-
మనిషొక దీవి కాదు … జాన్ డన్
. మనిషి ఒక స్వయం సమృధ్ధమైన దీవి కాదు… ప్రతివాడూ ఒక భూఖండంలో ఖండమే… సంపూర్ణతకి పరిపూర్ణతనిచ్చే అంతర్భాగమే… ఒక మట్టిపెళ్ళ కెరటాలకి కొట్టుకుపోయినా, యూరోపు ఆ మేరకు వెలవెలబోతుంది ఒక మిట్ట తరిగిపోయినరీతి… నీదో, నీ స్నేహితుడిదో, మొఖాసాలో కొంత భూమి కోల్పోయినతీరు… మరణించిన ప్రతి మనిషితోనూ, నాలో కొంత మేరను కోల్పోతున్నాను నేను, ఎందుకంటే నేను మనుషులతో ముడిపడి ఉన్నాను గనుక. అందుకే, గంటలు ఎవరికోసం మ్రోగుతున్నాయో తెలుసుకుందికి కబురంపకు… అవి నీ కోసమే…
-
ఈ క్షణం … లార్డ్ బైరన్
. మావి గుబురులలోనుండి కోయిల పంచమస్వరాలు వినిపించేది ఈ క్షణమే … ప్రేమికుల రహస్యవాగ్దానాలలోని ప్రతి మాటా మధురంగా వినిపించేది ఈ వేళలోనే … సమీపంలోని ప్రతి తెమ్మెరా, ప్రతి అలా ఏకాంతంలో వీనులకు సంగీతపు విందు చేసేదీ ఈ సమయమే… తుహినబిందువులు పువ్వులపై లలిత లలితంగా రాలేదీ, ఆకసాన తారకలు కలిసేదీ, కెరటపుటంచున తొలి నీలి మెరుగు మెరిసేదీ, ముదురాకున కావిరంగు కవిసేదీ ఈ క్షణమే… సాయం సంధ్యననుసరించిన చీకటి, గహన గగనాంతరాన వ్యాపించిన మెత్తని…
-
ఓజిమాండియస్ … షెల్లీ
. నేనొక పురాదేశపుయాత్రికుడిని కలిసేను అతనన్నాడుగదా: “ఎడారిలో నేను శిల్పాకృతిలో రెండు మహోన్నతమైన పాదాలు మొండివి, చూసేను. దగ్గరలోనే ఇసుకలో సగం కప్పబడి చెదిరిన శిరస్సుకూడా కనిపించింది. ఆ ముఖంమీద చిట్లించిన నొసలు, మడిచిన క్రింది పెదవీ, అపహసిస్తున్న అధికార దర్పమూ, నిర్జీవమైన ఆ శిలలో ఎంత సజీవంగా అచ్చుగుద్దినట్టు ప్రతిఫలిస్తున్నాయంటే, ఆ శిల్పి ఎవరో ఆ వెక్కిరించిన చేతినీ, ఆవేశపూరితమైన హృదయాన్నీ బాగా చదివేడని తెలుస్తోంది. అక్కడ పీఠం మీద ఈ మాటలు చెక్కి ఉన్నాయి:…
-
నేను నిన్ను ప్రేమించాను… అలెగ్జాండర్ పుష్కిన్
. నేను నిన్ను ప్రేమించాను. బహుశా ప్రేమిస్తున్నానేమో కూడా ఈ భావన ఇంకా కొంతకాలం కొనసాగుతూనే ఉంటుంది నా ప్రేమ నిన్నిక ఇబ్బంది పెట్టదులే, నీకు ఏ రకమైన బాధా కలిగించదలుచుకోలేదు నిన్ను ప్రేమించాను; అది ఎంత నిరాశావహమైనదో నాకు తెలుసు ఆ అసూయ, బిడియము నిష్ప్రయోజనమైనప్పటికీ నా నిజమైన, సుకుమారమైన ప్రేమకు ఆలంబనలయ్యాయి భగవంతుడు నువ్వు తిరిగి ప్రేమించబడేట్టుగా అనుగ్రహించుగాక! . అలెగ్జాండర్ పుష్కిన్ ప్రముఖ రష్యన్ కవి . I Loved You .…
-
షేక్స్పియర్ … సానెట్ 18
. నిన్నొక గ్రీష్మోదయముతో సరిపోల్తునా? కానీ, నువ్వు దానికంటే మనోహరంగా, మితోష్ణంగా ఉంటావు. మే వడగాడ్పులు కుసుమిస్తున్న లేత మొగ్గల్ని కుదిపేస్తాయి, అయినా, వేసవి నిడివి అనగా అదెంత ? ఒకోసారి దినకరుడు మరీ తీక్ష్ణంగా ప్రకాశిస్తాడు, తరచు అతని స్వర్ణరోచిస్సులు మేఘాఛ్ఛాదనకు గురౌతాయి. అదిగాక, ప్రతి సౌందర్యమూ, తన సౌందర్యాన్ని ఎప్పుడో ఒకప్పుడు వీడవలసిందే… సంభవతవలననో, ప్రకృతిపరివర్తనవల్లనో… మరి చక్కబడదు. కానీ, నీ వాయని వెచ్చదనం శాశ్వతం. ఇసుమంతైనా వాడని సౌందర్యం నీ సొత్తు. అనశ్వరమైన…
-
నా సమాధి దగ్గర ఏడవకు – మేరీ ఎలిజబెత్ ఫ్రై
. నా సమాధి దగ్గర నిలబడి ఏడవకు నే నక్కడ లేను. నేను నిద్రించను . నేనిపుడు శతసహస్ర పరీమళ పవనప్రసారాన్ని నేనిపుడు హిమోధ్భూత వజ్రసదృశ ప్రతిఫలాన్ని . ఈడేరిన వరికంకులమీది వెలుగురేని లే కావి కిరణాన్ని నేను, ఆకాసంనుండి మంద్రంగా జాలువారే వర్షాకాలపు చిరుజల్లుని నేను . ప్రాభాత నీరవప్రశాంతతలో నువు కనుదెరిచినపుడు సడిసేయక వడి ఎగిరే ఆవృత్త ద్విజసమూహాన్ని నేను నిశాతమస్సులో అల్లన మెరిసే మృదుతారానివహాన్ని నేను . నా సమాధి ప్రక్కన నిలబడి…
-
దూరం గా తొలగిపోకు… పాబ్లో నెరూడా
దూరంగా తొలగి పోకు, ఒక్క రోజుకైనా సరే! ఎందుకంటే… ఎందుకంటే… నాకెలాచెప్పాలో తెలియడం లేదు, రోజంటే… చాలా సమయం. ట్రైన్లన్నిట్నీ ఎక్కడో యార్డ్ లో విశ్రాంతికి తీసుకుపోతే, ఖాళీ ప్లాట్ ఫారం మీద వాటికోసం నిరీక్షించినట్టు, నేను నీకోసం నిరీక్షిస్తుంటాను . నన్ను ఒక గంటసేపైనా విడిచిపెట్ట వద్దు. ఎందుకంటే, నా పరివేదనా బిందువులు ఒక్కొక్కటీ కలిసి ప్రవాహమౌతాయి, గూడుకై దిమ్మరిగా తిరిగే పొగ, అలా దారితప్పి తేలియాడుతూ నాగుండెల్లోకి జొరబడి నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది .…
-
అజేయ … విలియం ఎర్న్ స్ట్ హెన్లీ
నా బ్లాగు సందర్శకులకందరికీ దీపావళి శుభాకాంక్షలు . భూ నభోంతరాలు వ్యాపించిన కాలబిలంలా నన్ను కమ్ముకున్న ఈ నిశీధినుండి, ఎక్కడెక్కడ ఏ ఏ దేవతలున్నారో వారందరికి నా కృతజ్ఞతలు లొంగదీసుకోలేని ఆత్మ నాకున్నందుకు . పరిస్థితుల పళ్ళచక్రం పట్టి బిగించినా బాధతో మూలగనూలేదు, వెనుకంజవెయ్యనూలేదు. యాదృఛ్ఛిక సంఘటనల గాయాలకి తల రక్తసిక్తమైంది గాని అవనతం కాలేదు . ఈ క్రోధాలూ కన్నీళ్ళ సీమ కావల కనిపిస్తున్నది కేవలం మృత్యుఛ్ఛాయ ఐనా, వత్సరాల బెదిరింపుల పిదప,…
-
నిప్పూ-నీరూ… రాబర్ట్ ఫ్రాస్ట్
. కొందరు యుగాంతం సౌరాగ్నికీలల్లో జరుగుతుందంటారు. కొందరు, హిమయుగము పునరావృతమవడం వలననంటారు కాంక్షాపరితప్తానుభవమున్న నేను, అగ్నికీలలనే సమర్థిస్తాను. కానీ, నాకు పునర్మరణమంటూ ఉంటే, నాకు ద్వేషం గురించి తగినంత అవగాహన ఉండడం వలన, వినాశానికి మంచుకూడా గొప్పదని చెప్పడంతో పాటు, అది సమర్థవంతమైనది అని కూడా చెప్పగలను . రాబర్ట్ ఫ్రాస్ట్ . Fire And Ice . Some say the world will end in fire, Some say in ice. From…
-
అయితే … రుడ్ యార్డ్ కిప్లింగ్
. నీ చుట్టూ ఉన్నవారు విచక్షణకోల్పోయి నిన్ను నిందిస్తున్నప్పటికీ, నీ సంయమనం కోల్పోకుండ నిగ్రహించుకోగలిగినట్టయితే, ప్రతిఒక్కరూ నీ సామర్ధ్యాన్ని శంకిస్తున్నపుడు, నీ మీద నువ్వు నమ్మకం కోల్పోకుండా, వాళ్ళ అంచనాలకుకూడా కొంత ఆస్కారంలేకపోలేదు అని అనుకోగలిగినట్టయితే తగిన అవకాశం కోసం నిరీక్షించగలిగి, నిరీక్షించడానికి విసుగుచెందకుండా ఉండగలిగినట్టయితే లేదా, నీ గురించి ఒకరు అబద్ధం చెప్పినపుడు, నువ్వు తిరిగి అబధ్ధాలతోనే ఎదుర్కోడానికి పూనుకోకుండా ఉన్నట్టయితే లేదా, నిన్ను ద్వేషిస్తున్నపుడు, నువ్వు తిరిగి ద్వేషించకుండా, అతి మంచిగా ఉండడం గాని,…