అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • జనవరి 25, 2012

    చితిమీద ఒక కవి … మునిపల్లె రాజు

    చితిమీద ఒక కవి … మునిపల్లె రాజు

    . చర్చిగంటలు మ్రోగడం లేదు. బజార్లు రద్దీగానే ఉన్నాయి ఆఫీసులు మూతపడలేదు సంతాప దినాలు ప్రకటింపబడలేదు వాహన సంచారం యధాప్రకారం అస్తవ్యస్తంగానే ఉంది సినిమాహాళ్ళు ఎప్పటిలాగే కిక్కిరిసి ఉన్నాయి * శవయాత్ర సాగుతోంది… అయితే ముందు బేండు మేళాలు మోగటమూ లేదు వెనుక గుర్రపు సవారీలు అనుసరించడమూ లేదు. పాడె మీద కవి ఏం పట్టనట్టు పరున్నాడు శవవాహకులు నలుగురూ పిడికిళ్లు బిగించి నడుస్తున్నారు. * జండాలు అవనతం కాలేదు. కొందరు ఇరుగు పొరుగు వాళ్ళూ, తోటి కవులు మరికొందరూకనిపిస్తున్నారు.…

  • జనవరి 24, 2012

    స్థబ్దతకీ చైతన్యానికీ మధ్య … ఆక్టేవియో పాజ్.

    . తన ప్రకాశానికి తానే మురిసిపోతూ, సూర్యాస్తమయాల మధ్య…  రోజు …  ఊగిసలాడుతోంది. . ఈ మిట్టమధ్యాహ్న వేళ, ప్రకృతి నిశ్శబ్దంగా ముందుకీ వెనక్కీ ఊగుతున్నసముద్ర తీరంలా ఉంది. . అంతా కనిపిస్తూనే ఉంటుంది… ఏదీ పట్టు చిక్కదు అంతా దగ్గిరా ఉన్నట్టే ఉంటుంది… ఏదీ చేతికందదు . కాగితం, పుస్తకం, పెన్సిలు, గ్లాసు అన్నీ తమ పేర్ల నీడలో సేదదీరుతున్నాయి . నా కణతలదగ్గర కొట్టుకుంటున్న నాడి ఏ మార్పూలేని రక్తాన్నే మోసుకెళ్తోంది. . నిర్లిప్తంగా…

  • జనవరి 23, 2012

    గొల్ల తన ప్రేయసికి … క్రిష్టఫర్ మార్లో

    . రమ్ము నెచ్చెలి, నాదు ప్రేయసివి కమ్ము ఇచటి లోయలు తోపులు, మిట్ట, బయళు, లిచటి యడవి, మహాగిరు లీను తావు లరసి, సుఖముల చొక్కి సోలుదము రమ్ము. కాంచుదము మనము శిలలపై గూరుచుండి సాటి గొల్లలు మందల సాకు తీరు యేటి పాటుకు గళమును దీటు గలిపి ఆలపించెడు పులుగు శృంగార గీతి. ఏ నమర్తు గులాబుల సెజ్జ నీకు వేలుగ సుగంథ సుమములపేర్లు, మీరి పూల కుళ్ళాయి తలకట్టు, ఒడలి యుడుపు తరుకదంబదళమ్ముల తీర్చినయది.  మించు…

  • జనవరి 22, 2012

    గాథాసప్తశతినుండి …

    . Rainy Season. Raining Cats and Dogs, Lord of Clouds was desperate to pull Earth towards him with his jet-reins; Thunders are but his grunts of vain enterprise. . Anonymous . (From Gatha Saptasati (A Book of 700 stories in Prakrutam) compiled, edited and augmented by King Hala (CE 19-24) from among the popular stories…

  • జనవరి 21, 2012

    Treescape in a Storm … Ismail

    . It sways like a sea… Why does this ungirdled garden grieve Night and day in the ceaseless storm? Curiously, why even the ocean imitates? Maybe it rains perpetually in its heart. Amidst such billowing turbulence Why do birds retreat only to the tree-waves That howl and hiss? No sooner the easterly hurricane Starts spinning…

  • జనవరి 20, 2012

    ప్రాచ్య గీతం… ఏలన్ జింజ్బెర్గ్

    . నేను నాకు గుర్తుకొస్తున్న ప్రేయసి గురించి చెబుతాను: ఆ చంద్రముఖి ఎంతో విశ్వసనీయురాలు, తెరలమాటున ఉన్నప్పటికీ… ఆమె పలుకకపోయినా, ఆలోచనలలో నిత్యం మెదులుతూనే ఉంటుంది సంరక్షణ బాధ్యతలు ఆమెని నా పట్ల ఉదాసీనురాలిగా చేసినై . సముద్రం అంత గంభీరంగానూ, భూమి అంత గహనంగానూ ఉంటాయని ఎన్నడూ ఊహించలేదు; గాఢనిద్రలో పడి నేను మరో పిల్లవాణ్ణయిపోయా; లేచి చూస్తే,  ప్రపంచం అంతా మమతతో కేరింతలుకొడుతోంది. . . ఏలన్ జింజ్బెర్గ్ (June 3, 1926 –…

  • జనవరి 19, 2012

    మానసిక క్షోభతో … రాబర్ట్ బర్న్స్

    . ఓ పరమాత్మా! నీవెవ్వరో నా కగమ్యగోచరం. కానీ, నీకీ సృష్టిలో జరిగేవన్నీ నీకు తెలుసుననే నమ్ముతున్నాను. . ఈ జీవుడు దీనుడూ, దుఃఖితుడై  నీ మ్రోల నిలబడ్డాడు ఈ హృదయాన్ని దొలిచే ఆవేదనలు నీ ఆనతి వినా జరగవని నమ్ముతున్నాడు . అయితే, శర్వశక్తిమయా! నువ్వు కోపంవలననో, నిర్దయతోనో ఇలా చేశావనుకోను. ప్రభూ! అలసిన నా కనుల కన్నీరైనా తుడు లేదా, శాశ్వతంగా మూసుకునేలా వరమివ్వు! . లేదూ, నీ చర్యల వెనుక ఏదో నిగూఢ…

  • జనవరి 18, 2012

    భగ్న ప్రేమ … ఎలిజబెత్ సిడాల్

    . ఓహ్! భగ్నప్రేమ గురించి చింతించడమెందుకు? ప్రేమ ఎన్నడు నిజం అయింది గనక?! అది అనువును బట్టి నీలం నుండి ఎరుపుకీ, రక్తవర్ణం నుండి నీలానికీ రంగులు మారుస్తుంటుంది. అసలు ప్రేమ పుట్టుకే బాలారిష్టాలతో… కనక అదెన్నడూ నిజం అవమన్నా అవలేదు. . సొగసైన నీ ముఖం మీద ఆ చిరునవ్వెందుకు? వద్దు. మళ్ళీ నిట్టూర్చవలసి వస్తుంది సుమా! చిట్టితల్లీ! ఎంత నిజాయితీగల మాటలు, నిష్కల్మషమైన పెదాలు పలికినా అవి గాలిలో కలిసి హరించిపోవలసిందే… శీతగాలులు కోతపెట్టే వేళ నువ్వు ఒంటరిగా మిగిలిపోవలసిందేనే…

  • జనవరి 17, 2012

    కపాల లిఖితం … లార్డ్ బైరన్.

    . భయపడకు… నా ఆత్మ లేచిపోయిందని అపోహపడకు. నాలో కపాలాన్ని మాత్రమే చూడు బ్రతికున్న బుర్రల్లోంచి ప్రవహించేవాటిలా నాలో ప్రవహించేదేదీ నిరుత్సాహం కలిగించదు . నీ లాగే నేనూ ఒకప్పుడు జీవించేను, ప్రేమించేను, తాగేను, మరణించి నా ఎముకలను నేలకి అప్పగించేను. నింపుకో… నన్ను నువ్వు బాధించ లేవు; క్రిముల పెదాలు నీ పెదాలకంటే కంపుగొట్టేవి . కులకులలాడే వానపాములని పోషిస్తూ వాటి ఆహారమై మిగిలే కన్న మెరిసే మదిరని మోస్తూ సురాపానపాత్రగా తిరుగాడమే మిన్న .…

  • జనవరి 16, 2012

    ఎవరీతడు? … రవీంద్రనాథ్ టాగోర్

    . బయలువెడలితి నొంటిగ సమావేశ స్థలికి ఈ నిశీధిని నన్ననుగమించు న ద దెవరు? . దారి విడిచితి తప్పించుకొన, విఫలుండనైతి . ప్రతి పదమునను భూ పరాగముల చెణుకు గర్వి, ప్రతి పదమున అహంకారమునె తొణుకు . స్వామి! నా ప్రతిరూపమె, స్వల్పబుధ్ధి, సిగ్గదన్నదెరుంగడు, చిత్రమేమొ వెనుకె వచ్చెను నీ గృహవాటి వారకు మరలనేరడు, సిగ్గయ్యె మరల మరల . రవీంద్రనాథ్ టాగోర్ . Who is This? . I came out alone…

←మునుపటి పుట
1 … 231 232 233 234 235 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు