అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • జూలై 30, 2013

    ఏడం ఫిర్యాదు … డేనిస్ లెవెర్టోవ్, బ్రిటిష్ అమెరికను కవయిత్రి

    కొంతమంది మనుషులకి నువ్వు ఎన్ని ఇవ్వు; చాలదు. ఇంకా కావాలనే అడుగుతుంటారు.   ఉప్పూ పప్పూ పంచభక్ష్య పరమాన్నాలు పెట్టినా ఇంకా ఆకలే అంటారు.   పెళ్ళి చేసుకున్నా పిల్లలని కన్నా ఇంకా దేహీ అంటూనే ఉంటారు   అఖండభూదానం చెయ్యండి వాళ్లకాళ్లకిందభూమినే వాళ్ళకి ఇచ్చెయ్యండి అయినా ఛాలలేదని వీధినపడతారు.        వాళ్ళకి లోతెరుగని నూతిని తవ్వించండి నీళ్ళకి అయినా వాళ్ళకి దాని లోతు చాలదు వాళ్ళు చంద్రుణ్ణికూడా తాగెయ్యాలి. .   డెనిస్ లెవెర్టోవ్ (October…

  • జూలై 29, 2013

    ముత్యపుపడవలో వీనస్… ఏమీ లోవెల్, అమెరికను

    ఒక విషయం చెప్పు నాకు, ముత్యపుచిప్ప పడవలో ముడుతలుపడుతున్న అలలమీద తేలుతూ తీరానికి కొట్టుకొస్తున్న వీనస్ నీకంటే అందంగా ఉందా? ఏమిటి, బోట్టిచెల్లీ* చూపు నాకంటే గొప్పగా అంచనా వెయ్యగలదా? ఆమెపై అతను విసిరిన రంగుపూసిన గులాబి మొగ్గలు వెండిజరీ ముసుగులో నీ అపూర్వ సౌందర్యం దాచడానికి నీపై వెదజల్లుతున్న నా అక్షర సుమాలకంటే విలువైనవా? నా మట్టుకు నువ్వు వినీలాకాశంలో తేలియాడుతూ వెలుగులవడ్డాణం ధరించి కిరణాలమీద చిద్విలాసంగా నడవడానికి సన్నద్ధంగా ఉన్నావు. నీకు ముందు పరిగెత్తుతున్న…

  • జూలై 28, 2013

    Evening Perfumes… Ismail, Telugu, Indian

    She daubs Evening perfumes For my sake every eve. The scent of thin shadows Creeps under her chin and ears.  The aroma of a Steady standing rain Over a Casuarina plantation On the sea-shore Flares in her tresses. A whiff of the caves The sun-lion sleeps at night Sweeps over her body. And in her…

  • జూలై 27, 2013

    ఒక మెట్రో స్టేషనులో… ఎజ్రా పౌండ్, అమెరికను

    జన సమూహంలో ఈ వదనాల దివ్య సందర్శనం… తడిసిన గుబురుపొదలలో కవటాకుల సౌందర్యం.  . ఎజ్రా పౌండ్  (30 October 1885 – 1 November 1972) అమెరికను ఈ కవిత చిన్నదే గాని, దీని వెనక పెద్ద కథ ఉంది. ఎజ్రాపౌండ్… కవిత్వానుభవం.   ఒక రోజు పారిస్ లో “Concorde” మెట్రో స్టేషన్ లోంచి బయటకి వస్తూ  ఎజ్రా పౌండ్ ఒక అందమైన ముఖాన్ని చూశాడు. తర్వాత మరొకటి, మరొకటి, ఇంకొకటి చూశాడు. ఆ తర్వాత ఒక…

  • జూలై 26, 2013

    ప్రాసకవి … ఏంబ్రోజ్ బియర్స్, అమెరికను

    నిర్లక్ష్యంచెయ్యబడ్డ తన కవితార్తిని తీర్చుకుందికి ఉద్యమిస్తాడు ప్రాసకవి; ధ్వని నీరసిస్తుంది, అర్థం అంతరిస్తుంది; పెంపుడుకుక్క, తూర్పునుండి పడమర వరకూ అతనిగుండెలో మండుతున్న భావోద్రేకాల్ని ప్రకటిస్తుంది. మనోహరమైన ఆ ప్రదేశంలో ఉదయిస్తున్న చంద్రుడు వినడానికి క్షణం ఆగి, అర్థంచేసుకుందికి తపిస్తుంటాడు. . ఏంబ్రోజ్ బియర్స్ ( June 24, 1842; after December 26, 1913) అమెరికను. . . Rimer   The rimer quenches his unheeded fires, The sound surceases and the sense…

  • జూలై 25, 2013

    మూడు ఉద్యమాలు… WB యేట్స్. ఐరిష్ కవి

    షేక్స్పియరు కాలం నాటి చేప తీరానికి బహుదూరంగా, సముద్రంలో ఈదింది; కాల్పనికోద్యమం చేతికి అందుబాటులో వలల మధ్య ఈదింది. ఆ ఒడ్డున ఇసకలో గిజగిజకొట్టుకుంటున్న చేపలు అవేమిటి? . WB యేట్స్. 13 June 1865 – 28 January 1939 ఐరిష్ కవి . . Three Movements Shakespearean fish swam the sea, far away from land; Romantic fish swam in nets coming to the hand; What…

  • జూలై 24, 2013

    ఉమర్ ఖయ్యాం రుబాయీలు

    . ఓహో, జ్ఞానుల్ని చర్చించుకోనీ! రా, ఈ ముసలి ఖయ్యాం తోడుగా నడు; ఒకటి మాత్రం నిజం- పరిగెడుతుంది జీవితం మిగతావన్నీ అబద్ధమైనా ఈ ఒక్కటి మాత్రం నిజం: ఒకసారి విరిసిన కుసుమం, రాలిపోవడం తథ్యం..   వయసులో ఉన్నప్పుడు తరచు సేవించేవాడిని పండితులనీ, యోగులనీ ; ఇదీ, అదీ, ప్రతి విషయాన్నీ చాలా కూలంకషంగా తర్కించేవాళ్ళు; ఎన్నిసార్లు వెళ్ళినగానీ  నాకేం లాభించలేదు. వెళ్ళినద్వారంలోంచే తిరిగొచ్చేవాడిని   వాళ్లలో జ్ఞాన బీజాలని అక్షరాలా నాటేను; కష్టపడి చేజేతులా…

  • జూలై 23, 2013

    ఒక సిగరెట్టు… ఎడ్విన్ జార్జి మోర్గన్, స్కాటిష్ కవి.

    నువ్వులేకుండా పొగరాదు, నా అగ్నిశిఖా! నువ్వు నిష్క్రమించిన తర్వాత  నా ఏష్ ట్రేలో నీ సిగరెట్టు వెలుగుతూ, ప్రశాంతంగా. సన్నని పొడవాటి బూడిదరంగు పొగ వదులుతోంది.  పొగతాగని నా ఏష్ ట్రేలో నీ సిగరెట్టు…. ప్రేమకి అంత గొప్ప ‘ప్రతీకగా’ నిలిచిన దాన్ని ఎవరు నమ్ముతారా అన్న ఆలోచనతో నాకు నవ్వొచ్చింది. ఆ చివరి మెలిక వణుకుతూ మీదకి ఎగయగానే అకస్మాత్తుగా ఒక గాలి రివట దాన్ని నాముఖం మీదకి కొట్టింది.  అది సుగంధమా? అది అనుభవమా?…

  • జూలై 22, 2013

    ఐదు హైకూలు … పాల్ ఎలూర్ , ఫ్రెంచి కవి

    గాలి ఎటూ తేల్చుకో లేక సిగరెట్టుపొగలా వీస్తోంది  ఆ మూగ పిల్ల మాటాడుతోంది: ఆ భాషలోకి చొరలేకపోవడమే కళకున్న కళంకం. మోటారుకారు ఆవిష్కరించబడింది : నలుగురి వీరుల తలలు దాని చక్రాలక్రింద దొర్లిపోయాయి. ఆహ్! వేనవేల జ్వాలలు, ఒక మంట, వెలుగూ- నీడా, సూర్యుడు  నన్ను వెంబడిస్తున్నాడు. తురాయి కిరీటం బరువుని తేలిక చేస్తుంది. చిమ్నీ పొగ వదుల్తోంది.  . పాల్ ఎలూర్ (14 December 1895 – 26 November 1952) ఫ్రెంచి కవి. హైకూలలో…

  • జూలై 21, 2013

    వికలాంగసైనికుడు… ఆలివర్ గోల్డ్ స్మిత్ , ఇంగ్లీషు కవి

    “ప్రపంచంలో సగంమందికి మిగతా సగంమందీ ఎలా బ్రతుకుతున్నారో తెలీదు”… అన్నంత అతి సాధారణమూ, యదార్థమైన పరిశీలన మరొకటి ఉండదేమో. గొప్పవాళ్ళ ఆపదలూ, కష్టాలూ మన ఆలోచనలను ప్రభావితం చేసేలా మనకి చెప్పబడుతుంటాయి; అవి ఉపన్యాసాలలోలా కాస్త అతిశయోక్తులతో కూడుకుని ఉంటాయికూడా; ‘అయ్యో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో(పడ్డారో) చూడం’డని ప్రపంచం దృష్టికి తీసుకెళతారు; బాధలవల్ల కలిగే ఒత్తిడిలో ఉన్న గొప్పవాళ్లకి వాళ్ళ బాధలు చూసి మిగతా వాళ్ళు జాలిపడుతున్నారు అన్న ఎరుక ఉంటూనే ఉంటుంది; వాళ్ళ ప్రవర్తన ఏకకాలంలో…

←మునుపటి పుట
1 … 178 179 180 181 182 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు