-
మృత్యువు ఈ రోజు నా ఎదురుగా ఉన్నది… అజ్ఞాత ఈజిప్టు కవి
మృత్యువు ఈ రోజు నా ఎదురుగా ఉన్నది… రోగికి ఆరోగ్యంలా రోగనివారణ తర్వాత పడకగది వదులుతున్నట్టు. మృత్యువు ఈ రోజు నా ఎదురుగా ఉన్నది… సాంబ్రాణి వాసనలా ఈదురుగాలిలో దుప్పటిక్రింద కూచున్నట్టు మృత్యువు ఈ రోజు నా ఎదురుగా ఉన్నది… వాన వెలిసినట్టు విదేశాలలో యుద్ధంచేసిన సైనికుడు ఇల్లుచేరినట్టు. మృత్యువు ఈ రోజు నా ఎదురుగా ఉన్నది… మబ్బులువీడి నిర్మలంగా ఉన్న ఆకాశంలా బానిసత్వంలో మగ్గుతున్న వ్యక్తికి ఇంటిమీది ధ్యాసలా. . అజ్ఞాత ఈజిప్టు కవి క్రీస్తు…
-
జంటబాసిన పులుగు… షెల్లీ, ఇంగ్లీషు కవి
జంటబాసిన పులుగొకటి శీతవేళ కొమ్మపై కూర్చుని రోదిస్తున్నది ; పైన గడ్డకట్టిన శీతగాలి కోత క్రింద గడ్దకడుతున్న సెలయేటి పాత. ఆకురాలిన అడవిలో మచ్చుకైన లేదు చిగురు నేలమీద వెతికితే దొరకదు పూలతొగరు గాలిలో లేదు సన్ననిదైన విసరు ఉన్నదొక్కటే మిల్లు చక్రపు విసురు. . P. B. షెల్లీ (4 August 1792 – 8 July 1822) ఇంగ్లీషు కవి . . The Widow Bird . A widow bird sate…
-
పిచ్చుక తొలి జాడ… చార్లెట్ స్మిత్, ఇంగ్లీషు కవయిత్రి
పోడు మీద ముళ్లపొదలు పచ్చగా కనిపిస్తున్నై చెరువుగట్ల నీలిపూలు ఆనందంతో లాస్యంచేస్తున్నై సిందూర వృక్షాలు పూతకొచ్చాయి, వాటి మొదళ్ళలో ముళ్ళగోరింటలు త్వరలోనే మాలలు అల్లనున్నాయి, మే నెల ఎండలో కనిపించే పూమాలలు. చిక్కబడిన వసంతఋతువు తొలి చుట్టం పిచ్చుక కూడ చివరకి అడుగుపెట్టింది. సరిగ్గా సూర్యాస్తమయవేళ, పిట్టలు కూసే వేళ అది తుర్రుమంటూ పరిగెత్తుకు రావడం చూసేను ఎప్పటిలాగే దానికి స్వాగతం పలికేను. ఓ వేసవి చుట్టమా! రా! రా! నా రెల్లుగడ్డి ఇంటిచూరుకు నీ మట్టిగూడు…
-
పిచ్చికుక్కపై స్మృతిగీతం… ఆలివర్ గోల్డ్ స్మిత్, ఐరిష్ కవి
సదయులారా! సహృదయులారా! నా కథని ఒకసారి ఆలకించండి! ఇందులో మీకు కొత్తదనం కనిపించకపోతే మిమ్మల్ని ఎక్కువసేపు నిలబెట్టదు. అనగనగా ఇస్లింగ్టన్ అనే ఊరిలో ప్రపంచమంతటా కీర్తిగణించిన, ప్రార్థనచెయ్యడంలో అతన్ని మించినవాడు లేడనిపించుకున్న ఒక భక్తుడుండేవాడు. శత్రువునైనా, స్నేహితుడినైనా సమదృష్టితో చూసి సాంత్వననీయగల కరుణార్ద్ర హృదయుడాతడు అతనికి వస్త్రధారణపై మమకారం లేక ఎప్పుడూ దిగంబరిగానే తిరిగే వాడు. అన్ని ఊళ్ళలో ఉన్నట్టే ఆ ఊరిలోకూడా, ఒకానొక కుక్క ఉండేది, అక్కడ మేలుజాతి వేటకుక్కనుండి, సంకరజాతి, ఊరకుక్కల వరకు అన్నిరకాలూ…
-
గూటికి… తావో చియాన్, చీనీ కవి
అవినీతి బలిసిపోయిన ప్రభుత్వంలో ఇమడలేక, ఉన్నతోద్యోగానికి వయసులోనే రాజీనామాచేసి, జీవితావసరాలని సంక్షిప్తంచేసుకుని జీవించగలిగితే, ప్రకృతిలో మనిషికి చాలినంత ఉంటుందనీ, కీర్తిప్రతిష్టల లాలసలేనపుడు ప్రకృతితో మమేకమై జివించడానికి మించిన “జీవితం” లేదనీ తన గ్రామానికి తిరిగి వెళ్ళి, పోతనలా హాలికుడై, ప్రకృతికీ, సాహిత్యానికీ ఉన్న దగ్గర సంబంధాన్ని తన జీవితంద్వారా ఋజువుచేసిన కవి తావో చియాన్. ఈ దిగువనిచ్చిన లింకులోనూ, వికీపీడియాలోనూ ఈ కవిగురించి మంచి సమాచారాన్ని చదవొచ్చు. . ఏప్పటినుండో నాకు అనిపిస్తుండేది ఈ కొండలూ, సరస్సులూ…
-
సాంధ్యదృశ్యం, తొలగుతున్న మంచుతెరలు… చియా తావో, చీనీ కవి
చేతికర్ర ఊతంగా, మంచుతెరలు తొలగడం గమనిస్తున్నాను వేనవేల మబ్బులూ, సెలయేళ్ళూ పోకపెట్టినట్టున్నాయి. కట్టెలుకొట్టేవాళ్ళు తమ కుటీరాలకి చేరుకుంటున్నారు, త్వరలో, వాడైన కొండశిఖరాల్లో వేడిమిలేని సూరీడు అస్తమించనున్నాడు. కొండ చరియల గడ్డివరుసల్లో కారుచిచ్చు రగులుకుంటోంది రాళ్ళమీదా, చెట్లచిగురుల్లోనూ పొగమంచు కొద్దికొద్దిగా పేరుకుంటోంది. కొండమీది ఆశ్రమానికి దారిదీసే త్రోవలో నడుస్తుండగానే సంధ్యచీకట్లు ఆ రోజుకి గంటకొట్టడం కనిపించింది. . చియా తావో (779 – 843) చీనీ కవి . . Evening Landscape, Clearing Snow . Walking…
-
సాంధ్యమేఘం… జాన్ విల్సన్, స్కాటిష్ కవి
అస్తమిస్తున్న సూర్యుడి సమీపంలో ఒక మేఘం వ్రేలాడుతోంది మంచుతో పెనవేసుకున్నట్టున్న దాని అంచు పసిడిలా మెరుస్తోంది, దిగువన స్ఫటికంలా మెరుస్తున్న నిశ్చల తటాకంలో నెమ్మదైన దాని నడకని అలా గమనిస్తూ ఎంతసేపు గడిపానో! దాని హృదయం ప్రశాంతతతో నిండే ఉంటుంది, అందుకే అంత నెమ్మది! అసలు దాని నడకలోనే ఎంత ఠీవి ఉందని. ఆ సాయంత్రం వీచిన ప్రతి చిన్న గాలి రివటా ఆ విహాయస విహారిని పడమటికి తేలుస్తూనే ఉంది. శరీరబంధాన్ని త్రెంచుకున్న ఆత్మలా, బ్రహ్మానందాన్ని…
-
మరణశయ్య… థామస్ హుడ్, ఇంగ్లీషు కవి
రాత్రంతా ఆమె ఊపిరితియ్యడాన్ని గమనిస్తూ గడిపాం, పోల్చుకోలేనంత నెమ్మదిగా ఆమె ఊపిరి తీస్తూనే ఉంది ఆమెగుండెలో కొట్టుకుంటున్నట్టే ప్రాణం అటూ ఇటూ కొట్టుమిట్టాడుతోంది. మేం ఎంత నెమ్మదిగా మాటాడుకున్నామంటే ఎంత నెమ్మదిగా ఆమె చుట్టూ కదలాడేమంటే ఆమెకి ఊపిసితీయగలశక్తి నివ్వడానికి మా శక్తులన్నీ ధారపోస్తున్నామేమో అనిపించేంతగా. మా ఆశలు మా భయాల్ని వమ్ము చేశాయి మా భయాలు మా ఆశల్ని వమ్ము చేశాయి; ఆమె పడుకున్నప్పుడు చనిపోయిందనుకున్నాం, చనిపోయినపుడు పడుకుందనుకున్నాం. ఎందుకంటే, చిన్న చినుకులతో, చలితో, మసకమసకగా,…
-
విషాద గీతిక… ఫెలీషియా హెమన్స్, ఇంగ్లీషు కవయిత్రి
ఫెలీషియా హెమన్స్ పేరు వినగానే గుర్తొచ్చేది ఒకప్పుడు పాఠ్యభాగంగా ఉండే ఆమె కవిత Casabianca… The Boy who stood on the burning deck. కన్యాశుల్కం చదివిన వారికి గుర్తు ఉండొచ్చు: వెంకటేశం తల్లి వెంకమ్మ “మా అబ్బాయీ మీరూ ఒక పర్యాయం యింగిలీషు మాటాడండి బాబూ!” అని బతిమాలినపుడు – గిరీశానికీ- వెంకటేశానికీ మధ్య జరిగిన సంభాషణలో ఇద్దరూ ఇష్టం వచ్చిన ఇంగ్లీషుముక్కలు మాటాడతారు. అందులో గిరీశం పై మాటలు … Casabianca పద్యానికి…
-
దిగువన… కార్ల్ శాండ్ బర్గ్, అమెరికను
Today is Carl Sandburg’s Birthday. మీ అధికార కెరటాల దిగువన ఉన్నత శాసనయంత్రాంగపు పునాది స్తంభాలను నిత్యం తాకుతూ వ్యతిరేకదిశలో ప్రవహించే తరంగాన్ని నేను నేను నిద్రపోను నెమ్మదిగా అన్నిటినీ సంగ్రహిస్తాను అందనంతలోతుల్లో మీరు భద్రంగా దాచుకున్న వస్తువులకు తుప్పునూ, తెగులునూ కలుగజేసేది నేనే మీ కంటే మిమ్మల్ని కన్నందుకు గర్వపడే వారికంటే పురాతనమైన శాసనాన్ని నేను మీరు “ఔ”నన్నా “కా”దన్నా ఎప్పటికీ నే వినిపించుకోను. నేను అన్నిటినీ కూలదోసే రేపుని. . కార్ల్…