-
An Earthen Pot … Ravi Verelly
Someone is walking away sacking the clay sedimented on the banks abraded and shoved by Time. * Wetting the heap of argil on the potter’s wheel occasionally, The Moment is Pressing it to shape. Separating it from the wheel in a trice like a midwife who snaps the umbilical, Youth harmonizes it tapping it with…
-
మోడువారిన నారింజ … గార్సియా లోర్కా, స్పానిష్ కవి
ఓ కట్టెలుకొట్టేవాడా! నా నీడని నా నుండి వేరు చెయ్యి. ఒక్కపండూ లేకుండా ఉన్న నన్ను, నేను చూడవలసిన దౌర్భాగ్యం నుండి తప్పించు. . నేనెందుకీ ఈ అందమైన చెట్లమధ్య పుట్టాలి? పొద్దు నాచుట్టూ వృత్తంలా తిరుగుతుంటుంది, నక్షత్ర మండలాలను అలంకరించుకుని రాత్రి నన్ననుకరిస్తుంటుంది. . నా నీడచూసుకుని నేను బ్రతకలేను. ఇకనుండి చీమలనీ, ఆకు ఎరువునీ కలగంటూ, ఆ నిద్రలోనే చివుర్లు తొడిగి పక్షినై పోతాను. . ఓ కట్టెలుకొట్టేవాడా! నా నీడని నానుండి వేరు…
-
It is not that easy to vacate the resident silence … Bobby Nee
It was long Since my reflection in the mirror smiled; And god knows when The dismal prospects crossed The thresholds of imagination last! Deep inside Failure peeps through nervously… The word bandied from the lips Ducks in some corner of the heart; And the aborted thought splintered to smithereens Aches and smarts…
-
ప్రేమ… విస్టెన్ హ్యూ ఆడెన్, అమెరికను కవి
తలెత్తి నింగిలోని చుక్కలని చూసినపుడు, పాపం, అవి అంతగా పట్టించుకుంటున్నా, చివరకి నేనెందుకూ పనికిరాకుండా పోవచ్చు. అదే నేలమీదైతే, మనిషైనా, మృగమైనా అవి మనఊసెత్తకపోతే,అసలు వెరవనక్కరలేదు. . పాపం తారలు మనమీద ప్రేమతో రగిలిపోతుంటే మనం తగినరీతిలో స్పందిచకపోతే ఎలా ఉంటుంది? ఎవరూ సమానంగా ప్రేమించలేరనుకున్నప్పుడు, ఇద్దరిలో ఎక్కువ ప్రేమించేది నేననవుతా. . మనం వాటిని గుర్తించేమో లేదో ఖాతరుచెయ్యని నక్షత్రాలంటే ఇష్టమయిన నాకు, అవి ఇప్పుడు కనిపిస్తున్నా, పగలల్లా వాటిని చూడలేకపోయానన్న చింత లేదు. .…
-
గంధర్వ బాలిక… మార్గరెట్ మాహీ, న్యూజిలాండు కవయిత్రి
. నేను పుట్టిన ఉత్తరక్షణంలోనే, ఖడ్గమృగమ్మీద స్వారీ చేశాను. మగపిల్లలు కప్పపిల్లల్ని వాళ్ల పాత్రల్లోకి ఏరుకుంటుంటే, నేను నా డబ్బాని నక్షత్రాలతో నింపేను. నేను సూర్యుణ్ణి చూడ్డానికి కూనిరాగం తీస్తున్నానని మిగతా పిల్లలు నన్ను వేలెత్తి చూపిస్తూ పారిపోతారు. నేను పక్షులని పంజరాల్లోంచి విడిచిపెడతానని ప్రజలు నన్ను చూస్తే తలుపేసుకుంటారు. ఓ మగవాళ్ళ లోకమా! నీ కిదే పదేపదే నా వీడ్కోలు మళ్ళీ ఇక్కడికి మరోసారి రమ్మన్నా రాను . మార్గరెట్ మాహీ న్యూజిలాండు కవయిత్రి .…
-
నన్నెంతగా ప్రేమిస్తున్నావు? … కార్ల్ సాండ్ బర్గ్, అమెరికను కవి
నువ్వు నన్నెంతగా ప్రేమిస్తున్నావు ఇవాళ? ఒక మిలియను బుషెల్స్ ఉంటుందా? అంతకంటే ఎక్కువా? నిజంగా, అంతకంటే చాలా ఎక్కువ? . బహుశా, రేపు బుషెల్ లో సగం అయిపోతుందేమో? లేక, బుషెల్ లో సగం కంటే కూడ తక్కువో. . ఇదేనా ప్రేమంటే నీ హృదయగణితం? అచ్చం ఇలాగే, గాలికూడ, వాతావరణాన్ని కొలుస్తుంటుంది. . కార్ల్ సాండ్ బర్గ్ (January 6, 1878 – July 22, 1967) అమెరికను కవి (గాలికి ఎంత…
-
ఎక్కడో ఒక చోట… క్రిస్టినా రోజెటి, ఆంగ్ల కవయిత్రి
ఎక్కడో ఒక చోట, నేను ఇప్పటివరకూ చూడని వదనమూ, వినని స్వరమూ, నా మాటకి ఇంకా స్పందించ వలసిన హృదయమూ నా అదృష్టం ఎలా ఉందో — తప్పకుండా ఉంటాయి . ఎక్కడో ఒకచోట, దగ్గరో దూరమో ఖండాలూ, సముద్రాలూ దాటి, కంటికి కనిపించనంతదూరంలో, చంద్రుణ్ణి దాటి, తనని ప్రతి రాత్రీ గమనించే నక్షత్రానికావల… . ఎక్కడో ఒక చోట, దూరమో దగ్గరో, కేవలం ఒక గోడ, ఒక కంచె, మధ్యలో అడ్డుగా; పచ్చగా పెరిగిన పచ్చికమీద…
-
నీకేగనక ఒక స్నేహితుడుంటే… రాబర్ట్ విలియం సెర్విస్, బ్రిటిషు కవి
నీకే గనక ఒక ఆప్త మిత్రుడు, శక్తిమంతుడూ, అహం లేనివాడూ, నీ తప్పులు తెలిసి, నిన్ను బాగా అర్థం చేసుకున్నవాడూ; నీ శక్తి యుక్తుల మీద అపారమైన నమ్మకం ఉన్నవాడూ నిన్ను తండ్రిలా సంరక్షించేవాడూ; చివరిదాకా నిన్ను విడిచిపెట్టక వెన్నంటి ఉండేవాడూ ప్రపంచం నిన్నెంత పరిహసించినా, నిన్నుచూసి ఎప్పుడూ ఆనందించేవాడూ, అలాంటి స్నేహితుడుంటే, నువ్వు తప్పకుండా అతన్ని సంతోషపెట్టడానికి ఎప్పుడూప్రయత్నం చేస్తూ, స్నేహాన్ని వదులుకోవాలన్న ఆలోచనే రానీయవు. . అదే నీ స్నేహితుడు చాలా గొప్పవాడూ ఉన్నతుడూ…
-
వయసూ – ముదిమీ … ST కోలరిడ్జ్
తలలూపుతున్న పూలగుత్తులమధ్య తూగాడే పిల్లగాలిలా కవిత్వమూ, వాటిలోని మకరందాన్ని గ్రోలుతున్న తేనెటీగలా ఆశా ఉండేవి. రెండూ నా స్వంతం! వయసులో ఉన్నప్పుడు ఆశా కవిత్వమూ ప్రకృతిలో విహరించేవి! ఓహ్!… (నిట్టూర్పు) వయసులో ఉన్నప్పుడు! అదెప్పటి మాట! ఎంతదురదృష్టం! అప్పటికీ ఇప్పటికీ ఎంత వ్యత్యాశం! ఈ గాలితిత్తి అప్పటికింకా రూపుదిద్దుకోలేదు ఈ శరీరం నాకు క్షమించరాని ద్రోహం చేసింది. ఆ రోజుల్లో పర్వతాగ్రాలమీదా, సైకతశ్రోణులమీదా ఎంత తేలికగ మెరుపులా పరుగులెత్తేది… సరస్సుల్లోనూ, విశాలమైన నదీ ప్రవాహాలమీదా, పూర్వం మనకు…
-
Only one Life… Kavi Yakoob, Telugu Poet
You have but only one life… whether you are glad or gloomy; win or vanquished; rejoice or repent; There is but just one life! . Within its scope, desires pile up like tamarind sprigs words course through the pathways to reach papers; the slumbering letters lie drowsing on the finger tips dreaming of wakening and…