నాకే గనక బట్టతలై, కోపంతో ఎగశ్వాసవస్తుంటే
నేను స్థావరానికి పోయి ఇతర మేజర్లతో కూచుని
కుర్రాళ్లని యుద్ధరంగానికి పంపేవ్యూహాలు పన్నేవాణ్ణి.
ఉబ్బిన నా ముఖం ఎప్పుడూ చిటపటలాడుతూ కనిపించేది;
ఉన్నంతలో ఉత్తమమైన భోజనశాల్లో తిని తాగుతూ,
కవాతుల్లో అమరవీరుల చిఠాచదువుతుండే వాడిని:
“పాపం, ఉజ్జ్వలమైన భవిష్యత్తు ఉన్న కుర్రాడు!”
వీళ్ళనాన్నని నాకు బాగా తెలుసు; నిజమే!
ఈ తాజా పోరాటంలో మనం భారీగా నష్టపోయాం,” అనే వాణ్ణి,
యుద్ధం ముగిసిన తర్వాత, యువకులందరూ శిలాఫలకాలైనపిదప
మా ఇంటికి క్షేమంగా నడుచుకుంటూపోయి,
ప్రశాంతంగా నా పక్కమీద హాయిగా మరణించేవాడిని.
.
సీ ఫ్రై ససూన్
ఆంగ్ల కవి
(8 సెప్టెంబరు 1886 – 1 సెప్టెంబరు 1967)
కవిత చాలా పదునైన వ్యంగ్యంతో కూడుకున్నది. యుద్ధంలో పిరికిపందలు అధికార్లుగానూ, యువకులు సైనికులుగా ఉండడం తరచు జరిగేదే. కొన్ని సందర్భాలలో ఇవి ఇంకా ఎక్కువ నిజం. మొదటి ప్రపంచ సంగ్రామంలో ప్రత్యక్షంగా పాల్గొన్న ‘సీ ఫ్రై ససూన్’ యుద్ధరంగంలో పై అధికారులు అవలంబించే వ్యూహాలపట్ల, వారి పిరికితనం పట్ల చాలా తీవ్రమైన స్వరంతో నిరసన వ్యక్తపరచిన వాడు. అతని కవిత్వం వీటికి బాగా నెలవైంది. అవసరం లేకపోయినా యుద్ధాన్ని కొనసాగించి, దేశానికి భవిష్యత్తైన యువకుల్ని యుద్ధానికి అప్పగించి, పిరికిపందలైన పైఅధికారులు తాము ప్రత్యక్షంగా కదనరంగంలోకి వెళ్ళవలసివచ్చినపుడు సంధిప్రయత్నాలు చేసుకుని ప్రాణాలు నిలబెట్టుకోవడం సర్వసాధారణమే. అలాంటి ఒకానొక మేజర్ గురించి ఈ కవిత.
ఇందులో ససూన్ యుద్ధంపట్ల, చాతకాని సైనికాధికారులపట్ల తన తీవ్రనిరసనని రికార్డు చేశాడు.
.

Image Courtesy: http://www.spartacus.schoolnet.co.uk/Jsassoon.htm
.
Base Details
.
If I were fierce, and bald, and short of breath,
I’d live with scarlet Majors at the Base,
And speed glum heroes up the line to death.
You’d see me with my puffy, petulant face,
Guzzling and gulping in the best hotel,
Reading the Roll of Honour. ‘Poor young chap,’
I’d say — ‘I used to know his father well;
Yes, we’ve lost heavily in this last scrap.’
And when the war is done and youth stone dead,
I’d toddle safely home and die — in bed.
.
Siegfried Loraine Sassoon.
(8 September 1886 – 1 September 1967)
English poet, writer, and soldier
Poem Courtesy: http://wonderingminstrels.blogspot.in/2000/03/base-details-siegfried-sassoon.html
The following makes an interesting read about the poem: http://www.studymode.com/essays/Base-Details-526070.html
స్పందించండి