-
వనకన్య… హిల్డా డూ లిటిల్, అమెరికను కవయిత్రి
Image Courtesy: http://bobsbaitandtackle.com/tag/cut-mullet/ సుడిలేచి ఎగసిపడు సంద్రమా! నీ సూదంచు కొమ్మలను నిలువెత్తు ఎగయనీ. ఎగసిలేచిన నీ దేవదారువుల నా బండరాళ్ళపై భంగపడనీ; నీ హరిత వర్ణాన్ని మామీద చిలికించి నీ పచ్చనాకుల పెనవేయవమ్మా. . హిల్డా డూలిటిల్ September 10, 1886 – September 27, 1961 అమెరికను కవయిత్రి HDగా ప్రఖ్యాతి వహించిన హిల్డా డూలిటిల్, 20 వ శతాబ్దం ప్రథమార్థంలో కవిత్వంలో బాగా వ్యాప్తిలో ఉన్న ఇమేజిజం ఉద్యమమానికి మారుపేరుగా నిలిచిన కవులలో…
-
చీకటిలో నామస్మరణ … డొరతీ పార్కర్, అమెరికను
కొందరు మగాళ్లు, అవును మగాళ్ళు ఒక పుస్తకాలషాపును దాటి రాలేరు. (తల్లీ! ఇప్పుడే నిశ్చయించుకో, జీవితకాలం ఎదురుచూడడానికి) కొందరు మగాళ్ళు, అవును మగాళ్ళే ఆ దిక్కుమాలిన ఆట ఆడకుండా ఉండలేరు. (ఏదీ, చీకటిపడేలోగా రానూ అన్నాడు, తేదీ మారిపోయింది) కొందరు మగాళ్ళు, మ..గా..ళ్ళు మధుశాలను దాటి రాలేరు. (నిరీక్షించు, ప్రాధేయపడు, వాళ్లతత్త్వం మారదు.) కొందరు పురుషులు, మహా పురుషులు ఏ ఆడదాన్నైనా చూడకుండా ఉండలేరు. (భగవంతుడా! నాకు అటువంటివాణ్ణి భర్తగా చేయకు) …
-
All Lovely Things … Conrad Aiken, American
అందమైన వస్తువులన్నిటికీ ఓ ముగింపు ఉంటుంది ఎంత సుకుమారమైన వస్తువైనా ఓ రోజు వాడి, రాలిపోతుంది ఈ రోజు అంత ధైర్యంగా ఖర్చుపెడుతున్న యువత, రేపు ఒక్కొక్క పెన్నీని అడుక్కోవలసి వస్తుంది. ఎంత అద్భుత సౌందర్యరాశులనైనా మరిచిపోతారు ఎంత రారాజులైనా మరణించి మట్టిలో కలవాల్సిందే. ఇంత మిసమిసలాడే శరీరమూ,పువ్వులూ,మురిగిపోవలసిందే ఎంత మేధావి శిరసైనా సాలీడు గూడుకి నెలవుకావలసిందే. ఒక్క సారి తిరిగా యవ్వనమా! ఓ ప్రియతమా, ఒక్కసారి! కాలం ఏమాత్రం పట్టించుకోకుండా సాగిపోతుంటుంది ఆశగా…
-
ఎవరికి వర్తిస్తే వారికి… ఏడ్రియన్ మిచెల్, ఇంగ్లీషు కవి
. Hear the poem in poet’s voice: To Whom It May Concern . ఒకరోజు సత్యం నన్ను తొక్కుకుంటూ నా మీంచి వెళ్ళిపోయింది ఆ ప్రమాదం జరిగిన దగ్గరనుండి ఇలా కుంటుతున్నాను. నా కాళ్ళకి ప్లాస్టర్ వెయ్యండి వియత్నాం గురించి అబద్ధాలు చెప్పండి. అలారం గంట బాధతో మూలగడం వినిపించింది నాకు నేను కనిపించక మళ్ళీ తిరిగి పడుక్కున్నాను. నా చెవుల్లో సీసం పొయ్యండి. కాళ్ళకి ప్లాస్టర్ వెయ్యండి. వియత్నాం…
-
బంగారం అయిన ప్రతీదీ మెరవదు… JRR టొల్కియన్, ఇంగ్లిష్ కవి
. బంగారం అయిన ప్రతీదీ మెరవదు. దేశాలు తిరుగుతున్నవాళ్లంతా దారితప్పినవాళ్లు కారు చేవ ఉన్నది పాతదయినా శిధిలమైపోదు. అంతరాంతరాల్లోని వేళ్లని గడ్డమంచు చేరుకోలేదు నివురులోంచే నిప్పు రాజుకుంటుంది నీడల్లోంచే వెలుగు ఒక్కసారి తలెత్తుతుంది; విరిగిపోయిన కత్తే, మళ్ళీ అతుక్కుంటుంది, కిరీటం లేనివాడే ఒక రోజు రాజవుతాడు. . JRR టొల్కియన్ 3 January 1892 – 2 September 1973 ఇంగ్లీషు రచయిత . Lord of the Rings పుస్తకం THE FELLOWSHIP OF…
-
సన్నిహితులు … D.H. లారెన్సు, ఇంగ్లీషు కవి.
నా ప్రేమంటే నీకు ఏమాత్రం లక్ష్యం లేదా? అని అడిగిందామె నిష్టూరంగా. ఆమె చేతికి అద్దాన్ని అందిస్తూ అన్నాను: ఈ ప్రశ్నని అడగవలసినవాళ్ళని అడుగు! నీ విజ్ఞాపనలని కేంద్ర కార్యాలయానికే పంపు! భావావేశ ప్రాధాన్యత ఉన్న విషయాలలో మీరు నేరుగా అత్యున్నత అధికారినే సంప్రదించవలెను… అని చెప్పి అద్దాన్ని చేతికి అందించేను. దాన్ని నాబుర్రకేసి పగలగొట్టి ఉండేదే, కాని అంతలో తన ప్రతిబింబాన్ని చూడ్డం తటస్థించింది. అది, రెండు సెకెన్లపాటు ఆమెని మంత్రముగ్ధురాలిని చేసింది. ఆ సమయంలో…
-
In The End… Vazir Rahman, Telugu, Indian
. Nothing remains in the end! Even the dreadful snake… that herald of death Dissolves like a scrawl on water. Some wild plant peeps out with passion Breaking through the grave Sapping the essence of the bod Only to wither away soon. Some small dirty cranial bone remains Wallowing in sun and dust… Rejected even…
-
ప్రతిఘటన … రషీద్ హుస్సేన్, పాలస్తీనా కవి.
నా దేశపు ఏ యోధుడూ ఒక చిన్న వరికంకుకైనా హాని చెయ్యడానికి నేను వ్యతిరేకం పిల్లలు… ఏ పిల్లలైనా సరే, తుపాకులు ధరించవలసిరావడానికి నేను వ్యతిరేకం నా చెల్లెలు సాయుధ కవాతు చెయ్యడానికి నేను వ్యతిరేకం ఆ మాటకొస్తే, నేను నీ అభీష్టాలకి వ్యతిరేకం… కానీ, వాళ్ల కళ్ళముందే నిరాఘాటంగా మనుషులప్రాణాలు పోతుంటే ఎంత స్థిత ప్రజ్ఞులైనా ఏమిచెయ్యగలరు? పదేళ్ళకే పిల్లలు వీరమరణం చెందడానికి నేను వ్యతిరేకం ప్రతిచెట్టూ పళ్ళకి బలు, తూటాలు కాయడానికి వ్యతిరేకం నా…
-
అన్వేషణ … గెమాలియల్ బ్రాడ్ ఫోర్డ్, అమెరికను
నేనొక పరమ పాపిని; కానీ నాకు ఋషిత్వం అంటే ఏమిటో తెలుసు అలసి వంగిన వాళ్ళ మోకాళ్ళూ, చిన్నా పెద్దా అపరాధాలూ, వేనవేల సూదులు గుచ్చుతున్నట్లు అంతులేని పశ్చాత్తాపాలూ, చిత్తంతో చేసిన పాపాలకి, జీవితాంతం నిజంగా చెల్లించే ప్రాయశ్చిత్తాలూ. . నాకు అన్నిదిక్కులా తిరగాలనుంటుంది, కాని నాకు జైలు అంటే తెలుసు, చెప్పుకోడానికెవరూ ఉండరు కాబట్టి, అలా రుద్రాక్షలకు చెప్పుకోడమే రాగరంజితమైన ఈ శరీరం, దాని చిత్రవిచిత్రమైన చమత్కారాలూ కళ్ళుమిరిమిట్లుగొలిపే శిలువ యశస్సుముందు చులకనచెయ్యడమే. . ఒకరితరఫున నేను వకాల్తా…
-
కవికావడం ఎలా… ఈవ్ మెరియం, అమెరికను.
ఒక చెట్టునుండి ఆకు తీసుకో దాని ఆకారం యథా తథంగా అనురేఖనం చెయ్యి దాని అంచులూ లోపలి గీతలూ రెమ్మకి ఎలా అతుక్కుని ఉందో జ్ఞాపకం పెట్టుకో (అలాగే, కొమ్మకి ఈ రెమ్మ ఎలా వాలి ఉందో కూడా) అది ఎలా ఏప్రిల్ లో చిగురిస్తుందో అదే జులై ఆగష్టు నెలాఖరు వచ్చేసరికి ఎంత సర్వాంగసుందరంగా ఉంటుందో. దాన్ని నీ చేతిలో నలిపి చూడు అప్పుడు గ్రీష్మాంతవేళ దాని విషాదాన్ని వాసనచూడొచ్చు; దాని కాండాన్ని నమిలి చూడు…