అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • డిసెంబర్ 28, 2012

    మిణుగురుల సయ్యాట… కాన్రాడ్ అయికెన్, అమెరికను కవి

    మెరిసే వలలాంటి ఉలిపొర వలువల్లో నను చూడు చీకటిలోంచి వెలుగులోకి అలవోకగా ఇట్టే ఎగురుతూ చప్పుడు చెయ్యకుండా తిరిగి చీకట్లోకి జారుకుంటాను! మిణుగురును నేను, ఎవరికీ పట్టుదొరకను . నువ్వు మిణుగురువా?  ఎవరి పట్టుకీ దొరకవా? నేనుమాత్రం నిన్ను చీకటిలా వెన్నాడుతా నిన్ను ఎప్పుడూ పట్టి గుప్పిట్లో మూసి, కడకి నిశ్శబ్దంలో లయించే పిలుపులా నువ్వు నశించేదాకా. . కడకి నిశ్శబ్దంలో లయించే పిలుపులా నే నశించేదాకా…ఊం! అయితే నువ్వేనా అంత ప్రశాంతంగా నా వెంటబడుతున్నది? నా…

  • డిసెంబర్ 27, 2012

    ప్రణయ తత్త్వము … షెల్లీ, ఆంగ్ల కవి

    1 చిన్నచిన్ననీటిబుగ్గలు నదులలో కలుస్తే నదులన్నీ సముద్రంలో కలుస్తాయి; రసనిష్యందమైన భావనలతోనింగిలో కలుస్తాయి సువాసనలు వెదజల్లే పిల్లగాలులు ;  ప్రకృతిలో ఏదీ ఒంటరిదికాదు. దైవసంకల్పం వలన ఆత్మలు అన్యోన్యానురక్తితో ఏకమౌతున్నప్పుడు, నేను నిన్నెందుకు కూడతగదు?  2 అనంతాకాశాన్నిగిరిశిఖరాలు ముద్దాడుతున్నై కెరటాలు ఒకదాన్నొకటి కాగలించుకుని పరుగిడుతునై; ఒక చెట్టు పూలే, అయినా,ఒకదాన్నొకటి నిరశించి పెడముఖం పెట్టడం లేదే; వేల బాహువులతో సూర్యుడు భూమిని ఆలింగనం చేస్తున్నాడు చంద్రకిరణాలుకూడా సముద్రాన్ని చుంబిస్తున్నై ఇంతటి ప్రకృతి రాగరసార్ణవానికీ ప్రయోజనమేముంది  ప్రేమతో నువ్వు…

  • డిసెంబర్ 26, 2012

    When the Heart Takes over… BVV Prasad, Telugu, Indian Poet

    . Why do we witness those rare drops of tear in a mother’s eyes when her son, who constantly chafes at her for nothing, touches her feet for a blessing; . Why do tears stream out from her pale eyes when you sincerely apologise your wife pleading guilty for the hurt; . Why do the eyes…

  • డిసెంబర్ 25, 2012

    సృష్టి … ఎడ్నా విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి,

    . ఓ విశ్వమా!నిన్నింకాగాఢంగా హత్తుకోవాలనుంది! ఏమి నీ అద్భుత పవనాలు! ఏమి నీ విశాల వినీల గగనాలు! ఏమా తెరలు తెరలుగా దిగి వ్యాపించే పొగమబ్బు దొంతరలు ! ఈ శిశిరఋతు పొద్దు, రంగులకై తపిస్తూ నీ పండుతోపులు తీపుతోవాలి పరితపిస్తున్నాయి; ఆ కాటుకకొండ తన వాలు కప్పిపుచ్చుకుందికీ ఆ శుష్కించిన మోడు చిగురించడానికీ ఆరాటపడుతున్నై; ఓ ప్రకృతీ! పుడమితల్లీ! నీనింతకంటే చేరువకాలేకున్నానే! . ఇక్కడి సౌందర్యాలగురించి ఎప్పటినుండో తెలుసు కానీ,ఇవి ఇంత సుందరంగా ఉంటాయని ఊహించలేదు! ఎంత పట్టరాని…

  • డిసెంబర్ 24, 2012

    పోస్టాఫీసులోని సిరాబుడ్డికి … క్రిష్టఫర్ మోర్లీ, అమెరికను కవి

    . ఎన్ని హృదయాలు వినయంగా నీలో మునకలిడి తమ చేతివ్రాతలుగా మిగిలి ఉంటాయి! తమ ఆంతరంగిక విషయాలు పంచుకునీ, బాధల్ని వెలిబుచ్చీ, తమ వింత, తమాషా వ్యవహారాల్ని నీతో చెప్పుకుని ఉంటాయి! నీ సిరా స్రవంతీ, నీ తడబడిరాసే కలమూ ఎన్ని పుట్టబోయే జీవితాలని ప్రభావితంచేసి ఉంటాయి, నిట్టూర్పులు విడుస్తూ, విరహులైన యువ జంటలు స్వర్గాన్నే పోస్టుకార్డుమీదకి ఎక్కించడం చూసి ఉంటాయి! . క్రిష్టఫర్ మోర్లీ (5 May 1890 – 28 March 1957 )…

  • డిసెంబర్ 23, 2012

    ఆతిథ్యం… క్రిస్టినా రోజెటి

    . నేను మరణించిన తర్వాత నా ఆత్మ ఎంతోకాలం నే మసలిన ఇల్లుచూడాలని వెళ్ళింది నేను ప్రాకారందాటి, నా మిత్రులందరూ పెరట్లో ఆకుపచ్చని నారింజచెట్లనీడన విందారగించడం చూసేను. ఒకరిచేతినుండి ఒకరికి మధుపాత్ర మారుతోంది; పళ్లలోని రసాన్ని చప్పరిస్తూ ఆస్వాదిస్తున్నారు. నవ్వుతూ, పాడుతూ, పరాచికాలాడుకుంటున్నారు, అవును మరి, ప్రతివారికీ తక్కినవాళ్లంటే ప్రేమ.  . కపటంలేని వాళ్ళ మాటలు వింటున్నా: ఒకరన్నారు:”రేపు మనం సముద్రతీరం వెంబడి మైళ్లకి మైళ్ళు, ఒక దారీ తెన్నూ లేని ఇసకతిన్నెలమీద కాళ్ళీడ్చుకుంటూ నడవాలి.” మరొకరు:”…

  • డిసెంబర్ 22, 2012

    వృద్ధుడు… జీన్ స్టార్ అంటర్ మేయర్, అమెరికను కవయిత్రి

    . చూసి నడుస్తున్నట్టు కనిపించని నడకతో ఆ వృద్ధుడు తలవంచి నడుస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తోంది దేనిగురించి ఆలోచిస్తున్నాడు చెప్మా అని: రాబోయే క్రిమిజన్మగురించా? గడచినదాని గురించా?  . లేక తనచూపును అంతర్ముఖం చేసి పరిసరాలు గూర్చిన స్పృహ విడిచి ఊహాలోకాల్లో శాశ్వతత్వం గురించి పేకమేడలు కడుతున్నాడో? . జీన్ స్టార్ అంటర్ మేయర్ (May 13, 1886 – July 27, 1970) అమెరికను కవయిత్రి. . Old Man . When an old…

  • డిసెంబర్ 21, 2012

    ప్రతీకలు … ఫెర్నాండో పెసో, పోర్చుగీసు కవి

    ప్రతీకలా? … నాకు చెప్పకండి. విసిగెత్తిపోయాను… కొంతమంది అన్నీ ప్రతీకలే అని అంటారు. అలా అనడంవల్ల వాళ్ళు నాకు చెప్పేదేమీ లేదు. . ప్రతీకలంటే ఏమిటి? కొన్ని ఊహలు… అంతే. సూర్యుడు ఒక ప్రతీక… సరే చంద్రుడు ఒక ప్రతీక… సరే భూమి ఒక ప్రతీక… అది కూడా సరే. కానీ, సూర్యుడ్ని ఎవడు పట్టించుకుంటున్నాడు వర్షంకురిసి కురిసి అలా వెలిసిన తర్వాత మేఘాల మధ్య ఖాళీలోంచి కనిపించి తనవెనక ఉన్న నీలాకాశాన్ని చూపించినప్పుడు తప్ప? అసలు…

  • డిసెంబర్ 20, 2012

    చలి – విడిది … ఫిలిప్ లార్కిన్, ఇంగ్లీషు కవి

    చాలామందికి వయసు పైబడుతున్నకొద్దీ చాలా తెలుస్తాయి అయితే, వాటికి వేటికీ నేను పెద్దగా విలువివ్వను. . నా రెండో పాతిక సంవత్సరాల జీవితాన్ని యూనివర్శిటీలో నేర్చుకున్నది వదిలించుకోడంలోనూ . ఆ తర్వాత జరిగిన విషయాలు అర్థంచేసుకుందికి నిరాకరించడంలోనూ గడిపేను. . నాకు ఇప్పుడు పత్రికలలో కనిపించే పేర్లేవీ పరిచయం లేదు. మనుషుల్ని గుర్తుపట్టలేక వాళ్లకి కోపం తెప్పించడంతోబాటు వాళ్ళు చెప్పిన చోట్లలోఎప్పుడూ లేనని ఒట్టేసిమరీ చెబుతున్నాను . నాకు నష్టం కలిగించేవి అన్నిటినీ అలా చివరి వరకూ…

  • డిసెంబర్ 19, 2012

    కవి… ఖలీల్ జీబ్రాన్, లెబనీస్ – అమెరికన్ కవి

    అతను ఈ ఇహపరాలకి వారధి. అతను, దప్పిగొన్న ప్రతి ఆత్మా సేవించగల స్వచ్ఛమైన నీటిబుగ్గ. . అతను… ఆకొన్న హృదయాలు అభిలషించే ఫలాలనందించే, సౌందర్యనదీజలాల తడిసిన పండ్లచెట్టు ; తన గానామృతంతో ఆర్తహృదయాలను అనునయించగల కోయిల; దిగంతాలలో మెరిసి, వ్యాపిస్తూ, పూర్ణాకాశాన్ని ఆవరించగల తెలివెండి మొయిలు; జీవన కేదారాలలో కురిసి ప్రవహించి, వెలుగు వెల్లువను స్వీకరించగల పద్మదళాలను వికసింపజేయగల నిపుణుడు; భగవంతుని దివ్యవాణిని వినిపించడానికి భగవతి ఎంపికచేసిన దేవదూత; ప్రేమైకమూర్తి తనుగా చమురుపోసి, స్వరసరస్వతి వెలిగించిన, పెనుగాలులార్పలేని, చీకటులు…

←మునుపటి పుట
1 … 199 200 201 202 203 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
  • Subscribe Subscribed
    • అనువాదలహరి
    • Join 114 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • అనువాదలహరి
    • Subscribe Subscribed
    • నమోదవ్వండి
    • లోనికి ప్రవేశించండి
    • ఈ విషయాన్ని నివేదించండి
    • సైటుని రీడరులో చూడండి
    • చందాల నిర్వహణ
    • ఈ పట్టీని కుదించు