-
నీకు పదిహేడేళ్ళప్పుడు… Maria Zafar, Indo-Anglian Poet
. ఆమె ముసిముసినవ్వులు నీకు వినిపించేయంటావు. నీకు అప్పుడు పదిహేడేళ్ళు ఆమె ఈడేరిన అప్సరస నీ కలల బాల… లోలిత. ఆమె సడిచేయని ఊర్పులూ, రహస్యభాషణలూ ప్రేమలోని లోతులు తెలుసునంటావు నీకు అప్పుడు పదిహేడేళ్ళు ఆమె కుందనపు బొమ్మ, అమలిన అనాఘ్రాత కుసుమం ఎప్పుడూ పచ్చిగా ఉండే జ్ఞాపకం. ఆమె నిరాశామయ జీవనగాథలన్నీ అవగాహనచేసుకున్నాననీ ఆమె మనసు పూర్తిగా తెలుసుననీ ఏవేవో అంటావు నీకు అప్పుడు పదిహేడేళ్ళు ఆమె వేసవి నీరెండలో హాయిగానిద్రించే మెరుగుపెట్టిన మేలిముత్యం ఆమె…
-
మహా నగం …Jayant Mahapatra,Indo-Anglian Poet
మహానగం దాని తనుభారమంతటితో నేలకు బందీ అయి నిలుచున్నది అగాధ మనః తీరాలలో ఈ సాంధ్య చీకటివేళ నిశ్శబ్దాన్నీ, ఒత్తిడినీ అధికంచేస్తూ, తగ్గిస్తూ, పెంచుతూ. ప్రతి రోజూ పెద్ద అంగలేసుకుని నడిచే సూర్యరశ్మిక్రింద తునాతునకలైన నీడతో అది ఎవరైనా తమజీవితాన్ని పునర్నిర్మించుకుందికి అవకాశముందనడానికి ఉదాహరణగా నిలుస్తోంది. ధృఢంగా ఉన్నప్పటికీ నిర్వీర్యమై పోయి బహుశా, ప్రపంచం మాట్లాడాలని నిరీక్షిస్తోందేమో ఆగిన కాలం మళ్ళీ కదలాలనీ ద్వేషం శిధిలాలనుండి కొత్త సమాజం ఆవిర్భవించాలనీ. రోజల్లా ఎంతకీ తరగని ఆ కొండ ఎగుడు…
-
ప్రేమికులు… వీరన్ కుట్టీ, Malayali Poet
రెండు చేపలు వంతెన దాటుతున్న రైలు ప్రతిబింబం నీటిలో చూస్తూ పెట్టెలోకి ఎక్కిపోయాయి . పాపం! వాటికి తెలీదు ఒక సారి రైలు నది దాటి నేలమీద అడుగుపెట్టిన తర్వాత అవి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతాయని! . వీరన్ కుట్టీ Infatuation (మోహాన్ని) నీటిలోని ప్రతిబింబంతో, అదికూడ వంతెనమీద నుండి పరిగెత్తుతున్న క్షణికమైన రైలు నీడతో, పోలుస్తూ ఎంత భావుకతతో కూడిన కవిత చెప్పాడో గమనించండి. వయసులో ఉన్న యువతీ యువకులకి పరస్పరం కలిగే ఆకర్షణని ప్రేమగా…
-
ఎదురుపడ్డ మృత్యువు … Shiv K Kumar
ఆ నీలిరంగు గంటెనపూలు, ముసుగులోతప్పెట్లలా సడిలేకుండ, తిరోజ్ఞ్ముఖమౌతున్న సేనలా, చావువాయిద్యంలా చిత్రంగా గలగలలాడేయి. దాని భారీ పృష్టం మీద కూర్చున్న నా తెల్ల ఆల్సేషియన్ కుక్క ‘జ్యూస్’, ఎందుకో ఒక్క సారి ఏడుపు లంకించుకుంది కానీ, బాగా గాలి వీస్తున్న ఆ మధ్యాహ్నవేళ, దీవాను మీద మొగలాయీ తలగడలకు చేరబడి మహరాణీలా కూర్చున్న ఎనభై మూడేళ్ళ మా అమ్మతో చతుర సంభాషణ జరుపుతున్న నేను ఈ శకునాలేవీ గుర్తించలేకపోయాను . నేను చెప్పినదానికో, చెప్పనిదానికో గాని ఆమె…
-
ప్రేమికుడా!… సర్ జాన్ సక్లింగ్, (1609 – 1642)
. ఓ పిచ్చి ప్రేమికుడా, ఎందుకంత కళ తప్పి, నీరసంగా ఉన్నావు? చెప్పుమీ, ఎందుకు అంత కళతప్పి ఉన్నావో? నువ్వు కళకళలాడినపుడే ఆమె నిను మెచ్చనపుడు కళతప్పి ఉంటే మెచ్చుతుందా? చెప్పుమీ ఎందుకంత కళతప్పి ఉన్నావో? . ఓ వెర్రి వాడా ఎందుకంత మౌనంగా, అచేతనంగా ఉన్నావు? చెప్పుమీ, ఎందుకంత మౌనమో? అరే, అంత చక్కగా మాటాడినపుడే ఆమెని నువ్వు గెలవలేకపోతే మౌనంతో గెలవగలవా? చెప్పుమీ ఈ మౌనమెందుకో? . ఛ!ఛ! సిగ్గుచేటు. ఇలా ఆమెని మెప్పించలేవు.…
-
గృహోన్ముఖం … Rajagopal Parthasarathy, Indian Poet
(Dear Friends, I am sorry I could not post for the last few days as I was travelling. I will be travelling till 10th August. Hence I shall see you all on August 11th) ఇవాళ మధ్యాహ్నం నా టేబిలు శుభ్రం చేసుకున్నాను నా మీద నేను నియంత్రణ సాధించే ప్రయత్నంలో అన్నీ సరిగ్గా సర్దుకున్నాను తర్వాత, నా నలభై ఏళ్ళ జీవితం ఒక…
-
అవతారం… శ్రీజిత్ అరియల్లూర్, Malayali Poet
. పడావు భూముల్లో ఆడుకుందికి ఒక్కడూ వెళ్ళిన కుర్రాడు రక్షణలేని నేలనూతిలోపడి ములిగిపోయాడు. ఊరల్లా ఆ కుర్రాడిగురించి వెది వెదికి కాళ్లు పుళ్లయిపోయి తిరిగొచ్చింది గాని ఏమీ లాభం లేకపోయింది. అహ్! వాడే వస్తాడులే ఏదో ఒక రోజు ఏ పెద్దూర్లోనో బాగా డబ్బుగడించి మారుతీ కారులో, అని ఆశించారంతా. తర్వాత వర్షాలొచ్చినప్పుడు ఇళ్ళూ వాకిళ్ళూ, నూతులూ కుప్పలుతెప్పలుగా నిండిపోయి వరదైపోయినపుడు ఆ కుర్రాడు తిరిగొచ్చేడు ఇంటికి మరు జన్మలో… చేపపిల్లగా. అయితే అతన్ని ఎవరూ గుర్తుపట్టలా.…
-
‘Mother’ is not Singular… Anisetti Rajita
It’s the mother earth, overflowing with oceans, that has breathed the idea of love at epochal time, and still, replicates life in every inch of this creation. She is an eternal spring that embraces all waters. Mother is a ceaseless source of monumental love And she is the beauty incarnate… And, the survival of humanity…
-
Meghasandesam (a stream of consciousness poem) … Vamshidhar Reddy
. Oh! It looks it might rain any time. When two oppositely-charged clouds interact What reaches us first, thunder or lightning? velocity of sound is lesser than light, they say… Where is my bava? Thanks to Einstein… Clouds are veritable thieves, no doubt. Stealing water from the sea, and amassing, get heavy, lazy and lame…
-
ఒలింపిక్ గీతం … జాన్ విలియమ్స్
(లండనులో 30వ ఒలింపిక్ క్రీడలు ప్రారంభం అవుతున్న శుభ సందర్భంగా మానవాళికి ఈ క్రీడలు క్రీడలుగా మాత్రమే మిగిలిపోకుండా, స్వేచ్ఛా, స్వాతంత్ర్యం, సమానత్వాలపై అచంచలమైన విశ్వాసాన్ని ఇనుమడింపజేస్తూ, అగ్రరాజ్యాలూ, అగ్రనాయకులూ తమ భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని ఈ భావాలని పెదవులతో వల్లించకుండా, కార్యాచరణలో చూపించి, మానవాళి పురోగతికి పాటుపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారత క్రీడాకారులు తమ తమ క్రీడా విభాగాలలో అత్యుత్తమ ప్రదర్శనచూపించడం ద్వారా మన జాతీయ పతాకాన్ని విశ్వవేదికమీద రెపరెపలాడించగలరని శుభాకాంక్షలూ, శుభాభినందనలూ తెలియజేస్తున్నాను.) .…