-
Rain… K. Godavari Sarma
. Like a childhood friend Seen after long years of separation… A drizzle Raining delicately Like a shower of jasmine petals Embraced me with all its hands . Unable to realize a wee-bit How good a friend he was People ran for cover towards dry shelters To protect their heads from getting wet . Just…
-
నను మరువకు … డేవిడ్ హార్కిన్స్
. నేను వెళిపోయేనని ఏడువకు, బదులుగా నేను కొంతకాలం జీవించినందుకు సంతోషించు. కళ్ళుమూసుకుని దేవుని ప్రార్థించకు నేను వెనుతిరిగి రావాలని, బదులుగా కళ్ళు విప్పి నేను మిగిల్చిపోయినవి గమనించు. నన్ను ఇక చూడలేక పోతున్నందుకు నీ హృదయం శూన్యంగా అనిపిస్తుందని నాకు తెలుసు. కానీ, నీ మనసు మనమిద్దరం గడిపిన స్నేహపరిమళాలతో నిండిపోవాలని కోరుకుంటున్నాను. రేపటికి వెన్నుతిప్పి నువ్వు నిన్నలోనే బ్రతకాలనుకుంటావో, లేక మనిద్దరి మధ్యా నిన్న గడిచినదానికి రేపు సంతోషంగా ఉంటావో నీ ఇష్టం. నన్ను…
-
ఇసుక రేణువు… రాబర్ట్ విలియం సెర్విస్
. రోదసికి హద్దులులేక, ఒక సౌరకుటుంబం తర్వాత ఇంకొక సౌరకుటుంబం ఎదురౌతుంటే, మన భూమి మీద మాత్రమే జీవరాశి ఉందనుకోడానికి తగినకారణం కనిపించదు. లెక్కలేనన్ని నక్షత్ర మండలాల మధ్య, బహుశా కొన్ని లక్షల ప్రపంచాలుండవచ్చు… ఒక్కొక్కదాన్నీ ఒక్కొక్క దేవుడు రక్షిస్తూనో, నాశనం చేస్తూనో, దాని ప్రస్థానాన్ని శాసిస్తూ. ఊహించుకుంటుంటే, ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో!! ఒక్కొక్కప్రపంచాన్నీ నడిపిస్తూ లక్షలమంది దేవుళ్ళూ, వాళ్ళందరిమీదా ఒక సర్వాధికుడైన పరమాత్మా!!! . అంత పెద్దపెద్ద అంకెలు నా బుర్ర పనిచెయ్యనివ్వవు. రోదసిలోంచి పడిపోతున్నట్టు…
-
ఏబూ బెన్ ఏడం … లే హంట్
. ఏబూ బెన్ ఏడం (అలాంటి వాళ్ళు అనేకులు వర్ధిల్లుదురు గాక!) ప్రశాంత గాఢసుషుప్తినుండి ఒకరోజు మేల్కొన్నాడు చంద్రకాంతితో నిండిన అతనిగదిలో విరుస్తున్న తెల్లకలువలా, ఇంకా కాంతివంతం చేస్తూ పుత్తడిపుస్తకం లో రాస్తూన్న ఒక దేవదూతని చూశాడు. . అతిశయించిన ప్రశాంతత బెన్ ఏడం కు ధైర్యాన్నిచ్చింది అతను ఆగదిలో ఉన్న స్వరూపాన్ని ఆడిగేడు: “ఏమిటి వ్రాస్తున్నావు?”అని. అపుడా తేజస్సు తలపైకెత్తి అతి ప్రసన్నమైన వీక్షణతో ఇలా అంది: “దేవుని ప్రేమించేవారి జాబితాని” అని “అందులో నా…
-
అందరితో పాటు ఒంటరిగా… ఛార్ల్స్ బ్యుకోస్కి
. ఎముకని మాంసం కప్పుతుంది. అక్కడొక మనసుని తగిలించి, అప్పుడప్పుడు ఒక ఆత్మనుకూడా వేలాడదీస్తారు స్త్రీలు పాత్రల్ని గోడకేసిపగలగొడుతుంటారు, మగాళ్ళు పూటుగా తాగుతుంటారు ఎవరికీ తమకి కావలిసినది దొరకదు కానీ వెదుకుతూ, పక్కలమీదపడి లేస్తూ ఉంటారు ఎముకని మాంసం కప్పి ఉంచుతుంది, తనువులు తనువులని మించి ఇంకేదో వెతుక్కుంటుంటాయి . తప్పించుకునే మార్గం అస్సలు లేదు. అందరూ ఈ చిత్రమైన విధికి చిక్కుకున్నారు ఎవరికీ ఎప్పుడూ కావలసినది దొరకదు . నగరాల్లో పెంటకుప్పలు నిండిపోతాయి, తుక్కు వాకిళ్ళు…
-
పోర్షియా— ఆస్కార్ వైల్డ్
Image Courtesy: http://static.enotes.com . బెసానియో ఆ సీసపు పెట్టె మీద తన సర్వస్వాన్నీ ఒడ్డేటంత సాహసం చేసేడన్నా, ఆ గర్విష్టి ఏరగాన్ తలదించుకున్నాడన్నా, ప్రేమతోజ్వలించిన మొరాకో హృదయం ఒక్కసారి చల్లబడిందన్నా నాకేం ఆశ్చర్యం కలగడం లేదు. ఎందుకంటే నేను చూసిన వెరోనియన్ వనితలలో మేలిమికన్నా మేలిమైన సూర్యకాంతి వంటి ఆ దివ్య స్వర్ణరచిత దుస్తులలో నీ అందానికి ఏ ఒక్కరూ సగంకూడా సరితూగడం లేదు. అయినా, వివేచనాకవచముగల నువ్వు, ఆ గంభీరమైన లాయరు గౌను…
-
సహానుభూతి … ఎమిలీ బ్రాంటి
Image Courtesy: http://www.sympathy-quotes.com . రాత్రి నక్షత్రాలు ప్రకాశిస్తున్నంత సేపూ, సాయంత్రాలు నిశ్శబ్దంగా మంచు కురుస్తున్నంతసేపూ, ఉదయానికి సూర్యకాంతి బంగరుపూత పూస్తున్నంతసేపూ నువ్వు నిరాశపడవలసిన పని లేదు. కన్నీరు నదులై ప్రవహిస్తే ప్రవహించనీ, అయినా, నువ్వు నిరాశాపడవలసిన పని లేదు. అత్యంత ప్రేమాస్పదమైన వత్సరాలు నీ గుండెల్లో శాశ్వతంగా లేవూ? . అవీ ఏడుస్తాయినువ్వూ, ఏడుస్తావు… అది సహజమే ఋతుపవనాలు నీలాగే నిట్టూరుస్తాయి, హేమంతం తన దుఃఖాన్ని మంచులా కురుస్తుంది శిశిరానికి** రాలిన ఆకుల గుట్టల మీద…
-
మిల మిల మెరియవె చిని తారా… జేన్ టేలర్ (Twinkle Twinkle Little star)
. మిల మిల మెరియవె చిని తారా! ఎంత అందంగా ఉన్నావు రా, భూమికి చాలా దూరంగా, ఆకాశానా వజ్రం లా. . మండే సూర్యుడు గుంకగనే, మెరిసే వస్తువు కనకుంటే, వెలుగులు నీవవి ప్రసరిస్తావ్, రేయంతా నువు మెరుస్తుంటావ్. . చిక్కని చీకటి నడిచేరూ, నీ వెలుగుని గొప్పగ పొగిడేరూ, వెలుగే నీదది లేకుంటే, ఎటుపోవాలో తెలియదులే. . నల్లని నింగిని ఉంటూనే, నా కిటికీ తెరలోంచి చూస్తావే, సూర్యుడు తిరిగొచ్చేదాకా, రెప్పే వెయ్యవు రాత్రంతా…
-
గుర్తుంచుకో … క్రిస్టినా రోజెటి
. నేను పోయినా, సుదూర నిశ్శబ్ద లోకాలకు వెళ్ళిపోయినా… నన్ను గుర్తుంచుకో. నన్నపుడు నువ్వు చెయ్యిపట్టుకుని నడిపించనూలేవు, నాకు ఉండాలనిపించినా సగం వెనుతిరిగి, ఉండిపోనూలేను నీ భవిష్యత్ ప్రణాళికలు ఇక ఎప్పటిలా ఏరోజుకారోజు చెప్పలేవు నన్ను గుర్తుంచుకో. అంతే! ఇప్పుడిక సలహాలివ్వడానికి గాని, ప్రార్థించడానికిగాని సమయం లేదు. ఒకవేళ నువ్వు నన్ను కాసేపు మరిచిపోయి, తర్వాత ఎప్పుడో గుర్తొస్తే, దిగులుపడకు. కాలక్రమంలో కొంత మరుపువచ్చి, నా ఆలోచనల ఆనవాళ్ళు లీలగానే గుర్తున్నపుడు, నువ్వు నన్ను గుర్తుంచుకుని బాధపడేకంటే,…