Weaving the dreams… Bala Sudhakar Mauli, Telugu, Indian
As
Darkness
Slowly settles over there
Like a thin veil of raiment …
They would be weaving
Their dreams into
Exquisitely beautiful arcades
With equally splendid exchange of words
Times
When people isolate themselves into
Diverse polarised worlds…
It’s really a delectable spectacle
To see them
Absorbed
And lost to themselves.
That night
The duo of mother and daughter
Look like two moons
Arisen on the horizon of their shack.
*
Where were they
Days before?
Yesterday?
They know not.
Today
They are on the bourns of the village…
They are eternally itinerant…
World is their abode
And the sky
Is the roof.
In the distant past
When some village expelled them…
They reached this shore like flotsam;
Learnt weaving the nest with bamboo
And somehow swim through the life.
*
What would they talk,
The mother and her twelve-year old girl,
In the evenings every day, anyway?
Is it
About her studies?
Or
About her younger sibling
Living far off
In a hostel?
Or
About the vacant plot
still available
Where they can
Erect a shanty?
*
Close by…
Propping up the trellis
Sagged on one side, and
Weaving their dreams from the other end
Is the father
Of that lettered moon-doll.
.
Bala Sudhakar Mouli
Telugu
Indian
(Dedicated to my student Kumari)
.

Balasudhakar Mouli
Balasudhakar Mouli is a young and upcoming poet with great passion for poetry. He is a Post graduate in Botany from Nagarjuna University and working in Zilla Parishath High School, Bhyripuram, Vizianagaram, AP. He feels it a social necessity that children learn to read and write poetry and stories and studiously implements it in his school. He says he is greatly influenced by the poetry of SriSri, Sivasagar and Siva Reddy. “Teachers are dreamers…. students realize those dreams” is his motto.
.
కలల వంతెన నేస్తూ…
.
చీకటి
పలుచని వస్త్రంలా
పరుచుకుంటున్న వేళ
వాళ్లు అక్కడ-
వొక వంతెనను కడుతుంటారు
మహా సౌందర్యవంతమైన వంతెనను
అంతే సౌందర్యవంతమైన మాటల అల్లికతో
కడుతుంటారు
మనుషులు దీవులుగా
భిన్న ధృవ ప్రపంచాలుగా
విడిపోతున్న దశలో..
వాళ్లలా
నిమగ్నం కావడం
సంలీనం కావడం
గొప్ప దృశ్యమానమైన స్థితి
ఆ తల్లీకూతుళ్లు –
ఆ రాత్రి
ఆ యింట విరబూసిన
రెండు చందమామలు!
*
మొన్నెక్కడో
నిన్నెక్కడో
ఈ రోజు
ఈ ఊరి చివర-
చలన స్వభావులు వాళ్లు
వాళ్లకు విశ్వమే యిల్లు
ఆకాశం
యింటి పైకప్పు
ఎప్పుడో
ఏదో ఊరు విసిరేస్తే
ఈ ఊరు తీరానికి వొచ్చి
చేరారు
నాలుగు వెదురు బద్దలతో
గూళ్లు అల్లుకుంటూ
బతుకును ఈదటమెలాగో నేర్చుకుంటున్నారు
*
ఆ తల్లీ, పన్నెండేళ్ల ఆ పసితల్లి
రోజూ సాయంకాలాలు
ఏం మాటాడుకుంటుంటారు !
బహుశా
ఆ పిల్ల చదువుని గురించా-
దూరంగా హాస్టల్లో వుండి చదువుకుంటున్న
తమ్ముడి గురించా-
లేదా..
యింకా అనువుగా
గుడిసె కట్టుకోడానికి
వీలుగా వున్న
ఖాళీ జాగా గురించి అయ్యుంటుందా-
*
పక్కనే
జారిన పందిరి కింద-
వాళ్ల
కలల వంతెనను రెండో చివర నుంచి నేస్తూ
బతుకు వంతెనకు దన్నుగా వున్న
ఆ చదువుల చందమామ ‘తండ్రి’ –
.
బాల సుధాకర్ మౌళి
27 డిసెంబర్ 2013
( నా విద్యార్థిని ‘కుమారి’ కోసం.. )
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
స్పందించండి