-
గుడారాల దీపాల వెలుగులో… Walt Whitman
గుడారాల దీపాలవెలుగులో, నా చుట్టూ నిశ్శబ్దంగా, నెమ్మదిగా కొన్ని అందమైన నీడలు తారట్లాడుతున్నాయి… ముందుగా నేను గమనించింది దూరాన నిద్రలో నున్న సైనిక పటాలం; రేఖామాత్రంగా కనిపిస్తున్న పొలాలూ; చిట్టడవుల చివరలూ; చిమ్మచీకటీ; ఉండుండి చీకటిని వెలిగిస్తూ చలిమంటలను ఎగదోసినపుడు పైకి ఎగసిపడే నిప్పు రవ్వలూ… నిశ్శబ్దమూ; అప్పుడప్పుడు దెయ్యాల్లా కదుల్తున్న ఒకటో అరో మనుషుల జాడలూ; చెట్లూ చేమలూ (ఒక్కసారి కళ్ళెత్తిచూసేసరికి అవి నన్నుదొంగచాటుగా గమనిస్తున్నాయేమోనని అనిపించింది); గాలికూడా ఆలోచనలతో జతకట్టి ఊరేగుతుంటే… ఓహ్! ఎంత సున్నితమైన,…
-
బుడగా… బండరాయీ… లూయిజా మే ఏల్కోట్
. ఓహ్! బోడిగా, గోధుమ రంగులో ఉన్న ఆ బండరాయి, తన పాదాల చెంత కెరటాలు నృత్యం చేస్తుంటే చూడ్డానికి ఎంత మనోహరంగా ఉంది! ఒకసారి ఓ చిన్న నీటిబుడగ అలలమీద తేలుతూ బండరాయి పక్కకి వచ్చి, గట్టిగా అరుస్తోంది: “ఏయ్ మొద్దూ! త్వరగా పక్కకి తప్పుకో. కనిపించటం లే? ఈ అలలమీద తేలియాడే అందాన్ని నే వస్తుంటే? చూడు హరివిల్లులాంటి నా ఆహార్యం. చూడు నా వెలుగు కిరీటాన్ని. నా మెరిసే సొగసూ, గాలిలా తేలిపోగలిగే…
-
జీవితం ఒక వరం … కోలరిడ్జ్
ఆత్మహత్య చేసుకోదలచుకున్న వ్యక్తి వాదన: . నేను పుట్టబోయే ముందు, అసలు నాకు పుట్టాలని ఉందో లేదో అడగలేదు; అలా జరిగి ఉండవలసింది కాదు. జీవించడమే ప్రశ్న అయినపుడు, ఆ ప్రయత్నం చెయ్యడానికి పంపించే వస్తువుకి ఇష్టం ఉండాలి; లేదు అంటే అర్థం? చావడమే. . ప్రకృతి సమాధానం: . ఎలా పంపేనో అలా వెనక్కితిరిగిరావడం లేదూ? శరీరం వల్ల కొత్తగా వచ్చిన నష్టం ఏముంది? ముందు నువ్వేమిటో ఆలోచించుకో. గతంలో నువ్వేమిటో ఒకసారి గుర్తు చేసుకో!…
-
You scurry off … leaving me to my music… Srinivas Vasudev
Even as I plead that The word rots on the edge of the nib Or, an idea hiccups in the gullet, You care a toss and scurry off Condemning me searching for you In the Tiananmen Square, or in the Bougainvilleas! I have expected to find you In the quietude of tomb being dug by…
-
శాశ్వతత్వం … ఎమిలీ డికిన్సన్.
కొందరు శాశ్వతత్వం కోసం కృషిచేస్తారు చాలామందికి తక్షణ ప్రయోజనాలుకావాలి. వీరికి ఫలితం వెంటనే లభిస్తే మొదటివారికి కీర్తి…భావి చెక్కులుగా దొరుకుతుంది అది చాలా మెల్లిగా లభ్యమౌతుంది… కాని శాశ్వతం. ఈ రోజుకి లభించే బంగారం మాత్రం నిత్యం చెల్లుబాటయే ఆ నాణేలతో పోలిస్తే వెలవెలపోతుంది అక్కడక్కడ ఉంటారు… నిర్భాగ్యులైనా స్టాకుబ్రోకరుని మించిన సూక్ష్మబుద్ధిగల మదుపుదారులు బ్రోకర్లకి కేవలం డబ్బులు మాత్రమే దక్కితే వాళ్ళకి దక్కేది … అంతులేని భాగ్యాల గని. . ఎమిలీ డికిన్సన్. (డిసెంబర్…
-
ప్రపంచపు తోటమాలి … RL Stevenson
మహానుభావుడు సూర్యుడు ప్రశాంతంగా సువిశాల శూన్యాకాశంలో విహరిస్తున్నాడు. వినీలగగనంలో ఈ వేసవి మధ్యాహ్నవేళ వర్షంకంటే చిక్కనికిరణాలజల్లు కురిపిస్తున్నాడు. అప్పటికేదగ్గరగా ఉన్నతెరల్ని ఇంకాదగ్గరగాలాగి గదిని నీడగా, చల్లగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాం అయినా ఒకటో రెండో కన్నాలు దొరుకుతూనే ఉన్నాయి అతనికి తన వేళ్ళు అందులోంచి దూర్చడానికి సాలీళ్ళుపట్టి దుమ్ముకొట్టుకుపోయిన అటక చూరుకన్నంలోంచి చొచ్చుకొస్తున్న వెలుతురులో బాగా కనిపిస్తోంది విరిగిపోయిన పెంకుల కొసలనుండి నిచ్చెనవేసిన గడ్డివామిని నవ్వుతూ పలకరిస్తున్నాడు మధ్యమధ్యలో తన బంగారు మోముతో తోటలోని నేలనంతా పరికించి చూస్తున్నాడు…
-
Carry On… RW Service
. అన్నీ అనుకున్నట్టు జరుగుతున్నంతసేపూ పోరాడడం సుళువే గెలుపు ఇచ్చే పులకరింతలూ, ప్రఖ్యాతీ మత్తెక్కిస్తాయి; విజయం దాపుల్లో ఉన్నంత సేపూ ఉత్సాహపరచడం సుళువే విజయధ్వానాలుచేసుకుంటూ అక్కడ రుధిరభూమిలో దొర్లవచ్చు. అనుకున్నది ఏదీ జరగనప్పుడే పరిస్థితి వేరు; మానవమాత్రులమేనన్న వేదన ముసురుకున్నపుడూ గెలుపు పదింటిలో ఒకటిగా అనిపించి, ఆశలణగారిపోతున్నప్పుడు నడుం బిగించు ఓ నా యువ సైనికుడా! చిరునవ్వు చెదరనీకు. ముందుకి సాగిపో! ముందుకి సాగిపో! నీ ముష్టిఘాతాల్లో మునపటి బలం లేకపోవచ్చు నువ్వుతిన్న దెబ్బలకి, సొమ్మసిల్లిపోతూ, గుడ్డిగా…
-
బాధ … సారా టీజ్డేల్
కెరటాలు సముద్రపు శ్వేత పుత్రికలు చిరు చినుకులు ఆ వర్షపు చిన్ని పిల్లలు నులివెచ్చని నా తనువున ఏ మూలనో మాతృత్వపు తీపు? . రాత్రి ఈ తారకలకు మాతృమూర్తి నురగలని చేతుల్లోకెత్తుకుని ఆడిస్తోంది గాలితల్లి విశ్వమంతా సౌందర్యంతో పొంగిపొర్లుతోంది కానీ, నేనే ఇంటిపట్టున ఉండిపోవాలి . సారా టీజ్డేల్ మాతృత్వ కాంక్ష ఎలా ఉదయిస్తుందో సారా టీజ్డేల్ ఈ కవితలో చక్కగా చెప్పింది. ఆ కాంక్ష మనసులో రగిలినప్పుడు ప్రకృతిలోని సమస్త వస్తువులూ మాతృత్వపు ప్రతిబింబాలుగా కనపడినట్టు చెప్పడం…
-
గాలి ఘోషిస్తోంది … బాబ్ డిలన్
. మనిషిని మనిషిగా గుర్తించడానికి అతను ఇంకా ఎంత దూరం నడవాలి? ఆ తెల్లని పావురం ఇసుకలో నిద్రించడానికి ఇంకా ఎన్ని సముద్రాలు దాటాలి? అవును, ఎన్ని ఫిరంగి గుళ్ళు ఇంకా గాలిలో ఎగరాలి వాటిని శాశ్వతంగా నిషేధించడానికి? మిత్రమా! దీనికి సమాధానం గాలి ఘోషిస్తోంది, గాలి ఘోషిస్తోంది. . అవును, ఇంకా ఎన్ని సంవత్సరాలని పర్వతం నిల్చోవాలి అది సముద్ర స్నానం చెయ్యడానికి? అవును, ఎన్ని సంవత్సరాలు ఇంకా మనుషులు బతికి బట్టకట్టాలి, వాళ్ళని స్వతంత్రంగా జీవించనివ్వడానికి?…
-
లండను నగర దృశ్యం.4.. శ్మశానవాటి… లెటిషా ఎలిజబెత్ లాండన్
. నిన్ను బ్రతిమాలుకుంటా ఈ చివికిపోతున్న ఎముకలమధ్య నన్ను సమాధిచెయ్యొద్దు. కిక్కిరిసిపోతున్న ఈ రాళ్ళగుట్టలు నేలను మరీ గట్టిగా ఒత్తుతున్నాయి. వాళ్ళ ఆడంబరాలతో, ఆనందాలతో జన జీవితం మరీ చేరువగా ఉంది; ప్రాపంచికసుఖాలకు అలవాటుపడ్డ ఈ నేలమీద నిన్ను బ్రతిమాలుకుంటా, సమాధిచెయ్యవద్దు ఎడతెరిపిలేని ఈ వాహనాల చప్పుళ్ళు చనిపోయిన వాళ్ళకి నిద్రాభంగంచేస్తాయి ఓహ్, నా తలమీంచి ఇలా జీవితం రాదారివెయ్యడం నేను జన్మజన్మలకీ భరించలేను. ఇక్కడ స్మృతిఫలకాలు, నిస్తేజంగా, బావురుమంటున్నాయి అవి దేనికదే ఒంటరిగా నిలబడి…