.
ఆమె ముసిముసినవ్వులు
నీకు వినిపించేయంటావు.
నీకు అప్పుడు పదిహేడేళ్ళు
ఆమె ఈడేరిన అప్సరస
నీ కలల బాల… లోలిత.
ఆమె సడిచేయని ఊర్పులూ, రహస్యభాషణలూ
ప్రేమలోని లోతులు తెలుసునంటావు
నీకు అప్పుడు పదిహేడేళ్ళు
ఆమె కుందనపు బొమ్మ, అమలిన
అనాఘ్రాత కుసుమం
ఎప్పుడూ పచ్చిగా ఉండే జ్ఞాపకం.
ఆమె నిరాశామయ జీవనగాథలన్నీ
అవగాహనచేసుకున్నాననీ
ఆమె మనసు పూర్తిగా తెలుసుననీ ఏవేవో అంటావు
నీకు అప్పుడు పదిహేడేళ్ళు
ఆమె వేసవి నీరెండలో హాయిగానిద్రించే
మెరుగుపెట్టిన మేలిముత్యం
ఆమె కాంతులీను కళ్ళను చదివేననీ
అందులో ఏవో చిత్రమైన
విషాదఛాయలు కనుగొన్నాననీ అంటావు
నీకు అప్పుడు పదిహేడేళ్లు
ఆమె చూడబోతే అంతుచిక్కని ప్రశ్న
మనసు వివశంచేసేచిత్రకారుడి వెలుగునీడల దృశ్యాదృశ్యరేఖ
ఆమెను పలకరించేననీ, దానితోపాటు ఆమెతో
తీయని ప్రేమభాషణలు నెరపేననీ కూడా అంటావు
నీకు అప్పుడు పదిహేడేళ్ళు
ఆమె ఒక అమాయకపు జోలపాట
మనసుకి హత్తుకుని, మాయమయే స్పష్టమైన క్రీనీడ.
.
- Image Courtesy
- Maria Zafar

స్పందించండి