-
Weaving the dreams… Bala Sudhakar Mauli, Telugu, Indian
As Darkness Slowly settles over there Like a thin veil of raiment … They would be weaving Their dreams into Exquisitely beautiful arcades With equally splendid exchange of words Times When people isolate themselves into Diverse polarised worlds… It’s really a delectable spectacle To see them Absorbed And lost to themselves. That night The…
-
ఖ్వాజా అబ్దుల్లా అన్సారీ … ఆఫ్ఘనిస్థాన్, సూఫీ కవి
లౌకిక దృష్టితో నిండిన కనులు పారలౌకికతలోని సుగుణాలు దర్శించలేవు; పారలౌకికతగూర్చిన ఆలోచనలతో నిండిన కనులు ఏకత్వంలోని సౌందర్యాన్ని చూడగల అవకాశం కోల్పోతాయి. . ఖ్వాజా ఆబ్దుల్లా ఆన్సారి. (1006 – 1088) ఆఫ్ఘనిస్థాన్, సూఫీ కవి . ఈ కవిత చిన్నదే అయినా మంచి సందేశం ఉంది. భగవంతునిమీద తప్ప మిగతా అన్నివిషయాలనుండి మనసుని తప్పించడమే సూఫీ సిద్ద్ధాంతంలోని మూలభావన. ఈ ప్రపంచమే సత్యమనే భావన ఒకటి, ఈ ప్రపంచం అంతా మిధ్య నఏది ఒకటి రెండు…
-
ఎంత కష్టపడ్డాను నా కన్నీళ్ళు దాచుకుందికి!… ఏన్ లీ వ్హార్టన్, ఇంగ్లీషు కవయిత్రి
నా కన్నీళ్ళు దాచుకుందికి ఎంత కష్టపడ్డాను! ఎన్ని సార్లు మొరపెట్టుకున్నాను! నా భయాలూ, దుర్భరమైన రోజులూ బోధించాయి: నేను నిష్ఫలంగా ప్రేమించానని. ఇప్పుడు నా ఆనందాలు చిన్నగానైనా మొలకెత్తుతున్నాయి అవి దాచుకోవడం అంత సులభం కాదు; విషాదం ఎవరికీ తెలియకుండా మూలగొచ్చేమో కాని, అనందం మాత్రం ఇట్టే తెలిసిపోతుంది. నా ఆనందాన్ని అరుస్తున్న గొర్రెలమందకి చెబుతాను ప్రతి సెలయేరుకీ, ప్రతి చెట్టుకీ చెబుతాను నా ఆనందాన్ని నాకు తొరిగి ప్రతిధ్వనిస్తున్నందుకు ఈ లోయలోని ప్రతి కొండకీ…
-
అందరూ పాడిన పాట… … సీ ఫ్రై ససూన్, ఇంగ్లీషు కవి
అందరూ ఒక్కసారి పాడటం ప్రారంభించేరు నాకు ఎంతగా ఆనందంతో పులకరింత కలిగిందంటే పంజరంలో బంధించిన పక్షి స్వేచ్ఛగా రెక్కలాడిస్తూ తెల్లని పళ్ళతోటల్లోంచీ, పచ్చని మైదానాలమీంచీ అలా అలా ఎగురుకుంటూ … కనుచూపు దాటిపోయినంత… అందరి గొంతూ ఒక్కసారి తారస్థాయి చేరుకుంది; సూర్యాస్తమయమంత శోభాయమానంగా ఉంది; నా గుండె కన్నీళ్ళతో నిండిపోయింది; భయం నెమ్మదిగా తొలగిపోయింది… ఓహ్, ప్రతివ్యక్తీ ఒక పిట్ట; పాటకి పదాలు లేవు… పాట మాత్రం ఎప్పటికీ ఆగదు… . సీగ్ ఫ్రై ససూన్ .…
-
బతికున్నవాడికో పువ్వు… నిక్సన్ వాటర్ మన్, అమెరికను
శవాలపై విలువైన పూలమాలలుంచే కంటే బ్రతికున్నవాడికి ఒక గులాబి ఇవ్వడం మెరుగు; అంతులేని ప్రేమ కోశాన్ని నింపే ప్రక్రియలో బ్రతికున్నవారికి ఇచ్చే ఒక గులాబీ అమూల్యమైనది, అలమటిస్తున్న ఆత్మ శలవుతీసుకోకమునుపే కోరకుండా ఉదారంగా ఇవ్వగలిగితే… బ్రతికున్న వాడికి ఇచ్చే ఒక గులాబి పువ్వు శవాలమీది విలువైన దండల కంటే మిన్న . నిక్సన్ వాటర్ మన్ 12 నవంబరు, 1859 – 1 సెప్టెంబరు 1944) అమెరికను . A Rose to the Living .…
-
కొత్త సంవత్సరం… ఎలా వ్హీలర్ విల్ కాక్స్, అమెరికను
2014 మిత్రులకీ బ్లాగు సందర్శకులకీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు My Hearty Greetings to all Friends and visitors for a very Happy and Prosperous New Year . May the New Year fill your Homes with Health, Prosperity and Happiness. . కొత్తసంవత్సరంలో కవితల్లో చెప్పడానికేముంటుంది ఇంతకుముందు కొన్నివేల సార్లు చెప్పింది కాకుండా? కొత్తసంవత్సరాలొస్తుంటాయి, పాతవి వెళ్తుంటాయి మనం కలలు కంటుంటాం, అవి గాలిమేడలని…
-
నగరం లోని చెట్లు… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను
పుర వీధుల్లోని చెట్లు రోడ్లమీద వాహనాలూ, రైళ్ళ కూతలూ లేకుంటే జనపథాలపక్కని చెట్లలా, అంత సుతిమెత్తని, తీయని ధ్వని చేస్తాయి. వర్షానికి, వాటి నీడలో తలదాచుకుంటున్న మనుషులు నిస్సందేహంగా పల్లెల్లోని చెట్లమీద వాన చేసే సంగీతాన్ని వినగలరు నగర రణగొణధ్వనికి మౌనాన్ని వహించే చిన్ని చిగురాకుల్లారా! పిల్లతెమ్మెర వీచినపుడు నే గమనింఛా,- మీరెంత చిరుసవ్వడి చేస్తారో. . ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే (February 22, 1892 – October 19) అమెరికను కవయిత్రి . .…
-
క్రీడ… హేమ్లిన్ గార్లాండ్, అమెరికను కవి
ఎక్కడో, దూరంగా పెనవేసుకున్న పనలతో, పండిన గోధుమ చేలలో ఒక చిన్న అడివికోడిపిల్ల ఏడుస్తోంది తనవాళ్ళందరినుండి తప్పిపోయి, వేడుకుంటూ, వెక్కివెక్కి. ఇంతలో, మట్టికొట్టుకుని, రెక్కలు చెదిరి దుమ్ముకొట్టుకున్న కళ్ళతో సమాధానం చెప్పలేని తల్లి కోడి వేటగాడి కాళ్ళదగ్గర రక్తమోడుతూ, కదల్లేక పడి ఉంది. . హేమ్లిన్ గార్లాండ్ (September 14, 1860 – March 4, 1940) అమెరికను కవి. . . Sport . Somewhere, in deeps Of tangled, ripening wheat,…
-
సమవర్తి మృత్యువు… జేమ్స్ షెర్లీ. ఇంగ్లీషు కవి
గొప్పింటి పుట్టుకలగురించీ, అధికార దర్పాలగురించీ చెప్పుకునే వన్నీ కేవలం మిధ్య, వాస్తవాలు కావు; విధిని ఎదిరించి నిలవగల కవచం ఏదీ లేదు; మహరాజులైనా మృత్యువు తన శీతహస్తంతో స్పృశిస్తుంది, కిరీటాలూ, రాజ చిహ్నాలూ దొర్లి పడవలసిందే పాడుబడ్డ బొరిగ తోనూ, పార తోనూ సమానంగా మట్టిపాలుకావలసిందే. కత్తులతో కొందరు యుద్ధరంగంలో జయించొచ్చు మృతుల హారాలని ధరించి సరికొత్త చరిత్ర లిఖించుకోవచ్చు కానీ, చివరకి ఏదోనాటికి వాళ్ళ సత్త్వము ఉడుగక తప్పదు విధితో పోరాడుతూ జయాపజయాలు చేతులు మారొచ్చు…
-
విస్మృతి… జెస్సీ రెడ్మన్ ఫాసెట్, అమెరికను కవయిత్రి
నేను మరణించిన పిదప ఎక్కడో నిర్మానుష్యమైన సమాధిలో ఉండాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే చెప్పలేను; కానీ, నాకు ఎవ్వరికీ తెలియని, అందరూ మరచి, పాడుబడి ఉపేక్షించబడిన చోట నిద్రించాలని ఉంది. నే నలా పడుక్కుని, నా మృత్యుశ్వాసతో గ్రహించగలగాలి నిర్జీవత్వాన్నీ, పరిపూర్ణమైన మృత్యు స్పర్శనీ; సమాధుల పక్కనుండి పోయేవాళ్ళు తరచు పలికే అసూయా, ద్వేషాలతో కూడిన వాక్కులెన్నడూ వినకూడదు ప్రార్థనలు గాని, కన్నీళ్ళు గాని నాలోకి ఇంకకూడదు అవి నిష్కారణంగా మృతుల్ని హింసించి, చెవులని బాధిస్తాయి; అక్కడ నేను…