అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • మార్చి 27, 2012

    జోలపాట … రిచర్డ్ రౌలండ్స్

    . ఒడిలోన నా రాజు కూరుచున్నాడు తమిదీర చనుబాలు త్రావుచున్నాడు ఆ ప్రేమ  ఉసురునకు ఊపిరుల నూదు, నా తనువు అణువణువు విశ్రాంతి నందు పాడనా ఒక జోల చిన్ని నా మొలకా ఏకైక ఆనంద హేతువుర కొడుకా. . చిన్నారి నీ బొజ్జ నిండారగానే కన్నార నా మేన నిదురించవయ్య తల్లి, దాదియె గాక, చిన్ని కన్నయ్య నన్ను నీ ఊయలగ జేసుకోవయ్య పాడనా ఒక జోల చిన్ని నా మొలకా ఏకైక ఆనంద హేతువుర కొడుకా .…

  • మార్చి 26, 2012

    హిమ పరాగము … రాబర్ట్ ఫ్రాస్ట్

    (రాబర్ట్ ఫ్రాస్ట్ 139 వ జన్మదినం సందర్భంగా) . గన్నేరు చెట్టు మీంచి ఒక కాకి నా మీదకి మంచుధూళిని, విదిలించిన తీరు… నా మనస్థితిలోమార్పు తీసుకు వచ్చి, రోజులో మిగిలిన భాగాన్ని, దుఃఖిస్తూ గడపనవసరం లేకుండా రక్షించింది . రాబర్ట్ ఫ్రాస్ట్  (March 26, 1874 – January 29, 1963) అమెరికను కవి రాబర్ట్ ఫ్రాస్ట్ (1874 – 1963) అమెరికను కవి The Dust of Snow . The way a…

  • మార్చి 25, 2012

    ఇంద్రజాలం… జెస్సిక హాగ్ దోర్న్

    . నాకుతెలిసిన కొందరున్నారు, వాళ్ళు అందంగా ఉండడమే వాళ్ళ  నేరం. వాళ్ళంటే నీకు ఎంత మోహం, వివశత్వం కలుగుతుందంటే, వాళ్ళకు దాసోహమనాలో, ఇంకేమైనా చేసెయ్యాలో నీకు తెలీదు. రెండవది నీ ఒంటికి మంచిది కాదు, అది శాశ్వత మతిభ్రమణకు దారితీస్తుంది. కనుక అటువంటి పరిస్థితులురాకుండా జాగ్రత్తగా ఉండడమే మంచిది. . చీకటినుండి దూరంగా ఉండు. వాళ్ళు గదిలో ఏ మూలనో నక్కి, మనని ఎవరూ గమనించరులే అని దాక్కుని ఉండొచ్చు. కాని వాళ్ళ అందమైన వెలుగే వాళ్ళని పట్టి ఇచ్చెస్తుంది.…

  • మార్చి 24, 2012

    Death in a Hospital … Bolloju Baba

    . A soul liberated from body shackles with a swan song. . “Woe betided me, Mother! How could you leave us, having lived your whole life for us?…” A son was grieving effusively with matchless histrionics, Who till yesterday treated her like a housemaid . On the countenances of other patients fear spread like an…

  • మార్చి 23, 2012

    ప్రభాత స్తుతి— ఫిల్లిస్ వ్హీట్లీ

    నా సహ బ్లాగర్లకీ, నా బ్లాగుదర్శకులకీ, మిత్రులకీ శ్రేయోభిలాషులందరికీ నందన నామ తెలుగు ఉగాది శుభాకాంక్షలు. మీ కందరికీ ఈ సంవత్సరం ఆయురారోగ్య ఐశ్వర్యాలతోపాటు సుఖశాంతులు కలుగజేయాలని ఆకాంక్షిస్తున్నాను. . ఓ నవ కళాధిదేవతలారా! నా కృషికి చేయూతనిచ్చి నా గీతాల్ని సంస్కరించండి; ప్రాభాతదేవతకి నేను స్వాగతమాలపించాలి శ్రుతిబధ్ధమైన పల్లవులు నా నోట జాలువార నీయండి ప్రభాత దేవీ! నీకివే నా నమస్సులు. నీవు ఒక్కొక్క అడుగూ ఖగోళాన్నధిరోహిస్తుంటే, పవలు నిద్రలేచి తన కిరణాలని దశదిశలూ విస్తరిస్తోంది.…

  • మార్చి 22, 2012

    గెలుపు … ఎమిలీ డికిన్సన్

    . [ఈ మధ్య కొంతమంది మంత్రులు చేస్తున్న ప్రకటనలూ, మాట్లాడే విధానమూ చూస్తుంటే, ఈ కవితలో డికిన్సన్ చెప్పిన అభిప్రాయంలోని లోతైన భావన అవగతం అవుతుంది. మొన్న ఈమధ్య ఒకరాష్ట్రమంత్రిమండలి సమావేశంలో ఒక మంత్రిగారు “ఎవర్నడిగి సి.బి.ఐ. దాడులు జరుగుతున్నా” యని ముఖ్యమంత్రిని నిలదీశారట. అంటే, రాజ్యాంగము ఇచ్చిన అధికారంతో మంత్రిగా ప్రమాణస్వీకారము చేసినపుడు, ఏ రకమైన బంధుప్రీతి ఆశ్రిత పక్షపాతమూ లేకుండా రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామన్నవాళ్ళే ప్రమాణాలకు విరుధ్ధంగా ప్రవర్తించినపుడు, అదే రాజ్యాంగపు ఇంకొక అంగం అవి…

  • మార్చి 21, 2012

    మృత్యువుతో సంభాషణ … స్విన్ బర్న్

    I ఓ మృత్యువా! నీకభ్యంతరంలేకపోతే, నిన్నొకటడగాలని ఉంది. మేము ఎన్నో ఆశల గూళ్ళను నిర్మించుకున్నామే. నువ్వుతలుచుకుంటే, మా ఆత్మలు ప్రశాంతంగా ఉండడానికి ఓ మృత్యువా! ఒక్కటంటే ఒక్కటి  మాకు ప్రసాదించలేవా? ఏ సార్వభౌమ చిహ్నాలూ అక్కరలేదు. సూర్యుడూ, మంచు ముత్యాల మెరుపులు పొదిగిన గోపురాలూ అక్కరలేదు. అధికారముద్రలనీ, కరవాలాలపిడులనీ ఉంచడానికి యోగ్యతలేనిదైనా సరే, ఏదో ఒక అడవిచెక్కతో చేసినదైనా, తలమీద ఒకకప్పు, చాలు! మార్పులూ, భయాలూ, పీడకలలూ,అపరాథభావనలనుండి విముక్తమై, ప్రేమ శాశ్వతంగా నిద్రించేలా ఎంత హీనమైనదైనా, ఒక చిన్న…

  • మార్చి 20, 2012

    విన్నపం … డాంటే గేబ్రియల్ రోజెటీ

    . సుందరీ! అతిశయించిన నీ కన్నుల్లో అలసట ఛాయలు కనబడుతున్నై; ‘ఇకపై, మగవాని మనసు చదివేసిన పుస్తకమే’ నని ఆలోచించినందుకు ఎవరో దెబ్బలాడినట్టు వాటిలో మేమెరిగిన మెరుగులు చిన్నబుచ్చుకున్నాయి. . సుందరీ! ఎత్తిన నీ ముఖంలో కనిపించే ఒంటరితనం భరింపరానిది; నిజమైన ఒంటరితనం పదిమందిలోనున్నా వెంటాడుతుంది. నా మనసులోమాట చెప్పడం వల్ల అది పెరగదూ, తరగదు గదా? నన్ను చెప్పనీ?  . సుందరీ! నా మనసులోని ఆలోచనలేమిటో నువ్వు ఆమాత్రం పసిగట్టలేవూ? బహుశా నువ్వు వాటిని ఉపేక్షించదగినవిగా భావిస్తునా వేమో!…

  • మార్చి 19, 2012

    మంచుమరక … రాబర్ట్ ఫ్రాస్ట్

    ఆ మూల నొక మంచుమరక ఉంది గాలి ఎగరేసుకుపోతున్న కాగితాన్ని వర్షం అదిమిపెట్టినట్టు; నేను దాన్ని ఈపాటికి పోల్చుకుని ఉండాల్సింది. . కాగితం మీద ముద్రించిన అక్షరాల్లా బురద అక్కడక్కడ మచ్చలా కనిపిస్తోంది. దానిమీద ఏమిటి రాసుందో, చదివుంటే, నాకిపుడు గుర్తు లేదు. . రాబర్ట్ ఫ్రాస్ట్ . A Patch of Old Snow … . There’s a patch of old snow in a corner That I should have guessed…

  • మార్చి 18, 2012

    Life is an Enigma … Kopparthy

    . Man must survive. Even if death is inviolable, Man should last as long as he can. Living is a wonderful process… To live with the consciousness of being alive and vitality of spirit is a feat… Possible only with man Living is a grace, an elegance A yearning, an adventure Sadly, life is… an…

←మునుపటి పుట
1 … 225 226 227 228 229 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు