Some Urdu poems (From a Telugu translation)

.
When you yourself are not turning up
Of what use are the thoughts about you?
Won’t you kindly tell them
Not to take the trouble of visiting me?
.
Jigar Muradabadi

.

నువ్వే రానప్పుడు

నీ ఊహలతో పనేంటనీ

దయతో వాటికి చెప్పవూ

వచ్చే శ్రమ తీసుకో వద్దనీ.

-జిగర్ మురాదా బాదీ

***********
Of all the houses in that street
It’s only in mine that no lamp is alight
That darkness is enough
To give away my address to you
.
Baki Ahmad Puri

.

మొత్తం ఆ వీధికంతా

నా ఒక్క కొంప లోనే దీపం లేంది

ఆ చీకటే చాలు నీకు

నా చిరునామా చెప్పేస్తుంది.

– బాకీ అహమద్ పురీ

***********
Oh, Moon is so arrogant
Flaunting its moonlight.
Dear! just unveil the veil a little,
And put her in her place.
-Sahil Manak Puri

.

వెన్నెలని చూసుకునే కదా

చంద్ర బింబం మిడిసి పడుతోంది

ప్రియా! ఒక్క సారి

నీ ముసుగు తీస్తే నిజం తెలుస్తుంది .

-సాహిల్ మానక్ పురీ

***********
(Courtesy:  Yendluri Sudhakar’s blog: http://sudhakaryendluri.blogspot.com

“Some Urdu poems (From a Telugu translation)” కి 9 స్పందనలు

  1. మొత్తం ఆ వీధికంతా
    నా ఒక్క కొంప లోనే దీపం లేంది
    ఆ చీకటే చాలు నీకు
    నా చిరునామా చెప్పేస్తుంది.

    Wah wah!!!

    మెచ్చుకోండి

    1. This is a translation by Sri Yendluri Sudhakar and I provided the link at the bottom. You can enjoy some more fare there. regards

      మెచ్చుకోండి

  2. “వెన్నెలని చూసుకునే కదా
    చంద్ర బింబం మిడిసి పడుతోంది
    ప్రియా! ఒక్క సారి
    నీ ముసుగు తీస్తే నిజం తెలుస్తుంది .

    -సాహిల్ మానక్ పురీ”

    ఎంత అత్భుతమైన భావన..

    మెచ్చుకోండి

    1. జ్యోతిర్మయీ,
      ఆ సౌందర్య భావన, రసానుభూతి కలిగించగల పదలాలిత్యం మరి ఉర్దూలోనే ఉందో, ఉర్దూ కవులలో ఉందో తెలియదు గాని, ఇవిచదువుతున్నంతసేపూ, మనసు రసానుభూతికి లోనవుతుంది. ఇవి యెండ్లూరి సుధాకర్ గారి అనువాదాలు. ఆయన తెలుగు యూనివర్శిటీ ప్రొఫెసరు, రాజమండ్రిలో ఉంటారు. చక్కటి కవిత్వాన్ని వ్రాసేరు.
      మీకు నచ్చినందుకు నాకు ఆనందంగా ఉంది.
      మూర్తి

      మెచ్చుకోండి

  3. నువ్వే రానప్పుడు
    నీ ఊహలతో పనేంటనీ
    దయతో వాటికి చెప్పవూ
    వచ్చే శ్రమ తీసుకో వద్దనీ.బాగుందండీ! ఏంటీ ఈయన మా ఊరిలో ఉంటారా? ఒకసారి చిరునామా చెప్పారూ కలుస్తాను!

    మెచ్చుకోండి

    1. రసజ్ఞ గారూ,
      ఆయన పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్శిటీ, రాజమండ్రిలో తెలుగు ప్రొఫెసరు. ఆయన రాజమండ్రి నివాసి. కాని నాకు ఆయన చిరునామా తెలియదు. మన్నించగలరు. ఆయన బ్లాగు అడ్రసు కవిత క్రిందను ఇచ్చాను. దానిలో మీరు స్పందిస్తే ఆయన ప్రతిస్పందించ వచ్చు. నా బ్లాగు సందర్శించి కామెంటు ఉంచినందుకు ధన్యవాదాలు.
      మూర్తి

      మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: