అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • ఫిబ్రవరి 27, 2014

    హార్బరులో… కన్స్టాంటిన్ కవాఫిజ్, గ్రీకు కవి

    ఏమ్స్ అన్న యువకుడు, ఇరవై ఎనిమిదేళ్ళుంటాయి, టెనోజ్ రేవు నుండి ఈ సిరియను హార్బరులో దిగేడు అత్తరు వ్యాపారం లో మెలకువలు నేర్చుకుందామన్న తలపుతో. కానీ, పాపం, ప్రయాణంలో రోగం పాలయ్యాడు. అలా ఓడలోంచి దిగడమే తడవు, చనిపోయాడు. అతని ఖననం, చాలా కనికిష్టమైనది, ఇక్కడే జరిగింది. చనిపోవడానికి కొన్ని గంటలు ముందు, “ఇంటి” గురించీ, “ముసలి తల్లిదండ్రులు” గురించీ ఏవో  గొణిగాడు. కానీ, వాళ్ళెవరో ఎవరికీ తెలీదు. ఈ గ్రీకుప్రపంచానికి ఆవల అతనిది ఏదేశమో తెలీదు.…

  • ఫిబ్రవరి 26, 2014

    విశ్రాంతి… క్రిస్టినా రోజేటి, ఇంగ్లీషు కవయిత్రి

    ఓ నేలతల్లీ! ఆమె కళ్ళను గట్టిగా ముయ్యి; ప్రపంచాన్ని చూసి చూసి అలసిన ఆమె అందమైన కళ్ళని ముయ్యి; ఆమెను దగ్గరగా హత్తుకో; సుఖానికి ఏ మాత్రం సందివ్వకు గట్టిగా నవ్వే ఆ నవ్వుకీ; లేదా నిట్టుర్చే నిట్టూర్పులకీ. ఆమెకు అడగడానికి ప్రశ్నలూ, చెప్పడానికి సమాధానాలూ లేవు; పుట్టిన దగ్గరనుండీ ఆమెను బాధించినవాటిలో ఈ కరువు ఆమెను మూగదాన్ని చేసి ఆమెపై పరదా కప్పింది; ఆ నిశ్చలత్వం ఒక రకంగా నిజంగా స్వర్గమే. మధ్యాహ్నం కంటే కూడా…

  • ఫిబ్రవరి 25, 2014

    కీట్స్ వర్థంతి సందర్భంగా… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి.

    వెన్నెలలనద్దుకున్న తమాల వృక్షాలు అర్థరాత్రి అతని సమాధిమీద వింత వింత నీడలు అల్లుతున్నప్పుడు, అప్పుడే విడిచిన నులివెచ్చని వానచినుకులలో తడిసిన జాజిపూలగుత్తులమీదనుండి పరిగెత్తే ప్రాతసమీరంలా అతని అసంపూర్ణ గీతాన్ని దీనంగా ఆలపిస్తోంది గాలి; అతని శిరసు మీదకి వంగి చంద్రకాంత రోదిస్తోంది, కెరటాలన్నీ నిశ్చలమై నిలిచిపోగా,  పోటెత్తుతున్న సముద్రాలు చీకటిలో మునిగి ప్రశాంతమై పోయేయి; గాఢనిద్రలో అప్పుడపుడు మూలిగుతూ, తనను ఆవరించిన నీరవ మేదినిని ఆశ్చర్య పరిచే అతనిపై ఎంత జాలంటే మైదానాలనీ, కెరటాలనీ మేల్కొలపగలిగినవారికి అతన్ని…

  • ఫిబ్రవరి 24, 2014

    జీవన శకటం … అలెగ్జాండర్ పుష్కిన్, రష్యను కవి

    ఉండుండి అదిమొయ్యవలసిన బరువు భారమైనా ఈ శకట గమనం నెమ్మదిగా సాగుతుంటుంది; జుత్తు నెరిసిన సాహస కాల చోదకుడు బండి మొగలులో సుఖంగా కూచిని తోలుతుంటాడు. ప్రాభాతవేళ  దానిలోకి ఉత్సాహంతో దూకి ఒక అద్భుతమైన ప్రయాణానికి సిద్ధపడతాం. సోమరితనాన్నీ, అలసటనీ లక్ష్యపెట్టకుండా మనం  అరుస్తాం: “ఊం! త్వరగా! మనం అక్కడికి చేరుకోవాలి” కానీ మధ్యాహ్నమయే సరికి మన ధైర్యం సన్నగిలితుంది, మనం భయపడతాం; ఆ సమయానికి కొండలూ లోయలూ భీతావహంగా కనిపిస్తాయి. అప్పుడు, “ఓ, సారధీ! మూర్ఖుడా!…

  • ఫిబ్రవరి 23, 2014

    నిలకడలేని ఆకారము … ఏ. ఎస్. క్లైన్, ఇంగ్లీషు కవి

    ప్రకృతికి ఈ వంక రాళ్ళూ రప్పలు ఆ వంక  జీవం, ఒక వంక పదార్థం మరోవంక దాన్ని కల్పనాచాతుర్యం, ఒక చివర వైభవం, పాలపుంతల వెలుగు, పువ్వులూ, వాటి రేకలనుండి ఎగిసే పుప్పొడి మరో చివర… మనసు. ఒక చివర శబ్దం, దానికి అటుచివర  నిశ్శబ్దం, గులకరాళ్ళమధ్యనుంది వడగడుతున్న ఇసుక. ఒక అంచున చీకటి, సంక్లిష్టత, సత్యంకోసమై వెదుకులాట, రెండో అంచున సత్యమూ, దాని సొగసు, పరిహసించేంత సరళత, అపహసించేంత క్లిష్టత. ఈ కొసని, నిశ్చలమైన గమ్యంలేని…

  • ఫిబ్రవరి 22, 2014

    స్వీయ మృత్యుల్లేఖనం… జాన్ గే, ఇంగ్లీషు కవి

    జీవితం ఒక పరిహాసం, అన్ని వస్తువులూ అదే ఋజువుచేస్తాయి. ఒకప్పుడు నేనూ అలాగే అనుకునే వాడిని; ఇప్పుడు నాకు తెలుసు. . జాన్ గే (30 June 1685 – 4 December 1732) ఇంగ్లీషు కవీ, నాటక కర్తా. ఈ కవితలో సౌందర్యం  “Jest”  అన్న మాటని సునిశితంగా వినియోగించిన తీరు.  మొదటి పాదంలో జీవితం  పరిహాసం అన్నప్పుడు  ప్రకృతిలోని వస్తువులని పరికిస్తూ ఆశగా … కావాలని కోరుకునే ఆనందం (Wishfulness) అన్న అర్థం సూచిస్తే, …

  • ఫిబ్రవరి 21, 2014

    సంగీతం … స్టీఫెన్ విన్సెంట్ బెనెట్ అమెరికను కవి.

    మా మిత్రుడు పియానోదగ్గరకి వెళ్ళి, స్టూలు కొంచెం ఎత్తుగా చేసుకుని, నోట్లో పైపుని పక్కనబెట్టి, అల్మారాలోంచి ఒక లావుపాటి పుస్తకం ఎంచుకున్నాడు; దాన్ని ఠప్ అని అసహనంగా తెరిచాడు. అతని వేళ్ళు అలవోకగా మెట్లమీద పరుగులుతీసాయి కత్తులు దూసుకుంటున్నట్లు… ఆటవికదళాల మొరటు డప్పుదరువులకనుగుణంగా ఆయుధాలను ఝళిపిస్తూ, పిడుగులు వర్షించినట్టు పెడబొబ్బలు పెడుతూ, అకస్మాత్తుగా ‘గాలి కోట’మీద సేనల దాడి ప్రారంభమైంది… మెరుపులు కదంతొక్కుతున్నాయో అన్నట్టు కవాతుచేస్తూ భీతిగొలిపే పతాకాలతో, హతమార్చి తగలెయ్యడానికి దివిటీలతో తుఫానుమేఘాల్లా జరజరా పాకుతూ….…

  • ఫిబ్రవరి 19, 2014

    అపార్ట్ మెంటు ఇళ్ళ వెనక వసారాలు… మేక్స్ వెల్ బోడెన్ హీం, అమెరికను కవి

    నీ కళ్ళు లవండరులా తెల్లగా కళకళలాడే రోజుల్లో ఎప్పుడో నువ్వు  కోసిన రేగి కాయని నోటితో కొరుకుతూ రేగి చెట్లగూర్చి ఎండలో పాటలుపాడుకునే ఓ పనిపిల్లా! సూర్యుడూ చంద్రుడూ, నక్షత్రాలూ ఎరుగని ఆకాశమూ ముఖం మీద ఆర్ద్రతాచిహ్నాలింకా చెరగని శవం లాంటి ఆకాశమూ నీ కళ్ళనుపోలిన రంగులోనే ఉంటాయిలే. నువ్వున్న ఇంటి మీది వసారాలో ఉన్న ఇద్దరు స్త్రీల ముఖాలు ఎన్నడూ వర్షం ఎరగని నేలలా ఎర్రబడి ఉన్నాయి; వాళ్ళకళ్ళు నీరంతా పోయి ఏమూలో కాస్త తడిమిగిలిన…

  • ఫిబ్రవరి 18, 2014

    బోనాపార్టే రోడ్డు … జోసెఫ్ వారెన్ బీచ్, అమెరికను కవి.

    సాదా రొట్టెలూ, నీ కాఫీ మాత్రమే అడిగి తీసుకుని నువ్వు బల్ల దాటి వస్తున్నపుడు, అక్కడ అన్నీ జాగ్రత్తగా గమనిస్తున్న యజమానురాలిని పలకరించిన తర్వాత మైధునంలో ఉన్న పక్షులని దాటేటంత నెమ్మదిగా లోనకి ప్రవేశించి, వార్తాపత్రిక అంచుమీదుగా వివేకంతో చూడమని అడ్గుతునాను. ఆదిగో ఆ మూల అస్పష్టంగా, ఏ మాటూ లేని ఆ మేజాబల్ల వెనక స్త్రీ పురుషులిద్దరు అనుకున్నట్టుగా కలుసుకుని మౌన సంభాషణ కొనసాగ్ఫిస్తున్నారు. బయట కాలిబాటమీద చక్కని వెలుగు వెల్లువెత్తుతోంది; దూరంగా గుట్టమీద  పనిపిల్ల…

  • ఫిబ్రవరి 17, 2014

    ఆత్మ-వర్షపు చినుకూ… సిడ్నీ లేనియర్, అమెరికను కవి

    తేలికపాటి చినుకులు పడి సముద్రమ్మీద ముడుతలు పడుతాయి తర్వాత వెంటనే మాయమైపోతాయి అస్సలు జాడలేకుండా. మనకి అక్కడ వర్షం పడిందని కూడా తెలీదు ప్రతిచినుకూ గుండ్రంగా చేసిన ముడతలు చూసి ఉండకపోతే. అలాగే, కొన్ని ఆత్మలు మనజీవితంల్లో ముడుతలు సృష్టించి ఈ తనూవారాశి అలజడుల్లో సమసిపోతాయి. జీవితవదనంమీద ఈ ముడుతలు లేకపోయి ఉంటే ఆత్మకి అక్కడ చోటుందని కూడా ఎవరికీ ఎరుక ఉండదు. . సిడ్నీ లేనియర్ February 3, 1842 – September 7, 1881)…

←మునుపటి పుట
1 … 157 158 159 160 161 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
  • Subscribe Subscribed
    • అనువాదలహరి
    • Join 114 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • అనువాదలహరి
    • Subscribe Subscribed
    • నమోదవ్వండి
    • లోనికి ప్రవేశించండి
    • ఈ విషయాన్ని నివేదించండి
    • సైటుని రీడరులో చూడండి
    • చందాల నిర్వహణ
    • ఈ పట్టీని కుదించు