అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • ఆగస్ట్ 29, 2013

    Comity of Notes …Elanaaga, Telugu, Indian

    Hot footing over sand dunes with whispers A hum breezes into the heart. Holding by the little finger it transports you Thousands of miles hence with her rhythm. It feasts ears Lading winds with perfumes, And paints the innards of the heart with An exotic amalgam of past lives and ancient glories. Enraptured by the…

  • ఆగస్ట్ 28, 2013

    Apartheid … Bolloju Baba, Telugu, Indian

    “Teacher! Can I give the bouquet to the Chief Guest?” “No. You can’t. We have already selected someone else.” And soon she realized the difference between Her and that ‘someone else’ … her tan. Emptying tears and blood into the gorges of history It plays chiaroscuro on the path of life… She wanted to cry…

  • ఆగస్ట్ 27, 2013

    పెంపుడు పిల్లి… నజీర్ కదొక్కడ్, మలయాళం, ఇండియన్

    కుర్చీలో చేరబడి నేను ఏదో చదువుకుంటుంటే నే నక్కడ ఉన్నానన్న ధ్యాస పిసరంతకూడా లేకుండా మా పెంపుడు పిల్లి కుర్చీ కాలుమీద ఏదో గియ్యడం ప్రారంభించింది.   నేనో తన్ను తన్న గానే అక్కడనించి వెళ్ళిపోయింది సగదూరం వెళ్లి నావంక తీక్ష్ణంగా ఓ చూపు చూసింది అందులో ఓ బెదిరింపు: “పంది వెధవా! మరీ అంత తెలివొద్దు” అన్నట్టు    చక్కని దస్తూరీతో రాసింది ఆ కుర్చీ కర్ర కాలు మీద “ఓరే మూర్ఖుడా! నీ దిక్కున్నచోటచెప్పుకో!”   …

  • ఆగస్ట్ 26, 2013

    ఏకాంత మైదానాల మీదా,రెల్లుపొదల సరస్సులమీదా… విలియం షెన్ స్టోన్, ఇంగ్లీషు కవి

    ఎక్కడా ఒక చెట్టుగాని, గోపురముగాని, కుటీరంగాని కనరాని ఏకాంత మైదానాల మీదా, రెల్లుపొదల సరస్సులమీదా… ఎండిన పచ్చికబయళ్ళమీదా కలయ తిరిగాను నా ప్రేయసిని కలుసుకుందికి… ఒకవేళ నా దారిపొడుగునా చక్కని అపురూపమైన అందాలు పరుచుకున్నా నా ఆలోచనలు నా చూపుకంటే ముందుగానే పరుగుతీస్తాయి… ఆమెపై లగ్నమౌతూ. దేవదారువృక్షకిరీటాలుగల పర్వతాగ్రాలుగాని సొగసైన సువిశాల రాజప్రాసాదాలు గాని చివికి మట్టిపాలౌతున్న చక్రవర్తులు నిద్రించే పిరమిడ్ ల కొనలుగాని నన్ను సంతోషపెట్టవు. తూర్పుదేశాల మహరాజుల ఉత్సవప్రభలు నా ముందునుండే నడచిపోవునుగాక, నా…

  • ఆగస్ట్ 25, 2013

    నెఱి చూపులు … సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి

    మొదటిసారి నువ్వు నన్ను వసంతకాలంలో కలిసేవు. నిన్ను తొలిసారి చూసినప్పుడు అప్పుడే సముద్రాన్ని చూసినట్టనిపించింది.   గాలికి ఊగుతున్న ఆ పూతీగకి తొలిచివురులు తొడగడం ఏటా పరిశీలిస్తూ   అప్పుడే నాలుగు వసంతాలు గడిచేయి మనిద్దరం సహజీవనం సాగిస్తూ. ఐనప్పటికీ, నన్ను చుట్టుముట్టే  నీ కళ్లలోకి నేనెప్పుడు చూసినా అప్పుడే మొట్ట మొదటిసారి సముద్రాన్ని చూస్తున్న భావన కలుగుతుంది నాకు.  . సారా టీజ్డేల్ అమెరికను . English: Filsinger, Sara Teasdale, Mrs., portrait photograph. (Photo credit:…

  • ఆగస్ట్ 24, 2013

    రెండవ పెళ్ళి … సామ్యూల్ బిషప్, ఇంగ్లండు

    “ఇదిగో, మేరీ, ఈ ఉంగరం సాక్షిగా నిన్ను వివాహం చేసుకుంటున్నాను,”… అని పధ్నాలుగేళ్ళ క్రిందట అన్నాను. కనుక మరో ఉంగరం కోసం ఎదురుచూడు.   “దేనికి?” “ఇంక దేనికి? నిన్ను మళ్ళీ పెళ్ళిచేసుకుందికి. ఏం కూడదా? ఆ ఉంగరం తొడిగి నీ యవ్వనాన్నీ, నీ అందచందాల్నీ, అమాయకత్వాన్నీ, నిజాయితీనీ పెళ్ళిచేసుకున్నాను ఆనాడు. ఎంతకాలం నుంచో  అభిరుచుల్ని అభినందిస్తూ  తెలివితేటలని సమ్మానిస్తూ వచ్చేను ఒకపక్క నా తెలివితక్కువలు బైటపడుతున్నా.    నేను ఊహించిన దానికంటే రెండురెట్లు  యోగ్యతగలస్త్రీగా నువ్వు…

  • ఆగస్ట్ 23, 2013

    ఆమెని సరిదిద్దడం వృధాప్రయాస… జార్జి స్మోలెట్, స్కాటిష్ కవి .

    ఆమె మనసు మార్చడం … వృధా ప్రయాస అది వర్షంలో చినుకులు లెక్కెట్టడం లాంటిది ఆఫ్రికా ఊసరక్షేత్రాల్లో నారుపొయ్యడం లాంటిది తుఫానుల్ని నిరోధించాలని శ్రమపడడం లాంటిది. మిత్రమా! నాకు తెలుసు : ఆమె గాలికంటే తేలిక బోయవాడి వలకంటే కళాత్మకమైన ఉచ్చు; వీచే గాలికంటే నిలకడలేనిది;హేమంతపు నీరవ మంచు మైదానాలంత దయమాలినది. ఆమె చాలా లోభి, ఆఖరికి ప్రేమలో కూడా; ఆమె కన్నులగెలుపులో తమభవిష్యత్తుకై వందలమంది వీరులు ఆతృతగా ఎదురుచూస్తున్నా ప్రేమలోని ఆనందమెవరితోనూ పంచుకోదు,ప్రకటించదు; అటువంటి లజ్జాకరమైన…

  • ఆగస్ట్ 22, 2013

    ఆమె అంత అందంగా కనపడదు…హార్ట్లీ కోలెరిడ్జ్,ఇంగ్లీషు కవి

    చాలామంది కన్నెపిల్లల్లాగే చూడ్డానికి ఆమె అంత అందంగా కనపడదు; ఆమె నన్ను చూసి చిరునవ్వు నవ్వేదాకా ఆమె అంత మనోహరంగా ఉంటుందని అనుకోలేదు; ఓహ్! అప్పుడు గమనించాను ఆ కళ్ళ మెరుగు ప్రేమతో ఉప్పొంగుతూ, వెలుగులు విరజిమ్ముతూ.  ఇప్పుడా చూపులు బిడియంతో నిర్లిప్తంగా ఉన్నాయి నా చూపులకి బదులివ్వడం లేదు; అయితేనేం? నేను చూడ్డం మానను ఆమె కళ్ళలోని వెలుగుల్ని; తక్కిన కన్నియల చిరునవ్వుల కంటే చిట్లించుకున్నా, ఆమె ముఖమే మెరుగు. . హార్ట్లీ కోలెరిడ్జ్ (19…

  • ఆగస్ట్ 21, 2013

    ప్రేమ సారూప్యత… జార్జి డర్లీ, ఐరిష్ కవి

    ఆ గులాబిరెమ్మని చూడు! పడమటి గాలి ప్రేమాతిశయంతో చుంబించబోతే తన చెక్కిలి పక్కకి తిప్పుకుంటోంది; కాని ఒక క్షణం గాలి ఆగితే మళ్ళీ అటే తిరిగిచూస్తూ తను చెంతనే ఉండాలని లాలనగా చూస్తోంది. మరులుకొన్న యువకుడు దరిచేరబోతే బిడియపడుతున్న కన్నియలా లేదూ ఆ గులాబి? బిడియపడుతూనే, తనూలతని విదిలించుకుంటూ తన అనురాగాన్ని తెలియపరుస్తూ ఉంది. ఒకవంక అతని అనునయాన్ని ఆశిస్తూనే మరొకవంక అతను హద్దుమీరకుండా వారిస్తోంది. . జార్జి డర్లీ (1795–1846) ఐరిష్ కవి, నవలా కారుడు,…

  • ఆగస్ట్ 20, 2013

    కాలిమడమ… విష్ణు ప్రసాద్, మలయాళం, ఇండియన్

    సరిగ్గా నా కాలిమడమలో మేకు దిగిపోయిన నాడే ఆమె మా యింటికి వచ్చింది. “మనం అలా కలిసి తిరిగొద్దామా, ఎక్కడైనా కాస్సేపు కూచుని కాలక్షేపానికి ఏదో నములుతూ కూచుందామా” అంది. ఆమె పట్ల ప్రేమతో తలమునకలై ఉన్నానేమో ఆమె అడగడమే ఆలస్యం, నా నొప్పి ఊసు ఎత్తకుండా వెంటనే బయలుదేరాను. కుంటుకుని కుంటుకుని కాసేపూ, సాగదీసుకుని నడుస్తూ కాసేపూ అలా సముద్రతీరం వెంట ఆమె పక్కనే నడిచాను. ఆమె నన్ను తనతోపాటు సముద్రం నీళ్ళలోకి పరిగెత్తి లాక్కెళుతుందని…

←మునుపటి పుట
1 … 175 176 177 178 179 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు