అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • డిసెంబర్ 18, 2012

    అతిథి గృహం … రూమీ, పెర్షియన్ కవి

    . ఈ మానవజీవితమే ఒక అతిథి గృహం . ప్రతి ఉదయమూ ఒక కొత్త అతిథి  రాక. ఒక ఆనందం, ఒక నిరాశ, ఒక నీచమైన ఆలోచన, ఒక క్షణికమైన జ్ఞానోదయం, అనుకోని అతిథిలా వస్తుంటాయి. అన్నిటినీ ఆహ్వానించి ఆతిథ్యం ఇవ్వు! అవి ఒక కష్టాల పరంపర అయినప్పటికీ ఇంట్లోని సర్వస్వాన్నీ  తుడుచుపెట్టుకుపోయినప్పటికీ, ప్రతి అతిథినీ, అతిథికివ్వవలసిన పూర్తి గౌరవంతో సేవించు ఏమో! ఒకొక్కరూ నిన్నొక కొత్త ఆనందానికి సన్నద్ధం చేస్తుండవచ్చు. భయాలూ, అవమానాలూ, అసూయలూ అన్నిటినీ ద్వారం దగ్గరే…

  • డిసెంబర్ 17, 2012

    అద్దెకో స్మృతి లేఖనం … టాం క్లార్క్, అమెరికను కవి.

    నా పేరు… ఓహ్! ఏ పేరు ఆయితే నేమిటి, తేడా ఏం రాదు. నా ఊరు… ఏ వూరయితే ఎవడిక్కావాలి, నిజానికి? పుట్టేను, పెరిగేను, చదువుకున్నాను ఏదో ఓ మాదిరిగా సంప్రదాయంగానే … ఇది ఎవరికైనా పనికొస్తుందా? నే నెలా బ్రతికేనన్న విషయానికి వస్తే…మనం దాన్లోకి వెళ్ళొద్దు. చివరికి నే చనిపోయాను. ఇక్కడ ఉన్నాను. అదొక్కటే ప్రస్తుతానికి పనికొచ్చే విషయం. . టాం క్లార్క్. అమెరికను కవి మార్చి 1, 1941 . ఈ కవితలో అద్భుత…

  • డిసెంబర్ 16, 2012

    బాటసారీ… ఏంటోనియో మచాతో, స్పానిష్ కవి

     . ఓ బాటసారీ! మరో గతి లేదు.   నీ అడుగుజాడలే తప్ప వేరే దారిలేదు.   ఓ బాటసారీ! మరో మార్గం లేదు,   నీత్రోవ నువ్వుచేసుకుంటూ దూరతీరాలు వెళ్ళాల్సిందే,  నువ్వు నడచిన దూరాన్ని సింహావలోకనంచేసుకునేదాకా దూరతీరాలు సాగుతూ, నీ త్రోవ నువ్వు చేసుకోవలసిందే ;  బహుశా, నువ్వెన్నడూ ఇక తిరిగి అడుగిడలేవు  ఆ త్రోవను వెనుదిరిగి చూడడం మినహా!  ఓ బాటసారీ! మరో మార్గం లేదు…  నీటిమీద జాడలు విడిచి వెళ్ళడమే! . ఏంటోనియో మచాతో 26 July…

  • డిసెంబర్ 15, 2012

    The Sea … Ramana GV, Telugu, Indian

    That e-mail was received when I was at the mental hospital. That was sent by an editor of a magazine soliciting a story for a special issue. My wife had informed me about it. That I was in the mental hospital she kept it a secret. Only my children knew about it. She felt it…

  • డిసెంబర్ 14, 2012

    స్వయం నిరాదరణ … జీన్ స్టార్ అంటర్మేయర్, అమెరికను కవయిత్రి

    తడిలేని ఈ మిట్టను దున్నడానికిగాని ఇక్కడ చెట్టునాటడానికిగాని ప్రయత్నించకు; ఈ పర్రలో విత్తుకి జీవగర్ర లేదు. నీ అక్కరకు పనికివచ్చి ఏమాత్రం ఉత్సాహాన్నివ్వలేని రసహీనమైన నేల ఇది. ఏ ఎండా దీనికి చైతన్యాన్నివ్వలేదు. ఇది దైవోపహతమైన భూమి. ఏ చినుకూ నిస్సారమైన ఈ నిట్రాతిలోకి ఇంకదు. దీని రాతి కొనలలో, గత ఏడు మిగిలిన ఆ చిట్టచివరి మోడునికూడా చండగాలులు తుడిచిపెట్టుకుపోయాయి. ఏ ఆశలూ  లేనిదానిమీద నీ కెందుకింకా ఆశ?   పో! వృధాశ్రమ; ప్రయాస పడకు! .…

  • డిసెంబర్ 13, 2012

    జపనీస్ కవిత … అజ్ఞాత జపనీస్ కవి

    . ఈ కొండకుసుమానికి మనోహరమైన రేకు*లనేకం ఉన్నాయి; కానీ, ఏమి ప్రయోజనం, చెప్పాలంటే సిగ్గుగా ఉంది, ఒక్కటీ వర్షానికి అక్కరకు రాదు.   . అజ్ఞాత జపనీస్ కవి. ఆంగ్లానువాదం: విలియం ఎన్. పోర్టర్. (వివరణ: *రేకు: (1) పుష్ప దళము  or, Petal of a Flower           (2) దుప్పటి, చద్దరు (ఈ కవిత వెనక ఒక అందమైన జానపద కథ ఉంది. అది ఒకప్పుడు జపానులో బాగా ప్రచారంలో ఉన్నది. ఇప్పటి సంగతి…

  • డిసెంబర్ 12, 2012

    చిన్ని నీలవర్ణుడు … యుజీన్ ఫీల్డ్, అమెరికను కవి

    . ఆ చిన్న కుక్క బొమ్మ నిండా దుమ్ము పేరుకుంది, అయినా అది బలంగా స్థిరంగా నిలబడి ఉంది; ఆ చిన్న బొమ్మ సిపాయి తుప్పుపట్టి ఎర్రగా ఉన్నాడు అతనిచేతిలో తుపాకీ బూజుపడుతోంది. ఒకప్పుడు ఆ కుక్క బొమ్మ కొత్తది గానూ ఆ బొమ్మ సిపాయి అందంగా ఉన్న రోజులున్నాయి అదెప్పుడంటే, మన నీలిరంగు బుజ్జాయి వాటితో ఆడి ముద్దుపెట్టుకున్న రోజుల్లో. “నువ్విప్పుడు నేను తిరిగివచ్చేదాకా ఎక్కడికీ కదలకేం? నువ్వుకూడా ఏ చప్పుడూ చెయ్యకు!” అని వాటితో…

  • డిసెంబర్ 11, 2012

    మర నాగలి … లూయీ అంటర్మేయర్, అమెరికను కవి.

    . విధేయతతో శ్రమిస్తూ కువకువలాడే ఈ భీకర మూర్తి కంటే ఏ నగ్నత్వం ఇంతకంటే అందంగా ఉంటుంది? ఏ ఆచ్ఛాదనా లేని జిడ్డోడుతున్న ఈ కండరాలూ గురితప్పని ఈ ఇనప కడ్డీలూ ఎన్నడూ ఆగవు పక్కలంట పొడవుగా, మెరిసే ఈ ఇనప రేకు కందెన కూడా పాడుచెయ్యలేని ఇంద్రజాలం. భూమిని రెండుగా చీల్చగల ఈ భారీ యంత్రం దాని కోపాన్ని ఉస్ ఉస్ అని నెమ్మదిగా ప్రకటిస్తుంది. దాన్ని అయిష్టాన్ని వెళ్ళగక్కదు; సృష్టికర్తలమీద చంపెద్దామన్నంత కోపంతో ఎదురుతిరగదు.…

  • డిసెంబర్ 10, 2012

    అబూ సయ్యద్ రుబాయీలు… పెర్షియన్ సూఫీ కవి.

    . 67 ప్రభూ! నా ఆలోచనలను ఈ ఇహ, పర లోకాలనుండి తప్పించు; పేదరికపు కిరీటంతో నన్ను ఉన్నతుడిని చెయ్యి. నిన్ను వెతకడంలో గల రహస్యాలను నాకు ప్రకటించు నీదగ్గరకు దారితీయని దారులనుండి నా అడుగులు మళ్ళించు. (ఒక సారి మన్సూర్ అల్ హలజ్ (858 – మార్చి 26, 922, పెర్షియన్ సూఫీ) ని ఎవరో అడిగేరట “దేముని దగ్గరకి త్రోవ ఏది?” అని. దానికతను ” రెండడుగులే,  నువ్వు అక్కడ చేరుకున్నట్టే; మొదటి అడుగు…

  • డిసెంబర్ 9, 2012

    ఎదురీత … కార్ల్ సాండ్ బెర్గ్, అమెరికను కవి

    . ధీరులు అలా పుడుతూనే ఉంటారు… వాళ్లని కాల్చి చంపుతారు, ఉరితీస్తారు, వేధించి, మానసికంగా కృంగదీస్తారు; అయినా వాళ్ళు పోరాడుతూ, గీతాలాలపిస్తూ, జీవితాన్ని పణం పెడుతూ జీవిస్తూనే ఉంటారు. ధీరులు …. అలా పుడుతూనే ఉంటారు గుండెబలమున్న వాళ్ళ తల్లులు వాళ్ళని ఏ సముద్రం నుండో, ఏ గొప్ప మైదానాలనుండో, ఏ కొండ శిఖరాలనుండో లాక్కొస్తారు మంగళహారతులివ్వు, ఆశీర్వదించు, కృతజ్ఞతలు చెప్పు. (వాటితో నిమిత్తం లేదు.) ధీరులు అలా పుడుతూనే ఉంటారు. . కార్ల్ సాండ్ బెర్గ్,…

←మునుపటి పుట
1 … 200 201 202 203 204 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
  • Subscribe Subscribed
    • అనువాదలహరి
    • Join 114 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • అనువాదలహరి
    • Subscribe Subscribed
    • నమోదవ్వండి
    • లోనికి ప్రవేశించండి
    • ఈ విషయాన్ని నివేదించండి
    • సైటుని రీడరులో చూడండి
    • చందాల నిర్వహణ
    • ఈ పట్టీని కుదించు