-
నిర్బంధించబడిన ఆత్మ … వాల్ట్ విట్మన్, అమెరికను కవి
చివరకి, తేలిపోతూ కోటలా సురక్షితమైన ఈ ఇంటిగోడల మధ్యనుండీ దగ్గరా మూసిన తలుపులనుండీ, పకడ్బందీగా వేసిన తాళాలనుండీ నన్ను ఎగిరిపోనీ… నన్ను చప్పుడు చెయ్యకుండా జారుకోనీ… సుతి మెత్తని గుసగుసలతో తాళాలు తీసుకుంటూ … ఓ నా జీవమా! ద్వారాలు తెరుచుకోనీ. ఓహో, నెమ్మదిగా! అంత అసహనం కూడదు.. ఎంత బిగువైనది నీ పట్టు, నశ్వరమైన శరీరమా! ఎంత బలీయము…
-
చిరుగాలి… రాబర్ట్ లూయీ స్టీవెన్సన్, స్కాటిష్ కవి
రోజల్లా వీచే ఓ చిరుగాలీ! బిగ్గరగా ఆలపించు చిరుగాలీ! గాలిపటాలు మీదకి ఎగరెయ్యడం చూశాను ఆకాశంలోకి పక్షుల్ని ఎగరేసుకుపోవడం చూశాను నా చుట్టూ నువ్వు వీస్తున్న చప్పుడు విన్నాను… ఆడవాళ్ళ పరికిణీలు గడ్డిమీద చప్పుడు చేసినట్టు. రోజల్లా వీచే ఓ చిరుగాలీ! బిగ్గరగా ఆలపించు చిరుగాలీ! నువ్వు చేసే చాలా పనులు చూశాను కానీ ఎప్పుడూ నిన్ను నువ్వు దాచేసుకుంటావు నువ్వు నన్ను తొయ్యడం తెలుస్తోంది, నీ పిలుపూ వినిపిస్తోంది కానీ నాకంటికి నువ్వు ఏమాత్రం కనిపించడం…
-
ఒంటిగంట దాటింది… వ్లాడిమిర్ మయకోవ్ స్కీ, రష్యన్ కవి.
రాత్రి ఒంటిగంట దాటింది. నువ్వు ఈపాటికి నిద్రకి ఉపక్రమించి ఉంటావు. పాలపుంత రాత్రి పొడవునా వెండివెలుగులు విరజిమ్ముతూనే ఉంది. నా కేమీ తొందరలేదు; మెరుపుల తంతివార్తలు పంపి నిన్ను మేలుకొలిపి ఇబ్బందిపెట్టడానికి తగిన కారణం కనిపించదు. ఇంతకీ, అదెవరో చెప్పినట్టు, ఆ విషయం ముగిసిపోయింది. నిత్యనైమిత్తికాల రాపిడికి ప్రేమ పడవ పగిలిపోయింది. ఇప్పుడు నీకూ నాకూ చెల్లు. ఇంకెందుకు వివాదం దుఃఖాలూ, విచారాలూ, గాయాలూ లెక్కలేసుకోవడం? చూడు, ప్రపంచం మీద ఎంత ప్రశాంతత పరుచుకుంటోందో. చీకటి ఆకాశాన్ని…
-
మనం ఒక మొక్కని నాటుతున్నామంటే … హెన్రీ ఏబీ, అమెరికను కవి
మనం ఒక మొక్కని నాటుతున్నామంటే ఏమిటి నాటుతున్నాం? మనం సంద్రాలు అవలీలగా దాటగల ఓడని నాటుతున్నాం, దాని తెరచాపలు ఎగరేసే నిలువెత్తు వాడస్థంభాన్ని నాటుతున్నాం; తుఫానులను ఎదుర్కోగల చెక్కలని నాటుతున్నాం, దాని వెన్నుని, దూలాల్ని, లో దూలాల్ని, కీళ్ళని, మనం ఒక మొక్కని నాటుతున్నామంటే ఒక ఓడని నాటుతున్నాం. మనం ఒక మొక్కని నాటుతున్నామంటే ఏమిటి నాటుతున్నాం? నువ్వూ నేనూ ఉండడానికి ఒక ఇల్లుని నాటుతున్నాం, ఇంటివాసాల్ని, పట్టీల్ని, మిద్దెల్ని, నాటుతున్నాం, గుబ్బమేకుల్ని, పెండెబద్దల్ని, తలుపుల్ని నాటుతున్నాం,…
-
వర్ణన… షెల్ సిల్వర్ స్టీన్, అమెరికను కవి
జార్జి “దేముడు పొట్టిగా లావుగా ఉంటాడు,” అన్నాడు. నిక్ “లేదు, సన్నగా పొడవుగా ఉంటాడు,” అన్నాడు. “అతనికి తెల్లని పొడవాటి గడ్డం ఉంటుంది,” అని లెన్ అంటే “లేదు, అతను నున్నగా గడ్డం గీసుకుని ఉంటాడు,” అన్నాడు జాన్. విల్ “అతను నల్లని వాడు,” అంటే, “కాదు, తెల్లని వాడు” అన్నాడు బాబ్. రోండా రోజ్ అంది: “దేముడు పురుషుడు కాదు, స్త్రీ.” నాలో నేను నవ్వుకున్నాను గాని,…
-
ఎపుడో…… ఫరూవే ఫరుక్జాద్, పెర్షియన్ కవయిత్రి
చక్కని కాంతులీను ఒక ఆమని పగటివేళో లేక మంచు పొడిగారాలే సుదూర హేమంతవేళో, ఏ ఆనందఛాయలూలేని శూన్యశిశిర వేళో… ఏదో రోజు మృత్యువు నన్ను సమీపిస్తుంది. . అన్ని రోజుల్లాగే బాధేసుఖమనిపించిన రోజునో, గతంలోమాదిరి ఏ సందడీలేని రోజునో నేటికీ రేపటికీ నకలుగా ఉండే రోజునో మృత్యువు నన్ను సమీపిస్తుంది. . నా కళ్ళు మసకచీకటి మార్గాలకి అలవాటుపడతాయి నా చెంపలు చల్లబడి కళతప్పిన పాలరాయిలా ఉంటాయి ఉన్నట్టుండి నిద్ర నన్ను ముంచెత్తుతుంది. నొప్పితో…
-
what does he do alone?… Nanda Kishore, Telugu, Indian
Suffering the turmoils within what does he do alone? Sitting on the sandy shore He would pen poems on the spurgy tides; going lyrical at the undulating waves and the swaying froth he would hum a tune striking a rhythm with their balletic steps. when the tide overwhelms him he would be perturbed like…
-
తరాలు … ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి
నువ్వు బంగారు రంగు చివురులు తొడుగుతూ తిన్నగా ఎదుగుతూ కొమ్మలతో ఊగిసలాడే చిన్ని బాదాం (1) చెట్టు మొలకవి . నీ నడక కొండగాలికి రివ్వున కొమ్మలు జాచే బాదం చెట్టు వంటిది. నీ గొంతు సడి ఆకులమీద తేలికగా విహరించే దక్షిణగాలి ఒరిపిడి; నీ నీడ నీడకాదు, విరజిమ్మిన వెలుతురుపొడ; రాత్రివేళ నువ్వు ఆకాశాన్ని క్రిందకి దించుకుని నక్షత్రాలను చుట్టూ కప్పుకుంటావు. నేను మాత్రం, తనపాదాల చెంత పెరుగుతున్న పిల్ల బాదం మొక్కని మేఘావృతమైన…
-
నా ప్రియమిత్రుడు, జాన్ ఏండర్సన్, రాబర్ట్ బర్న్స్, స్కాటిష్ కవి
ప్రియ మిత్రమా, జాన్ ఏండర్సన్, మనిద్దరికి తొలిసారి పరిచయమైనపుడు నీ జుత్తు ఎంత కారునలుపుగా ఉండేదని, ఒత్తైన నీ కనుబొమలు గోధుమరంగులో ఎంతో తీరుగా ఉండేవి; కానీ జాన్, ఇప్పుడు ఆ కనుబొమలు పల్చబడ్డాయి, నీ జుత్తు బాగా తెల్లబడింది; ప్రియ మిత్రమా, జాన్ ఏండర్సన్, నీకు అనేకానేక ఆశీస్సులు. ప్రియ మిత్రమా, జాన్ ఏండర్సన్, మనిద్దరం కొండ కలిసి ఎక్కేవాళ్ళం ఎన్నో ప్రకాశవంతమైన రోజుల్ని ఇద్దరం ఒకరికొకరు తోడుగా గడిపేం, గుర్తుందా, కానీ, జాన్ ఇక…
-
A book slipping from a rack… Mallavajjala Narayana Sarma, Telugu, Indian
Like an unexpected call from an old friend A book slips down from the bookrack. How many tears he might have shed, the poet, And how much he must have struggled to gather himself … He was tenderly humane here and there And equally arrogant even times, Sometimes, strong and severe Like the ever effusive…