-
ఇక అరిగిపోయిన పదబంధాలొద్దు … ఆక్టేవియో పాజ్
. చంద్రముఖీ! పొద్దుతిరుగుడుపువ్వు సూర్యుడివైపు తన దళాలు తిప్పినట్లు, నేను పేజీ తిప్పినడల్లా నీ ముఖారవిందాన్ని నా కభిముఖంగా తిప్పుతావు . సుహాసినీ! పత్రికలోని అందాల సుందరాంగీ! ఏ మగాడైనా నిన్ను చూడగానే మంత్రముగ్ఢుడౌతాడు . నీ మీద ఎన్ని కవితలు రాసి ఉంటారు? ఓ బియాట్రిస్! నీకెంతమంది డాంటేలు ప్రేమలేఖలు వ్రాసి ఉంటారు నీ భ్రాంతిమదాకారానికి? కల్పిత భావ వివశత్వానికి? *** కానీ, ఈ రోజు నేను మరొకసారి అరిగిపోయిన మాటలనే వాడి నీ మీద…
-
Your Chariot … Viswanatha Satyanarayana
. Your chariot, O my Lord! is racing with an ordained speed, uninterrupted. This corp came under it, got crushed; spurting blood streamed in pools and dried up. . That effulgent resplendent chariot divine had not stopped a wee, cognizing any snag; Neither it made a turn around, nor divine the instant roaring screams I let out.…
-
నే నెందుకు బానిసనయ్యాను? … ఏన్ హాక్ షా
. ————————————————————————————– ఒక పేద నిర్భాగ్యుడు నిరంతరం “నేనెందుకు బానిసనయ్యాను?” అని తపిస్తూ గుండెకోతతో ఈ “ఐల్ ఆఫ్ ఫ్రాన్స్**” లో మరణించాడు. ……………… తమ “ప్రపంచ యాత్ర” పుస్తకంలో బెన్నెట్ & తైయెర్మన్. ** ఇప్పుడు అది మారిషస్ గా పిలవబడుతోంది…. అనువాదకుడు. ———————————————————————————— నాకెందుకీ శాపగ్రస్తమైన పేరు? ఎందుకు? ఎందుకు నేను బానిసనయ్యాను? మరణించేదాకా, ఈ నికృష్టపు జీవితం ఈడవమని ఎవరిచ్చారీ ఆదేశం? మహానగాల ఏకాంతంలో, సింహంలా స్వేఛ్ఛగా జన్మించిన నాకు, కాళ్ళూచేతులకు సంకెలలు…
-
పేరు … కేరొలీన్ నార్టన్
. పేరులో ఏముంది?… షేక్స్పియర్ . నీ పేరొకప్పుడు సమ్మోహనమంత్రం, ఆలోచనలన్నీ దాని చుట్టూతిరిగేవి. తపించే కలలనుండీ, కోరికలనుండీ ఆ ధ్వని మేల్కొలిపేది. కొత్తవాళ్ళెవరయినా నీ పేరు ఊరికే పొగడడానికో, నిందించడానికో ఉఛ్ఛరించినపుడల్లా, నాకు శరీరం గగుర్పొడిచి, అంతరాంతరాలలో చెప్పనలవికాని ఆనందానుభూతి ఎగసిపడేది. . ఎన్ని సంవత్సరాలు… ఎన్ని సంవత్సరాలు దొర్లిపోయాయి; నువ్వూ మనిషి మారిపోయేవు; ఒకప్పుడు సంతోషంగా కలుసుకునే మనం, ఇప్పుడు అపరిచితుల్లా కలుసుకోవాలి; మన పాత స్నేహితులు నన్ను కలుస్తుంటారప్పుడప్పుడు, కానీ, ఇపుడు ఎవరూ…
-
మనిషి వెయ్యని ఒక సన్నని మార్గము…. ఎమిలీ డికిన్సన్
. మనిషి వెయ్యని ఒక సన్నని మార్గము కంటికి కనిపించింది తేనెటీగల జంటకీ తుమ్మెదల గుంపుకీ . వాటికవతల, ఒక నగరి ఉందేమో, నే చెప్పలేను, కాని, ఆ త్రోవలో నన్ను తీసుకెళ్లగల వాహనం లేదే అని మాత్రం… నిట్టూరుస్తాను. . A little road not made of man . A little road not made of man, Enabled of the eye, Accessible to thill of bee, Or cart of…
-
తొలిచూపులో ప్రేమించక, ప్రేమించినవాడెవ్వడు? … క్రిష్టఫర్ మార్లో
. ప్రేమించడమూ, ద్వేషించడమూ మన వశంలో ఉండేవి కావు. ఎందుకంటే, మనం కోరినదానిని విధి ఎప్పుడూ త్రోసిరాజంటుంది. ఇద్దరు మనసుపోగొట్టుకున్నపుడు, సహజీవనం ప్రారంభింపక ముందే, ఒకరినొకరు ప్రేమించాలనీ, రెండవవారిని గెలవాలనీ అనుకుంటాము . రెండు బంగారు కణికలు చూసి, దేనికదే పరిశీలించినపుడు, ఒకటి రెండవదానికంటే మిన్న అని నిర్ణయిస్తాము. కారణమెవరికీ తెలియదు, కాని, ఇది ఒక్కటి గుర్తుంచుకుంటే చాలు: మనం పరిశీలిస్తున్నదాన్ని కళ్ళు బేరీజు వేస్తాయి. ఇద్దరూ వివేకంగా ఆలోచించినచోట ప్రేమ పాలు శూన్యమే, తొలిచూపులో ప్రేమించక,…
-
చేతులు… Prof. Shiv K Kumar
. కాఫీ తాగుతూ, మొహాలనిండా దట్టంగా కమ్ముకున్న సిగరెట్టు పొగని సైతం లెక్కచెయ్యకుండా బాతాఖానీలో మునిగిపోయి, కబుర్ల సందడిలో వున్న జనాలమధ్యలోంచి నడుచుకుంటూ వెళ్ళేను. వెనకవైపు కోర్టుయార్డ్ లో పరిస్థితి హాలుకి భిన్నంగా ఉంది. పొగాలేదు…రణగొణధ్వనుల గొడవా లేదు. అటూ ఇటూ ఒకసారి పరికించిచూసేను. హమ్మయ్య! నా అలవాటైన కార్నర్ సీటు ఖాళీగానే ఉంది… బహుశా ఆ టేబిలునిండా ఎవరో తిని వదిలేసిన ప్లేట్లూ, కప్పులూ, సాసర్లూ ఉండడంచేతనో ఏమో! దూరంగా టేబిళ్ళు క్లీన్ చేస్తున్న ఆ…
-
Some More Urdu Poems
. She asked me laughing: How is it your heart these days? A tear surfaced in the eyes And stopped at the threshold . — Mahir ul Quadri . మనసు ఎలా వుంటోందని ‘ ఆమె నవ్వుతూ అడిగింది ఒక కన్నీటి చుక్క దొరలి అలా నిలిచి పోయింది. . -మహిరూల్ కాదరీ **** Mind dragged me To your presence. What to…
-
Some Urdu poems (From a Telugu translation)
. When you yourself are not turning up Of what use are the thoughts about you? Won’t you kindly tell them Not to take the trouble of visiting me? . Jigar Muradabadi . నువ్వే రానప్పుడు నీ ఊహలతో పనేంటనీ దయతో వాటికి చెప్పవూ వచ్చే శ్రమ తీసుకో వద్దనీ. -జిగర్ మురాదా బాదీ *********** Of all the houses in that…
-
తొలి ప్రేమ … జాన్ క్లేర్
. ఆ క్షణం వరకు ప్రేమ నన్నెప్పుడూ అంత అకస్మాత్తుగా, అంత తియ్యగా, తాకలేదు. ఆమె ముఖం ఒక మనోజ్ఞమైన కుసుమంలా వికసించి నా మనసు పూర్తిగా దోచుకుంది. . నా ముఖం రక్తపుబొట్టులేనంతగా పాలిపోయింది నా కాళ్ళు కదలాడడం మానేసేయి. ఆమె నన్ను చూడగానే నాకేమయిందో! నా జీవితం, సమస్తం మృత్పిండంలా మారిపోయాయి. . నా ముఖం లోకి ఒక్కసారి రక్తం పెల్లుబికింది. నా కళ్ళు చూపులు దక్కి, మిట్టమధ్యాహ్నం అర్థరాత్రిలా చెట్లూ చేమలూ ఏవీ…