The Tiger… Silalolita, Telugu Poetess, Indian
All the blessings for longevity, and happiness
shall be confined to age four or five.
They may blossom to the same twig of a plant
but each of the flowers meets a different fate:
Clear barriers, destinies, veils of fidelity,
Adorning the bode and putting on lingering shades of blushing
Are inseverable fetters to womanhood
that follow up to the grave.
Wanting recognition
and a smack of compassion
feminity fatigues in the identity crises.
.
Amidst shades of swelling tears
I must touch up the cheeks with powdery smiles
and act what behooves of me with alertness before all.
The moment I open the book, like any other sibling
the younger brother starts crying,
the elder fellow roars at me,
father knits his brows
and there would be no end to mother’s errands;
the household chores grip me like a python.
Only the sleep that makes no discrimination of sex
Mercifully visits the work-weary eyes.
Yet, I can’t appropriate sleep like others
as days reduce to encumbrances
under several masters.
.
I would be tethered to a post for display.
Men shall come and go endlessly
inspecting and testing me, my body and my skills .
.
Nobody gets satisfied with this body and its worth
I will be yearning for a change of place;
father who fails to balance me with money-weights
starts reviling me with synonyms for daughter;
Mother corks up all teary-springs at kitchen’s threshold ;
and brothers look at me … as an impending calamity.
.
Heart-broke,
how long can I stand donning the veil of smiles?
I love the times I can stand on my feet.
My battle is ahead
with the tiger that ensnares me.
.
Silalolita
.

Dr. Silalolita is a Lecturer at GLR New Model College, Hyderabad. She was a columnist and working editor for Bhoomika, a reputed magazine in Telugu wholly run by women. Presently she is running a column in Maanavi, a monthly.
.
పెద్దపులి
.
అమ్మకడుపు చల్లగా, అమ్మ ప్రేమ తియ్యగా
అన్నీ ఐదారేళ్ల లోపే
చెట్టు ఒకటే అయినా
బతుకుపూలుమాత్రం మరోలా
లక్ష్మణరేఖలూ, తలరాతలూ, పాతివ్రత్యపు బురఖాలు
శరీరమంతా అలంకరణ, నునుసిగ్గుల మేలిపూత
బతుకు కొనదాకా వెంటాడే సంకెల — ఆడతనం.
గుర్తింపూలేదు, ఆప్యాయతల చిలకరింపూలేదు
ఐడెంటిటీ క్రైసిస్ లో అలుపుతెచ్చే ఆడతనం.
.
కన్నీటికెరటాల మధ్య
చిరునవ్వుల పుప్పొడి మొహం మీద అద్దుకుని
అందరిముందూ అప్రమత్తంగా నటించాలి
అందర్లానే పుస్తకం తెరుస్తానా
తమ్ముడిరాగాలాపన, అన్నగాడి ఘీంకారం
నాన్ననొసటి చిట్లింపు, ఎడతెగని అమ్మపురమాయింపు
కొండచిలువలా నన్ను చుట్టుకున్న ఇంటిపని
స్త్రీపురుషవివక్షలేని నిద్రమాత్రం
అలసినకళ్ళను ఆదరిస్తుంది
అయినా అందరిలా నిద్రనూ నేను ప్రేమించలేను
అన్ని అధికారాలమధ్యా రోజులు గుదిబండల్లా మారిపోతాయి.
.
నేను కట్టుకొయ్యకు కట్టేసే ఉంటాను
ఎందరోవచ్చి వెళ్తుంటారు
నన్నూ, నా శరీరాన్ని, నా పనితనాన్ని చూసి,
పరీక్షించి వెళ్తూనే ఉంటారు.
.
ఎవరికీ ఈ శరీరమూ, దీని కీమత్తూ నచ్చవు
స్థలం మర్పుకోసం నేను ఆరాటపడుతూనే ఉంటాను
తులాభారం లో డబ్బులరాళ్ళెయ్యలేని నాన్న
కూతురినే పర్యాయపదాలతో ఛీకొడతాడు.
అమ్మ అన్ని నీటిబుగ్గల్నివంటింటిగడపలోనే అదిమిపెడుతుంది
అన్నాతమ్ముళ్ళు నన్నొక ఆపదలా చూస్తుంటారు.
.
పగిలిన గుండెతో ఎన్నాళ్ళని నేనుమాత్రం
చిర్నవ్వుల ఆచ్ఛాదన కప్పుకోగలను?
నన్ను నేను నిలబెట్టుకునే కాలాన్ని ఇష్టపడతాను
నన్ను చుట్టుకున్న పెద్దపులితో ఇక నా పోరాటం.
.
(ఎంతెంతదూరం … కవితా సంకలనం నుండి.)
శిలాలోలిత
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
స్పందించండి