-
ఈ నంబరు వాడుకలో లేదు … మంగళేష్ దబ్రాల్, హిందీ కవి
ఈ నంబరు వాడుకలో లేదు నేనెక్కడికెళ్ళినా, ఏ నెంబరు ప్రయత్నించినా ఆవలి అంచునుండి నాకో కొత్త గొంతు వినిపిస్తుంది: “ఈ నంబరు వాడుకలో లేదు, మీరు డయలుచేసిన నంబరు మరొకసారి సరిచూసుకొండి” అంటూ. నిన్న మొన్నటివరకూ, ఆ నంబరుకొడితే సమాధానమిచ్చిన మనుషులు “అయ్యో, మీరు తెలియకపోవడమేమిటి? ఈ సృష్టిలో అందరికీ చోటుంది” అనేవారు. కానీ ఇప్పుడు ఆ నంబరు పాతబడిపోయింది. ఆ నంబరు వాడుకలో లేదు. ఆ చిరునామాల్లో ఇప్పుడు ఎవరూ మిగలలేదు. ఒకప్పుడు కాలిచప్పుడు…
-
This Night… Nishigandha, Telugu, Indian
Effacing the last trace of cloudlets Darkness congeals. Jasmines of the sky blossom one after another Whether to trade few pleasantries Or to pursue the dreams adrift Deftly sieging the swoons of Cheery butterflies within the bungled hands I must gently introduce him soundlessness… Leaving the shards of memories, The remotest dreams, And the toils…
-
చావూ-బ్రతుకూ .. ఎడిలేడ్ ఏన్ ప్రోక్టర్, అమెరికను
ఫాదర్! జీవితం అంటే ఏమిటి? “అది ఒక పోరాటం, బిడ్డా! అందులో ధృఢమైన కత్తి కూడా పనికిరాకపోవచ్చు, జాగరూకతగల కళ్ళు కూడా మోసపోవచ్చు దిటవైన హృదయమైనా ధైర్యం కోల్పోవచ్చు. అక్కడ అన్నిచోట్లా శత్రువులు చేతులుకలిపి రాత్రీ పగలూ విశ్రమించరు. పాపం అర్భకులైనవాళ్ళు ఎదురునిలిచి భీకరపోరాటం మధ్యలో చిక్కుకుంటారు. ఫాదర్! మృత్యువంటే ఏమిటి? అది విశ్రాంతి, బిడ్డా! బాధలూ, పోరాటాలూ ముగిసేక సాధువూ, శాంతస్వభావుడైన దేవదూత ఇక మనం పోరాడే పనిలేదని ప్రకటిస్తాడు; అతను రాక్షసమూకలని తరిమివేసి,…
-
Flapping of the Wings … Prasuna Ravindran, Telugu, Indian
As I tune up my heart With the silence of the night A Swan flapping its wings Is heard over the pond. Childhood Revisits the lips… Oh, this moment, how sweet it breathes! . Prasuna Ravindran Prasuna Ravindran Prasuna is an engineer by profession and is a resident of Hyderabad, Andhra Pradesh. She is…
-
A Black Love Poem… Afsar, Telugu, Indian
1 Will you agree at least now That there is no invisible love? 2 All that remained between us were some apprehensions And few insults still. And after that Either you shoot me Or I shoot you. 3 No. Faces of people Are not just colourful flora Or green foliage; Neither woods, nor skies Nor…
-
Some Stars and a Few Drops of Tears … Vimala. Telugu, Indian
(The agony and angst of the story can be understood better by the readers if they come to know that the poetess Vimala was once an active revolutionary spending the prime of her youth in forests, married to another revolutionary (but had very little family life with both attending to different assignments) who was later…
-
నల్లమందు చేలలో … జేమ్స్ స్టీఫెన్స్, ఐరిష్ కవి
. పాట్నీ ఓ పిచ్చోడు. వాడు నాతో అంటాడు: ప్రతిరోజూ ఉదయం వాడు చూస్తుంటాడట ఆకాశంలో ఒక దేవదూత విహరించడం; ప్రభాత సూర్యకాంతుల ఆకాశం నుండి దోసిళ్ళకొద్దీ నల్లమందు విత్తనాలను అన్నిదిక్కులా పైరులమీద జల్లుతూ పోతాడట. అని చెప్పి, తర్వాత ఆ దేవదూత సూర్యుడిలో ఎరుపు రంగు కోసం పరిగెడతాడని చెప్పేడు. అరే, నల్లమందు ఒక కలుపు మొక్క అంటాన్నేను; కాదంటాడు వాడు. పొడుగ్గా అందంగా ఉండే ఆ పువ్వుల్ని పైరులమధ్యా, మైదానాలమీదా తోటల్లో దొడ్లల్లో వ్యాప్తిచెయ్యడంలో…
-
ఎవరి ప్రపంచం వాళ్లది… మార్తా గిల్బర్ట్ డికిన్సన్ బియాంచీ అమెరికను
ఒక వేసవి పొద్దు ఉరకలేస్తున్న సెలయేటి ఒడ్డున కొబ్బరాకుల బూరాలు ఊదుకుంటూ ఒక కాలక్షేపరాయుణ్ణి చూసేను అతని ప్రపంచం అంతా హాయిగా ఉల్లాసంగా ఉన్నట్టుంది ప్రతి వంపులోనూ అతని చేష్టల్లో కొంటెతనం కనిపిస్తోంది. . కలలప్రపంచంలో తేలియాడుతున్న ఒక చిత్రకారుణ్ణి చూసేను అతని దేదీప్యమానమైన సృష్టిలోంచి హరివిల్లు ఉదయిస్తోంది కామరూపిలా పలు అవతారాలు ధరిస్తున్న ఆలోచనాస్రవంతిపై దాని సమ్మోహకరమైన పట్టకపు రంగులను ప్రసరిస్తూ . . నేనొక ఉచ్చును చూశాను… మరోలోకాన్ని కప్పుతూ… దానిమీద వేట పక్షులు…
-
పనికిమాలిన వివరాలు… సీ ఫ్రై ససూన్
నాకే గనక బట్టతలై, కోపంతో ఎగశ్వాసవస్తుంటే నేను స్థావరానికి పోయి ఇతర మేజర్లతో కూచుని కుర్రాళ్లని యుద్ధరంగానికి పంపేవ్యూహాలు పన్నేవాణ్ణి. ఉబ్బిన నా ముఖం ఎప్పుడూ చిటపటలాడుతూ కనిపించేది; ఉన్నంతలో ఉత్తమమైన భోజనశాల్లో తిని తాగుతూ, కవాతుల్లో అమరవీరుల చిఠాచదువుతుండే వాడిని: “పాపం, ఉజ్జ్వలమైన భవిష్యత్తు ఉన్న కుర్రాడు!” వీళ్ళనాన్నని నాకు బాగా తెలుసు; నిజమే! ఈ తాజా పోరాటంలో మనం భారీగా నష్టపోయాం,” అనే వాణ్ణి, యుద్ధం ముగిసిన తర్వాత, యువకులందరూ శిలాఫలకాలైనపిదప మా ఇంటికి…
-
పగటిపూట విమానప్రయాణం… జాక్ డేవిస్, ఆస్ట్రేలియను కవి
జెట్ లో కూచుని కళ్ళుమూసుకున్నాను. నాతో పాటే ఒక వినీలాకాశపు తునకనీ, ఒక చారెడు మైలుతుత్తంవంటి సముద్రపు చెలకనీ తీసుకెళ్ళనిస్తుందేమోనని ఎయిర్ హోస్టెస్ ని అడిగేను బాగా దిగువన నా దేశం తళతళలాడుతోంది బక్క చిక్కుతున్న నదుల్తో, లేతనీలి సరస్సులతోనూ; నేను కలగంటూ కోరున్నది నిద్రతోవాలిన తలక్రిందకీ తలగడలా మడుచుకుందికీ, పైన కప్పుకుందికీ ఉత్త ఎర్రటి ఎడారి చౌకాన్ని. . జాక్ డేవిస్, ఆస్ట్రేలియను కవి 11 మార్చి 1917- 17 మార్చి 2000. జాక్ డేవిస్,…