అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • జూన్ 6, 2013

    ఆగ్రహం… ఛార్లెస్ లాంబ్, ఇంగ్లీషు కవి

    . తగిన సమయంలో, తగినచోట ఆగ్రహమైనా  అందం సంతరించుకుంటుంది, అయితే, దానికి తగిన కారణం ఉండాలి ఒక నిముషం దాటి అది ఉండకూడదు. అంతకుమించి ఇంకా కొనసాగిందా అది పగ క్రింద మారుతుంది.   అది ఒక పాముకీ, ఒక తేనెటీగకీ మధ్య మనం గమనించే వ్యత్యాసం లాంటిది. వెనకచెప్పినదాన్ని మీరెప్పుడైనా రేపెడితే తొందరపడి ఒకసారి గట్టిగా కుడుతుంది, మీకు క్షణకాలం తీవ్రంగా నొప్పెడుతుంది కానీ, రెండోసారి మరి కుట్టదు.   గుబురు పొదలమాటునో, వెదురు, ముళ్లపొదలచాటునో…

  • జూన్ 5, 2013

    శ్రోతలు… వాల్టర్ డి లా మేర్, ఆంగ్ల కవి

    …’ఎవరదీ లోపల?’ అని అడిగేడు బాటసారి వెన్నెల జాల్వారుతున్న తలుపును తడుతూ. ఒత్తుగా పచ్చిక మొలిచిన అడవినేలమీద మౌనంగా  గడ్డి కొరుకుతోంది అతని గుర్రం: ఇంటి కప్పుమీదనుండి రివ్వున ఎగురుకుంటూ బాటసారి తలమీదనుండి ఒక పిట్ట దూసుకు పోయింది. అతను తలుపుమీద రెండోసారి గట్టిగా తట్టేడు; ‘ఇంట్లో ఎవరైనా ఉన్నారా?’ అని అడిగేడు మరోసారి. కాని ఎవ్వరూ బాతసారి వైపు కదల్లేదు; లతలతో అల్లుకున్న ద్వారబంధం నుండి ఒక్క తలకాయా అతనివైపు వంగి వాలలేదు, నిశ్చేష్టుడై ఉన్నచోటే…

  • జూన్ 4, 2013

    ఈ త్రోవ అలా పోతూనే ఉంటుంది… జె. ఆర్. ఆర్. టోల్కీయెన్,

    ఈ గుమ్మం ముందునుండి ప్రారంభమైన ఈ త్రోవ అలా ముందుకి పోతూ పోతూ అప్పుడే చాలా దూరం సాగిపోయింది, ఇక చాతనయితే, వడిగా అడుగులేసుకుంటూ దానివెనక పరిగెత్తాలి… అది మరెన్నో మార్గాలూ లక్ష్యాలూ కలిసే పెద్ద కూడలిని కలిసేదాకా. అక్కడినుండి ఎక్కడికి? ఏమో! నాకు తెలీదు. . జె. ఆర్. ఆర్. టోల్కీయెన్ 3 January 1892 – 2 September 1973 ఆంగ్ల కవీ, రచయితా, భాషాశాస్త్రజ్ఞుడూ. J R R Tolkien  కీర్తిప్రతిష్టలు అతని ఫాంటసీ…

  • జూన్ 3, 2013

    ఇక్కడ చచ్చి పడున్నాం… ఆల్ఫ్రెడ్ ఎడ్వర్డ్ హౌజ్మన్, ఆంగ్ల కవి

    మేం ఇక్కడ చచ్చి పడున్నాం ఎందుకంటే, మేం బ్రతికి జన్మించిన ఈ గడ్డకి అగౌరవం తీసుకురాదలుచుకో లేదు. . జీవితం… నిజానికి అందులో పోగొట్టుకున్న దేదీ లేదు. కాని యువకులు అలా భావిస్తారు, మరి మేం అందరం యువకులమే. . ఆల్ఫ్రెడ్ ఎడ్వర్డ్  హౌజ్మన్ 26 March 1859 – 30 April 1936 ఆంగ్ల కవి ఈ కవితలో గొప్ప తాత్త్విక చింతన ఉంది. జీవితం అపురూపమైనదీ, విలువైనదీ అని వృద్ధులు నమ్ముతారు. అసలు చాలా…

  • జూన్ 2, 2013

    క్షణికం… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి

    అంతవరకూ కడలికెరటాలమూపున సుడులుతిరుగుతూ తిరుగాడిన నురుగు, అలలుభంగమవగానే నిండు సముద్రంలో నిశ్చలంగా మిగిలినట్లు, నేను మరణించిన కొద్ది సేపటికే నా జీవితం సంగీతంలోనే మిగులుతుంది నా అనంతరం. క్షణికమైన బుద్బుదంలో మెరిసే హరివిల్లులా కొన్ని రేయింబవళ్ళు సంగీతంతో జ్వలిస్తాయి ఒక వెలుగు వెలిగి, తమ శాశ్వతనివాసమైన శూన్యంలోకి నిర్గమించేదాకా… . సారా టీజ్డేల్ (August 8, 1884 – January 29, 1933) అమెరికను కవయిత్రి . . A Little While                                      A little…

  • జూన్ 1, 2013

    Poet Immortal…… Ismail, Telugu, Indian

    Poet Immortal…  . Taking a stroll for a while On the shores of Time, He returned Throwing a pebble afar. The puppy of world Came wagging its tail And looked at the pebble left And tried to take a bite. Never did it see Such a piece of brawn before. The stone the poet had…

  • మే 31, 2013

    బుర్ఖా … అఫియా నూర్, మలయాళం, ఇండియా

    . నేను మాటాడలేను, ఎందుకంటే, ఈ బలమైన దారాల అల్లిక నా పెదాలు దగ్గరగా గట్టిగా కుట్టేసింది.    వినడానికి నాకు చెవులు గాని శ్వాశించడానికి ముక్కురంధ్రాలుగాని లేవు; ఈ నల్లదారాల జాలీ వెనక నా చూపుకూడా నిరోధింపబడుతుంది. నామీద దాడిచేసే వాడు ఎదురుగా ఉన్నా వాడిని గుర్తుపట్టకుండా ఉండడానికి ఏదో ఏర్పాటు చేసినట్టు, చుట్టూ అంతా చీకటి…   శరీరం పాపపంకిలమని నిరసించినపుడే  నా అస్తిత్వ చైతన్యం మీద మొట్టమొదటిసారి, నల్లగా ఇది తొడగబడింది.  …

  • మే 30, 2013

    ఏదైనా సాధ్యమే అని నమ్మేవాళ్ళకి… లారీ ఎస్ చెంగెజ్, అమెరికను

    తమ శక్తియుక్తులపై నమ్మకం  లేనివాళ్లకి ఏ అద్భుతాలూ జరుగవు… నువ్వు ఏది నమ్మినప్పటికీ; నువ్వు ఏం చేసినప్పటికీ; నువ్వు నీ జీవితంలో ఏది సాధించినప్పటికీ, నీ మార్గాన్ని మరలించుకుని ఏదైనా కొత్తగా పునఃప్రారంభించడానికి ఎప్పుడూ సమయం మించిపోదు…  ఒక సరికొత్త ప్రారంభం, ఉజ్జ్వలమైన భవిష్యత్తు, అన్ని అంచనాలనూ అధిగమించిన అద్భుతమైన ప్రశాంతతా… ఇప్పటికీ, ఇక ఎప్పటికీ అక్కున జేర్చుకునే అవకాశం ప్రయత్నించాలిగాని… నీదే!    . లారీ ఎస్ చెంగెజ్ . For Those Who Believe All…

  • మే 29, 2013

    కరుణ … నే ఓ మీ షిహాబ్ నై … పాలస్తీనియన్ అమెరికన్ కవయిత్రి

    నీకు నిజంగా కరుణ అంటే ఏమిటో తెలియాలంటే ముందు నీకున్న సమస్తవస్తువుల్నీ కోల్పోవాలి; వారాంతంలో తయారు చేసుకునే వంటకంలో ఉప్పు కరిగినట్టు భవిష్యత్తు ఒక్క క్షణంలో కరిగిపోవడం అనుభూతమవాలి; ప్రస్తుతం నీ స్వాధీనంలో ఉన్నదీ, విలువైనదని తలచి జాగ్రత్తగా కూర్చుకున్నదీ అవన్నీ పోగొట్టుకోవాలి రెండు కరుణార్ద్ర సంఘటనలమధ్య నిరామయ జీవనదృశ్యం అర్థం అవడానికి… నువ్వు ఎక్కిన బస్సు ఆగకుండా అలా వెళుతూనే ఉంటుందని అనుకుంటావు ప్రయాణీకులు దొరికిన చిరుతిళ్ళు తింటూ కిటికీలోంచి ప్రకృతిని గమనిస్తుంటారు. సున్నితమైన కారుణ్య ప్రభావం అర్థం…

  • మే 28, 2013

    Memories… Prasuna, Telugu, Indian

    At least When the sepia photos on the wall mock at us We should suck into the past like whirlwind Rather than coolly bypassing it like a river.   Like a streak of light That squarely questions each oversleeping bud, Memories scout for and catch at The inmost roots of our existence Which we ourselves…

←మునుపటి పుట
1 … 183 184 185 186 187 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు