-
రెండు నిజాలు… హెలెన్ హంట్ జాక్సన్, అమెరికను
“ప్రేయసీ,” కళ్ళలో చెమ్మ కదలాడుతుండగా అతనన్నాడు, “నిన్ను బాధించాలని నా ఉద్దేశం కాదు, “ప్రపంచం పాదాక్రాంతమైనా నిన్ను బాధించను, నేను మరిచిపోతే, అది నాదా తప్పు? చెప్పు.” . ఆమె అంది, “ఓహ్! ఎప్పుడూ నా గురించే ఆలోచించే ఈ కన్నీళ్ళకి… క్షమించు. నేను అర్థం చేసుకోగలను ప్రియా, నన్ను బాధించడం నీ అభిమతం కాదని. నువ్వు మరిచిపోయి ఉంటావని కూడా తెలుసు!” . అయినప్పటికీ, ఆమె మనసు లో లోపలి పొరల్లో ఈ ఆలోచన మెరమెరలాడి……
-
కల్పిత కథ … చిత్ర కె.పి. మలయాళం, భారతీయ కవయిత్రి
నాటక ప్రదర్శన ముగిసి చాలసేపయింది. ఆహార్యం మార్చుకోవడమూ పూర్తయింది. ప్రేక్షకులెప్పుడో వెళ్ళిపోయారు. అయినా, నేనిక్కడ రంగస్థలం మీదనే ఉన్నాను… పోగొట్టుకోని దానికోసం వెతుక్కుంటూ… ఇక్కడ నేనే పాత్రధారినీ, ప్రేక్షకుడినీ. అంతేకాదు ఆ రెండూ రూపాంతరంచెంది ఏకమయినవేళ మధ్యలో అంతరించిపోయిన కట్టుకథని నేను . చిత్ర కె.పి మలయాళం భారతీయ కవయిత్రి . Chitra KP Poem and Image Courtesy: Poetrans.wordpress.com . The Fictitious Tale . The play was enacted long since.…
-
సింహం పంజా క్రింద … హామ్లిన్ గార్లాండ్, అమెరికను కథా రచయిత
అది శరత్కాలపు ఆఖరిరోజు, హేమంతపు మొదటి రోజు కలిసిపోయిన రోజు. రోజల్లా రైతులందరూ విశాలంగా సమతలంగాఉన్న తమ ప్రెయిరీ క్షేత్రాల్లో పైనుంచి మంచు కురుస్తూ, పడుతూనే కరిగి ఒళ్ళంతా తడిసిముద్దవుతున్నా పనిచేస్తూనే ఉన్నారు; ఉండీ ఉండీ ఈదురుగాలులతో తెరలుతెరలుగా వచ్చి మంచు వర్షించిపోయే మేఘాల సంగతి చెప్పనక్కర లేదు… క్రింద నాగేటి చాళ్ళలోని మట్టి నల్లగా తారుముద్దలా బురద బురద అవుతోంది. కాడికి కట్టిన గుర్రాలు నీళ్ళోడుతూ తడుస్తున్నా తమ సహజమైన శాంతస్వభావంతో ఏమాత్రం అసంతృప్తి లేకుండా…
-
Everything That is Active… Devipriya, Telugu, Indian.
Somehow I like more … The sky that endlessly stretches its hands in all direction… The waters Whether they overwhelm the banks or attenuate to a bare ten-feet tributary but, nevertheless run… The wheel on the move even if it were that of a child’s tricycle … The nib of a writing pen… The mote…
-
ప్రమాదం… రాబర్ట్ విలియం సెర్విస్, బ్రిటన్
నా కారులో నిన్న రాత్రి తీసుకెళ్ళిన ఆ కుర్రాడు, శరీరం దారుణంగా చితికి వేలాడిపోతూ, పెదాలు రక్తంగడ్డకట్టి ఎర్రగా, కళ్ళు నిప్పుకణికల్లా మెరుస్తూ, పాపం చేతులు మట్టిముద్దల్లా చల్లగా, ముడుచుకుని… ఓహ్, ఈ రోజు రోజల్లా అతనే గుర్తుకొచ్చాడు. అలసిపోయిన ఆ ముసలి డాక్టరు నాతో అన్నాడు గదా: “మహా అయితే అతనొక గంటకుమించి బతకడేమో. అతని కాళ్లు రెండూ ముణుకులవరకూ బాంబుపేలుడుకి తెగిపోయాయి, కాబట్టి బాబూ నెమ్మదిగా వెళ్ళు. పాపం అతనికి ఈ విషయం తెలీదు.…
-
శోకం… ఎడ్న సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను
పిల్లలూ, వినండి: మీ నాయన చనిపోయేడు. అతని పాత కోట్లు తీసుకుని వాటితో మీకు జాకెట్లు కుడతాను; అతని పొడుగాటి పేంట్లనుండి మీకు చిన్న పేంట్లు కుడతాను. అతని జేబుల్లో పొగాకు మరకలుపడి అతను అక్కడపెట్టే వస్తువులుంటాయి తాళం చెవులూ, చిల్లరడబ్బులూ… చిల్లర డబ్బులు డాన్ కి తన కిడ్డీబేంకులో దాచుకుందికి; తాళాలు మాత్రం ఏన్ కి చప్పుడుచేసుకుంటూ ఆడుకుందికి. జీవితం కొనసాగవలసిందే మరణించినవారిని మరిచిపోవలసిందే; ఎంత మంచివాళ్ళు చనిపోయినా జీవితం కొనసాగవలసిందే; ఏన్, పద, నీ బ్రేక్…
-
ముగ్గురు రాజులు … ఎడిలేడ్ ఏన్ ప్రోక్టర్, బ్రిటన్
. గురువులకీ, గురుతుల్యులకీ, స్నేహితులకి, హితులకీ, కుటుంబసభ్యులందరికీ విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. . ఒక గొప్ప సామ్రాజ్యంలో రాజుగారు ఠీవిగా నిలబడి ప్రజల్ని అణగదొక్కడం చూశాను. అతని చే సంజ్ఞ చాలు, ప్రజలు తలవంచి నిల్చునేవారు అతని ఉక్కుపాదం ఎప్పుడూ వాళ్ళ కుత్తుకమీద ఉండేది అతని పేరు పాలకుల్లో, బాధితుల్లో మారుమోగేది అతని కత్తి వాళ్ళ స్తోత్రాలని ప్రతిఫలించేది. మరొక రాజు తలెత్తడం ఇంకొకచోట చూశాను. అతని మాటలు ఉదాత్తంగా, మంచిగా, వివేకంగా ఉండేవి; ప్రశాంతమైన…
-
I am just your shadow … Sowbhagya
Everything in Nature is just made out for you. The whole creation is your excursing ground. Planets of the cosmos are your play-dolls. Flowers just bloom for you and shower over you as you pass by. You pick one of them and bless it by decking it in your plait. That azure sky and moonlight…
-
Silence… Marianne Moore
మా నాన్నగారు అంటుండేవారు: “గొప్పవాళ్ళెప్పుడూ ఎవరిళ్ళలోనూ ఎక్కువరోజులుండరు. వాళ్ళకి లాంగ్ ఫెలో సమాధి(1)ని గాని హార్వర్డ్ లోని “గాజుపువ్వుల”(2) ని గాని చూపిస్తే చాలు. ఆత్మనిర్భరత గల పిల్లి ఏకాంతంలోకి తన ఆహారమైన ఎలుకని తీసుకుపోయి మూతినుండి దానితోక షూ లేసులా వేలాడుతున్నా ఎలా ఆశ్వాదించగలదో… అలా ఒక్కోసారి వాళ్లు ఏకాంతాన్ని ఆశ్వాదించగలరు. వాళ్లకి బాగా ఇష్టమైన సంభాషణేచ్ఛని కూడా అప్పుడు వాళ్ళనుండి దూరం చెయ్యొచ్చు. ఎందుకంటే, గాఢమైన అనుభూతులు మౌనంలోనే ఎక్కువప్రస్ఫుటంగా వ్యక్తమవగలవు. మౌనం అంటే…
-
ఈ శరీరం ఏమిటి? … సి. హెచ్. సిస్సన్ , ఇంగ్లండు
. ఈ శరీరం ఏమిటి? కేవలం ఊహేనా? అలా అయితే, “నా” లో నేను లేను. ఇదొక రూపకాలంకారమా? లేక, దేవునికి అన్యాపదేశమా? అదే నిజమయితే, నే నేమిటో నాకు తెలీదు. దీనికి స్పృహ ఉందని గర్వించపనిలేదు. ఎందుకంటే, సుఖం చర్మపులోతే. నువ్వు సంపాదించినవన్నీ మరొకడు అనుభవించడానికే. నీ వెలుగు మరొకరి చీకటిలో దీపకళిక. నువ్వు ఏమిచెప్పేవన్నదానితో నిమిత్తం లేదు ఎందుకంటే, నువ్వెవరైనా, ఏదైనా అది ఒక్కరోజు భాగవతమే. దానితో నీ చుక్క రాలిపోతుంది…