Treescape in a Storm … Ismail

Image Courtesy: http://www.laytonstree.com

.

It sways like a sea…
Why does this ungirdled garden grieve
Night and day in the ceaseless storm?

Curiously, why even the ocean imitates?

Maybe it rains perpetually in its heart.

Amidst such billowing turbulence
Why do birds retreat only to the tree-waves
That howl and hiss?

No sooner the easterly hurricane
Starts spinning its sinister snares, than the
Ships sail to the seas for refuge, they say;

As the trees flaunt to the wind
Their answer to its questioning of their roots
The erotemes of roots
Still hang in the vacuum left by the upturned.

And the graceful cities
Fattened by the questionables
Remain under the siege
Of surrounding sheets of brimming brine.

Hands may cede, but,
Seeds and birds shall take wings.
Casting new shadows
Humming new hymns.

For the storm and the swelling surfs
Agitation is only at the periphery…
But at heart
They are both pacific.

.

Ismail 

July 1, 1928 – Nov 25, 2003

Indian

.

వర్షంలో ఊగే చెట్లు

.

సాగరంలా ఊగుతోంది.

భోరున కురిసే వర్షంలో

పారం కనిపించని తోట

అహర్నిశీధులు క్షోభిస్తుందేం?

మహాసముద్రం చోద్యంగా ?

గుండెల్లో నిత్యం వానలు

కురుస్తో ఉంటాయి గావును.

అంత కల్లోలంలోనూ

ఎగిరిపడి కసిరేసే

వృక్షతరంగాల్నే

పక్షులాశ్రయిస్తాయేం?

తూర్పున నల్లటి ఉచ్చులు

తుఫాను పన్నుకుంటూ రాగా

చప్పున సాగరవృక్షాగ్రానికి

తప్పించుకుంటాయిట ఓడలు

మూలాల్ని ప్రశ్నించే గాలికి

కూలుతాయి మహావృక్షాలు,

ఊగుతాయి ఆ శూన్యంలో

ఊడిన వేళ్ళ ప్రశ్నార్థకాలు

చుట్టుకుపోయిన మహాసముద్రాల

అట్టడుగున మిగుల్తాయి

బలిసిన ప్రశ్నార్థకాలతో

కుల్కులలాడే మహానగరాలు.

భుజాలు పతనమైనా

బీజాలూ ద్విజాలూ ప్రసరిస్తాయి

కొత్తనీడల్ని పాతుతాయి

కొత్తపాటల్ని మొలకెత్తుతాయి

జలనిధికీ, ఝంఝ కీ

అలజడి పైకే కానీ

హృదయాలతి ప్రశాంతమట

.

ఇస్మాయిల్. 

July 1, 1928 – Nov 25, 2003

 

“Treescape in a Storm … Ismail” కి 6 స్పందనలు

  1. ఈయన కవితలు చాలానే చదివాను. విలక్షణమయిన రీతిలో పరిసరాలని పరిచయం చేస్తూ ఉంటారు. చెట్టు నా ఆదర్శం, రాత్రి వచ్చిన రహస్యపు వాన ఎంతగానో ఆకట్టుకున్నాయి.

    మెచ్చుకోండి

    1. అమ్మా రసజ్ఞా,
      సర్ ఆర్థర్ కాటన్ ధర్మమా అని పచ్చని చెట్లూ, ఉండుండి తుఫానులూ గోదావరిజిల్లావారికి నిత్యజీవితంలో భాగాలయిపోయాయి. సముద్రతీరపట్టణాల్లో ఉన్నవారికి సముద్రం ఒక అనుభూతి, ఆలోచనలు గిలకొట్టే కవ్వం;కవిత్వీకరించడం తెలిసినవారికి అదొక తరగని వస్తువిశేషం.
      నిజమే. ఇస్మాయిల్ గారిది విలక్షణమైన రీతి.
      ఆశీస్సులతో.

      మెచ్చుకోండి

  2. అలజడి పైకేకాని హృదయాలతి ప్రశాంతమట……..అద్భుతం.

    మెచ్చుకోండి

    1. శర్మగారూ,
      ఈ మాట ఎంతో చమత్కారంగా చెప్పాడాయన. సముద్రానికి మధ్యలోనూ, తుఫానుకి మధ్యలోనూ (eye of the cyclone)ప్రశాంతంగానే ఉంటాయని వ్యవహారం.
      అభివాదములతో

      మెచ్చుకోండి

  3. తుఫానులో ప్రకృతి విలయతాండవం..ముగింపు చాలా బావుంది..

    మెచ్చుకోండి

    1. అమ్మా జ్యోతిర్మయీ,
      చక్కగా చెప్పావు. ఈ కవితలోని సౌందర్యం ప్రకృతి భీభత్సాన్ని subtle గా చెప్పడమేగాక, ఆశావహంగా కనిపిస్తున్న ప్రకృతిసిధ్ధమైన ముగింపు, అందులో దాన్ని చమత్కారంగా చెప్పడమూను.
      ఆశీస్సులతో

      మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: