-
After bidding Adieu…Afsar, Telugu, Indian
She walks silently across the bridge… As if she has caressed a flower with her delicate hands; Or, has feathered a branch along her rosy cheeks… The bridge whelms in Spring Himself becoming a flower And a greenish sprig… After she crosses the bridge over She looks back for a brief moment And then swiftly…
-
మనసులో శిశిరం… HW లాంగ్ ఫెలో, అమెరికను
ఇది శిశిరం; బయట ప్రకృతిలో కాదు, నా మనసులోనే ఉన్నది…ఈ అచేతన. యవ్వనం, వసంతమూ నన్నుఆవరించి ఉన్నా ఇక్కడ వయసు మీరినది కేవలం నేనొక్కడినే. . పక్షులు గాలిలో రివ్వునదూసుకుపోతున్నాయి, పాడుకుంటూ, విరామంలేక గూడుకట్టుకుంటూ; నలుదిక్కులా జీవం సందడిస్తోంది ఒక్క నా మనసులో తప్ప. . అంతా నిశ్శబ్దం; ముదురాకులు గలగలా రాలి కదలకుండా పడున్నై; ధాన్యం నూరుస్తున్న చప్పుళ్ళు వినరావు మిల్లు కూడా మూగపోయింది. . HW లాంగ్ ఫెలో (February 27,…
-
విచికిత్స .. డొరతీ పార్కర్, అమెరికను కవయిత్రి
నేనే మెత్తనిదాన్నై ఉండి, అందంగా ఉండి నా మనసు నీ పాదాలముందు పరిచితే; నా మనసులోని ఆలోచనలన్నీ నీతో చెప్పుకుని నువ్వు తేలికగా చెప్పే అబద్ధాలన్నీ నిజమని పొగిడితే; “నిజం సుమీ” అని నెమ్మదిగా మనసులోనే అనుకుని “ప్రియా! ఎంత నిజం చెప్పావు,” అని పదేపదే చెపుతూ; సందర్భానికి తగ్గట్టు కళ్ళువాల్చుకుని నీ నొసలుచిట్లింపులకు ముఖంపాలిపోయేలా భయపడుతూ, నా మాటల్లో నిన్నెక్కడా ప్రశ్నించనంతవరకు ప్రియతమా, అప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తావు. అదే నేను బలహీనురాల్నై, పిచ్చి…
-
తుదీ- మొదలూ … జిష్వావా షింబోర్స్కా, పోలిష్ కవయిత్రి
యుద్ధం ముగిసిన ప్రతిసారీ ఎవడో ఒకడు అంతాశుభ్రం చెయ్యాలి. విషయాలు వాటంతట అవి చక్కబడవుకదా. శవాలతో నిండిన బళ్ళు ముందుకు నడవాలంటే, ఎవరో ఒకరు రోడ్డుమీదున్న చెత్తను రోడ్డుపక్కకి ఊడ్చిపోయాలి. ఎవడో ఒకడు కూరుకుపోవాలి … చెత్తా, బుగ్గీలో, సోఫా స్ప్రింగుల్లో, పగిలినగాజుముక్కల్లో రక్తాలుచిమ్మిన గుడ్డపీలికల్లో… గోడకూలిపోకుండా ఒకడు పొడవాటి దూలం పూటు పెట్టాలి ఊడిపోయిన తలుపు తిరిగి తగిలించి కిటికీ అద్దాలు పగిలినవి తీసి కొత్తవి వెయ్యాలి. చూడటానికి అంతగొప్పగా ఏం ఉండదు, చాలా ఏళ్ళుపడుతుంది…
-
I teach a lesson… Raghavareddy Ramireddy, Telugu, Indian
బ్లాగు మిత్రులందరికీ దసరా శుభాకాంక్షలు Yes, I teach a lesson. Oh! I am not a greenhorn. I have been teaching for ten years. True! Let me admit it. There was audacity and rebellion in what I teach. The student aspires to become an engineer or a doctor or some such thing, But shouldn’t he become…
-
Who carks for the creed of lords of music? … Samala Sadasiva, Telugu Indian
This was an anecdote recounted by KD Dikshit, who worked in AIR before partition days; an anecdote that opens up the eyes of people who assume the mantle of great singers doing some diploma or degree from some music college; an anecdote that demonstrates only those that devoutly practice music … like tapas… can catch…
-
నువ్వు వచ్చిన ఆ రోజు… లిజెట్ వుడ్ వర్త్ రీజ్, అమెరికను కవయిత్రి
దైవం నిన్నిక్కడకు పంపిన ఆ రోజు చుట్టూ సుగంధపరిమళాలు వ్యాపించాయి నాకు అర్థమైంది లవండరు పూసిందని ఋతుచక్రం సగం తిరిగిందనీ. అలవాటుగా వడిగాలిలు వీస్తున్నాయి ఓడలు సముద్రం మీదకి పయనిస్తున్నాయి; రోజు ముగిసేలోగా నాకు అవగతమైంది నేను ఎదురుచూసినరోజు రానే వచ్చిందని. కొన్ని పాటలు ముగిసిన తర్వాత ఒక రాగం పచ్చికలో, పొదరిళ్ళలో తూగాడినట్టు ఇప్పుడు ప్రతి ఋతువులోనూ ఎంతోకొంత వసంతఛాయలు కనిపిస్తూనే ఉన్నాయి. సంవత్సరం, కొత్తలో మొక్కలకి మొగ్గలు తొడిగితే వీడ్కోలుపలికినపుడు ఆకులు రాల్చి మోడులను…
-
Festival of Rain … Tummala Devarao, Telugu, Indian
On the bare barren lands… On the expanse of green rice corns, Over the roofs of the thatched hovels And upon temples and glazing marble mansions Comes down heavily the rain in streams and currents and torrents . Rain is a demonstration of equality principle A shuttle of water wool Stitching the earth and heaven…
-
Pisan Cantos… LXXXI… Ezra Pound, American Poet
నువ్వు దేన్ని బాగా ఇష్టపడతావో అదే నీతో నిలిచేది, మిగతాది అంతా రద్దే; నువ్వు దేన్ని గాఢంగా ప్రేమిస్తావో దాన్ని నీనుండి ఎవరూ లాక్కో లేరు; నువ్వు దేన్ని అమితంగా కాంక్షిస్తావో, అదే నీ నిజమైన వారసత్వం. ఈ ప్రపంచం ఎవరిది? నాదా? వాళ్ళదా? ఎవరిదీ కాదా? మొదటగా తెలిసేది దృశ్యమాన జగత్తు, తర్వాతే అనుభూతిమయ నందనవనాలు అవెంత నరకంలో ఉన్నా. నువ్వు దేన్ని అమితంగా కాంక్షిస్తావో, అదే నీ నిజమైన వారసత్వం. నువ్వు దేన్ని గాఢంగా…
-
Poem with a Tail… ఓర్హాన్ వేలీ కణిక్, టర్కీ కవి
మనిద్దరం కలిసి ఉండలేం. మనిద్దరిదీ చెరోదారి. నువ్వు కసాయి బంటువి, నేను ఏ దిక్కులేని అనాధని. నువ్వు పళ్ళెంలో భోంచేస్తావు నేను బితుకు బితుకు మంటూ బతుకుతాను. నువ్వు ప్రేమ గురించి కలలు కంటుంటావు, నేను రాత్రి భోజనం ఎలాగా అని ఆలోచిస్తుంటాను. కానీ, మిత్రమా, నీదీ అంత సుఖమైన జీవితం కాదులే. నిజం. ప్రతి సారీ, ప్రతి దిక్కుమాలిన రోజూ తోక ఊపుకుంటూ నిలబడ్డం అంత సులువేమీ కాదు. . ఓర్హాన్ వేలీ…