అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • ఫిబ్రవరి 5, 2014

    ఎడబాటు… థామస్ స్టాన్లీ, ఇంగ్లీషు కవి

    నా ప్రియమైన స్వామీ! దూరంగా వెళ్తున్నా నీ కౌగిటినుండి విడదీయబడి నన్ను సమ్మోహపరచిన వాటికంటె న్యూనమైన ఆకర్షణలవైపు. ఇక ముందెప్పుడైనా దుఃఖమే నన్ను పొట్టనబెట్టుకుందని నీకు తెలిస్తే, రా! నా సమాధిమీద ఒకటో, రెండో కన్నీటి చుక్కలు రాల్చు. నీ నిట్టూర్పులతో నా ప్రశాంతమైన నిద్రని భగ్నం చెయ్యి. నీ రోదన విని, మృతిలో కూడా నేను హర్షిస్తాను ఏమో! నీ కన్నీళ్ళకి నా చితాభస్మాన్ని కొత్త జీవంతో నింపగల సత్తా ఉండొచ్చు, లేదా నన్నొక పువ్వుగా…

  • ఫిబ్రవరి 4, 2014

    రాతి మీది నాచు… జోస్ మెండోంకా, పోర్చుగీసు కవి

    సాహసయాత్రికులూ, దేశదిమ్మరులూ, ఎన్నడో అదృశ్యమైపోయారనుకుంటున్న యాత్రీకులూ, బెర్బరులూ, ఆలమందలుతోలుకునే సంచార జాతులూ, దేశబహిష్కృతులూ… క్షణక్షణమూ ఎదురయ్యే ఊహించలేని అవసరాలు కాక పవిత్రగ్రంధాలే ధర్మశాస్త్రాలుగా భావించే మనలాటివాళ్ళకి ఏమి చెప్పగలరు? మన చైతన్య పరిధికి అతీతంగా, వాళ్ళు వసించే చోటులలో ఒక ప్రేతాత్మల భాష ఉంది అది ఏ భాషా చెప్పలేని విషయాలు చెబుతుంది: నక్షత్రాలు ఒకదాన్నొకటి ఢీకొన్నపుడు వెలుగుతునకలు పుడతాయనీ; తరుము కొస్తున్నపుడు జింక పిల్ల ఎన్నో అక్షరాల సోయగాలతో పరుగెడుతుందనీ; అఖండ హిమపాతము తర్వాత, మొనదేలిన…

  • ఫిబ్రవరి 3, 2014

    స్మారక-తిప్ప గుర్తుంచుకో… యెహుదా అమిఖాయ్. ఇజ్రేలీ కవి

    నాకు బదులు ఈ స్మారక తిప్పని గుర్తుంచుకో, అది ఉన్నది అందుకే. నా సహచరులని గుర్తుంచుకో, వాళ్ల పేరు పెట్టిన వీధిని గుర్తుంచుకో, బాగా పేరుపడ్డ భవనాన్ని గుర్తుంచుకో. దేవుని పేర వెలిసిన ఆరాధన మందిరాన్ని గుర్తుంచుకో, తోరాటోరాలోని వ్యాఖ్యానాలను గుర్తుంచుకో, స్మృతిగీతాలని గుర్తుంచుకో, చరిత్రని తమలో ఇముడ్చుకున్నరంగురంగుల జండాలను, వాటిలో చుట్టబడిన అమరవీరుల దేహాలనూ గుర్తుంచుకో అవి ఏనాడో మట్టిలో కలిసినై; ఆ మట్టిని గుర్తుంచుకో. వాకిటముందు కళ్ళాపినీ, పునర్జన్మనీ గుర్తుంచుకో. భూమిమీద పశుగణాలూ, ఆకాశంలోని విహంగాలూ గుర్తుంచుకో.…

  • ఫిబ్రవరి 2, 2014

    కలలు…. లాంగ్స్టన్ హ్యూజ్, అమెరికను కవి

    కలల్ని సజీవంగా ఉంచుకో! ఎందుకంటే, కలలు గనక మరణిస్తే జీవితం రెక్కలు తెగిన పక్షిలా ఇక పైకి ఎగరలేదు. కలల్ని గట్టిగా పొదువుకో! ఎందుకంటే, కలలు గనక జారిపోతే జీవితం మంచుకప్పిన మైదానంలా ఊసరక్షేత్రమైపోతుంది. . లాంగ్స్టన్ హ్యూజ్ February 1, 1902 – May 22, 1967 అమెరికను కవి. . Langston Hughes . Dreams . Hold fast to dreams For if dreams die Life is a broken-winged…

  • ఫిబ్రవరి 1, 2014

    శిశువు… సిల్వియా ప్లాత్, అమెరికను కవయిత్రి

    Image Courtesy: http://www.plant-and-flower-guide.com/snowdrop-flower.html . నిర్మలమైన నీ కనులు అత్యంత సుందరంగా ఉన్నాయి. వాటిని నేను రంగులతో, పక్షులతో నింపదలుచుకున్నాను, ఒక కొత్త జంతు ప్రపంచం దానికేపేరు పెడతావో నువ్వే ఊహించు— ‘తుహినకుసుమ’మా, మోహన మురళీ చిన్నారీ… మొనదేరిన అంకురం, పోలికలు ఉదాత్తంగా సాంప్రదాయికంగా ఉండే సరస్సు… వ్యాకులమైన మనసుతో చేతులు నులుపుకుంటూ, చుక్కలెరుగని చూరుకింద కూచోడం కాదు. . సిల్వియా ప్లాత్ October 27, 1932 – February 11, 1963 అమెరికను కవయిత్రి (గమనిక:…

  • జనవరి 31, 2014

    దురహంకారం … జాన్ వెబ్స్టర్, ఇంగ్లీషు కవి

    వసంత ఋతువులోని పూలన్నీ మన సమాధులని గుబాళింపజెయ్యడానికి సరిపోతాయి; పాపం అవన్నీ మంచి వయసులో ఉన్నాయి, మనిషి చూడబోతే అలంకరించుకునేది కాసేపే: పుట్టినప్పటినుండి మన ప్రగతి ఒక సారి గమనించండి మనం పుడతాం, పెరుగుతాం, తిరిగి మట్టిలో కలుస్తాం. టాటాలు చెప్పుకుంటాం, అన్ని సుఖాలకీ, అన్ని బలహీనతలకీ వశమౌతాము ! తియ్యని మాటైనా, నిశితమైన చూపైనా, పరిమళాల్లా, నాలుగుదిక్కులా వ్యాపించి నశించవలసిందే. సూర్యుడికోసం నిరీక్షించే నీడలా, అందుకనే, ఈ తంతు అంతా జరుగుతుంటుంది. రారాజుల నిష్ఫలమైన కోరిక,…

  • జనవరి 30, 2014

    దైవానికి ప్రేమగీతాలు… రిల్కే, ఆస్ట్రియన్ కవి

    నువ్వే భవిష్యత్తువి, ప్రభాత సంధ్యల విశాల కాలమైదానాల విరిసే అరుణారుణ గగనానివి నువ్వు. నిశాంతాన్ని సూచిస్తూ కూసే తొలికోడి కూతవి, తుహిన బిందువువీ, ప్రాభాత భేరీవీ, కన్నియవీ, అపరిచితుడివీ, తల్లివీ, మృత్యువువ్వీ నువ్వే. మేము కనీ వినీ ఎరుగని కారడవిలా… మేము కీర్తించక, శోకించక, వర్ణించక గడిపే మా దైనందిన జీవితాలలోంచి ప్రభవించే అనేకానేక రూపాలుగా నిన్ను నువ్వు సృజించుకుంటావు వస్తువులలోని అంతరాంతర ప్రకృతివి నువ్వు, ఎన్నడూ నిర్థారించి చెప్పలేని తుది పలుకువి నువ్వు. మాకొక్కరికీ ఒక్కొక్కలా నువ్వు…

  • జనవరి 29, 2014

    సంఘర్షణ… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి

    (సారా టీజ్డేల్ వర్ధంతి సందర్భంగా) . నాలోని యోగీ, భోగీ రాత్రనక పగలనక కొట్టుకుంటూ ఉంటారు; సమౌజ్జీలేమో, అలుపులేక, శక్తి సన్నగిల్లుతున్నా ఒకర్ని ఇంకొకరు తిట్టుకుంటూ, నా చల్లారిన రక్తం చెమటపడుతుంది, వాళ్ళు అలా సూర్యోదయం నుండి అస్తమయందాకా కొట్టుకుంటుంటే. మళ్ళీ రాత్రయినదగ్గరనుండీ యుద్ధం కొనసాగుతుంది వేకువవేళకి నేను వణుకుతూ వాళ్ళ పోరాటం వింటుంటాను; ఈ సారి మాత్రం వాళ్ళు చావో రేవో తేల్చుకునేలా పోరాడుతుంటారు, అయితే, ఎవరు చస్తే నాకేం అని నేను పట్టించుకోను. ఎందుకంటే, …

  • జనవరి 28, 2014

    విలంబనము… ఎలిజబెత్ జెన్నింగ్స్, బ్రిటిషు కవయిత్రి

    ఈ క్షణం నా మీద ప్రసరిస్తున్న నక్షత్ర కాంతి ఎన్నో ఏళ్ళక్రిందట మెరిసినది. ఇప్పుడు అక్కడ మిలమిలలాడుతున్న కాంతిని నా కనులు బహుశా చూడలేకపోవచ్చు, ఈ కాల విలంబనము ఎలాగా అని నన్ను ఊరిస్తూంటుంది. ఇపుడు నన్ను ప్రేమిస్తున్న ప్రేమ నాదగ్గరకు చేరకపోవచ్చు దాని తొలి లాలసలు తీరేదాకా. కళ్ళు చూచి అందంగా ఉందని గుర్తించేదాకా, ఆ తారకావేశం నిరీక్షించాల్సిందే మనల్ని చేరుకున్న ప్రేమ, మనం ఇంకెక్కడో ఉండగా చేరొచ్చు. . ఎలిజబెత్ జెన్నింగ్స్ బ్రిటిషు కవయిత్రి.…

  • జనవరి 27, 2014

    Revision 2… Nanda Kishore, Telugu, Indian

    Some acquaintances are such! Furnishing wings you did not fancy in your wildest dreams they bid you up suddenly pitting against gushing winds. . If you could somehow manage to drop down safely, fine! You can still breathe life even if your body is battered. . But if you continue your assay for fun or…

←మునుపటి పుట
1 … 159 160 161 162 163 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు