమతో, ఔదార్యంతో నక్షత్రాలనన్నిటినీ తళుకులీనే పొడులుగా మారుస్తున్నాడు. అన్ని దిక్కులనుండీ, దట్టమైన ఆకుపచ్చని నీడలు తెరలు తెరలుగా నా వైపు కమ్ముకొస్తున్నాయి. నా ప్రేమిక నుండి ఏడబాటు గుర్తుచేసుకున్నప్పుడల్లా…

  • జూలై 21, 2019

    భాగ్యవిధాతలు… హెన్రీ వాడ్స్ వర్త్ లాంగ్ ఫెలో, అమెరికను కవి

    కాలమనే ఈ గోడల మధ్య పనిచేసే వారందరూ భావిభాగ్యవిధాతలే; కొందరు మహత్తరమైన కార్యాలు సాధిస్తే, కొందరు చక్కని నడకగల కవిత్వాన్ని రాస్తారు. వీటిలో ఏదీ పనికిమాలినదీ, తక్కువైనదీ లేదు; దేనిమట్టుకు అది దాని స్థాయిలో ఉత్తమమైనదే; పైకి కేవలం కాలక్షేపపు పనిలా కనిపించేది సైతం  తక్కినవాటికి బలంకూర్చి సహకరిస్తుంది. మనం నిలబెట్టే కేవల ఆకృతిస్వరూపానికి కాలం తగిన వస్తుసముదాయం నింపి పూర్ణత ఇస్తుంది. మనం ఈ స్వరూపాన్ని వర్తమానం, గతం అనే ఇటుకలతోనే కట్టి నిలబెట్టేది. ఈ…

  • జూలై 20, 2019

    ఒక చిన్ని పక్షికి…. ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి

    గూటిలోంచి జారి పడిపోయిన నిన్నొకసారి చూసేను గాయపడిన రెక్కతో నీ బెదురుచూపులూ గమనించాను. నీ గాయాన్ని మాన్పి భయాన్ని నెమ్మదిగా పోగొట్టేను, అప్పుడు నువ్వు ధైర్యంగా కిచకిచలాడుతూ పాడ బోయేవు. నిన్ను పెంచుకుందికి నీకో పంజరం కూడా కొన్నాను, ఈ అడవి నీకు అంత పరిచయం లేదన్న ధీమాతో కాలక్రమంలో అన్నీ మరిచిపోతావని ఊహించుకుని నాతోనే నువ్వు ఒంటరిగా ఉండిపోతావని సంతృప్తి పడ్డాను. కానీ, వేసవి పొడచూపడంతోనే నీలో దూరంగా, ఎక్కడికో ఎగిరిపోవాలన్న కాంక్ష మోసులువారింది- నీదైన…

  • జూలై 16, 2019

    కవిత్వం… డాన్ పాటర్సన్, స్కాటిష్ కవి

    ఈ గ్రహం రూపుదిద్దుకుంటున్నప్పుడు దాని అగ్నికీలలోని ఒకానొక మెరుపును,  వజ్రం తన గర్భంలో శాశ్వతంగా పొదువుకున్న చందాన, కవిత్వం ప్రేమ తర్వాత కలిగే విరహాన్ని కాకుండా నిశ్శబ్దంగా మనలో అణురూపంలో ఉత్పన్నమయే స్థితినే ప్రతిబింబిస్తుంది; కనుక, నిప్పుకణికలాంటి అతని ప్రేమ నివురుగప్పుతున్నపుడు, మధుశాలలోని గాయకుని గొంతులోంచి అకస్మాత్తుగా వచ్చే పాటలా కవి తన గొంతు తానే వింటాడు: అతని అనుభూతుల్ని ఉదాత్తమైనవిగా చేసి చెప్పుకుంటూనో, లేదా, తోడుగా వాయిస్తున్న వయొలిన్ రాగాలలో కరిగిపోతూనో; కానీ ఆ ప్రేమ నిలకడగా…

  • జూలై 15, 2019

    మృత్యువంటే… ఛార్లెస్ సోర్లీ, స్కాటిష్ కవి, సైనికుడు

    మృత్యువంటే…  ఛార్లెస్ సోర్లీ, స్కాటిష్ కవి, సైనికుడు

    మృత్యువు రకరకాలుగా ఉంటుంది: అందులో గెలుపూ లేదు ఓటమీ లేదు: కేవలం ఒక బాల్టీ ఖాళీ అవడం, పలక శుభ్రంగా తుడిచిపెట్టడం లాంటిది, అప్పటివరకూ ఉనికిగలదానికి దయతో చరమగీతం పాడడం. అంతే! మనకి తెలిసినది ఇంతవరకే: మృత్యువు జీవనం కాదు, ఒక క్షీణస్థితి, ప్రాణం చిదిమివెయ్యబడుతుంది, బాల్టీ పగులుతుంది. ఎన్నో గొప్ప వింతలూ, విశేషాలు చూసినవారికి కూడా ముగింపుమాత్రం ఇంకా తెలీదు. మరణంలో విజయుడూ, విజితుడూ ఒక్కటిగా కలిసి పోతారు; పిరికివాడూ, సాహసికుడూ: మిత్రుడూ శత్రువూ, ఒకటే.…

  • జూలై 13, 2019

    పరుగు పందెం … వాస్కో పోపా సెర్బియన్ కవి

    పరుగు పందెం … వాస్కో పోపా సెర్బియన్ కవి

    కొందరు మనుషులు అవతలివాడిది కాలో, చెయ్యో, ఏది దొరికితే ఒక ముక్క కొరికేస్తారు దాన్ని పళ్ళ మధ్య దొరకబుచ్చుకుని ఎంత వీలయితే అంత జోరుగా అక్కడినుండి ఉడాయించి దాన్ని గోతిలో కప్పెట్టి దాచుతారు. తక్కినవాళ్ళు నాలుగుపక్కలా కమ్ముకుని భూమంతా,  వాసనచూడ్డం – తవ్వడం వాసనచూడ్డం – తవ్వడం చేస్తారు. వాళ్ళకి అదృష్టం కలిసొస్తే ఒక చెయ్యో,  కాలో దొరుకుతుంది. ఇప్పుడు దాన్ని కొరికి పరిగెత్తడం వాళ్ళ వంతు. చేతులు దొరికినంత కాలం, కాళ్ళు అందినంతకాలం, చివరికి ఏదో…

  • జూలై 12, 2019

    నా బ్రతుకులో వైరుధ్యాలు… డెల్మైరా ఆగస్టినీ, ఉరుగ్వే కవయిత్రి

    నా బ్రతుకులో వైరుధ్యాలు…  డెల్మైరా ఆగస్టినీ, ఉరుగ్వే కవయిత్రి

    నే బ్రతుకుతాను, మరణిస్తాను, దహిస్తాను, మునిగిపోతాను ఏకకాలంలోనే వేడినీ చల్లదనాన్నీ అనుభవిస్తాను. జీవితం ఒకప్రక్క మెత్తగా ఉంటూనే చాలా కఠినంగా ఉంటుంది నా కష్టాలలో ఆనందం కలగలిసే ఉంటుంది. ఒక్కొక్కసారి నవ్వుతోపాటే ఏడుపూ వస్తుంది నా ఆనందం ఎన్నో కష్టాలను దిగమింగగలిగేలా చేసింది. నా సుఖం క్రమేణా పల్చబడినా మార్పులేక స్థిరంగా ఉంటుంది జీవితం నిస్సారమైన క్షణంలోనే పచ్చగా మొలకెత్తుతుంటాను. ప్రేమలోని వైరుద్గ్యాలూ అలాగే భరిస్తుంటాను. ‘నా వల్లకాదు, ఈ బాధ భరించలేను’ అని నే ననుకుంటానా…

  • జూలై 11, 2019

    An Unburnt Pot… Sikhamani, Telugu Poet, Indian

    Some unknown person I met on my way Put a Pot of clay In my hands, and left Asking me to take care of it.   From that day I have been carrying it with me Without rest or relent. And over time I got used to Carrying it unaware i did.     Having…

  • జూలై 10, 2019

    మా అన్న మిగెల్ స్మృతిలో… సిజార్ వలేహో, పెరూ కవి

    అన్నా! ఈ రోజు మనింట్లో ఇటుకబెంచీ మీద కూర్చున్నాను. అక్కడ నువ్వొక లోతెరుగని శూన్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు. నాకు బాగా గుర్తు, మనం ఈ సమయంలో దొంగాట ఆడుకునే వాళ్లం. అమ్మ “ఒరే పిల్లలూ” అంటూ జాగ్రత్తలు చెబుతుండేది. నేను ఎప్పటిలాగే ఇప్పుడూ దాక్కుంటునాను సాయంత్రపు నీతిబోధలనుండి. ఎక్కడున్నానో నువ్వెవరికీ చెప్పవని నా నమ్మకం. చావడిలోనో,వాకిలి సందులోనో, వసారాలోనో, ముందు నేను; తర్వాత నువ్వు దాక్కుంటే, ఎక్కడున్నావో నెవరికీ చెప్పేవాణ్ణి కాదు. అన్నా! నాకు ఇంకా గుర్తే,…

  • జూలై 9, 2019

    అతను చంపిన వ్యక్తి … థామస్ హార్డీ, ఇంగ్లీషు కవి

    అతను చంపిన వ్యక్తి … థామస్ హార్డీ, ఇంగ్లీషు కవి

    ఒక పాత వసతిగృహంలో ఎప్పుడైనా అతనూ నేనూ కలుసుకుని ఉంటే ఇద్దరం కలిసి కూచుని ఎన్ని చషకాలైనా తాగేసి ఉండేవాళ్ళం. కానీ, పదాతిదళంలో పెరగడం వల్ల ఒకరికొకరు ఎదురుపడి తీక్ష్ణంగా చూసుకుంటూ అతను నామీదా, నే నతనిమీదా కాల్పులుజరుపుకున్నాం. నే నతన్ని ఉన్నవాణ్ణి ఉన్నట్టుగా కాల్చిచంపాను. అతన్ని నేను ఎందుకు కాల్చి చంపేనంటే… అతను నా శత్రువు గనుక; అదంతే! అతను నా శత్రువు, వైరి వర్గం; అందులో సందేహం లేదు, కాకపోతే నా లాగే, అనుకోకుండా,…

←మునుపటి పుట
1 … 31 32 33 34 35 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు