-
కొండ ఎగుడు … క్రిస్టినా రోజెటి
. ఈ రోడ్డు అలా తిరిగుతూ తిరుగుతూ కొండ చివరిదాకా పోతుందా? ఆహా! కొండ కొనకొమ్ము దాకా. అక్కడికి చేరడానికి రోజంతా పడుతుందా? మిత్రమా! ఉదయం ఎక్కడం మొదలెడితే చీకటిపడుతుంది చేరేసరికి. . మరి రాత్రికి అక్కడ విశ్రాంతి తీసుకుందికి వసతి ఏమైనా? చీకటిపడగానే, ఇంటికప్పొకటి కనిపిస్తుంది. కొంపదీసి చీకట్లో కనిపించకుండా పోదుగద? దాన్ని కనుక్కోలేకపోయే అవకాశమే లేదు. . రాత్రి ఇతర బాటసారుల్ని కలిసే అవకాశం ఉంటుందా? ఆ! నీకంటే ముందు వెళ్ళిన వారందరినీ కలవొచ్చు.…
-
My Heart Coos…. Afsar, Telugu, Indian
. 1 Yours is A rattling voice that flows with a tremble… An agitated river… Collecting itself …much like a feverish child under a blanket. Lowering a pregnant hovering cloudlet to earth, You flash like lightning bowing on its splitting vein. Shrinking into silence like her … a disquiet Godavari. For the last time before…
-
దివ్య దృష్టి …జాయిస్ కిల్మర్
. అంతా అంటుంటారు “హోమరు” గ్రుడ్డివాడనీ, అతని కళ్ళలోకి చూసి అతని కలల్ని ప్రతిఫలించే ముఖాలను చూడలేకపోయేవాడనీ. కానీ, అతనికి దేవతలని వారి దివ్య క్షేత్రాలకు కూడా అనుసరించగల దివ్యదృష్టి ఉన్నట్టు కనపడుతుంది. . నాకు ఏ దివ్యదృష్టీ లేదు. పూలబాణాలు ధరించిన మన్మథుడిని గాని, విలయాన్ని సృష్టించగల ఇంద్రునిగాని, అతని రాణి శచీదేవినిగాని చూడగలగడానికి. అయినా, ఒక అమాయకపు కన్నెహృదయంలో, ఈ ప్రపంచంలోని ఆనందాన్నంతా నేను చూడగలిగాను . జాయిస్ కిల్మర్ . VISION (For…
-
A Poem that’s not a Poem… Arudra
Tolerance of Truth (?) . Slogans are not religion There is no more welfare in morals What the people in power parrot to people like you and me damn them, they reck not their own reed. Who do you think rejoice When you and I die? Only the politicians who incite us. Corrupted are the…
-
పోగొట్టుకున్న స్వరం … ఏడిలేడ్ ఏన్ పార్కర్
. ఒకరోజు నేను “ఆర్గన్” ముందు కూచున్నాను బడలిన నా మనసు మనసులోలేదు నా వేళ్ళు వూరికినే లక్ష్యంలేకుండా మెట్లమీద తారాడుతూ చప్పుడుచేస్తున్నాయి . నేనేం వాయిస్తున్నానో నాకే తెలియడం లేదు అసలు అప్పుడు నేనేమిటాలోచిస్తున్నానో కూడా. అనుకోకుండా ఒక అద్భుతమైన స్వరం పలికింది “తథాస్తు” అన్న వేదోక్త మంగళాశీర్వచనంలా . అంతే! సంకీర్తనానంతర ఘంటారావంలా అది వెల్లువై ఆ సంధ్యకెంజాయని ముంచెత్తింది. పరమప్రశాంతతాస్పర్శతో అది నా సంతప్తహృదయం మీద నడయాడింది . ప్రేమ వైరాన్ని పరిహరించినట్టు అది…
-
నేనింకా నీదానను కాలేదు … సారా టీజ్డేల్
. నే నింకా నీదానకాలేదు, నీలోకరిగిపోలేదు, ఉనికికోల్పోలేదు; మధ్యాహ్నం వెలిగించిన కొవ్వొత్తిలా, మున్నీటగలిసిన మంచుతరకలా, నీలో నన్ను నే కోల్పోవాలన్న కాంక్ష ఉన్నప్పటికీ . నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నిజమే! ఇప్పటికీ నువ్వు నాకొక సుందరతర తరళ తేజస్సువే. అయినా, నేను ఇంకా నేనుగానే మిగిలి ఉన్నాను వెలుగులో హరించిన వెలుగునౌ కోర్కె ఉన్నప్పటికీ . ఓహ్! నన్ను నీ ప్రేమతో ముంచెత్తు — నీ ప్రేమ జడిలో కొట్టుకుపోయి, సుడిగాలికి కొండెక్కిన దీపకళికలా, నాచేతన…
-
ఏళ్ళు గడిచేక… టెడ్ కూజర్, అమెరికను కవి.
. ఈరోజు నేను దూరం నుండి గమనించేను నువ్వు అలా నడుచుకుంటూ నిష్క్రమించడం… మెరిసే హిమానీ నదమొకటి చప్పుడు చెయ్యకుండా సముద్రంలోకి జారుకుంది. ఎప్పటిదో తాతలనాటి సింధూర వృక్షమొకటి, నామమాత్ర పత్రావశిష్టమై, నదిలోకి వాలిపోయింది. కోడిపిల్లలకు గింజలు వెదజల్లుతున్న ముదుసలి ఒకతె తృటికాలం తలెత్తి చూసింది. . మన పాలపుంతకావల, ముప్ఫైఐదుమంది సూర్యులపెట్టు నక్షత్రమొకటి విస్ఫోటనచెంది, తోడులేని నాహృదయ ద్వారసీమల నిలిచిన ఖగోళశాస్త్రజ్ఞుడి నేత్రపటలమ్మీద ఒక పచ్చని చుక్క పొడిచి అదృశ్యమయిపోయింది. . టెడ్ కూజర్ (…
-
నేను ఖాతరు చెయ్యను … సారా టీజ్డేల్
. నేను మరణించిన పిదప, వానలోతడిసిన తరుల కురులను ఏప్రిలునెల విదిలించే వేళ, నువ్వు నా సమాధిమీద గుండెలు పగిలి శోకిస్తే … శోకింతువు గాక! నేనేం ఖాతరు చెయ్యను. . జడివాన తరుశాఖలను అవనతం చేసినపుడు, పత్రాతపత్రపాదపాల ప్రశాంతత నేనవధరిస్తాను. నువ్విప్పుడెంత మౌనంగా, నిర్దయగా ఉన్నావో అంతకంటే మౌనంగా, నిర్దాక్షిణ్యంగా ఉంటాను. . నేను అమితంగా ప్రేమిస్తాను. పరవళ్ళుతొక్కుతూ, వార్నిధిని కాంక్షించే నదిని నేను. నేనొక ఉదార వితరణశీలిని. ప్రేమ నన్ను త్రాగేందుకు వొదగ లేదు.…
-
నిన్నే తలుచుకున్నా … సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి.
. నిన్నే తలుచుకున్నా, నువ్వీ అందాన్ని ఎలా ఆశ్వాదిస్తావోనని ఆలోచిస్తూ… ఈ సుదీర్ఘమైన బీచిలో ఒక్కర్తినీ ఒంటరిగా నడుస్తూ, భంగపడుతున్న కెరటాలు ఒక క్రమంలో చేసే ఘోష వింటున్నా… నీకూ నాకూ విసుగ్గొచ్చేది ఈ ఏకశృతి వినలేక ఒకప్పుడు. . ఇపుడు నన్నావరించి ఉన్నవి… ప్రతిధ్వనించు సైకతశ్రోణులూ, దిశాభ్యంతరములునిండిన రాగరహిత విపులార్ణవ రజతశోభా. మళ్ళీ నువ్వు నాతోకలిసి ఈ తరంగధ్వని వినే సమయానికి మనిద్దరం మృత్యువులోంచి పయనిస్తాం, యుగాలు దొర్లి పోతాయి. . సారా టీజ్డేల్ (August…
-
ఒంటరి రైతు … ఆర్. ఎస్. థామస్. వేల్సు కవి.
పాపం ఒక గిరిజన రైతు అడవిలో దారి తప్పాడు ఎక్కడో కదిలిన చప్పుడు, తలెత్తి మీదికి చూసాడు. పిల్లగాలి తుర్రున పరిగెత్తడం కనిపించింది. . ఎక్కడినించో మాటలు గాలిలోంచి తేలివస్తున్నాయి. ఎక్కడ? ఎక్కడ? అని పరికించాడు. సెలయేరు తనలోతాను మాట్లాడుకుంటూ పోతోంది. అంతే! . వసంతంలో ఒకసారి తను బాటలో నడుస్తుండగా ఆకులసందునుండి వినవచ్చిన కీరవం అతన్ని వంచించింది. ఒక్క నిముషం … ఒక్క నిముషం … నాలుగు స్వరాలు… వెనుదిరిగేడు… వేరెవరూ కాదు… ముళ్ళపొదల్లో ఓ…