-
Anjani Bai Malpekar, a Sage of Music… Samala Sadasiva
. Kumar Gandharva who recently attained his eternal abode, often used to speak about Anjani Bai Malpekar to his aesthetic friends. He addressed her respectfully as “Mayi”. Most people of those times addressed her that way. Mayi means ‘mother’. When she took up on herself to teach the intricacies of music to Kumar Gandharva, she was…
-
ప్రేమించే వాళ్ళు … సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
అమితంగా ప్రేమించే వ్యక్తులెప్పుడూ తమప్రేమని వాచ్యం చెయ్యరు. ఫ్రాన్సెస్కా, గ్వినివేర్, డీయర్డ్రె, ఈస్యూల్ట్ , హీలియోజ్ కమ్మతెమ్మెరలు వీచే స్వర్గంలో వాళ్ళు మౌనంగా ఉంటారు. అధవా, మాట్లాడినా ఏవో పిచ్చాపాటీ కబుర్లాడుకుంటారు. . నాకు బాగా తెలిసిన ఒకామె ఉండేది వయసువచ్చినప్పటినుండీ ఒకర్ని ప్రేమించింది బలీయమైన విధిని సగర్వంగా ఒంటరిగా ఎదుర్కుంటుండేది గాని ఎన్నడూ ఈ విషయం వ్యక్తం చెయ్యలేదు కానీ, సందర్భవశాత్తూ అతనిపేరు వినిపిస్తే ఆమె ముఖంలో ఒక వింతకాంతి తళుక్కున మెరిసేది. . సారా…
-
చేతులు చుట్టుకుని, దుఃఖపు ఉడుపుల్లో, … అనా అఖ్మతోవా, రష్యను కవయిత్రి
చేతులు చుట్టుకుని, దుఃఖపు ఉడుపుల్లో “ఇవాళ అంత పాలిపోయినట్టు కనిపిస్తున్నావేమి?” ఎందుకంటే, ఇవాళ అతనికో చేదు వార్త చెప్పి అతని శోకపాత్ర పొంగిపొర్లేలా చేశాను. . ఎలా మరిచిపోగలను? అతని అడుగులు తడబడ్డాయి. అతని ముఖం బాధతో వంకరలుపోయింది… అత్రంగా మేడమీదనుండి క్రిందికి ఎకా ఎకిని వీధి గేటు దాకా పరిగెత్తేను. . “ఊరికే, నీతో హాస్యం ఆడేను,” అన్నాను నేను వగరుస్తూ. “నువ్వు వెళ్ళిపోతే ఇక నేను బతకలేను,” అన్నాను. అతను చిత్రంగా నవ్వుతూ, ప్రశాంతంగా…
-
మట్టిబొమ్మ … ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
ఓ పిచ్చి మట్టిబొమ్మా! చివరకి నువ్వుకూడా పోవలసిందే. ఇంతటి నీ అపురూపమైన అందమూ నీకు అక్కరకు రాదు తీర్చిదిద్దినట్టున్న నీ చేయీ, లోపరహితమైన తలా, జ్వలించే ఉక్కువంటి బలిష్ఠమైన ఈ శరీరమూ… ప్రచండమృత్యుప్రహారము ముందు, దాని హేమంతహిమపాతము ముందు, వాడి రాలిపోయిన ఏ తొలి పండుటాకుకంటే బలీయము కాదు; ఇంత వింత సౌందర్యమూ నిష్క్రమించక తప్పదు… రూపుమాసి, ఎడమై, చివికి శిధిలమవక తప్పదు… ఆ క్షణం వచ్చినపుడు ఇంత…
-
హైకూలు… (1 వ భాగం), ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి
బ్లాగు మిత్రులకి, పాఠకులకీ సంక్రాంతి శుభాకాంక్షలు. . నిన్ను నేనెలా బాధపెట్టేను నావంక అలా పాలిపోయి చూస్తున్నావు? ఈ కన్నీళ్ళు నావి. . ఉదయమూ… సాయంత్రమూ ఒకప్పుడు ఈ రెండింటికీ మనమధ్య తేడా ఉండేది కాదు. . ఈ అద్భుతమైన ప్రాతః వేళ నీకోసం కొన్ని కొత్తమాటలు రాస్తున్నాను. అయినా, నువ్వు నిద్రపోతునే ఉన్నావు. . సూర్యోదయమైంది, తెలుసా? జాలిలేని రంగురంగుల పూబాలల్లారా నామీద మీకు ఇంకా కనికరం లేదా? . మిమ్మల్ని అన్ని దిక్కులా అనుసరించలేక…
-
ఇసుకకట్ట దాటుతున్నప్పుడు … టెన్నీసన్, ఆంగ్ల కవి.
అదిగో సూర్యుడస్తమిస్తున్నాడు, అదే రేచుక్క, నన్ను రమ్మని ఆహ్వానం పలుకుతున్నాయి! ఇసుకకట్ట*దాటి నేను కడలిలోకి అడుగిడుతున్నపుడు వీడ్కోలుచెప్పే కెరటాల కళ్ళు చెమరించకుండుగాక! ఈ అపారపారావారపు అగాధమైన లోతులలోనుండి వెలువడి, సాగి, అలసిసొలసిన ఈ కెరటం తిరిగి తనువచ్చినచోటికే పోతూ నురగలతో సడిచెయ్యడానికీ ఓపికలేనిది. అదిగో మునిచీకటి, అవే సాంధ్యఘంటారావాలు ఇకపై అంతా చిక్కని చీకటి! నేను నావలోకెక్కుతున్నప్పుడు, సాగనంపినవారిలో విషాదము లేకుండు గాక; దేశాకాలావధులుదాటి నా ప్రయాణం కొనసాగినా నన్ను తీరానికి చేర్చే శక్తి కెరటాలకు కలుగుగాక,…
-
ఆత్మలేని మనిషి … సర్ వాల్టర్ స్కాట్, స్కాటిష్ కవి
ఇది నాది, నా జన్మభూమి అని ఎన్నడూ తనకు తాను సంభావించుకోని ఆత్మలేని మనిషి ఒకడక్కడ ఉన్నాడు. పరాయి నేలలమీద తిరిగి తిరిగి కాళ్ళు ఇంటిముఖం పట్టినపుడు ఎవరి మనసు జన్మభూమిని తలుచుకుని పులకరించదు? వాడిలాంటి మనిషి కనిపిస్తే, జాగ్రత్త; ఏ జానపద సంగీతమూ అతనికై హోరెత్తదు; బిరుదులూ,పదవులతో,అతనిపేరు మార్మ్రోగిపోవచ్చు గాక, కోరికల అవధులకి ధనం పోగుచేసుకుని ఉండవచ్చు గాక; కానీ, అతని పేరుకీ, అధికారానికీ, ఆ తుచ్ఛుడు తనకోసం పోగేసుకున్న తుచ్ఛమైన సంపదకీ, ఉన్నంతకాలమూ మంచిపేరుతెచ్చుకోలేడు…
-
గుడ్లగూబ… ఎడ్వర్డ్ థామస్, ఇంగ్లీషు కవి
ఆకలితోనే కొండ దిగేను; ఐతే కడుపు నకనకలాడిపోలేదు; చలిగాలి బాగా వీస్తోంది. అయినా, నా ఒంట్లో ఇంకా ఈ ఉత్తరగాలిని తట్టుకోగల వేడి ఉంది; వొళ్ళు ఎంత అలిసిందంటే ఏ గూట్లోనో తలదాచుకుంటే ఎంతహాయిగా ఉంటుందో చెప్పలేను. . నాకు ఎంత ఆకలిగా, చలిగా, అలసటగా ఉందో తెలుసుగనుక బసలో చలి కాగి,ఆకలితీర్చుకుని విశ్రాంతి తీసుకున్నాను; ఇక బయటి ప్రపంచంతో సంపర్కంలేకుండా రాత్రి గడిచిందిగాని, హృదయవిదారకమైన గుడ్లగూబ అరుపుమాత్రం వేధిస్తూనే ఉంది . పాపం!సంతోషపెట్టే స్వరం గాని,తగిన…
-
The Tiger… Silalolita, Telugu Poetess, Indian
All the blessings for longevity, and happiness shall be confined to age four or five. They may blossom to the same twig of a plant but each of the flowers meets a different fate: Clear barriers, destinies, veils of fidelity, Adorning the bode and putting on lingering shades of blushing Are inseverable fetters to womanhood that follow up…
-
విడిపోవడం కష్టసాధ్యం … మైకేల్ డ్రేటన్, ఇంగ్లీషు కవి
వేరే మార్గం లేదు గనుక, దా, మనిద్దరం ముద్దుముద్దుగానే విడిపోదాం లాభం లేదు, నేను విసిగిపోయాను, నన్నిక నువ్వుచూడడం కుదరదు. నాకు సంతోషంగా ఉంది, నిజం, మనసుకి చాలా హాయిగా ఉంది ఇలా ఇంత నిర్మలంగా నేను విముక్తుడిని అవుతున్నందుకు. కడపటిసారి చేతులు కలుపుకుందాం, ప్రమాణాలు గట్టుమీదపెడదాం, భవిష్యత్తులో ఎప్పుడైనా కలుసుకోవడం తటస్థిస్తే, మనిద్దరిలో ఏ ఒక్కరూ మన పూర్వపు ప్రేమఛాయలు లేశమైనా మనిద్దరి కనుబొమలలో మిగలనీవద్దు. “ప్రేమ” ఇపుడు ఎగవూపిరితో చివరిశ్వాశకై పాకులాడుతూ, దాని నాడి…