Rain… K. Godavari Sarma

http://1.bp.blogspot.com/-yGbigT739X8/TgbyS_6d3NI/AAAAAAAACBw/77LugEi0ufA/s1600/man%2Bin%2Bthe%2Brain.jpg
Image Courtesy: http://1.bp.blogspot.com

.

Like a childhood friend

Seen after long years of separation…

A drizzle

Raining delicately

Like a shower of jasmine petals

Embraced me with all its hands

.

Unable to realize a wee-bit

How good a friend he was

People ran for cover towards dry shelters

To protect their heads from getting wet

.

Just me and the rain!

Nobody else was there on the roads.

Since it was an uninterrupted togetherness

We roamed the whole town

Resting hands on each other’s shoulders

.

In the nets of the drizzle, we filtered

The fish of our childhood stories

Catching and leaving them alternatingly

And were bone-tired loitering

Steeped in the rain of friendship

.

Coming on a seasonal tour

And spending this whole day with me

Rain bade me good-bye.

Though the clouds that brought him here had vanished,

Like the brilliant smile he left behind

A Rainbow stuck to the sky

Like the soaked shirt sticking to my skin.

.

(Telugu Original: Late Dr. K. Godavari Sarma)

.

వాన

.

ఎన్నాళ్ళకో కనబడ్డ

చిన్నప్పటి మిత్రుడిలా

అన్ని చేతులతో చుట్టేసింది

సన్నజాజి పూరేకుల్లా

సున్నితంగా కురిసే వాన జల్లు.

.

ఎంత మంచి మిత్రుడో

సుంతైనా గ్రహించని  మనుషులు

పొడి గడపలమీదకి చేరుకున్నారు

తడవకుండా తలదాచుకున్నారు

.

వానా నేనూ!

ఇంకెవ్వరూలేరు రోడ్డు మీద.

ఎదురులేని ఏకాంతం కనక

బుజాలమీద చేతులు వేసుకుని

ఎప్పటికబుర్లో చెప్పుకుంటూ

ఊరంతా తిరిగేశాం

.

చినుకుల వలల్లో చిన్నప్పటి కథల్ని

చేపల్లా వడపోస్తూ వదిలేస్తూ

స్నేహం జడిలో తడుస్తూ నడుస్తూ

తిరిగి తిరిగి అలసిపోయాం

.

సీజనల్ టూర్ లో ఈ ఊరొచ్చి

ఈ రోజంతా నాతో గడిపి

వీడ్కోలుచెప్పి వెళ్ళిపోయింది వాన.

వానని తెచ్చిన మబ్బులు మాయమైనా

వాన వదిలి వెళ్ళిన చిరునవ్వులా

హరివిల్లు ఆకాశాన్ని అంటుకునే ఉంది

నా గుండెకి అతుక్కున్న తడిచొక్కాలా.

.

కె. గోదావరి శర్మ

‘అంతర్వాహిని” కవితా సంకలనం నుండి.

“Rain… K. Godavari Sarma” కి 2 స్పందనలు

  1. వర్షం స్నేహితునిలా చేసిన వర్ణన బావుంది. “వాన వదిలి వెళ్ళిన చిరునవ్వులా
    హరివిల్లు ఆకాశాన్ని అంటుకునే ఉంది” చాలా బావుంది.

    మెచ్చుకోండి

  2. జ్యోతిర్మయీ,
    ముందుతరం కవులలో, తిలక్, శ్రీ శ్రీ, సోమసుందర్ లలా చిన్న వయసులోనే మంచిపేరు సంపాదించిన కవి గోదావరి శర్మ. నాకు “సామాజిక స్పృహకంటే, సంసార స్పృహ ముఖ్యం ” అంటూ ఇల్లు చక్కదిద్దుకుంటే, లోకాన్ని దిద్దినట్టే అన్న భావనని చమత్కారం గా చెప్పిన శర్మగారు దురదృష్టవశాత్తూ కారు ప్రమాదంలో మరణించడంతో తెలుగుదేశం ఒక మంచి కవిని పోగొట్టుకుంది.
    అభివాదములతో,
    మూర్తి

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: