అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • మార్చి 9, 2014

    స్వర్గంలో కాఫీ… జాన్ అగార్డ్, ఆఫ్రో-గయానీస్ కవి

    మీరు స్వర్గంలో అడుగుపెట్టినపుడు ఒక మంచి కప్పు కాఫీతోనూ గంధర్వ గానంతోనూ మీకు స్వాగతం లభిస్తుంది కానీ, మీకు  అక్కడ కెఫీన్ తీసిన కాఫీ మాత్రమే ఇచ్చినపుడు, నరకంలోని ఫిల్టర్లనుండి సైతాను తాజా ఎస్ప్రెస్సో ఘుమఘుమలు మీ ముక్కుపుటాలమీద దాడి చేసినపుడు మీరు క్రుంగిపోరూ? . జాన్ అగార్డ్ (21.6.1949) ఆఫ్రో-గయానీస్ కవి. . . Coffee In Heaven . You’ll be greeted by a nice cup of coffee when you…

  • మార్చి 8, 2014

    మిసెస్ థాచర్… స్యూ టౌన్ సెండ్, బ్రిటిష్

    నువ్వు నిజంగా రోదిస్తావా, మిసెస్ థాచర్, రోదిస్తావా? నువ్వు మేల్కొంటావా, మిసెస్ థాచర్, నిద్రలో ఉలిక్కిపడి ఎన్నడైనా? ఎండి మోడై విచారగ్రస్తమైన చెట్టులా? ఖరీదైన నీ “మార్క్స్ & స్పెన్సర్” తలగడ మీద? నీ కన్నీళ్ళు మరుగుతున్న ఉక్కులా ఉంటయా? అసలు నీకు అసలు ఎప్పుడైనా ఏడుపొస్తుందా? నీ  మనసులో “3 మిలియన్లు” అన్న ఆలోచనతో ఎప్పుడన్నా నిద్రలేస్తావా? వాళ్ళకి చెయ్యడానికి పని లేదని నీకెప్పుడైనా నిజంగా బాధకలుగుతుందా? నువ్వు నీ అధికారదుస్తులు వేసుకుంటున్నప్పుడు, ఉద్యోగంకోసం క్యూలో నిరీక్షిస్తున్నవారు…

  • మార్చి 7, 2014

    మళ్ళీ సముద్రం మీదకి పోవాలి… జాన్ మేస్ ఫీల్డ్, బ్రిటిషు కవి

    నేను మళ్ళీ సముద్రం మీదకి పోవాలి ఒంటరి సముద్రమూ, ఆకాసమూ వైపుకి. నేను కోరుకునేదల్లా ఒక పొడవాటి ఓడా దానికి దోవచూపడానికి ఒక నక్షత్రమూ, గిరగిరా తిరిగే చక్రాలూ, హుషారుగా ఈలవేసే గాలీ దానివడికి అటుఇటు ఊగే  తెల్లని తెరచాపా, సంద్రతలం మీద సన్నని తెల్లని మంచుతెరా, అప్పుడే చీకటిని తొలగిస్తున్న అరుణోదయమూ. నేను మళ్ళీ సముద్రం మీదకి వెళ్ళాలి పరిగెడుతున్న అలల పిలుపుకి ఊ కొడుతూ, అది స్పష్టమైన, నీరవమైన పిలుపే, అందులో సందేహం లేదు.…

  • మార్చి 6, 2014

    మనిషికి జీవితంలో తగినంత సమయం చిక్కదు… యెహుదా అమిఖాయ్, ఇజ్రేలీ కవి

    అతనికి కావలిసిన దానికి దేనికీ జీవితంలో మనిషికి తగినంత సమయం చిక్కదు అతని ప్రతి అవసరానికి తగినట్టుగా అతనికి తగినన్ని ఋతువులు లేవు. ఈ విషయంలో మతగ్రంధాలు చెప్పేదంతా తప్పే. మనిషికి ఏకకాలంలోనే ప్రేమించనూ ద్వేషించనూ వలసి వస్తుంది అవే కళ్ళతో ఏడ్వనూ, నవ్వనూ వలసి  వస్తుంది, ఆ చేతుల్తోనే రాళ్లు విసరనూ, ఏరుకోనూ వలసి వస్తుంది యుద్ధంలో ప్రేమించనూ, ప్రేమలో పోరాడనూ వలసి వస్తుంది ద్వేషించి క్షమించనూ, గుర్తుండి మరిచిపోనూ వలసి వస్తుంది, సవరించి చిందరపరచనూ వస్తుంది, తిని అరిగించుకోనూ…

  • మార్చి 5, 2014

    మనసు తాకే రీతులు… మిల్లర్ విలియమ్స్, అమెరికను కవి

    నువ్వు కలిసే ప్రతిమనిషిపై అనుకంప చూపించు… వాళ్ళు అక్కరలేదన్నప్పటికీ. మనకి అసభ్య నడతగా, చిటపటలాడే స్వభావంగా, నిరాశావాదంగా కనిపించే ప్రవర్తన మన చెవులు వినని, కనులు చూడని ఎన్నో వాటికి సంకేతం. అక్కడ… “దేహమూ ఆత్మా సహజీవనంచేసే చోట” ఎన్ని అగోచర అంతర్యుద్ధాలు జరుగుతున్నాయో నీకు తెలియదు. . మిల్లర్ విలియమ్స్ (born April 8, 1930) Note: దేహమూ ఆత్మా సహజీవనంచేసే చోట (“Spirit meets the Bone”): దేహము పదార్థానికి ఉదాహరణ అయితే, ఆత్మ…

  • మార్చి 4, 2014

    కాలం ఏ ఉపశాంతీ కూర్చదు… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి.

    కాలం ఏ ఉపశాంతీ ఇవ్వదు; మీరుచెప్పినదంతా పచ్చి అబద్ధం. కాలమే నా బాధని మాన్పుతుందని చెప్పిందెవడు? ఈ హోరుమంటున్న రాత్రిలో అతని తోడులేమి వెలితే. సముద్రం ఆటులో ఉన్నప్పుడు తను నాప్రక్కనుంటే బాగుణ్ణు ప్రతి కొండ వాలులోనూ మంచు కరిగి ప్రవహిస్తోంది. క్రిందటేడువి  ఆకులు ప్రతివీధిలో దర్శనమిస్తున్నాయి; కానీ, ఆలోచనలలోనే మిగిలిన క్రిందటేటి గాఢమైన ప్రేమ నా గుండెల్లో భద్రంగా పేరుకుంది. నేను వెళ్ళడానికి భయపడే స్థలాలు వంద. ఎందుకంటే అవన్నీ అతని జ్ఞాపకంతో పొర్లుతుంటాయి. ప్రశాంతతకోసం, అతని…

  • మార్చి 3, 2014

    ప్రియురాలి స్మృతికి… డొరతీ పార్కర్, అమెరికను కవయిత్రి.

    ఆమె జీవితం అంతా బంగారపు ఇసుకని తెలివితక్కువగా చక్రాలుగా, ముగ్గులుగా అరచేతి వేళ్లసందుల్లోచి జారనిస్తూ ఇసుకకోటలు కట్టడానికే సరిపోయింది. హరివిల్లులు ఒకదానివెనకఒకటివచ్చినట్టు మంచిరోజులు కట్టగట్టుకుని వచ్చినా వాటినన్నిటినీ ఆమె తృణప్రాయంగా విసిరేసింది కుళ్ళు కాలవలో సుడులుతిరుగుతూ పోయేట్టు. ఆమె కొరకు ఒక కొత్త గులాబీ మొగ్గని వదిలి మీ మానాన్న మీరు వెళ్ళండి; జాలి పడొద్దు; ఆమె హాయిగానే జీవించింది; ఆమెకి తెలుసు, తను మట్టిలోకలిసినా, అదీ అందంగా ఉంటుందని. . డొరతీ పార్కర్. August 22,…

  • మార్చి 2, 2014

    ప్రార్థన … కెరోల్ ఏన్ డఫీ, బ్రిటిషు కవయిత్రి

    ఒక్కో సారి, మనం ప్రార్థన చెయ్యకపోయినా, ప్రార్థన దానంతట అదే నోటంట వస్తుంది; ఒకోసారి చేతుల జల్లెడలోంచి ఓ స్త్రీ తలెత్తి పైకి చూసి అనుకోని వరం లాంటి చెట్లుపాడే శృతులు వింటుంది. మనకి విశ్వాసం లేకపోవొచ్చు గాని, కొన్ని రాత్రుళ్ళు సత్యం మనగుండెల్లో జొరబడి సన్నగా సలుపుతుంది; అప్పుడు మనిషి చెట్టుబోదెలా నిశ్చలంగా నిటారుగా నిలబడి దూరంగా పట్టాలమీద అర్థంకాని రైలుపాటలో తన యవ్వన గీతాల్ని  వింటాడు. ఇప్పుడు మాకై ప్రార్థించండి. సత్రంనుండి నగరాన్ని వీక్షిస్తున్న…

  • మార్చి 1, 2014

    ప్రశాంత సాగరం… లాంగస్టన్ హ్యూజ్, అమెరికను కవి

    ఎంత నిశ్చలంగా ఉంది, చిత్రంగా ఎంత నిశ్చలంగా ఉంది ఈ రోజు సముద్రం. నీరు అలా నిశ్చలంగా ఉండడం అంత మంచిది కాదు. . లాంగ్ స్టన్ హ్యూజ్ ఫిబ్రవరి 1, 1902 – మే 22, 1967 అమెరికను కవి . Langston Hughes . Sea Calm  . How still, How strangely still The water is today, It is not good For water To be so…

  • ఫిబ్రవరి 28, 2014

    పసిఫిక్ తీరంలో ఒకసారి… రాబర్ట్ ఫ్రాస్ట్, అమెరికను కవి

    విరిగిన అల పెద్ద చప్పుడుచేసుకుంటూ బిందుతెర వేసింది. పెద్ద కెరటాలు వెనక్కి తిరిగిచూశాయి తమని అనుసరిస్తున్నవాటిని, మునుపెన్నడూ నీరు తీరానికి చెయ్యనిది ఏదో చెయ్యాలని సంకల్పించుకున్నాయి. ఆకాశంలో మేఘాలు దిగువగా కేశాల్లా వేలాడుతున్నాయి కళ్ళవెలుగులకి అడ్డంగా తారాడుతున్న ముంగురుల్లా మనం ఆ మాట అనలేము గానీ, అలా అనిపిస్తోంది తీరం అదృష్టవంతురాలే, పెద్దకొండదన్నుగా ఉందని. ఆ కొండకి భూఖండం దన్నుగా ఉంది; రాత్రి ఏదో ఉపద్రవం రాబోతోందనిపిస్తోంది, రాత్రి ఒక్కటే కాదు, బహుశా ఒక యుగం కావొచ్చు.…

←మునుపటి పుట
1 … 156 157 158 159 160 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
  • Subscribe Subscribed
    • అనువాదలహరి
    • Join 114 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • అనువాదలహరి
    • Subscribe Subscribed
    • నమోదవ్వండి
    • లోనికి ప్రవేశించండి
    • ఈ విషయాన్ని నివేదించండి
    • సైటుని రీడరులో చూడండి
    • చందాల నిర్వహణ
    • ఈ పట్టీని కుదించు