-
పేదరికం… మూన్ బ్యూంగ్ రాన్, దక్షిణ కొరియా కవి
మనందరికీ తెలిసినదే నాలుగు చెలకలైనా వరిపొలం లేని రైతుకి ఎంతశ్రమో నలుగురు పిల్లల్ని పెంచి బడికి పంపించాలంటే. తనకంటూ ఇల్లులేని, నగరంలోని గృహస్థు ఇల్లు సంపాదించుకుందికి జీవితమంతా ఎన్ని కష్టనష్టాలు పడతాడో కూడా తెలుసు. పిల్లల్ని పెంచిన వారందరికీ తెలుసు నలుగురు పిల్లల్ని పెంచాలంటే అందరిలాగే బడికి పంపించాలంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు చెయ్యాలంటే ఒళ్ళు తెగకోసుకోవడం లాంటిదని. ఓ పిల్ల పెళ్ళిచెయ్యాలంటే, ఒక ఇంటిస్తంబం మాయమౌతుంది, కుర్రాణ్ణి కాలేజీకి పంపాలంటే ఒక పొలం అమ్మెయ్యాల్సొస్తుంది. రోజుకి ఎనిమిది గంటలు…
-
మన కృతులు … హెన్రీ ఏబీ, అమెరికను కవి

మన ఆలోచనలు అవి పుట్టినప్పటి మన ఆవేశాల వన్నెల్ని ఎలా సంతరించుకుంటాయో, అలాగే మన కృతులు కూడా మన అంతరాంతరాలలోని అశాంతిని ప్రతిఫలిస్తూ ముందటిదాన్ని విడిచిపెట్టి కొత్తది అందుకుంటాయి. మానవ నిర్మితాలైన గర్వించదగిన మహత్తర కళాఖండాలు వాటి సృష్టికర్తలు వాటితో సంతృప్తి చెందలేదని సూచిస్తుంటాయి. కారణం, తన కృతుల సోపానాలని అధిరోహించి క్రిందకి చూసినపుడు పూర్ణవృత్తాలుకూడా సన్నగా కనిపిస్తాయి; అసలు తను చేసిన సృష్టి అంతా కళాకారుడికి లోపభూయిష్టంగా కనిపిస్తుంది; గుండె రక్తమోడుతుంది; పశ్చాత్తాపం తెరలు తెరలుగా…
-
శిధిల సమాధి… ఫేనీ స్టెరెన్ బోర్గ్, డచ్చి కవయిత్రి
ఈ కవితలో గొప్ప సౌందర్యం ఉంది. ఈ కవిత తనప్రియమైన వ్యక్తి గురించి రాసిన స్మృతిగీతం కాదు. ఒక శిధిల సమాధినీ, అక్కడి శిలా ఫలకం మీది తేదీనీ, మృత్యుల్లేఖనాన్నీ చూసిన తర్వాత కవి మదిలో మెదిలిన ఆలోచనల పరంపర. . “ప్రియాతి ప్రియ సఖా! ఎప్పటికీ నీ ప్రేమలో” అని ఆ శిలాఫలకం మీద చెక్కి ఉంది, ఎన్నేళ్ళ క్రిందటో. ఆ ఆప్త వచనాలక్రింద నిద్రిస్తోంది ఒక శరీరం మరీ తొలిప్రాయంలోది, విగతాత్మయై. ప్రతి ఏడూ…
-
కొత్త సంవత్సరపు కోరిక… జూడిత్ రైట్, ఆస్ట్రేలియన్ కవయిత్రి
కొత్త సంవత్సరం నాకు ఏ బహుమతి అందించాలా అని గనక ఆలోచిస్తూంటే, అది, కళలపట్ల ఆమెకున్న మక్కువ గురించి కథలుగా చెప్పుకునే మా ముత్తవ్వ వైఖరి లాంటిది కావాలని కోరుకుంటాను. ఎనిమిదిమంది సంతానంతో, పాపం ఆమెకు ఎన్నడూ బొమ్మలు గీయడానికి అవకాశం చిక్కలేదు; ఒక రోజు ఆమె స్విట్జర్లాండు దేశంలో ఒక నది ఒడ్డున చాలా ఎత్తైన కొండగుట్టపై కూర్చుంది. దూరంగా ఆమె రెండో కొడుకు మంచునీటిప్రవాహం మీద తేలుతూ పట్టుతప్పి ప్రవాహదిశలో ఎనభై అడుగుల దిగువన…
-
క్షణకాలపు లోలత్వం… రబీంద్రనాథ్ టాగోర్, భారతీయ కవి
ప్రభూ! నీ ప్రక్కన కూర్చునే క్షణకాలపు లోలత్వానికి అనుమతి ప్రసాదించు. నే చేయవలసిన పనులని తర్వాత నెమ్మదిగా చక్కబెట్టుకుంటాను. నీ వదనాన్ని వీక్షించక నా మనసుకి విశ్రాంతీ, ఉపశమనమూ లేవు, దరిలేని శ్రమసాగరంలో నా పని అశ్రాంతశ్రమల ప్రోవు. నిట్టూర్పులతో, మర్మరధ్వనులతో నా ప్రాంగణంలో అడుగుపెట్టిన ఈ వేసవి రోజున నికుంజవిహారులు నెత్తావి పూలగుత్తులచుట్టూ తమకంతో నృత్తగీతాలాలపిస్తునాయి. దొరికిన ఈ కొద్ది ప్రశాంత విశ్రాంతి సమయమూ, నీ ఎదురుగా, మౌనంగా కూర్చుని, నా జీవితాన్ని నీకు అంకితం…
-
అది లేని వాడు ఎంత అదృష్టవంతుడో కదా! … బెర్తోల్ట్ బెహ్ట్, జర్మను కవి

సాలమన్ రాజు ఎంత కుశాగ్రబుద్ధో చూసే ఉంటారు అతనికేమయిందో మీరు గ్రహించే ఉంటారు. అతనికి ఎంట జటిలసమస్యలైనా స్పష్టంగా కనిపించేవి అంత తెలివైన వాడిగా ఎందుకు పుట్టేనా అని విచారించేవాడు ఈ సృష్టిలో అన్నీ వృధా అని అతని భావన. సాలమన్ రాజు ఎంత గొప్పవాడు, తెలివైనవాడు! అయినా ప్రపంచం అతన్ని సహించలేదు తర్వాత అతని జీవితంలో వచ్చిన మార్పు చూస్తూ ఊరుకుంది! దీనికంతటికీ కారణం సాలమన్ రాజు తెలివితేటలే అవి లేని వాడు ఎంత అదృష్టవంతుడో కదా!…
-
నన్ను వెంట తరుముతూ… అబ్బాస్ కియరోస్తమి ఇరానియన్ కవి

అబ్బాస్ కియరోస్తమి దీనిని ఒక జపనీస్ హైకు లా రాసినా, దానికి ఉండే ప్రాథమిక లక్షణాలని మాత్రం తెలిసే అతను అనుసరించలేదు. ఇక్కడ నీడ చాలా చక్కగ అమరే ఉపమానం అయినప్పటికీ, కవి చెప్పదలుచుకున్నది మాత్రం నీడ కాదు. మనతో పాటు పెరిగే, మనకికూడ తెలియని మన వ్యక్తిత్వం. *** నా చిన్నప్పటి నేస్తం నా నీడ, నన్ను వెంటాడుతూ వస్తోంది. అదీ నాతో పెరిగింది, నాతో పాటే వయసు మీరింది. అది నన్ను నా సమాధివరకూ…
-
నిజమైన ప్రేమికుడు… రూమీ, పెర్షియన్ కవి
నిజమైన ప్రేమికుడికి మతం అంటూ ఏదీ ఉండదు, ఈ సత్యాన్ని గ్రహించుకో. కారణం, ప్రేమే అభిమతమైనవారికి దేని మీదా అటు విశ్వాసమూ ఉండదు, ఇటు అగౌరవమూ ఉండదు. అసలు, ప్రేమలో పడినప్పుడు ఈ శరీరం, బుద్ధి, మనసు, ఆత్మల ఉనికే ఉండదు. ప్రేమలో ఆ స్థితిని చేరుకో. అప్పుడు నీకు వియోగమన్న ప్రశ్నే ఉండదు. . రూమీ 13వ శతాబ్దం పెర్షియను కవి . . True lover . A true Lover doesn’t follow…
-
కాలమే నిర్ణయిస్తుంది… సుకాసా స్యహ్దాన్, ఇండోనీషియా కవి

కాలమే నిర్ణయిస్తుంది ఎక్కడ నిజమైన యుద్ధం ఆరంభమవుతుందో: ప్రతి గుండెలోనూ. కాలమే నిర్ణయిస్తుంది తమని తాము గాయపరచుకోడంలో ఎవరు కృతకృత్యులౌతారో: ఎవ్వరూ గెలవరు. కాలమే నిర్ణయిస్తుంది మిత్రులలో శతృవులెవరో: రెంటిలో పెద్ద తేడా ఉండదు. కాలమే నిర్ణయిస్తుంది చివరకి, ఎవరు చెప్పేది నిజమో: ఎవరు చెప్పేదీ కాదు. . సుకాసా స్యహ్దాన్ జననం: 1968 ఇండోనీషియన్ కవి . Time Shall Tell . Time shall tell where the real warfare befalls: in…
-
విచారము… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి

ఎడతెరిపి లేకుండా కురిసే వానలా విచారము నా గుండె దొలిచేస్తోంది. తక్కినవారు రాత్రల్లా బాధతో లుంగలు చుట్టుకుపోయి మూలిగినా ఉదయం అయేసరికి ఎప్పటిలా మామూలుగా అయిపోతారు. కానీ, ఈ బాధ పెరగనూ పెరగదు, తరగనూ తరగదు. ఇది పూర్తిగా ఆగిపోదు, పూర్తిగా పెరగదు. అందరూ ఎప్పటిలా ముస్తాబై ఊరిలోకి వెళ్ళిపోతారు. నేను మాత్రం కుర్చీలో కూర్చుండిపోతాను. నా ఆలోచనలన్నీ మెల్లగా విచారగ్రస్తమౌతాయి. అప్పుడు నేను నిల్చున్నా ఒకటే, కూర్చున్నా ఒకటే, నేను ఏ గౌను తొడుక్కున్నా, ఏ…